ప్రపంచంలోనే అత్యధిక దంతవైద్యులు ఉన్న పట్టణం...(ఆసక్తి)....01/06/23న ప్రచురణ అవుతుంది

మరవటం మర్చిపోయాను...(సీరియల్/PART-1 of 24)....02/06/23న ప్రచురణ అవుతుంది

'గ్రహాంతర వాసులు భూమిపై చాలా కాలంగా ఉన్నారు'!!!...(ఆసక్తి)...03/05/23 న ప్రచురణ అవుతుంది

జాబిల్లీ నువ్వే కావాలి …(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది.

17, జనవరి 2020, శుక్రవారం

ఆలయం(సీరియల్)...PART-6                                                  ఆలయం(సీరియల్)
                                                             (PART-6)అతనికి జీతం నెలకు పదిహేనువేలు. అందులో డిడెక్షన్స్ పోను చేతికి వచ్చేది పన్నెండు వేలు. పోయిన ఏడాది వరకు నాలుగు వేల రూపాయల ఇంట్లోనే అద్దెకు ఉండేవాడు. ఈ రోజు అతను ఉంటున్న ఇంటి అద్దే పదివేలు. అంతే కాదు ఆఫీసుకు రావాటానికి ఒక 'బుల్లెట్' మోటర్ బైకు. చల్లగా పడుకోటానికి ఇంటి బెడ్ రూము గదిలో ఒక ‘స్పిట్ ఏ.సీ.’ అని...'జెనెరల్ మేనేజర్’ రేంజ్ లో ఉన్నాడు. అతను తీసుకుంటున్న జీతంలో ఇవన్నీ ఎలా సాధ్యం?"

-- రాజేష్ కుమార్ అలా చెప్పేసరికి ప్రసాద్ ఇబ్బంది పడ్డాడు.

"చాలు...ఇలాంటి విషయాలు నా చెవిలో పడుతున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతోంది. 'కంపనీ' భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆలొచనతో నాకు తల తిరుగుతోంది" చెప్పాడు ప్రసాద్.

"దానికేం చేయగలం...టాప్ లో ఉన్న తలలు సరిగ్గా ఉంటే, క్రింద ఉండే వీడిలాంటి వాళ్ళు సరిగ్గా ఉంటారు. కానీ,పెద్ద తలలు వేరే విధంగా నడుచుకుంటున్నారే?

"వేరే విధంగా అంటే?"

"నీకేమీ తెలియదన్నట్టు మొహం పెడతావేం...వీడిక్కడ టీ పొడి, ఆహార సామగ్రి లో దొచుకుంటుంటే...అక్కడ వాళ్ళు, 'సబ్-కాంట్రాక్ట్', 'మెటీరియల్ పర్చేస్’ అని చెప్పి దోచుకుంటున్నారు"

"చాలు...ఇంతకంటే ఇంకేమీ మాట్లాడొద్దు! మంచిది ఏదైనా ఉంటే మాట్లాడు"--- అని చెప్పి ప్రసాద్ తాత్కాలికంగా రాజేష్ కుమార్ ను తప్పించుకుని వెళ్ళిపోయాడు.

డిపార్ట్ మెంటులో కి దూరేటప్పుడు ఎప్పటిలాగానే ప్రసాదే మొదటి వ్యక్తి. సమయం 8.50. తొమ్మిదింటికి షిఫ్ట్ మొదలు. అతనితో పాటు మరో ఏడుగురు ఆ డిపార్ట్ మెంటులో పనిచేస్తున్నారు. అందరూ మిలటరీ వాళ్ళలాగా కరెక్టుగా ఫ్యాక్టరీ బెల్లు తొమ్మిదింటికి మోగంగానే లోపలకు వచ్చారు. కానీ, పది నిమిషాల ముందే వచ్చి, కంప్యూటర్ ఆన్ చేసి పని మొదలుపెట్టిన ప్రసాద్ ను చూసి ఒక నవ్వు నవ్వారు. దాన్ని ప్రసాదూ గమనించాడు.

ఇదంతా అక్కడ రోజూ జరిగే తంతే. 'కంపెని’ లో ప్రసాద్ లాంటి నిజాయితీ అయిన ఉద్యోగులు ఉండటమే కష్టం. మిగిలిన అందరికీ ప్రసాద్ లాంటి వారు 'పాఠాలు నేర్పుతారు’. అందులో కనకారావ్ అనే ఒకతను ఉన్నాడు. అతనికి వెంకట్ ప్రసాద్ అంటే వొళ్ళుమంట. వెక్కిరిస్తూ మాట్లాడతాడు. ఎందుకంటే ప్రసాద్ ఖాళీ సమయంలో కూడా 'ఉద్యోగం చేసే చోటు ఆలయంలాంటిది. దాంట్లో ఉద్యోగం దేవుడు లాంటిది’ అని చెబుతూ ఎప్పుడూ పని పని అంటూ కళ్ళార్పకుండా పనిచేశేవాడు.

"రేయ్ కేశవ్, నువ్వూ ఉన్నావే...నీకు శ్రమ అంటే ఏమిటో తెలుసారా? మన ప్రసాద్ ను చూడు...శ్రమకు ప్రసాదే ఒక ఉదాహరణ" అని వేలాకోళంగా మొదలెడతాడు.

అందరూ అతనితో వంతుపాడుతారు. కొంతమంది ప్రసాద్ దగ్గరకు వెళ్ళి అతన్ని కెలుకుతారు.

"రేయ్ ప్రసాద్...నేను తెలియక అడుగుతున్నాను. ఇంతగా కష్టపడి పనిచేస్తున్నావే! నీకేమన్నా 'కంపనీ’ లో గోల్డు మెడల్ ఇస్తారా?"

"అంటే...కష్టపడి పనిచేస్తే బంగారు పతకం ఇవ్వాలి అంటావా?..."

"నేను అలా చెప్పటంలేదు! నువ్వెందుకు అంత కష్టపడాతవు...మనం కొండనే పగలుగొట్టినా మనం 'లేబర్’ గుంపే. కావాలంటే ఐదొందలో, వెయ్యో జీతం ఎక్కువ ఇస్తారు. నువ్వొక మేనేజర్ గానో....ఆఫీసర్ గానో అవలేవురా!"

"నేను మేనేజర్ అవటంకోసం ఇక్కడ పనిచేయటంలేదు. తీసుకునే జీతానికి న్యాయం చేయాలి. అందుకోసమే పనిచేస్తున్నాను. నేను ఈ కంపనీలో పనిచేయటానికి నాకు ఒక అవకాశం దొరికింది. అప్పుడు జీతం కూడా వద్దు 'ఉద్యోగం దొరికితే చాలు’...పని నేర్చుకోవచ్చు. అదే చాలు అనుకున్నాను. కానీ, జీతంతో ఉద్యోగం దొరికింది. అలాగే అప్పుడప్పుడు జీతం పెరుగుతూ ఇప్పుడు నెలకు ముప్పైవేల రూపాయలు వస్తోంది. ఇంత పెద్ద జీతం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది నిలకడగా ఉండాలి. ఇలాగే కొనసాగాలి. దానికోసం ఈ కంపనీ ఇప్పటి లాగానే ఎప్పుడూ ఉండాలి. దానికోసమే నా పనిని నేను బాధ్యతగా చేస్తున్నాను. నేను ఇలా పనిచేయడంలో నాకు ఒక ఆనందం ఉందిరా. దయ చేసి మీ వ్యాఖ్యానాలతో నా బుర్రను మార్చటానికి ట్రై చేయకండి. ప్లీజ్..."

"ఇలా చూడరా...మేము నీమీద ఏమీ రుద్దటం లేదు. యధార్ధాన్ని మాట్లాడుతున్నాము. ఇక్కడ మనం చెమటోడ్చి పనిచేస్తున్నాము. దానికి తగిన జీతాలు ఇవ్వటం లేదు. కానీ, 'ఆఫీసర్’ అనే ముసుగులో 'ఏ.సీ.' గదులలో వార్తా పత్రికలు చదువుతూ డెబ్బైవేలు, ఎనభైవేలు జీతాలు తీసుకుంటున్నారు...దీని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలొచించావా?"

"చాలురా...నువ్వేదో వాళ్ల పక్కనే ఉండి చూసినట్టు మాట్లాడకురా! ఎవరో ఒకలిద్దరు కథల పుస్తకాలు చదువుతూ ఉండి ఉండొచ్చు. వెంటనే అందర్నీ అలాంటి వారనే చెప్పాలా?...వెళ్ళరా. వెళ్ళి పనిచూసుకో"

నేను చెప్పేది కొంచం విను.

చెప్పు...వింటూనే ఉన్నాగా...చెప్పు.

                                                                           ఇంకా ఉంది.....Continued in PART-7 **************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి