ప్రేమ సుడిగుండం (సీరియల్) (PART-13) పెళ్ళి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. వరుణ్, పజిల్ యొక్క మరో ముఖంలా తిరుగుతున్నాడు.
ప్రతిమకు ఒకొక్కసారి అతన్ని చూడటానికే భయం వేస్తోంది. ఒకొక్కసారి అతన్ని చూస్తే 'కచ్చితంగా ఇతను ఏదో మంచే చేయబోతాడు’ అనే నమ్మకం ఏర్పడుతోంది. మొత్తానికి ఏం జరుగుతోందో మాత్రం అర్ధం కావటంలేదు. ఏదో నదిలో కొట్టుకు వెడుతున్నట్టు ఉన్నది. అది ప్రతిమను తీరానికి తీసుకు వెడుతుందా లేక ముంచుతుందా?
కిరణ్ దగ్గర నుండి ఎటువంటి సమాచారమూ లేదు. అతను వస్తాడా...రాడా అనేదే తెలియలేదు. తన పెళ్ళి ఎవరితో జరగబోతోందో తెలియక పెళ్ళికి రెడీ అవుతున్న అమ్మాయి ఈ ప్రపంచంలో తాను ఒకత్తినే అని అనిపించింది ప్రతిమకు. పెళ్ళి రోజు దగ్గర పడుతుంటే ప్రతిమ గుండేలో దఢ పెరుగుతోంది. గడియారంలోని ముళ్ళును చూస్తేనే వణుకు పుడుతోంది.
పెళ్ళికి రెండు రోజుల ముందు అమెరికా నుండి వచ్చాడు కిరణ్. వాడిపోయిన మొహంతో...మనసు నిండా కోపంతో! ఎవరి దగ్గర మాట్లాడకుండా మేడ మీదకు వెళ్ళిపోయాడు. మాట్లాడకపోయినా అతను రావటమే సంతోషం అని అనుకుంటోంది అత్తయ్య.
వరుణ్ మాత్రం మేడ మీదకు వెళ్ళి కిరణ్ తో మాట్లాడి వచ్చాడు.
"ఏమిట్రా వాడికి ఇంకా కోపం ఎందుకట? వాడి పెళ్ళి ఆపేశాము కదా? మరి ఇంకా ఎందుకు కోపం?"- ఏమీ తెలియనట్లు అత్తయ్య అడగటంతో...వరుణ్ ఆమెను కోపంగా చూశాడు.
'అమ్మకు నిజంగానే ఏమీ తెలియదా? లేక, తెలియనట్లు నటిస్తోందా?'...అనే ఆలొచనతో వరుణ్ ఏమీ మాట్లాడలేదు.
"ఏరా...నీ ‘డ్రస్సు’ వచ్చిందా? వాటిని తీసుకు రావద్దా? ఎం టైలర్ రా వాడు? పెళ్ళి బట్టలను సరైన సమయానికి కుట్టివ్వాలని తెలియదా వాడికి?"...వరుణ్ ఆలొచనలను పెళ్ళి వైపుకు మళ్ళించాలని వరుణ్ని అడిగింది తల్లి.
"తీసుకు వస్తాను. ‘డ్రస్సు’ ఎక్కడికి పోతుంది?"
ఆ రోజు సాయంత్రమే వెళ్ళి వరుణ్ తన పెళ్ళి ‘డ్రస్స్’ తీసుకు వచ్చాడు.
ఆడ పెళ్ళి వారు, మగ పెళ్ళి వారూ అందరూ వాల్లే కాబట్టి ఇల్లే పండుగ వాతావరణంతో వెలిగిపోయింది. పెళ్ళి మండపానికి సామాన్లను చేర వేస్తున్నారు.
“ప్రొద్దున అనంగా వచ్చాడు. ఇంతవరకు ఏమీ తినలేదు. క్రిందకు రానే లేదు. వాడికి ఏమిట్రా కావాలి?"
తల్లి చెప్పిన వెంటనే....వరుణ్ మేడపైకి వెళ్ళాడు.
"ఏమిట్రా కిరణ్...ఎందుకు ఏమీ తినలేదు?"
ఎర్ర బడ్డ కళ్లతో అన్నయ్యను చూశాడు తమ్ముడు.
"నీ పెళ్ళిలో భోజనం ఒక పట్టు పడదామని కడుపును ఖాలీగా ఉంచుకున్నా?"
వరుణ్, నవ్వుతూ తమ్ముడ్ని చూశాడు. "నా మీద నీకు కోపం పోదని నాకు తెలుసురా కిరణ్. ప్రతిమ నా దగ్గర మీ ఇద్దరి ప్రేమ గురించిన అన్ని విషయాలూ చెప్పినా నేను కొంచం కూడా మనస్సాక్షి లేకుండా....ఆమె మెడలో తాలి కట్టబోతున్నానే అనే కోపమే నీకు. అంతే కదా...?"
సమాధానం చెప్పకుండా కిరణ్ తల తిప్పుకున్నాడు.
"నేను ఏం చెయ్యనురా? ‘తోడ పుట్టిన తమ్ముడా?...పది నెలలు మోసిన తల్లా?'అని ఆలొచిస్తే...అమ్మే ముఖ్యంగా కనబడుతోంది. ఆమె సంతోషమే నాకు ముఖ్యం. కన్న తల్లి ఒక కన్నీటి బొట్టు కార్చినా మన పడవ మునిగిపోతుంది. నా కోసరం కాకపోయినా, ఆమె కోసం నేను ప్రతిమతో జీవించే కావాలి. వేరే దారి లేదు. కానీ, నేను నీకు ఒకే ఒక నమ్మకాన్ని ఇవ్వగలను. 'అమ్మ వేసిన ముడికి బలం ఎక్కువా? లేక దానికంటే బలంగా దేవుడు వేరే ముడి వేసున్నాడా?' అనేది రేపుగాని తెలియదు.
నీకూ, ప్రతిమకు దేవుడు ముడి వేసుంటే అమె నీకే దొరుకుతుంది! లేదు...నాకు వేసుంటే....నాకు దొరుకుతుంది. అలా గనుక అమె నా భార్య అయితే...ఆమె యొక్క పాత ప్రేమను మరిచిపోవటానికి నేను తయారుగా ఉన్నాను. నువ్వూ మర్చిపోవటం మంచిది" - వరుణ్,తమ్ముడి వీపు మీద సమాధానంగా తట్టి లేచి బయటకు వచ్చాడు.
అంతవరకు బయట నిలబడి వాళ్ల మాటలను దొంగతనంగా వింటున్న తల్లి గబుక్కున పక్కకు జరిగి తనని దాచుకుంది.
ఆమె ముఖంలో ప్రశాంతత, అనందమూ నిండుకుంది. పాతవన్నీ తల్లికొసం మరిచిపోయి జీవించటానికి తయారుగా ఉన్న వరుణ్ గుణం ఆమెను ఆశ్చర్యపరిచింది. తనని ఇంత గొప్పగా గౌరవిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆమెకు గర్వంగా ఉన్నది.
'కచ్చితంగా దేవుడు నా లెక్కను తప్పుగా మార్చడు. నా ఇష్టప్రకారమే ఎటువంటి ఆటంకమూ లేకుండా వరుణ్-ప్రతిమల పెళ్ళి జరిగిపోతుంది. కొన్ని రోజులైతే అన్నీ సర్ధుకుంటాయి. మంగళసూత్ర తాడుకు శక్తి ఎక్కువ. అది వీళ్ళను బాగానే జీవింప చేస్తుంది. కిరణ్ కూడా మారుతాడు. 'వదిన’ అనే మనిషి మరొక తల్లి అనే భావం అతనిలో ఏర్పడుతుంది. రోజులు గడుస్తున్న కొద్ది వాడు, వాడి పెళ్ళికి అంగీకరిస్తాడు. తనకు తగిన అమ్మాయిని వెతికే బాధ్యత నాకు అప్పగిస్తాడు. వాడికి తగిన అమ్మాయిని వెతికి పెళ్ళికూడా చేసి ముగిస్తాను. ఇద్దరు పిల్లలూ సంతోషంగా జీవిస్తారు. ఇంతకంటే ఒక తల్లికి ఇంకేం కావాలి?'....అనే ఆలోచనలతో సంతోషంగా కిందకు వెళ్ళింది తల్లి.
తన గదిలోకి దూరిన వరుణ్ కి నవ్వొచ్చింది. తన వెనుకే మేడపైకి వచ్చి తమ మాటలను దొంగతనంగా విన్న తల్లిని గుర్తుకు తెచ్చుకున్నందుకే ఆ నవ్వు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి