30, జనవరి 2020, గురువారం

'కరోనా' వైరస్ వ్యాప్తికి కారణం?!...(న్యూస్ /ఆసక్తి/మిస్టరీ)



                                       'కరోనా' వైరస్ వ్యాప్తికి కారణం?!


ప్రపంచాన్ని భయపెడుతున్న 'కరోనా' వైరస్ వ్యాప్తికి కారణం ఎవరు?...నిజం ఏమిటి?

ప్రమాదకరమైన కరోనావైరస్ వ్యాప్తి వాస్తవానికి మానవ నిర్మిత కిల్లర్ వ్యాధిగా ఉంటుందా!?


చైనా ప్రభుత్వం చెప్పినట్టు వుహాన్ కరోనావైరస్ చేపల మార్కెట్లో ఉద్భవించలేదని ఆధారాలు చెబుతున్నాయి. వుహాన్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ వైపు వేళ్లు చూపుతున్నాయి.

 చైనాలోని వుహాన్ నగరంలో 50 మిలియన్లకు పైగా ప్రజల అసాధారణమైన ‘లాక్ డౌన్’ వెనుక ‘nCoV-2019’ అని పిలువబడే కరోనావైరస్ ఉంది - మరియు మానవ కార్యకలాపాలు ఆ వైరస్ ను వదిలుంటాయ్ అని నమ్ముతున్నారు.

1) వుహాన్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ కనీసం 2016 నుండి కరోనావైరస్ ను అధ్యయనం చేస్తోంది.


2) వూహాన్ కరోనావైరస్ ఆ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ నుండి లీక్ అయి ఉండవచ్చని పెరుగుతున్న ఆధారాలు సూచిస్తున్నాయి.

3) అదే నిజమైతే, చైనా పరిశోధనా సంస్థ నుండి అ ప్రమాదకరమైన వైరస్ లీక్ అవ్వడం ఇది మొదటిసారి కాదు.

వుహాన్ కరోనావైరస్ వ్యాప్తితో సంబంధం ఉన్నట్లు ఎక్కువగా అనుమానిస్తున్న వుహాన్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ వైరస్ గురించి అధ్యయనం చేస్తున్నట్లు 2016 పత్రాలు చూపిస్తున్నాయి. ఈ వ్యాధి చెపల మార్కెట్లో ఉద్భవించలేదని పెరుగుతున్న సాక్ష్యాలు సూచిస్తున్నాయని చైనా ప్రభుత్వం పేర్కొంటోంది.

ధృవీకరించని నివేదికలు నిజమైతే, చైనా వైరాలజీ పరిశోధనా కేంద్రం నుండి  ప్రమాదకరమైన  వైరస్ తప్పించుకోవడం ఇది మొదటిసారి కాదు. మార్చి 2004 లో, చైనాలోని బీజింగ్‌లోని నేషనల్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ నుండి ఘోరమైన SARS వైరస్ తప్పించుకున్నది. దానివలన 9 మంది వ్యాధిగ్రస్తులయ్యారు. అందులో ఒకరు మరణానికి గురయ్యారు. ప్రస్తుత ప్రమాదకరమైన కరోనావైరస్ వ్యాప్తికి మూలం ఇలాంటిదే అయ్యుండొచ్చు.

ఈ వ్యాది సోకినది ప్రభుత్వ అధికారిక సంఖ్యల కంటే చాలా ఎక్కువ.



పై ఫోటోలో మీరు చూస్తున్నదే 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ, వుహాన్(ఇక్కడి నుండే కరోనా వైరస్ లీక్ అయ్యుండొచ్చని భావిస్తున్నారు)

హాంగ్ కాంగ్ యొక్క వార్తాపత్రిక అయిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, వుహాన్ కరోనావైరస్ వ్యాప్తి చైనా ప్రభుత్వం అంగీకరించిన దానికంటే తీవ్రంగా ఉండవచ్చు. హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయం (HKU) నుండి వచ్చిన విద్యావేత్తలు ఇప్పుడు వుహాన్‌లో సోకిన వారి సంఖ్య(వారం క్రిందటి లెక్కలు) 43,590 కు చేరుకుందని అంచనా వేశారు - ఇది చైనా ప్రభుత్వ అధికారిక సంఖ్య కంటే 1456% ఎక్కువ.

HKU విద్యావేత్తల నుండి వచ్చిన డేటా-ఆధారిత గణిత నమూనా అంచనా ప్రకారం, వుహాన్ కరోనావైరస్ యొక్క అంటువ్యాధుల సంఖ్య ప్రతిరోజూ 1,50,000 కొత్త కేసులను సూచిస్తోంది.

చైనా ప్రభుత్వం కేవలం 2,800 మందికి మాత్రమే ఈ వ్యాధి సోకిందని పేర్కొన్నారు. కానీ వారి చర్యలను చూస్తుంటే వారే ఈ సంఖ్యను నమ్మవద్దని కూడా సూచిస్తున్నట్లు కనబడుతోంది.

కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి చైనా ప్రభుత్వ అధికారులు రికార్డు స్థాయిలో తొమ్మిది బిలియన్ల డాలర్ల నిధులను కేటాయించారు. (ఎందువల్ల ఇంత ఖర్చు?)

మొత్తం జనాభా 60 మిలియన్లకు పైగా ఉన్న అన్ని నగరాలను సంసర్గ నిషేధంలో(క్వారంటైన్‌) లో నిర్బంధించారు. లెజెండ్ సినిమా చాలా మంది చూసే ఉంటారు. అందులో లాగానే వుహాన్ నగరం కూడా ఉన్నది. ఎప్పుడూ అత్యధిక జన సమూహంతో ఉండే అ నగరం ఒక మన్యుష్యులే లేని అడవి ప్రాంతంలా ఉన్నది. ఈ క్రింది వీడియోలో అది మీరు చూడవచ్చు. ప్రజలందరినీ ఇళ్ళ నిర్భందలో ఉంచారు.


అతి తక్కువ కాలంలో రెండు సరికొత్త 1,000 పడకల ఆసుపత్రులను నిర్మించటం మొదలుపెట్టారు.( ఎందుకా తొందర?)

వుహాన్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ నుండి కరోనా వైరస్ లీక్ అయ్యిందా?.

ధృవీకరించని నివేదికలు ఈ ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి వుహాన్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీ మూలం కావచ్చు.'ఇన్స్ టి ట్యూట్' నుండి వుహాన్ కరోనావైరస్ లీక్ అయినట్లయితే, చైనాలో ఇటువంటి ఉల్లంఘన జరగడం ఇదే మొదటిసారి కాదు.

2004 లో, చైనీస్ 'సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' నుండి ఐదుగురు ఉన్నతాధికారులకు, వారి సదుపాయంలో లీక్ కారణంగా సంభవించిన SARS వ్యాప్తికి...శిక్ష విధించారు. బీజింగ్ 'ఇన్స్ టి ట్యూట్' ఆఫ్ వైరాలజీలో ఈ లీక్ సంభవించింది, ఇక్కడ పరిశోధకులు ప్రత్యక్ష మరియు క్రియారహిత SARS కరోనావైరస్ ప్రయోగాలు చేస్తున్నారు. ఇద్దరు కార్మికులు SARS బారిన పడ్డారు మరియు తరువాత ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించింది.

అతి తక్కువ కాలంలో ప్రపంచవ్యాప్తం వ్యాపించే వేగం కలిగిన ఈ కరోనా వైరస్ ను ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు ఎలా నియంత్రిస్తుంది?....వేచి చూడాలి!

Image credit: to those who took the original photo.

28, జనవరి 2020, మంగళవారం

ఆలయం(సీరియల్)...PART-11



                                                   ఆలయం(సీరియల్)
                                                            (PART-11)


"లేకపోతే ఏమిటమ్మా... నేను వచ్చి ఎంతసేపైందో తెలుసా?"

"అలాగా...'టీ.వీ.' లో సీరియల్ చూస్తూ ఉండటంతో నువ్వు వచ్చింది గమనించలేదు"

"నువ్వు ఎలా గమనిస్తావమ్మా! నేను టీ.వీ. లో కనబడి 'అమ్మా...ఆకలేస్తోంది’ అని అడిగితేనే, నా మీద నీ దృష్టి పడుతుందని చెప్పు"

"ఛఛ...మీ నాన్న రానీ, ఇద్దరికీ ఒకేసారి భోజనం పెడతాను"

"అమ్మా...నాన్న ఎప్పుడో వచ్చాశారు. అక్కడ చూడండి మంచం మీద"

---శంకరయ్య తల్లికి చూపగా, మాలతీ బెడ్ రూమువైపు చూసింది.

వెంకట్ ప్రసాద్ చెవులకు వాళ్ళ సంభాషణ వినబడింది.

"నాన్నా లేచిరా...నాకు బాగా ఆకలిగా ఉంది"

----శంకరయ్య పిలిచాడు. ప్రసాద్ లేచి కట్టుకున్న లింగీని బాగా సర్ధుకుని హాలులోకి వచ్చాడు. మొహంలో డల్ నెస్.

"ఏం నాన్నా డల్ గా ఉన్నారు?"

"అరే నువ్వొకడివిరా...మీ నాన్న అలా ఉంటే 'కంపనీ' లో ఏదో సమస్య అని అర్ధం".

"అవునా నాన్నా?"

"ఆయన్ని ఎందుకు అడుగుతావు...నన్ను అడుగు. నేను చెబుతాను. నీకు ఏది జరిగినా...నాకు ఏది జరిగినా ఆయన బాధపడరు. ఆయన బాధపడుతున్నారు అంటే 'కంపనీ' లో ఏదో సమస్యే నని అర్ధం"

"ఏమిటి నాన్నా...అమ్మ చెప్పేది నిజమా?"

"అవును రా..."

"నువ్వు బాధ పడేటంత సమస్య ఏమిటి నాన్నా? నీ పనిలో నువ్వు ఏమన్నా తప్పు చేశావా?"

"పిచ్చొడా...నా 'కంపనీ' లో ఇప్పుడు తప్పు చేస్తేనే అక్కడ ఉద్యోగం చేయగలం"

"ఏమిటి నాన్న చెబుతున్నారు?" --- కొడుకు శంకరయ్య అర్ధంకాక ఆశ్చర్యంగా అడిగాడు.

మాలతీ మళ్ళీ తండ్రీ-కొడుకుల సంబాషణ మధ్యలో తలదూర్చింది.

“శంకరయ్యా...ఎప్పుడూ ఊరంతా ఒక దారిలో నడిస్తే....మీ నాన్న మాత్రం వేరే దారిలో నడుస్తారు"

"అరే ఏంటమ్మా నువ్వు...నాన్నతో చెప్పి ఆయన చేస్తున్న 'కంపనీ' లో ఒక ఆరు నెలలో, ఒక సంవత్సరమో 'మేనేజ్ మెంట్ ట్రైనీగా' అవలాని అనుకుంటున్నాను. ఇప్పుడు పోయి ఈయన దారి వేరే దారి అంటున్నావు..."

"అవునురా...ఐదు వేళ్ళూ ఒకే లాగానా ఉన్నాయి? చేతి వేళ్ళే ఎచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు...మనుషులందరూ మనం ఎదురుచూస్తున్నట్టు ఉండాలనుకుంటే ఏలా?"

"నువ్వు చాలా కన్ ఫ్యూజ్ చేస్తున్నవమ్మా..."

"నేనేమీ కన్ ఫ్యూజ్ చేయటం లేదు. నిజం చెబుతున్నా! మీ నాన్నకు తానేమిటో; తన పనేమిటో చూసుకోవటం తెలియదు. ఈయన పని చేస్తున్న కంపనీకి ఈయనే యజమాని అనుకుంటారు. నన్ను అడిగితే ఈయన యజమాని కూడా అంత బాధ పడరని గట్టిగా చెప్పగలను. ఎవరు ఎలా ఉంటే మన కెందుకురా? మన పని ఏమిటో అది మాత్రం చూసుకుంటే ఏ సమస్యా ఉండదు"

----- మాలతీ మాటలతో సాధించింది. ప్రసాద్ కు కోపం ముక్కు మీదకు వచ్చింది. కోపంగా భార్యను చూశాడు.

"వూరికే అలా చూడకండి...మీరేమీ మహాత్మా గాంధీ కాదు. అందరినీ మార్చటానికి"

"తరువాత...?"

"తరువాత ఏమిటి తరువాత...కంపనీలో జరిగే తప్పుల కోసం మీరు ఎందుకండీ ఇలా బాధ పడుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటారు? ఇప్పుడు మీ కంపనీ ఏమన్నా మూసేస్తున్నారా ఏమిటి?"

"అంటే...కంపనీ నష్టపోయి మూసేసిన తరువాతే ఒకరు బాధపడాలి అంటావా?"

"అలాగంతా జరగదండి... కోట్లలో పెట్టుబడి పెట్టి కంపనీ నడుపుతున్నవారికి తెలియదా...ఎవరు ఏం చేస్తున్నారు? ఏది, ఎప్పుడు, ఎలా జరపాలోనని?"

"తెలియదు మాలతీ...ఏమీ తెలియదు. అదే ఇప్పుడు నా బాధ!"

"ఏం చూసి చెబుతున్నారు...'తెలియదు’ అని?"

“కంపనీ లోనే మధ్యం సేవిస్తున్నాడు ఒక అధికారి. ఎప్పుడు చూడు పేపరూ, పత్రికలు చదువుతూ ఆఫీసు 'ఫైల్స్’ చూశానని అబద్దం చెబుతున్నాడు ఇంకొక అధికారి. లేని సమస్యను ఉందని చెప్పి దానికి లంచం అడుగుతున్నాడు ఒకడు. దాన్ని ఇంకొకడు తీసుకుని వీడికి ఇస్తున్నాడు.

ఎనిమిది గంటలు పని. దాంట్లో కనీసం మూడు గంటలు కూడా ఎవరూ పనిచేయటం లేదు. మిగితా సమయమంతా సినిమాల గురించి, రాజకీయాల గురించి కబుర్లే. క్యాంటీన్లో వర్కర్లకు ఒక 'మెనూ'... పై అధికారులకు ఒక 'మెనూ'! క్యాంటీన్లో ఏదైనా సరిలేదు అని ఎవరైనా చెబితే వినిపించుకునే వారే లేరు. వర్కర్స్ ను కలుసుకోవటమే అతిపెద్ద గౌరవ సమస్యగా అనుకునే సర్వాధికార మనసున్న వ్యక్తికి 'పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పదవి"

------ 'ఏమీ చేయలేం' అని కన్నీళ్లు పెట్టుకుంటూ తన నిస్సహాయాన్ని, నిస్పృహను వ్యక్తం చేయలేక కుములిపోయాడు వెంకట్ ప్రసాద్. అలా తండ్రి కుమిలిపోవటం కొడుకు శంకరయ్యా ఇంత వరకు చూడలేదు. కానీ ఇదంతా మాలతీని ఏమీ చేయలేదు.

"హూ...ఇలాగే కదా భారతదేశంలో ఉన్న ఎనబై శాతం కంపనీలూ నడుస్తున్నాయి. ఏదో మీ ఒక్క కంపెనీ మాత్రమే ఇలా ఉన్నట్టు బాధపడుతున్నారు?"

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-12 ****************************************************************************************************

26, జనవరి 2020, ఆదివారం

ఆలయం(సీరియల్)...PART-10



                                                    ఆలయం(సీరియల్)
                                                             (PART-10)


"నేను ఇప్పట్నుంచే జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే అడుగుతున్నాను"

"ఎక్కువ భయపడకండి. నేను మళ్ళీ చెబుతున్నాను. ఇక్కడ భయపడటానికి...పెద్దగా ఎవరూ లేరు. వెంకట్ ప్రసాద్ అని ఒకడున్నాడు. వాడికి దేవుడు మన ‘చైర్మనే.' నిజంగానే చాలా మంచివాడు. మన ‘చైర్మన్’ కి కూడా వెంకట్ ప్రసాద్ అంటే ఒక మర్యాద. అతని దగ్గర మాత్రం మీరు జాగ్రత్తగా ఉంటే చాలు"

"అంటే ఇంకెవరితోనూ మనకు సమస్య లేదు...అంతే కదా?"

"నమ్మండి...ఇక్కడున్న వారందరికీ ఒక వెల ఉన్నది. అందరి దగ్గరా తప్పులూ ఉన్నాయి. అది తాకితే చాలు. పరిగెత్తుకుని పారిపోతారు. మనం జాగ్రత్తగా ఉండవలసింది ఒకే ఒక మనిషి దగ్గరే. వెంకట్ ప్రసాద్ అనే ప్రసాద్..."

ఇక చెప్పటానికీ, మాట్లాడటానికి ఏమీ లేదన్నట్టు 'అకౌంట్స్ మేనేజర్’ వెళ్ళటానికి లేచాడు.

విఠల్ రావ్ మన్సులో...'ఏవరీ వెంకట్ ప్రసాద్?' అనే ప్రశ్న!

'క్యాంటీన్లో' వేడి వేడిగా పునుగులు, మెరపకాయ బజ్జీలు వేస్తున్నవి వేస్తున్నటు అయిపోతున్నాయి. మనిషికొక 'కూపన్’ ఇచ్చి వాటిని కొనుక్కుని తింటున్నారు.

బయట ఒక ప్లేటు పునుగులు పది రూపాయలైతే, క్యాంటీన్లో రెండు రూపాయలు. వెంకట్ ప్రసాద్ కూడా అప్పుడప్పుడు అక్కడకొచ్చి ఒక కాఫీ తాగి వెళ్ళిపోతాడు.

ఆ రోజు ప్రసాద్ క్యాంటీన్ కు వచ్చినప్పుడు 'రచ్చ' చేసే పార్టీ రాజేష్ కుమార్ కాఫీకంటే వేడిగా ఆర్భాటం చేస్తున్నాడు.

"ఆ రాష్ట్ర రాజకీయ నాయకుడికి మంచి వేట. ఐదు లక్షలతో వెళ్ళిన ఆ మనిషి అందులో సగం నొక్కేసి, కంపనీ రెండు లక్షలే ఇచ్చిందని ఆఫీసులో చెప్పాడు. ఇక్కడ మన వాళ్ళు...పార్టీకి కోటి రూపాయలు డొనేషన్ గా ఇచ్చినట్టు 'వౌచర్’ తయారు చేసారు"

ఎక్కడ, ఎలా పసిగట్టాడో తెలియదు. విషయాన్ని పెద్దది, చిన్నది చేసి పునుగులు, బజ్జీల కంటే కమ్మగా చెబుతున్నాడు.

"ఏరా...ఏమిటో పక్కనే ఉండి చూసిన వాడివిలాగా మాట్లాడుతున్నావు...?"

"అలాగే ఉంచుకో..."

"అయినా ఇలా నోటికొచ్చినట్టు అబద్దం చెప్పకూడదురా,ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీకి....ఇలాంటి ఒక 'కంపెనీ’ కోటి రూపాయలు ఇస్తుందారా?"

"ఎక్కడరా ఇచ్చారు! ఇచ్చింది ఐదు లక్షలే. రాసుకున్నది కోటి..."

"తొంబై ఐదు శాతమా మోసంచేస్తారు?"

"అది కరెక్టే...ఆ రాజకీయ నాయకుడు గనుక సమస్య చేయటం మొదలుపెట్టాడంటే 'కంపనీ’ జరుపగలరా? 'డిల్లీ' నుండి రైడ్ వస్తుంది"

"రానివ్వురా...మనం 'రూల్స్’ ప్రకారం నడుచుకోవాలని మన ‘చైర్మన్' నే కదా చెబుతున్నారు!"

"చెబుతున్నారు...కానీ ఇక్కడ ఎక్కడున్నాయ్'రూల్స్’ ?నువ్వొక తెల్ల కాగితం కొని 'రూలు’ కర్ర తో దానిపై గీతలు గీతలుగా గీసుకో. అదే 'రూల్స్’."

"అయితే 'కంపనీ' ఎలా రన్ అవుతోంది?"

"వీడొకడురా... ఊరంతా కలిసి రథం లాగటం మొదలుపెడతారు. రథం కదులుతుంది. అక్కడక్కడ కొంతమంది చేతులు నొప్పి పుడుతున్నాయని లాగటం ఆపినా రథం జరగటంలేదా ఏమిటి? లేక...ఆ రథం ఎవరివలన జరుగుతున్నదని చెప్పగలమా? అలాగే మన 'కంపనీ' కూడా నడుస్తోంది"

-----రాజేష్ కుమార్ చెప్పిన ఉదాహరణలో నిజం లేకపోలేదు. కాఫీ తాగుతూ నడుచుకుంటూ తన ఆఫీసు గదిలోకి వచ్చి తన కుర్చీలో కూర్చున వెంకట్ ప్రసాద్ మనసులోనూ అతని చెప్పిన సమాధానం ఎన్నో ఆలొచనలను రేకెత్తింది. మౌనంగా భారమైన మనసుతో పనిలో శ్రద్ద చూపటానికి ప్రయత్నించాడు. కానీ పనిలో మనసు పెట్టలేకపోయాడు.

అతని కుర్చీకి ఎదురుకుండా రెండక్షరాల కొటేషన్:

'అమ్మాయికి కన్యాత్వము….వస్తువుకు నాణ్యత' - అని రెండే లైన్లు!

దానిని చూసిన వెంటనే, విరక్తి కలిసిన నవ్వు వచ్చింది ప్రసాద్ కు. ‘ఇక్కడ అన్నీ లిఖిత రూపం. నిజానికి రెండిటికీ చాలా దూరం. కారణం...? స్నేహితులు మాట్లాడుకున్నట్టే ఇన్వాల్వ్ మెంట్ లేని పని. ఎప్పుడూ మనో భారం. కొంచం కూడా శ్రద్దలేని...కూలీకి చేసే పనిలాగా’

అలా ఆలొచించుకుంటూ పోయిన ప్రసాద్, చివరగా...ఇది 'చైర్మాన్’ కు తెలుసా? అని ప్రశ్నించుకున్నాడు. దానికి మాత్రం అతనికి గబుక్కున సరైన సమాధానం దొరకలేదు.

వెంకట్ ప్రసాద్ ఇల్లు!

ప్రసాద్ భార్య మాలతీ 'టీ.వీ.' చూస్తూ కూర్చోనుంది. ఈనాటి మనిషి జీవితంలో తినడం-నిద్రపోవడం-స్నానం చేయడం లాంటి విడిచిపెట్టలేని రోజువారి పనులలో 'టీ.వీ.' కూడా చేరిపోయింది.

కాలేజీ చివరి సంవత్సరం పరీక్షలు ముగించుకుని 'గెట్ టు గెదర్’ పార్టీలో కూడా పాల్గొని అప్పుడే తిరిగి వచ్చాడు ప్రసాద్ కొడుకు శంకరయ్య... ప్రసాద్ వరకు ‘చైర్మాన్'!

కొడుకు లోపలకు వెళ్ళి డ్రస్సు చేంజ్ చేసుకుని 'డైనింగ్ టేబుల్’ దగ్గరకు వెళ్ళి కూర్చున్నది కూడా గమనించలేదు మాలతీ. కారణం....టీ.వీ! అందులో ఒక సీరియల్లో హీరోయిన్ జైలులో 'వార్డన్’ చేతిలో చిత్రవధ అనుభవిస్తోంది. మాలతీకి ఆ చిత్రవధలను తానే అనుభవిస్తున్నట్టు ఒక ఫీలింగ్. ప్రసాద్ మంచం మీద బోర్లా పడుకుని ఆలొచిస్తున్నాడు. మనసు నిండా 'కంపనీ’ గురించిన ఆలొచనే. శంకరయ్య తల్లిని-తండ్రిని చూసిన తరువాత వొళ్ళుమండి 'టీ.వీ' కి వెడుతున్న కరెంటు స్విచ్ ను ఆపాడు. 'టీ.వీ.' స్క్రీన్ తెల్లగా రావటంతో "అరే...కరెంటు పోయిందా...తలనొప్పిగా ఉంది ఈ ‘ఈ.బి.’ వాళ్ళతో! అంటూ తల బాదుకుంటూ వెనక్కు తిరిగిన మాలతీ... శంకరయ్యను చూసి, "నీ పనేనా?" అంటూ విసుక్కుంది.

                                                                            ఇంకా ఉంది.....Continued in PART-11 ****************************************************************************************************

24, జనవరి 2020, శుక్రవారం

ఆలయం(సీరియల్)...PART-9




                                               ఆలయం(సీరియల్)
                                                          (PART-9)


"ఏమిటండి ఇది...ఐదు బదులు యాబై అని వేసుంది"

"నాకు తెలియదండి...పై అధికారుల ఆర్డర్. నేను వేశాను"

"అయితే మిగతా 45 ఎక్కడ?"

"ఏం ప్రశ్నండి ఇది...మీకు ఒక ఐదు, నాకు ఒక ఐదు. ఇలాగే మిగిలిన 35 కు మనుష్యులు ఉన్నారు కదా...”

"సంతకం పెట్టే నాకు కేవలం ఐదు లక్షలేనా?"

"మీరు కంపెనీలోకి వచ్చేటప్పడు 'జి.ఎం.' అన్ని విషయాలూ చెప్పుంటారే?"

"చెప్పారు...కానీ ఇంత పెద్దదిగా ఉంటుందని నేను అనుకోలేదు"

"ఇప్పుడేమైంది...ఐదు అనే చోట ఏడో...ఎనిమిదో తీసుకోండి. మిగతాది నేను చూసుకుంటాను"

"అది సరే...తరువాత సమస్యేమీ రాదే?"

"రాకూడదనే దేని దేనికి ఎంతెంత లెక్క చూపించాలో అలా చూపించటానికి రెడీగా ఉన్నాను"

"దానికోసం కాదు...ఆ రాజకీయ నాయకుడ్ని సమాధానపరచి పంపించింది నేను. దాన్ని అకౌంట్స్ లో సరి చేసేది మీరు...మనకు పైన ఒకరు, దీనికి దారి చూపించేవారు. మొత్తం ముగ్గురే కదా. మిగతా వాళ్ళకు ఎందుకు భాగం పోవాలి?"

"ఇలాగా వొలిచి మాట్లాడుతారు. మిగతా వాళ్ళ నొరు మూయొద్దా...దానికోసమే?"

"ఇది వాళ్ళకు తెలిస్తేనే కదా?"

"అది సరే...'టాప్' లో ఉన్న చాలామంది గురించి మీకు ఏమీ తెలియదనుకుంటా. పోను పోనూ అన్ని విషయాలనూ తెలుసుకుంటారు"

"నా ప్రశ్నకు ఇప్పుడు ఇదేనా సమాధానం?"

"అవును సార్...కొంచం ఓపికగా 'అడ్జస్ట్' చేసుకుని వెళ్ళండి. ఇలా అప్పుడప్పుడు ఐదు,ఆరు తీసుకుంటూ 'టాప్' కు వెళ్ళిపొవచ్చు. ఒక సంవత్సరం ఈ సీటులో ఉంటే చాలు...జీవితంలో 'సెటిల్’ అయిపోవచ్చు"

----ఆ అకౌంట్స్ మేనేజర్, విఠల్ రావ్ కు బాగానే ఆశ చూపాడు.

అతని కళ్ళల్లోనూ...ఒక విశాలమైన పండ్ల తోటలోకి పెద్ద బుట్టతో వెళ్ళినంత కుషీ.

"అవును...మీ దగ్గర ఒక విషయం అడగాలి.'ఈ కంపెనీ చైర్మాన్' శంకరయ్య గురించి చాలా విన్నాను. ఆయన రాసిన పలు వ్యాసాలు చదివాను. అవి చదివిన తరువాత ఆయన ఒక మేధావి అనేది సందేహం లేకుండా తెలుస్తోంది"

"దానికేమిటిప్పుడు?"

"అది కాదు...'ఈ ఎక్స్ ట్రా' సమాచారం ఆయన వరకు వెల్తే?"

"వెల్తేనే కదా?"

"అంటే వెళ్ళదా?"

"అరే మీరొకరు...ఆయన దగ్గరకు వెళ్లటం అంత సులభం కాదు. అంతే కాదు...ఆయనకు ఎవరిమీదైనా చాడీలు చెబితే నచ్చదు"

“అంటే...ఎంత తప్పు జరిగినా ఆయన చెవులదాక వెళ్ళదని చెబుతున్నారు"

"అవును...అలా ఒకవేల వెళ్ళినా 'టాప్' లో కొంతమంది ఉన్నారు. వాళ్ళకు ఆయన్ని ఎలా సమాధాన పరచాలో తెలుసు"

"ఇది పెద్ద గొప్ప సమాధానం లాగా కనబడటం లేదు"

"సారీ....తెలిసింది చెప్పాను. నాకూ మీలాగానే సందేహాలు ఉన్నాయి. నేను వేగంగా 'సెటిల్’ అవటానికి ఆశపడటం నా భార్యకే నచ్చలేదు. 'పలు రోజుల దొంగ ఒక రోజు చిక్కుకుంటాడు’...తరువాత పరువే పోతుంది. మర్యాద పోతుంది అని అప్పుడప్పుడు బుద్ది చెబుతుంది. కానీ, ఇలాంటి సంధర్భాలు అన్ని చోట్లా దొరకవు.

'చైర్మాన్’ మంచాయనే. అందుకని కంపనీ లాభాలలో భాగం అడిగితే ఇస్తారా? అందుకని మనమే తీసుకోవటం ఒకే దారి. దీని వలన ఆయనేమీ తరిగిపోడు. సంవత్సరానికి వెయ్యి కోట్లు సంపాదిస్తున్నాడు. అందులో మనం ఐదారు కోట్లు కొట్టేయ గలిగితే అదే చాలా పెద్దది కదా?”

'అకౌంట్స్ మేనేజర్ చెప్పిన 'న్యాయం' విఠల్ రావ్ కే ఆశ్చర్యం తెప్పించింది.'ఇలాంటి మనిషి సెంట్రల్ మినిస్టర్ గా ఉండి--అందులోనూ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యుంటే భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని ఏ దేశానికి అమ్ముతాడో తెలియదు!" అనే అనిపించింది.

అయినా ఒక హెచ్చరిక భావం మనసులో ఏర్పడింది.

"బాగా మాట్లాడుతున్నారు...అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. అవును....ఇక్కడ ఈ విషయాల్లన్నిటినీ గమనించే వ్యక్తి ఎవుడూ లేడా?"

"ఎందుకు అడుగుతున్నారు?"

"ఒక హెచ్చరిక కోసమే..."

"ఉన్నారు. 'కంపనీ' అన్న తరువాత ఇలా ఒక నలుగురు, అలా ఒక నలుగురూ లేకుండానా పోతారు? రామక్రిష్ణ అనే ఒకతను ఉన్నాడు.'హిందీ డౌన్ డౌన్, తెలుగు జై జై' అనే ముఠా. సాధారణ మనిషే. కానీ పనిచేయటానికి వొళ్ళు వొంగదు. అతనికి కూడా మనలాంటి ఆలొచనే.'కమీషన్’ ఎక్కడ దొరుకుతుందో ఆ సీటులోకి వెళ్ళి కూర్చోవాలని ఆశ. ఎవరి దగ్గరన్నా మంచి ఉంటే అతనికి తెలియదు. కానీ, చెడు మాత్రం ఏలాగైనా తెలుసుకుంటాడు. మీరు 'ప్యాంటు’ బటన్ సరిగ్గా వేసుకోలేదనుకోండి...దాన్ని కూడా 'నోట్' చేసి నలుగురు దగ్గర మాట్లాడతాడు. అతనికి ఒకే పాలసీ:

'అధికారి గాడిదైనా సరే కాళ్ళు పుచ్చుకో, కార్మికుడు ఆ దేవుడైనా సరే ఎగిరి తన్ను!' అనేదే.

అతనికి మన విషయాలు కొన్ని తెలుసు. దానికి ప్రతిగా అతను పనిచేయకుండా అటూఇటూ తిరుగుతూ ఉండటాన్ని పట్టించుకోము. మాటి మాటికీ లీవు పెడతాడు. దాన్ని కూడా పట్టించుకోము"

"అంటే ఈ పరిశ్రమలో ఏ ఒక్కడూ కూడా న్యాయంగా లేడా?"

"మీరు అడిగేది చూస్తే...?"

నో...నో, ఈ ప్రశ్నకు మీరు ఊహించుకునే సమాధానం తప్పు...నేనెందుకు అలా అడిగానంటే...

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-10 ****************************************************************************************************

21, జనవరి 2020, మంగళవారం

ఆలయం(సీరియల్)...PART-8




                                                ఆలయం(సీరియల్)
                                                           (PART-8)


మరుసటి రోజు!

ఆ జిల్లా రాజకీయ పార్టీ ఆర్గనైజర్, పార్టీ రంగుతో మెరిసిపోతున్న పంచ కట్టుకుని ఆఫీసులోకి దూరాడు. అతనికి కోలాహలమైన స్వాగతం. విఠల్ రావ్ కూడా ఒక పెద్ద పూలమాలను కొని ఉంచాడు. ఆ మాల వేసి అతన్ని తన గదికి తీసుకు వెళ్ళి, కూర్చోబెట్టి కుషీ చేయటం మొదలుపెట్టాడు.

"మీరేనా కొత్తగా వచ్చిన ఆఫీసరో?"

“అవునండి...ఇక నేనే ఇక్కడ ‘ఆఫీసర్- ఇన్ చార్జ్’ ని"

"ఇంతకు ముందు ఎక్కడ ఉండే వాళ్ళు?"

"విశాకపట్నంలో ఉన్న ‘ఎఫ్.జే.ఎస్ పైప్స్’ అనే కంపెనీలో..."

"ఓ...అది చాలా పెద్ద కంపెనీ కదా?"

"అవును...నెలకు వంద కోట్ల బిజినస్ ఉన్న కంపెనీ"

"ఈ కంపెనీలో బిజినస్ ఎంత ఉంటుంది"

"ఇక్కడ కూడా సుమారుగా అంతే బిజినస్ ఉంటుంది"

"విశాకపట్నంలో క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా! అది వదిలేసి ఎండిపోయిన ఈ ఊరుకు వచ్చారు?"

“ఏప్పుడూ 'మేనేజ్ మెంట్ టాప్స్’ ఒకే చోటే ఉండకూడదు. ‘ఎక్స్ పీరియన్స్’ రాను రాను 'జంప్' అవుతూనే ఉండాలి. పాత కంపెనీ కంటే ఇక్కడ సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తామని చెబుతుంటే చల్లని క్లైమేట్టు...విశాకపట్నం, ఇవన్నీ దేనికి చెప్పండి"

"అదీ నిజమే...ఇంట్లో ఒక 'ఏ.సి’ మిషన్ కొని తగిలిస్తే చల్లటి క్లైమేట్ వస్తుంది. దానికోసం విశాకపట్నం వెళ్ళాలా ఏమిటి?"

---వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంభాషణే జరుగుతోంది. మధ్యలో అందులో ఒక చిన్న మార్పు. విఠల్ రావ్ తన కుర్చీ పక్కన పెట్టుకున్న బ్రీఫ్ కేసును ఆ రాజకీయ నాయకుడికి అందించాడు.

“ఈ ఐదు లక్షలు మీ 'కంపనీ’ కి చిల్లర డబ్బులు. మేము 50 లక్షలు వరకు ఎదురు చూశాము"

"అరే మీరొకరు. మా 'కంపనీ’ ‘చైర్మాన్’ పెద్ద పిసినారి అనేది తెలుసుకునే నేను ఈ కంపనీలో చేరాను. మీరు పెద్దగా బాధ పడకండి. అప్పుడప్పుడు భయపెడుతూ ఉండండి. నేను డైరక్టర్లతో మాట్లాడి మీకు 'సెటిల్’ చేస్తూ ఉంటాను"

"అరె...మీరు మా సైడా? ఇంతకు ముందు మీ 'సీటు’లో ఉన్న మనిషి పెద్ద పొగురుబోతు. నేను గాంధీ గారికి మనవుడ్ని, నెహ్రూ గారికి మేన మామను అంటూ డబ్బులే ఇవ్వనని చెప్పాడు. నేను కూడా...చుట్టు పక్కలున్న వారితో గొడవ పెట్టుకోకండని ఎంతో చెప్పి చూశాను. వినలేదు. కరక్టుగా అప్పుడే మీ కంపనీలో పని చేస్తున్న ఒకతను పనిచేస్తున్నప్పుడే 'హార్ట్ అటాక్' వచ్చి చనిపోయాడు. ఎవరో ఒక ఆఫీసర్ ఎక్కువగా శ్రమ పెట్టినందువలనే 'హార్ట్ అటక్' వచ్చిందనే విషయం నా చెవికి చేరింది. అది చాలదా నాకు? పిడి దొరికింది కదా. మీ 'చైర్మాన్' కి ఒక లెటర్ పంపించాను. ఆయన ఇంకొక ఆయనకు లెటర్ పంపించాడు. ఇప్పుడు ఐదు లక్షలు వచ్చింది. ఇదే మీ 'కంపనీ లక్షణం”

---ఆ రాజకీయ నాయకుడు బాగానే మంట వెలిగించాడు. విఠల్ రావ్ కూడా అలాగే 'ఇదే మనకు ఒక మంచి సంచీ' అని ఆ బంధుత్వాన్ని గట్టిగా బిగించుకున్నాడు.

"వదిలేయండి సార్...పాత చెత్తను ఎందుకు కెలకటం? మీరు నాకు మద్దత్తుగా నిలబడండి. మిగితాది నేను చూసుకుంటాను"

"అరె ఏమిటండి మీరు...ఇంత ఒపన్ గా మీరు మాట్లాడిన తరువాత నేను చెప్పటానికి ఏముంది? లోపల హత్యే జరిగినా మీరు భయపడ అక్కర్లేదు. అన్నీ నేను చూసుకుంటాను"

----మొత్తానికి ఆ రాజకీయ నాయకుడు, తను ఎలాంటి మనిషి...తన గుణం ఎలాంటిదీ అనే విషయాలన్నీ చెప్పి ముగించి ఆ బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు.

విఠల్ రావ్ ముఖంలో విజయం సాధించిన నవ్వు. దానికి ఎన్నో అర్ధాలు. రాజకీయ నాయకుడు వెళ్ళిన వెంటనే...'అకౌంట్స్ మేనేజర్’ లోపలకు వచ్చాడు.

"నమస్తే సార్...ఒకలాగా రాజకీయ నాయకుడ్ని సమాధానపరచి పంపించారు లాగుందే?"

"అవును...ఇక మన దగ్గర తోక ఆడించడు. అంతలా బెదిరించి పంపాను"

"గొప్ప మనిషి సార్ మీరు....మీ సీటులో ఇంతకు ముందు ఉన్న ఆఫీసర్ ఆయన్ని లోపలకు రానిచ్చేవాడే కాదు"

"అందుకే ఇక్కడ పనిచేయలేకపోయాడు. నాకు....ఎలాంటి వాళ్లతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. సరే...మీరు ఎందుకు వచ్చారు?"

"సార్...వౌచర్ లో సంతకం తీసుకు వెల్దామని వచ్చాను"

"అవును...ఇలాంటి హెడ్దింగ్గులే లేని ఖర్చులను ఏ లెక్కలో రాస్తారు?"

"అదెందుకు సార్ అడుగుతారు...'మెషనరీ బ్రేక్ డౌన్, కంపనీ మెత్తం పైంటింగ్ వేయించాము...అని ఏదో ఒక లెక్కలో రాయాల్సిందే..."

--అకౌంట్స్ మెనేజర్ మాట్లాడుతూనే వౌచర్ జాపాడు. అందులో సంతకం పెట్టటానికి పెన్ను తెరిచిన విఠల్ రావ్ గుండె గుబేలు మన్నది. కారణం, ఐదు లక్షల రూపాయలకు బదులు 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు అందులో రాసుంది.

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-9 ****************************************************************************************************

19, జనవరి 2020, ఆదివారం

ఆలయం(సీరియల్)...PART-7



                                                  ఆలయం(సీరియల్)
                                                             (PART-7)


"అలా కాదురా...మనల్ని మన తల్లి తండ్రులు పదినెలలు తరువాతే కన్నారు. వాళ్ళనూ వాళ్ళ తల్లితండ్రులు పదినెలల తరువాతే కన్నారు. వాళ్ళకు మాత్రం 'ఏ.సీ.' గదులు, కార్లూ అంటూ చాలా వసతులు. కానీ, మనం కుర్చీలో కూడా కూర్చోకూడదు. నిలబడే పని చేస్తూ చచ్చిపోవాలి"

"దానికేం చేయగలం...వాళ్ళు స్కూల్లో బాగా చదువుకుని మంచి 'మార్కులు’ తెచ్చుకున్నారు. అందువలన 'బి.ఈ', 'ఎం.ఈ' అని సీటు తెచ్చుకుని ఆ చదువులను కూడా విజయవంతంగా పూర్తిచేశారు. మీరు 'సినిమా' కోసం స్కూల్ కట్ చేసి వెళ్ళినందుకు 'ప్లస్ టూ' కూడా పాస్ అవలేదు. అక్టోబర్ లో పరీక్షలు రాసి ఎలాగో 'పాస్’ అయ్యి బ్రతికిపోయారు. మనిషి యొక్క జీవిత పర్వాలలోనే ముఖ్యమైనది విధ్యార్ధి పర్వం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే జీవితం తప్పుగానే స్థిరపడుతుంది. ఏదో ఈ చదువుకు ఈ మాత్రమైనా మంచి కంపెనీలో ఉద్యోగం దొరికి నెల జీతం తీసుకుంటున్నది తలచుకుని సంతోష పడండిరా"

-- ప్రసాద్ ఇలాగే సమాధానం చెబుతాడు. అతనితో మాట్లాడిన వాళ్ళకు 'ఎందుకురా మాట్లాడాము?' అని అనిపిస్తుంది. అందువలన వాళ్ళ వరకు ఇతనొక ప్రత్యేక వ్యక్తి.

ఈ వ్యక్తి ఆరోజు కూడా వీళ్ళ మాటలను పట్టించుకోకుండా, వాళ్ళతో కలవక, విడిగా ఉండి తన పని తాను చేసుకుంటూ వెడుతున్నాడు. అందరి జీవితమూ ఎప్పుడూ ఒకే లాగానే పయనిస్తుందా? అందులో ఎన్నో భయం పుట్టించే మార్పులు, వంకర్లు వస్తూనే ఉంటాయి కదా!

ప్రసాద్ వరకు అలాంటి ఒక మార్పు వచ్చింది.

అతనికి 'పర్సనల్ డిపార్ట్ మెంటు’ నుండి పిలుపు వచ్చింది.

"మిస్టర్ వెంకట్ ప్రసాద్...మీరు కొత్త ‘పి.ఆర్.ఓ.’ సారును చూడాలని చెప్పుంచారా?"

"అవును..."

“ఆయన డ్యూటీలో జాయిన్ అయ్యి ఈ రోజు రెండో రోజు. నిన్న మీరు ఆయన్ని కలవటానికి వచ్చి అలాగే తిరిగి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వెళ్ళండి. సారు మీకోసం కాచుకోనున్నారు"

ప్రసాద్ ను పిలిచినతను తప్పుకున్నాడు. కానీ ‘పి.ఆర్.ఓ.’ ను వెతుక్కుంటూ వెళ్ళి 'విష్' చేయటానికి ప్రసాదుకు బిడియంగా ఉంది. ఎందుకంటే ముందు రోజు ఆయన్ని కలవడానికి వచ్చినప్పుడు అతను చూసిన ఆ దృశ్యం అతని మనసులో కదలాడుతోంది.

'ఒక తాగుబోతు--అందులోనూ పని చేసే సమయంలోనే తాగుతున్న మహా తాగుబోతుగా మనసులో పదిలమైపోయిన ఆయన్ని ఏమని చెప్పి విష్ చేయాలి?’

"ఇంకా ఎక్కువగా తాగి ఆనందంగా జీవించండి!" అని విష్ చేయాలా? -- గందరగోళంతో 'కంప్యూటర్ మానీటర్ నే' చూస్తూ కూర్చున్న అతను, చివరగా ఆ ‘పి.ఆర్.ఓ’ ను కలిసి విష్ చేయాలనే ఐడియానే మార్చుకున్నాడు.

అప్పుడు రాజేష్ కుమార్ వచ్చాడు.

“ప్రసాద్...ఇంకా వెళ్లలేదా?"

"లేదు రాజేష్... అభినందనలు అనేది మంచి మనుషులకు మాత్రమే"

"వచ్చిన 'పార్టీ' ఒక వేస్టు వ్యక్తి అనేది మొదటి రోజే తెలిసిపోయిందా?"

ప్రసాద్ మౌనంగానే దాన్ని ఆమోదించాడు.

రాజేష్ కుమార్ కు కుషీగా ఉన్నది.

"పెద్ద అధికారంలో ఉండే ఆఫీసర్లు అందరూ ఎప్పుడూ దేవాది దేవతలు అని అనుకుంటావే. వాళ్ల గురించి నీదగ్గర ఇప్పుడొక మార్పు...మంచిది" అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళాడు.

అదే సమయం 'డిపార్ట్ మెంటులో' ఆ 'పి.ఆర్.ఓ.' రహస్యంగా బాటిల్ తెరిచి గ్లాసులో పోసుకుని తాగటం మొదలుపెట్టాడు. ఎక్కువగా వాసన రాని విదేశీ మధ్యం. అయినా కానీ, ఒక జాగ్రత్తకోసం వక్కపొడి పొట్లం కట్ చేసి నోట్లో పోసుకున్నాడు. అద్దాల అడ్డు దగ్గరకు వెళ్ళి కర్టన్ను పక్కకు జరిపి ఎవరైనా గమనిస్తున్నారా? అని ఒక చూపు వేశాడు.

టెలిఫోన్ మోగింది. రిజీవర్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతలవైపు ఆ పరిశ్రమకు చెందిన అతిపెద్ద పోస్టులో ఉన్న మరో అధికారి ఒకరు మాట్లాడారు.

"మిస్టర్. విఠల్ రావ్!"

"ఎస్ సార్..."

"పనిలో చేరి ‘సెటిల్’ అయ్యారా?"

"ఎస్ సార్..."

"సరే...నేను చెప్పినదంతా జ్ఞాపకం ఉంచుకున్నారు కదా?"

"ఉంది సార్"

"రేపు ఆ ప్రాంతం వ్యక్తి, రాజకీయ పార్టీ జిల్లా ఆర్గనైజర్ వస్తారు. ఆయనకు ఐదు లక్షలు 'బ్రీఫ్ కేసు’ లో ఉంచి ఇవ్వండి. సస్ పెన్స్ అకౌంటులో డబ్బులు తీసుకోండి. అలాగే 'వౌచర్’ లో సంతకం అడిగితే వేసి ఇవ్వండి. ఈ డబ్బు ఇచ్చే విషయాన్ని రహస్యంగా ఉంచండి...అది వాళ్ళ ఎలక్షన్ ఫండ్"

"ఓ.కే. సార్...నేను చూసుకుంటాను"

--- విఠల్ రావ్ అంటూ 'టాప్ లెవల్లో' పిలవబడ్డ ఆ 'పి.ఆర్.ఓ.'...వెంటనే ఫోను పెట్టేసి, వచ్చి కూర్చున్నాడు. అతని కడుపు రగిలిపోతోంది. ‘ఏ పనీ చేయని రాజకీయ నాయకులకు నా చేతులతో లంచం ఇవ్వాల్సి వస్తోంది. హు...మనం కూడా ఒక రాజకీయ నాయకుడై ఉండాల్సింది, ఏ పనీ చేయకుండా డబ్బు సంపాదించుకోవచ్చు’ అని గొణుక్కోవడం మొదలుపెట్టాడు.

                                                                      ఇంకా ఉంది.....Continued in PART-8 ****************************************************************************************************

17, జనవరి 2020, శుక్రవారం

ఆలయం(సీరియల్)...PART-6



                                                  ఆలయం(సీరియల్)
                                                             (PART-6)



అతనికి జీతం నెలకు పదిహేనువేలు. అందులో డిడెక్షన్స్ పోను చేతికి వచ్చేది పన్నెండు వేలు. పోయిన ఏడాది వరకు నాలుగు వేల రూపాయల ఇంట్లోనే అద్దెకు ఉండేవాడు. ఈ రోజు అతను ఉంటున్న ఇంటి అద్దే పదివేలు. అంతే కాదు ఆఫీసుకు రావాటానికి ఒక 'బుల్లెట్' మోటర్ బైకు. చల్లగా పడుకోటానికి ఇంటి బెడ్ రూము గదిలో ఒక ‘స్పిట్ ఏ.సీ.’ అని...'జెనెరల్ మేనేజర్’ రేంజ్ లో ఉన్నాడు. అతను తీసుకుంటున్న జీతంలో ఇవన్నీ ఎలా సాధ్యం?"

-- రాజేష్ కుమార్ అలా చెప్పేసరికి ప్రసాద్ ఇబ్బంది పడ్డాడు.

"చాలు...ఇలాంటి విషయాలు నా చెవిలో పడుతున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతోంది. 'కంపనీ' భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆలొచనతో నాకు తల తిరుగుతోంది" చెప్పాడు ప్రసాద్.

"దానికేం చేయగలం...టాప్ లో ఉన్న తలలు సరిగ్గా ఉంటే, క్రింద ఉండే వీడిలాంటి వాళ్ళు సరిగ్గా ఉంటారు. కానీ,పెద్ద తలలు వేరే విధంగా నడుచుకుంటున్నారే?

"వేరే విధంగా అంటే?"

"నీకేమీ తెలియదన్నట్టు మొహం పెడతావేం...వీడిక్కడ టీ పొడి, ఆహార సామగ్రి లో దొచుకుంటుంటే...అక్కడ వాళ్ళు, 'సబ్-కాంట్రాక్ట్', 'మెటీరియల్ పర్చేస్’ అని చెప్పి దోచుకుంటున్నారు"

"చాలు...ఇంతకంటే ఇంకేమీ మాట్లాడొద్దు! మంచిది ఏదైనా ఉంటే మాట్లాడు"--- అని చెప్పి ప్రసాద్ తాత్కాలికంగా రాజేష్ కుమార్ ను తప్పించుకుని వెళ్ళిపోయాడు.

డిపార్ట్ మెంటులో కి దూరేటప్పుడు ఎప్పటిలాగానే ప్రసాదే మొదటి వ్యక్తి. సమయం 8.50. తొమ్మిదింటికి షిఫ్ట్ మొదలు. అతనితో పాటు మరో ఏడుగురు ఆ డిపార్ట్ మెంటులో పనిచేస్తున్నారు. అందరూ మిలటరీ వాళ్ళలాగా కరెక్టుగా ఫ్యాక్టరీ బెల్లు తొమ్మిదింటికి మోగంగానే లోపలకు వచ్చారు. కానీ, పది నిమిషాల ముందే వచ్చి, కంప్యూటర్ ఆన్ చేసి పని మొదలుపెట్టిన ప్రసాద్ ను చూసి ఒక నవ్వు నవ్వారు. దాన్ని ప్రసాదూ గమనించాడు.

ఇదంతా అక్కడ రోజూ జరిగే తంతే. 'కంపెని’ లో ప్రసాద్ లాంటి నిజాయితీ అయిన ఉద్యోగులు ఉండటమే కష్టం. మిగిలిన అందరికీ ప్రసాద్ లాంటి వారు 'పాఠాలు నేర్పుతారు’. అందులో కనకారావ్ అనే ఒకతను ఉన్నాడు. అతనికి వెంకట్ ప్రసాద్ అంటే వొళ్ళుమంట. వెక్కిరిస్తూ మాట్లాడతాడు. ఎందుకంటే ప్రసాద్ ఖాళీ సమయంలో కూడా 'ఉద్యోగం చేసే చోటు ఆలయంలాంటిది. దాంట్లో ఉద్యోగం దేవుడు లాంటిది’ అని చెబుతూ ఎప్పుడూ పని పని అంటూ కళ్ళార్పకుండా పనిచేశేవాడు.

"రేయ్ కేశవ్, నువ్వూ ఉన్నావే...నీకు శ్రమ అంటే ఏమిటో తెలుసారా? మన ప్రసాద్ ను చూడు...శ్రమకు ప్రసాదే ఒక ఉదాహరణ" అని వేలాకోళంగా మొదలెడతాడు.

అందరూ అతనితో వంతుపాడుతారు. కొంతమంది ప్రసాద్ దగ్గరకు వెళ్ళి అతన్ని కెలుకుతారు.

"రేయ్ ప్రసాద్...నేను తెలియక అడుగుతున్నాను. ఇంతగా కష్టపడి పనిచేస్తున్నావే! నీకేమన్నా 'కంపనీ’ లో గోల్డు మెడల్ ఇస్తారా?"

"అంటే...కష్టపడి పనిచేస్తే బంగారు పతకం ఇవ్వాలి అంటావా?..."

"నేను అలా చెప్పటంలేదు! నువ్వెందుకు అంత కష్టపడాతవు...మనం కొండనే పగలుగొట్టినా మనం 'లేబర్’ గుంపే. కావాలంటే ఐదొందలో, వెయ్యో జీతం ఎక్కువ ఇస్తారు. నువ్వొక మేనేజర్ గానో....ఆఫీసర్ గానో అవలేవురా!"

"నేను మేనేజర్ అవటంకోసం ఇక్కడ పనిచేయటంలేదు. తీసుకునే జీతానికి న్యాయం చేయాలి. అందుకోసమే పనిచేస్తున్నాను. నేను ఈ కంపనీలో పనిచేయటానికి నాకు ఒక అవకాశం దొరికింది. అప్పుడు జీతం కూడా వద్దు 'ఉద్యోగం దొరికితే చాలు’...పని నేర్చుకోవచ్చు. అదే చాలు అనుకున్నాను. కానీ, జీతంతో ఉద్యోగం దొరికింది. అలాగే అప్పుడప్పుడు జీతం పెరుగుతూ ఇప్పుడు నెలకు ముప్పైవేల రూపాయలు వస్తోంది. ఇంత పెద్ద జీతం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది నిలకడగా ఉండాలి. ఇలాగే కొనసాగాలి. దానికోసం ఈ కంపనీ ఇప్పటి లాగానే ఎప్పుడూ ఉండాలి. దానికోసమే నా పనిని నేను బాధ్యతగా చేస్తున్నాను. నేను ఇలా పనిచేయడంలో నాకు ఒక ఆనందం ఉందిరా. దయ చేసి మీ వ్యాఖ్యానాలతో నా బుర్రను మార్చటానికి ట్రై చేయకండి. ప్లీజ్..."

"ఇలా చూడరా...మేము నీమీద ఏమీ రుద్దటం లేదు. యధార్ధాన్ని మాట్లాడుతున్నాము. ఇక్కడ మనం చెమటోడ్చి పనిచేస్తున్నాము. దానికి తగిన జీతాలు ఇవ్వటం లేదు. కానీ, 'ఆఫీసర్’ అనే ముసుగులో 'ఏ.సీ.' గదులలో వార్తా పత్రికలు చదువుతూ డెబ్బైవేలు, ఎనభైవేలు జీతాలు తీసుకుంటున్నారు...దీని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలొచించావా?"

"చాలురా...నువ్వేదో వాళ్ల పక్కనే ఉండి చూసినట్టు మాట్లాడకురా! ఎవరో ఒకలిద్దరు కథల పుస్తకాలు చదువుతూ ఉండి ఉండొచ్చు. వెంటనే అందర్నీ అలాంటి వారనే చెప్పాలా?...వెళ్ళరా. వెళ్ళి పనిచూసుకో"

నేను చెప్పేది కొంచం విను.

చెప్పు...వింటూనే ఉన్నాగా...చెప్పు.

                                                                           ఇంకా ఉంది.....Continued in PART-7 **************************************************************************************************