11, డిసెంబర్ 2019, బుధవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-14



                                              ప్రేమ సుడిగుండం (సీరియల్)  
                                                               (PART-14)                                                           


మంచి టైము చూసి అందరూ మండపానికి బయలుదేరారు. ప్రతిమ పూర్తి పెళ్ళి కూతురు అలంకారంతో కారులోకి ఎక్కింది. అత్తయ్య...మరో ఇద్దరు బంధువులు పక్కన కూర్చోగా...బయలుదేరటానికి రెడీ అయ్యింది కారు.

మరో కారులు మగవాళ్ళందరూ ఎక్కారు. అరటి చెట్లు, పందిరి, సీరియల్ బల్బుల అలంకరణతో ఇళ్ళు కలకలలాడుతోంది.

"ఇల్లు తాళం పెట్టాలా? ఎవరైనా ఒకరు ఇంట్లో ఉంటే మంచిది కదా?" -వరుణ్ అడిగాడు.

"పనమ్మాయి రావాలి...అది ఇంకా రాలేదు?"

"ఒక పని చెయ్యండి...మీరంతా బయలుదేరండి. పనమ్మాయి వచ్చిన వెంటనే చెప్పేసి వస్తాను" అన్నాడు వరుణ్.

"ఏమిట్రా ఇది...పెళ్ళికొడుకును నిన్ను వదిలిపెట్టి మేము ఎలా వెళ్ళగలం? రేయ్ కిరణ్...నువ్వు కావాలంటే ఉండేసి తరువాత వస్తావా?" అడిగింది తల్లి.

"వాడ్ని మీతో రానీయమ్మా. అక్కడ చాలా పనులున్నాయి! పెళ్ళికొడుకైతే ఏమిటిట...నాకేమన్నా కొమ్ములు మొలిచాయా! మంచి రోజు కదా, ఇల్లు తాళం వేయకూడదని అలొచిస్తున్నా. మీరు బయలుదేరండి. పనమ్మాయి వచ్చిన వెంటనే చెప్పేసి, ఒక ఆటో పట్టుకుని వచ్చేస్తాను"

"ఆటో ఎందుకు? నీ 'స్కూటర్’ ఉందిగా! దాంట్లోనే రా. అక్కడేమైనా అర్జెంటు పనులుంటే ఎవరికైనా పనికొస్తుంది"

వరుణ్ వాళ్ళను పంపించి ఇంటి లోపలకు వచ్చాడు. అర గంట తరువాత పనమ్మాయి వచ్చింది. దాని చేతికి ఇంటి తాళాలు ఇచ్చి వరుణ్ బయలుదేరాడు.

"ఏదైనా 'ఫోన్’ వస్తే, ఎవరూ...ఏమిటీ? అని అడిగుంచు. కల్యాణ మండపం 'అడ్రస్సు’ అడిగి ఎవరైనా మాట్లాడితే...పక్కనే పత్రిక పెట్టాను చూడు. అది చూసి ‘అడ్రస్సు’ చెప్పు. లెటర్ ఏదైనా వస్తే తీసి ఉంచుకో. నువ్వొకదానివే నా పెళ్ళి చూడకుండా ఉంటావు. పరవలేదు....తరువాత నీకు మాత్రం స్పెషల్ గా ... 'వీడియో’ వేసి చూపిస్తాను"

వరుణ్ స్కూటర్ స్టార్ట్ చేశాడు. మనసు ఎలా వెళ్ళమంటే స్కూటర్ను అలా నడిపాడు. సిటీ దాటి హైవేలోకి ప్రవేసించి నిదానంగా వెడుతోంది అతని స్కూటర్.

కల్యాణ మండపంలో అతనికోసం అందరూ కాచుకోనున్నారు. 'ఇదిగో వచ్చేస్తాడు....' అని నమ్ముతుంటారు. సమయం అవుతున్న కొద్ది ఆందోళన చెందుతారు. మండపం లోపలకూ, బయటకూ తిరుగుతుంది తల్లి...అల్లల్లాడిపోతుంది.

నాన్న ఇంటికి 'ఫోన్ చేస్తారు. 'అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయారే...!'అని పనమ్మాయి చెబుతుంది.

మనిషి కొక దిక్కుగా వెతుకుతారు. అతను దొరకడు. అమ్మ ఏడుస్తుంది. 'ఎక్కడికెల్లి చచ్చాడు ఈ దరిద్రుడు అని తిట్టుకుంటుంది. రాత్రంతా రాక పోవటంతో...'ఇక ఏం చేయాలి?' అని ఒక అర్జెంట్ మీటింగు జరుగుతుంది.

“పెళ్ళి ఆగటం అపశకునం. మంచి కార్యం ఆగిపోకూడదు. ఒకవేల అతనికి ఈ పెళ్ళి ఇష్టం లేదో ఏమో? అందుకే రాకుండా ఎక్కడికో పోయాడు! అందుకని పెళ్ళి ఆగిపోవాలా? పెద్ద కొడుకు లేకపోతే ఏమిటి? చిన్న కొడుకు ఉన్నాడే! వాడిని పెళ్ళికొడుకు చేయండి!” చెప్పాడు వరుణ్ మామయ్య. అక్కడున్న అందరూ వంతు పాడారు.

“ప్రతిమ, మీరు కన్న బిడ్డ కాదు. అయినాకానీ ప్రేమంతా వొలకబోసి పెంచారు. ఆమె పెళ్ళి ఆగిపోతే...అందులోనూ మీ కొడొకు రాకుండా పోయినందువలన ఆగిపోయిందని తెలిస్తే, ఆమె భవిష్యత్తు చీకటైపోతుంది. ఆమెను పెళ్ళిచేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు!”

వరుణ్ కి నమ్మకమైన ఒకే ఒక మనిషైన అతని మామయ్య, వరుణ్ చెప్పిచ్చిన డైలాగులను 'అక్షరం’ మార్చకుండా చెప్పాడు.

అయన దగ్గర మాత్రమే నిజం చెప్పి సహాయం అడిగాడు. ఆ విషయాన్ని ఎవరి దగ్గరా చెప్పకూడదని చేతిలో చెయ్యి వేయించుకున్నాడు.

ప్రతిమకు, కిరణ్ కి ఆయనే పెళ్ళి చేయాలని, ఆ బాధ్యతను ఆయనకు అప్పగించాడు.

****************************************************************************************************                                    ఇంకా ఉంది.....Continued in చివరి PART-15.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి