19, జనవరి 2020, ఆదివారం

ఆలయం(సీరియల్)...PART-7



                                                  ఆలయం(సీరియల్)
                                                             (PART-7)


"అలా కాదురా...మనల్ని మన తల్లి తండ్రులు పదినెలలు తరువాతే కన్నారు. వాళ్ళనూ వాళ్ళ తల్లితండ్రులు పదినెలల తరువాతే కన్నారు. వాళ్ళకు మాత్రం 'ఏ.సీ.' గదులు, కార్లూ అంటూ చాలా వసతులు. కానీ, మనం కుర్చీలో కూడా కూర్చోకూడదు. నిలబడే పని చేస్తూ చచ్చిపోవాలి"

"దానికేం చేయగలం...వాళ్ళు స్కూల్లో బాగా చదువుకుని మంచి 'మార్కులు’ తెచ్చుకున్నారు. అందువలన 'బి.ఈ', 'ఎం.ఈ' అని సీటు తెచ్చుకుని ఆ చదువులను కూడా విజయవంతంగా పూర్తిచేశారు. మీరు 'సినిమా' కోసం స్కూల్ కట్ చేసి వెళ్ళినందుకు 'ప్లస్ టూ' కూడా పాస్ అవలేదు. అక్టోబర్ లో పరీక్షలు రాసి ఎలాగో 'పాస్’ అయ్యి బ్రతికిపోయారు. మనిషి యొక్క జీవిత పర్వాలలోనే ముఖ్యమైనది విధ్యార్ధి పర్వం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే జీవితం తప్పుగానే స్థిరపడుతుంది. ఏదో ఈ చదువుకు ఈ మాత్రమైనా మంచి కంపెనీలో ఉద్యోగం దొరికి నెల జీతం తీసుకుంటున్నది తలచుకుని సంతోష పడండిరా"

-- ప్రసాద్ ఇలాగే సమాధానం చెబుతాడు. అతనితో మాట్లాడిన వాళ్ళకు 'ఎందుకురా మాట్లాడాము?' అని అనిపిస్తుంది. అందువలన వాళ్ళ వరకు ఇతనొక ప్రత్యేక వ్యక్తి.

ఈ వ్యక్తి ఆరోజు కూడా వీళ్ళ మాటలను పట్టించుకోకుండా, వాళ్ళతో కలవక, విడిగా ఉండి తన పని తాను చేసుకుంటూ వెడుతున్నాడు. అందరి జీవితమూ ఎప్పుడూ ఒకే లాగానే పయనిస్తుందా? అందులో ఎన్నో భయం పుట్టించే మార్పులు, వంకర్లు వస్తూనే ఉంటాయి కదా!

ప్రసాద్ వరకు అలాంటి ఒక మార్పు వచ్చింది.

అతనికి 'పర్సనల్ డిపార్ట్ మెంటు’ నుండి పిలుపు వచ్చింది.

"మిస్టర్ వెంకట్ ప్రసాద్...మీరు కొత్త ‘పి.ఆర్.ఓ.’ సారును చూడాలని చెప్పుంచారా?"

"అవును..."

“ఆయన డ్యూటీలో జాయిన్ అయ్యి ఈ రోజు రెండో రోజు. నిన్న మీరు ఆయన్ని కలవటానికి వచ్చి అలాగే తిరిగి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వెళ్ళండి. సారు మీకోసం కాచుకోనున్నారు"

ప్రసాద్ ను పిలిచినతను తప్పుకున్నాడు. కానీ ‘పి.ఆర్.ఓ.’ ను వెతుక్కుంటూ వెళ్ళి 'విష్' చేయటానికి ప్రసాదుకు బిడియంగా ఉంది. ఎందుకంటే ముందు రోజు ఆయన్ని కలవడానికి వచ్చినప్పుడు అతను చూసిన ఆ దృశ్యం అతని మనసులో కదలాడుతోంది.

'ఒక తాగుబోతు--అందులోనూ పని చేసే సమయంలోనే తాగుతున్న మహా తాగుబోతుగా మనసులో పదిలమైపోయిన ఆయన్ని ఏమని చెప్పి విష్ చేయాలి?’

"ఇంకా ఎక్కువగా తాగి ఆనందంగా జీవించండి!" అని విష్ చేయాలా? -- గందరగోళంతో 'కంప్యూటర్ మానీటర్ నే' చూస్తూ కూర్చున్న అతను, చివరగా ఆ ‘పి.ఆర్.ఓ’ ను కలిసి విష్ చేయాలనే ఐడియానే మార్చుకున్నాడు.

అప్పుడు రాజేష్ కుమార్ వచ్చాడు.

“ప్రసాద్...ఇంకా వెళ్లలేదా?"

"లేదు రాజేష్... అభినందనలు అనేది మంచి మనుషులకు మాత్రమే"

"వచ్చిన 'పార్టీ' ఒక వేస్టు వ్యక్తి అనేది మొదటి రోజే తెలిసిపోయిందా?"

ప్రసాద్ మౌనంగానే దాన్ని ఆమోదించాడు.

రాజేష్ కుమార్ కు కుషీగా ఉన్నది.

"పెద్ద అధికారంలో ఉండే ఆఫీసర్లు అందరూ ఎప్పుడూ దేవాది దేవతలు అని అనుకుంటావే. వాళ్ల గురించి నీదగ్గర ఇప్పుడొక మార్పు...మంచిది" అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళాడు.

అదే సమయం 'డిపార్ట్ మెంటులో' ఆ 'పి.ఆర్.ఓ.' రహస్యంగా బాటిల్ తెరిచి గ్లాసులో పోసుకుని తాగటం మొదలుపెట్టాడు. ఎక్కువగా వాసన రాని విదేశీ మధ్యం. అయినా కానీ, ఒక జాగ్రత్తకోసం వక్కపొడి పొట్లం కట్ చేసి నోట్లో పోసుకున్నాడు. అద్దాల అడ్డు దగ్గరకు వెళ్ళి కర్టన్ను పక్కకు జరిపి ఎవరైనా గమనిస్తున్నారా? అని ఒక చూపు వేశాడు.

టెలిఫోన్ మోగింది. రిజీవర్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతలవైపు ఆ పరిశ్రమకు చెందిన అతిపెద్ద పోస్టులో ఉన్న మరో అధికారి ఒకరు మాట్లాడారు.

"మిస్టర్. విఠల్ రావ్!"

"ఎస్ సార్..."

"పనిలో చేరి ‘సెటిల్’ అయ్యారా?"

"ఎస్ సార్..."

"సరే...నేను చెప్పినదంతా జ్ఞాపకం ఉంచుకున్నారు కదా?"

"ఉంది సార్"

"రేపు ఆ ప్రాంతం వ్యక్తి, రాజకీయ పార్టీ జిల్లా ఆర్గనైజర్ వస్తారు. ఆయనకు ఐదు లక్షలు 'బ్రీఫ్ కేసు’ లో ఉంచి ఇవ్వండి. సస్ పెన్స్ అకౌంటులో డబ్బులు తీసుకోండి. అలాగే 'వౌచర్’ లో సంతకం అడిగితే వేసి ఇవ్వండి. ఈ డబ్బు ఇచ్చే విషయాన్ని రహస్యంగా ఉంచండి...అది వాళ్ళ ఎలక్షన్ ఫండ్"

"ఓ.కే. సార్...నేను చూసుకుంటాను"

--- విఠల్ రావ్ అంటూ 'టాప్ లెవల్లో' పిలవబడ్డ ఆ 'పి.ఆర్.ఓ.'...వెంటనే ఫోను పెట్టేసి, వచ్చి కూర్చున్నాడు. అతని కడుపు రగిలిపోతోంది. ‘ఏ పనీ చేయని రాజకీయ నాయకులకు నా చేతులతో లంచం ఇవ్వాల్సి వస్తోంది. హు...మనం కూడా ఒక రాజకీయ నాయకుడై ఉండాల్సింది, ఏ పనీ చేయకుండా డబ్బు సంపాదించుకోవచ్చు’ అని గొణుక్కోవడం మొదలుపెట్టాడు.

                                                                      ఇంకా ఉంది.....Continued in PART-8 ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి