ఆలయం(సీరియల్) (PART-10) "నేను ఇప్పట్నుంచే జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే అడుగుతున్నాను"
"ఎక్కువ భయపడకండి. నేను మళ్ళీ చెబుతున్నాను. ఇక్కడ భయపడటానికి...పెద్దగా ఎవరూ లేరు. వెంకట్ ప్రసాద్ అని ఒకడున్నాడు. వాడికి దేవుడు మన ‘చైర్మనే.' నిజంగానే చాలా మంచివాడు. మన ‘చైర్మన్’ కి కూడా వెంకట్ ప్రసాద్ అంటే ఒక మర్యాద. అతని దగ్గర మాత్రం మీరు జాగ్రత్తగా ఉంటే చాలు"
"అంటే ఇంకెవరితోనూ మనకు సమస్య లేదు...అంతే కదా?"
"నమ్మండి...ఇక్కడున్న వారందరికీ ఒక వెల ఉన్నది. అందరి దగ్గరా తప్పులూ ఉన్నాయి. అది తాకితే చాలు. పరిగెత్తుకుని పారిపోతారు. మనం జాగ్రత్తగా ఉండవలసింది ఒకే ఒక మనిషి దగ్గరే. వెంకట్ ప్రసాద్ అనే ప్రసాద్..."
ఇక చెప్పటానికీ, మాట్లాడటానికి ఏమీ లేదన్నట్టు 'అకౌంట్స్ మేనేజర్’ వెళ్ళటానికి లేచాడు.
విఠల్ రావ్ మన్సులో...'ఏవరీ వెంకట్ ప్రసాద్?' అనే ప్రశ్న!
'క్యాంటీన్లో' వేడి వేడిగా పునుగులు, మెరపకాయ బజ్జీలు వేస్తున్నవి వేస్తున్నటు అయిపోతున్నాయి. మనిషికొక 'కూపన్’ ఇచ్చి వాటిని కొనుక్కుని తింటున్నారు.
బయట ఒక ప్లేటు పునుగులు పది రూపాయలైతే, క్యాంటీన్లో రెండు రూపాయలు. వెంకట్ ప్రసాద్ కూడా అప్పుడప్పుడు అక్కడకొచ్చి ఒక కాఫీ తాగి వెళ్ళిపోతాడు.
ఆ రోజు ప్రసాద్ క్యాంటీన్ కు వచ్చినప్పుడు 'రచ్చ' చేసే పార్టీ రాజేష్ కుమార్ కాఫీకంటే వేడిగా ఆర్భాటం చేస్తున్నాడు.
"ఆ రాష్ట్ర రాజకీయ నాయకుడికి మంచి వేట. ఐదు లక్షలతో వెళ్ళిన ఆ మనిషి అందులో సగం నొక్కేసి, కంపనీ రెండు లక్షలే ఇచ్చిందని ఆఫీసులో చెప్పాడు. ఇక్కడ మన వాళ్ళు...పార్టీకి కోటి రూపాయలు డొనేషన్ గా ఇచ్చినట్టు 'వౌచర్’ తయారు చేసారు"
ఎక్కడ, ఎలా పసిగట్టాడో తెలియదు. విషయాన్ని పెద్దది, చిన్నది చేసి పునుగులు, బజ్జీల కంటే కమ్మగా చెబుతున్నాడు.
"ఏరా...ఏమిటో పక్కనే ఉండి చూసిన వాడివిలాగా మాట్లాడుతున్నావు...?"
"అలాగే ఉంచుకో..."
"అయినా ఇలా నోటికొచ్చినట్టు అబద్దం చెప్పకూడదురా,ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీకి....ఇలాంటి ఒక 'కంపెనీ’ కోటి రూపాయలు ఇస్తుందారా?"
"ఎక్కడరా ఇచ్చారు! ఇచ్చింది ఐదు లక్షలే. రాసుకున్నది కోటి..."
"తొంబై ఐదు శాతమా మోసంచేస్తారు?"
"అది కరెక్టే...ఆ రాజకీయ నాయకుడు గనుక సమస్య చేయటం మొదలుపెట్టాడంటే 'కంపనీ’ జరుపగలరా? 'డిల్లీ' నుండి రైడ్ వస్తుంది"
"రానివ్వురా...మనం 'రూల్స్’ ప్రకారం నడుచుకోవాలని మన ‘చైర్మన్' నే కదా చెబుతున్నారు!"
"చెబుతున్నారు...కానీ ఇక్కడ ఎక్కడున్నాయ్'రూల్స్’ ?నువ్వొక తెల్ల కాగితం కొని 'రూలు’ కర్ర తో దానిపై గీతలు గీతలుగా గీసుకో. అదే 'రూల్స్’."
"అయితే 'కంపనీ' ఎలా రన్ అవుతోంది?"
"వీడొకడురా... ఊరంతా కలిసి రథం లాగటం మొదలుపెడతారు. రథం కదులుతుంది. అక్కడక్కడ కొంతమంది చేతులు నొప్పి పుడుతున్నాయని లాగటం ఆపినా రథం జరగటంలేదా ఏమిటి? లేక...ఆ రథం ఎవరివలన జరుగుతున్నదని చెప్పగలమా? అలాగే మన 'కంపనీ' కూడా నడుస్తోంది"
-----రాజేష్ కుమార్ చెప్పిన ఉదాహరణలో నిజం లేకపోలేదు. కాఫీ తాగుతూ నడుచుకుంటూ తన ఆఫీసు గదిలోకి వచ్చి తన కుర్చీలో కూర్చున వెంకట్ ప్రసాద్ మనసులోనూ అతని చెప్పిన సమాధానం ఎన్నో ఆలొచనలను రేకెత్తింది. మౌనంగా భారమైన మనసుతో పనిలో శ్రద్ద చూపటానికి ప్రయత్నించాడు. కానీ పనిలో మనసు పెట్టలేకపోయాడు.
అతని కుర్చీకి ఎదురుకుండా రెండక్షరాల కొటేషన్:
'అమ్మాయికి కన్యాత్వము….వస్తువుకు నాణ్యత' - అని రెండే లైన్లు!
దానిని చూసిన వెంటనే, విరక్తి కలిసిన నవ్వు వచ్చింది ప్రసాద్ కు. ‘ఇక్కడ అన్నీ లిఖిత రూపం. నిజానికి రెండిటికీ చాలా దూరం. కారణం...? స్నేహితులు మాట్లాడుకున్నట్టే ఇన్వాల్వ్ మెంట్ లేని పని. ఎప్పుడూ మనో భారం. కొంచం కూడా శ్రద్దలేని...కూలీకి చేసే పనిలాగా’
అలా ఆలొచించుకుంటూ పోయిన ప్రసాద్, చివరగా...ఇది 'చైర్మాన్’ కు తెలుసా? అని ప్రశ్నించుకున్నాడు. దానికి మాత్రం అతనికి గబుక్కున సరైన సమాధానం దొరకలేదు.
వెంకట్ ప్రసాద్ ఇల్లు!
ప్రసాద్ భార్య మాలతీ 'టీ.వీ.' చూస్తూ కూర్చోనుంది. ఈనాటి మనిషి జీవితంలో తినడం-నిద్రపోవడం-స్నానం చేయడం లాంటి విడిచిపెట్టలేని రోజువారి పనులలో 'టీ.వీ.' కూడా చేరిపోయింది.
కాలేజీ చివరి సంవత్సరం పరీక్షలు ముగించుకుని 'గెట్ టు గెదర్’ పార్టీలో కూడా పాల్గొని అప్పుడే తిరిగి వచ్చాడు ప్రసాద్ కొడుకు శంకరయ్య... ప్రసాద్ వరకు ‘చైర్మాన్'!
కొడుకు లోపలకు వెళ్ళి డ్రస్సు చేంజ్ చేసుకుని 'డైనింగ్ టేబుల్’ దగ్గరకు వెళ్ళి కూర్చున్నది కూడా గమనించలేదు మాలతీ. కారణం....టీ.వీ! అందులో ఒక సీరియల్లో హీరోయిన్ జైలులో 'వార్డన్’ చేతిలో చిత్రవధ అనుభవిస్తోంది. మాలతీకి ఆ చిత్రవధలను తానే అనుభవిస్తున్నట్టు ఒక ఫీలింగ్. ప్రసాద్ మంచం మీద బోర్లా పడుకుని ఆలొచిస్తున్నాడు. మనసు నిండా 'కంపనీ’ గురించిన ఆలొచనే. శంకరయ్య తల్లిని-తండ్రిని చూసిన తరువాత వొళ్ళుమండి 'టీ.వీ' కి వెడుతున్న కరెంటు స్విచ్ ను ఆపాడు. 'టీ.వీ.' స్క్రీన్ తెల్లగా రావటంతో "అరే...కరెంటు పోయిందా...తలనొప్పిగా ఉంది ఈ ‘ఈ.బి.’ వాళ్ళతో! అంటూ తల బాదుకుంటూ వెనక్కు తిరిగిన మాలతీ... శంకరయ్యను చూసి, "నీ పనేనా?" అంటూ విసుక్కుంది.
ఇంకా ఉంది.....Continued in PART-11****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి