15, డిసెంబర్ 2019, ఆదివారం

వాతావరణ నియంత్రణ జరుగుతొందా?(మిస్టరీ)



                                      వాతావరణ నియంత్రణ జరుగుతొందా?

వెదర్ వార్ ఫేర్---ఈ మధ్య ఈ మాట తరచుగా వినబడుతోంది. శక్తివంతమైన వాతావరణ నియంత్రణ పరికరాలు ఉపయోగించి అగ్రరాజ్యాలు ఇతరు (తమకు ఎదురు చెప్పే) దేశాల వాతావరణంలో మార్పిడి తీసుకు వచ్చి ఆ దేశాలలో కరువు, వరదలు, తుపానలు, భూకంపాలు సృష్టిస్తున్నాయని చెబుతున్నారు. కానీ ఆ సంగతిని ఎవరూ నిరూపించలేకపోతున్నారు.

వాతావరణ మార్పిడికి అవసరమైన టెక్నాలజీ అగ్రరాజ్యాల దగ్గర ఉన్నదని అందరికీ తెలుసు. అయితే ఈ టెక్నాలజీని యుద్ధాలలో వాడకూడదని 1978 జెనీవా సమావేశంలో అగ్రదేశాలు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ రహస్యంగా శక్తివంతమైన వాతావరణ నియంత్రణ పరికరాలతో పరిశోధనలు జరుగుతున్నాయని, జరిగాయని, ఈ పరిశోధనలను ఇతర దేశాల వాతావరణంపై వాడుతున్నారని/వాడారని అగ్రరాజ్యాలపై ఒక నింద ఉంది. దీనికి కారణాలేమిటో తెలుసుకుందాం.


1967-1968లో 'ఆపరేషన్ పాప్ ఐ' అనే పెరుతో అమెరికా, వియత్నాంలో వాతావరణ మార్పిడి ఏర్పరచి అక్కడ వరదలు సృష్టించి శత్రుసేనలను బలహీనం చేసింది. యుద్దంలో శత్రుసేనలు నష్టపోలేదు గానీ, సాధారణ పౌరులు తీవ్రంగా నష్టపోయారు. అందువలనే వాతావరణ మార్పిడి పద్దతిని యుద్ధాలలో వాడకూడదని జెనీవా ఒప్పందం జరిగింది. ఆ తరువాత వాతావరణ వార్ఫేర్ గురించి అందరూ మరిచిపోయారు.


వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ లాంటి పరిస్థితులు నెలకొనడంతో, వాటి నుండి బయటపడటానికి వాతావరణ మార్పిడి అనే మాట మళ్ళీ తలెత్తింది. మానవులవల్ల ఏర్పడిన వాతావరణ కాలుష్యం, అదే మానవులచేత శుద్ధిపరచాలని అంతర్జాతీయ సదస్సులు జరిపి వాతావరణ కాలుష్యానికి ముఖ్యకారణమైన కార్బన్ డై ఆక్సైడ్ ను ప్రతి దేశమూ తగ్గించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ ఏ దేశం ఎంత తగ్గించాలి. ఎంత శాంతం తగ్గించాలి అనే విషయంపై చర్చ జరుగుతోంది. కానీ ఏ దేశమూ కచ్చితమైన లెక్కలకు రాలేకపోతోంది. దీనిని కారణంగా తీసుకుని అగ్రరాజ్యాలు వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కృతిమ పద్దతులను (రసాయనాలు వాడి) ఉపయోగించి గ్లోబల్ వార్మింగ్ ని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చునని, దానికి కావలసిన టెక్నాలజీ తమ దగ్గర ఉన్నదని చెప్పడంతో శాస్త్రవేత్తలలోనూ, ప్రజలలోనూ మళ్ళీ ఆందోళన చెలరేగింది.


అగ్రరాజ్యాలు ఇప్పటికే ఆ టెక్నాలజీ వాడుతున్నారని, అలాంటి పరిశోధనా కేంద్రాలలో ముఖ్యమైనది, అత్యంత శక్తివంతమైంది అమెరికాలోని 'హార్ప్'(HAARP...High Frequency Active Auroral Research Program) పరిశోధనా కేంద్రమని, అక్కడి నుండి రహస్యంగా వాతావరణ మార్పిడి జరుగుతోందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం వీరి మాటలను ఖండిస్తున్నది. మరైతే 'హార్ప్'(HAARP) లో మీరు చేస్తున్న పరిశోధనలు ఏమిటని ప్రశ్నించినప్పుడు "మా దేశ రక్షణ కోసం మేము ఏర్పరుచుకున్న పరిశోధనా కేంద్రం" అని చెబుతున్నారు.

"ప్రకృతి వైపరీత్యాల వెనుక వున్నది ఏమిటి?...అనంతమైన శక్తి. ఈ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే ఆ ప్రకృతి వైపరీత్యం అంత శక్తివంతంగా ఉంటుంది. వాతావరణంలోని పై పొరైన అణుశకలావరణం (Lonosphere) లోకి HAARP 1.17 జిగా వాట్స్ వికిరణ శక్తిని బీమ్ చేస్తోందట. ఆ వికిరణ శక్తి, అత్యంత వేగంతో తిరిగి భూమిపైకి తోయబడుతుంది. అలా తోయబడిన వికిరణ శక్తే తుపాను, భూకంపం, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలను సృష్టిస్తుంది" అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఇవి ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. నవంబర్-13, 1997 లో వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఒక వార్త ప్రచురించింది. మలేషియా తమ దేశంలో ఏర్పడిన పొగమంచును మానవ నిర్మిత తుఫాన్ తో ఎదుర్కోవటానికి, రష్యా దేశానికి చెందిన ఒక వాతావరణ మార్పిడి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నదని ఆ వార్త. ఒప్పందం ప్రకారం ఆ సంస్థ మలేషియాలో హరికేన్ సృష్టించింది. ఆ హరికేన్ వలన మలేషియాలో పొగమంచుపోయి స్పష్టమైన వాతావరణం నెలకొన్నదని ఆ వార్తలో రాశారు.

"హరికేన్ కత్రీనా న్యూ ఓర్లియన్స్ ను తాకటానికి రష్యా గూఢచార సంస్థే కారణం. 1976 నుండి అమెరికాదేశ వాతావరణాన్ని వారే నియంత్రిస్తున్నారు" అని రిటైర్డ్ అమెరికన్ Lieutenant Colonel Thomas Bearden ఆరోపిస్తున్నారు.

1952 లో ఇంగ్లాండు దేశంలోని లిన్ మౌత్ గ్రామంలో ఇంగ్లాడ్ దేశ రాయల్ ఏర్ ఫోర్స్ నిర్వహించిన 'వర్షం కోసం వాతావరణ మార్పిడి పరిశోధన వలన అక్కడ 20 నిమిషాల సమయంలో అత్యంత అధిక వర్షపాతం కురిసి, వరదలు ఏర్పడి ఆ గ్రామానికి తీవ్ర నష్టం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి మాత్రమే సోలార్ రేడియేషన్ మేనేజ్ మెంట్ పద్దతి వాడుతున్నామని Intergovernment Panel on Climate Change(IPCC) తమ నివేదికలో తెలిపినా, 'గ్లోబల్ వార్మింగును తగ్గించడానికి ఆ పద్దతి ఉపయోగపడదు. కాబట్టి దీనిని చెడు ప్రయోజనాల కోసమే వాడుతున్నారు అని కొంతమంది శాస్త్రవేత్తలు వాపోతున్నారు.


ప్రాజెక్ట్ స్టామ్ ఫ్యూరీ(Project Stormfury) పేరుతో తుఫాన్ల వుద్రిక్తతను తగ్గించడానికి అమెరికా చేపట్టిన పరిశోధన ఇది. విమానం ద్వారా సముద్రంలోని సుడిగుండంలో సిల్వర్ ఐయొడైడ్ చల్లితే తుపాన్ బలహీనం చెందుతుంది. 1962 నుండి 1983 వరకు అమెరికా ఈ పరిశోధన చెపట్టింది. ఈ పరిశోధనల వలన 4 తుఫానల తీవ్రతను 30 శాతం తగ్గించగలిగారట.


కెమ్ ట్రయల్స్(Chemtrails): విమానాలలో నుండి వస్తున్న పొగను కెమ్ ట్రయల్స్ అంటున్నారు. విమానాలలో నుండి వస్తున్నది హానికరం కాని పొగ కాదు. అది అగ్ర రాజ్యాలు వాతావరణ మార్పిడికోసం రసాయనాలు వెదజల్లడమే అని ఒక వాదన బలపడుతోంది. 19990లో చైనా రాజధాని బీజింగ్ నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్ ఆటలలో పాల్గొన్నవారు, కలుషితమైన గాలిని పీల్చకుండా ఉండేందుకు బీజింగ్ నగర వాతావరణంలో మార్పిడి తేవటానికి అమెరికా ఈ పద్ధతి వాడింది.

'వాతావరణ ఇంజనీరింగ్' ఉన్నదనటానికి కావలసిన జవాబులు ఉన్నాయి కనుక, వాతావరణ నియంత్రణ జరుగుతోందంటున్నారు. ఎవరో ఒకరు దీనిని శాస్త్రీయంగా నిరూపించేంతవరకు ఇది మిస్టరీగానే ఉంటుంది.

Image Credits: to those who took the original photos.
*************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి