ఆ జిల్లా రాజకీయ పార్టీ ఆర్గనైజర్, పార్టీ రంగుతో మెరిసిపోతున్న పంచ కట్టుకుని ఆఫీసులోకి దూరాడు. అతనికి కోలాహలమైన స్వాగతం. విఠల్ రావ్ కూడా ఒక పెద్ద పూలమాలను కొని ఉంచాడు. ఆ మాల వేసి అతన్ని తన గదికి తీసుకు వెళ్ళి, కూర్చోబెట్టి కుషీ చేయటం మొదలుపెట్టాడు.
"మీరేనా కొత్తగా వచ్చిన ఆఫీసరో?"
“అవునండి...ఇక నేనే ఇక్కడ ‘ఆఫీసర్- ఇన్ చార్జ్’ ని"
"ఇంతకు ముందు ఎక్కడ ఉండే వాళ్ళు?"
"విశాకపట్నంలో ఉన్న ‘ఎఫ్.జే.ఎస్ పైప్స్’ అనే కంపెనీలో..."
"ఓ...అది చాలా పెద్ద కంపెనీ కదా?"
"అవును...నెలకు వంద కోట్ల బిజినస్ ఉన్న కంపెనీ"
"ఈ కంపెనీలో బిజినస్ ఎంత ఉంటుంది"
"ఇక్కడ కూడా సుమారుగా అంతే బిజినస్ ఉంటుంది"
"విశాకపట్నంలో క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా! అది వదిలేసి ఎండిపోయిన ఈ ఊరుకు వచ్చారు?"
“ఏప్పుడూ 'మేనేజ్ మెంట్ టాప్స్’ ఒకే చోటే ఉండకూడదు. ‘ఎక్స్ పీరియన్స్’ రాను రాను 'జంప్' అవుతూనే ఉండాలి. పాత కంపెనీ కంటే ఇక్కడ సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తామని చెబుతుంటే చల్లని క్లైమేట్టు...విశాకపట్నం, ఇవన్నీ దేనికి చెప్పండి"
"అదీ నిజమే...ఇంట్లో ఒక 'ఏ.సి’ మిషన్ కొని తగిలిస్తే చల్లటి క్లైమేట్ వస్తుంది. దానికోసం విశాకపట్నం వెళ్ళాలా ఏమిటి?"
---వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంభాషణే జరుగుతోంది. మధ్యలో అందులో ఒక చిన్న మార్పు. విఠల్ రావ్ తన కుర్చీ పక్కన పెట్టుకున్న బ్రీఫ్ కేసును ఆ రాజకీయ నాయకుడికి అందించాడు.
“ఈ ఐదు లక్షలు మీ 'కంపనీ’ కి చిల్లర డబ్బులు. మేము 50 లక్షలు వరకు ఎదురు చూశాము"
"అరే మీరొకరు. మా 'కంపనీ’ ‘చైర్మాన్’ పెద్ద పిసినారి అనేది తెలుసుకునే నేను ఈ కంపనీలో చేరాను. మీరు పెద్దగా బాధ పడకండి. అప్పుడప్పుడు భయపెడుతూ ఉండండి. నేను డైరక్టర్లతో మాట్లాడి మీకు 'సెటిల్’ చేస్తూ ఉంటాను"
"అరె...మీరు మా సైడా? ఇంతకు ముందు మీ 'సీటు’లో ఉన్న మనిషి పెద్ద పొగురుబోతు. నేను గాంధీ గారికి మనవుడ్ని, నెహ్రూ గారికి మేన మామను అంటూ డబ్బులే ఇవ్వనని చెప్పాడు. నేను కూడా...చుట్టు పక్కలున్న వారితో గొడవ పెట్టుకోకండని ఎంతో చెప్పి చూశాను. వినలేదు. కరక్టుగా అప్పుడే మీ కంపనీలో పని చేస్తున్న ఒకతను పనిచేస్తున్నప్పుడే 'హార్ట్ అటాక్' వచ్చి చనిపోయాడు. ఎవరో ఒక ఆఫీసర్ ఎక్కువగా శ్రమ పెట్టినందువలనే 'హార్ట్ అటక్' వచ్చిందనే విషయం నా చెవికి చేరింది. అది చాలదా నాకు? పిడి దొరికింది కదా. మీ 'చైర్మాన్' కి ఒక లెటర్ పంపించాను. ఆయన ఇంకొక ఆయనకు లెటర్ పంపించాడు. ఇప్పుడు ఐదు లక్షలు వచ్చింది. ఇదే మీ 'కంపనీ లక్షణం”
---ఆ రాజకీయ నాయకుడు బాగానే మంట వెలిగించాడు. విఠల్ రావ్ కూడా అలాగే 'ఇదే మనకు ఒక మంచి సంచీ' అని ఆ బంధుత్వాన్ని గట్టిగా బిగించుకున్నాడు.
"వదిలేయండి సార్...పాత చెత్తను ఎందుకు కెలకటం? మీరు నాకు మద్దత్తుగా నిలబడండి. మిగితాది నేను చూసుకుంటాను"
"అరె ఏమిటండి మీరు...ఇంత ఒపన్ గా మీరు మాట్లాడిన తరువాత నేను చెప్పటానికి ఏముంది? లోపల హత్యే జరిగినా మీరు భయపడ అక్కర్లేదు. అన్నీ నేను చూసుకుంటాను"
----మొత్తానికి ఆ రాజకీయ నాయకుడు, తను ఎలాంటి మనిషి...తన గుణం ఎలాంటిదీ అనే విషయాలన్నీ చెప్పి ముగించి ఆ బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు.
విఠల్ రావ్ ముఖంలో విజయం సాధించిన నవ్వు. దానికి ఎన్నో అర్ధాలు. రాజకీయ నాయకుడు వెళ్ళిన వెంటనే...'అకౌంట్స్ మేనేజర్’ లోపలకు వచ్చాడు.
"నమస్తే సార్...ఒకలాగా రాజకీయ నాయకుడ్ని సమాధానపరచి పంపించారు లాగుందే?"
"అవును...ఇక మన దగ్గర తోక ఆడించడు. అంతలా బెదిరించి పంపాను"
"గొప్ప మనిషి సార్ మీరు....మీ సీటులో ఇంతకు ముందు ఉన్న ఆఫీసర్ ఆయన్ని లోపలకు రానిచ్చేవాడే కాదు"
"అందుకే ఇక్కడ పనిచేయలేకపోయాడు. నాకు....ఎలాంటి వాళ్లతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. సరే...మీరు ఎందుకు వచ్చారు?"
"సార్...వౌచర్ లో సంతకం తీసుకు వెల్దామని వచ్చాను"
"అవును...ఇలాంటి హెడ్దింగ్గులే లేని ఖర్చులను ఏ లెక్కలో రాస్తారు?"
"అదెందుకు సార్ అడుగుతారు...'మెషనరీ బ్రేక్ డౌన్, కంపనీ మెత్తం పైంటింగ్ వేయించాము...అని ఏదో ఒక లెక్కలో రాయాల్సిందే..."
--అకౌంట్స్ మెనేజర్ మాట్లాడుతూనే వౌచర్ జాపాడు. అందులో సంతకం పెట్టటానికి పెన్ను తెరిచిన విఠల్ రావ్ గుండె గుబేలు మన్నది. కారణం, ఐదు లక్షల రూపాయలకు బదులు 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు అందులో రాసుంది.
ఇంకా ఉంది.....Continued in PART-9****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి