24, జనవరి 2020, శుక్రవారం

ఆలయం(సీరియల్)...PART-9




                                               ఆలయం(సీరియల్)
                                                          (PART-9)


"ఏమిటండి ఇది...ఐదు బదులు యాబై అని వేసుంది"

"నాకు తెలియదండి...పై అధికారుల ఆర్డర్. నేను వేశాను"

"అయితే మిగతా 45 ఎక్కడ?"

"ఏం ప్రశ్నండి ఇది...మీకు ఒక ఐదు, నాకు ఒక ఐదు. ఇలాగే మిగిలిన 35 కు మనుష్యులు ఉన్నారు కదా...”

"సంతకం పెట్టే నాకు కేవలం ఐదు లక్షలేనా?"

"మీరు కంపెనీలోకి వచ్చేటప్పడు 'జి.ఎం.' అన్ని విషయాలూ చెప్పుంటారే?"

"చెప్పారు...కానీ ఇంత పెద్దదిగా ఉంటుందని నేను అనుకోలేదు"

"ఇప్పుడేమైంది...ఐదు అనే చోట ఏడో...ఎనిమిదో తీసుకోండి. మిగతాది నేను చూసుకుంటాను"

"అది సరే...తరువాత సమస్యేమీ రాదే?"

"రాకూడదనే దేని దేనికి ఎంతెంత లెక్క చూపించాలో అలా చూపించటానికి రెడీగా ఉన్నాను"

"దానికోసం కాదు...ఆ రాజకీయ నాయకుడ్ని సమాధానపరచి పంపించింది నేను. దాన్ని అకౌంట్స్ లో సరి చేసేది మీరు...మనకు పైన ఒకరు, దీనికి దారి చూపించేవారు. మొత్తం ముగ్గురే కదా. మిగతా వాళ్ళకు ఎందుకు భాగం పోవాలి?"

"ఇలాగా వొలిచి మాట్లాడుతారు. మిగతా వాళ్ళ నొరు మూయొద్దా...దానికోసమే?"

"ఇది వాళ్ళకు తెలిస్తేనే కదా?"

"అది సరే...'టాప్' లో ఉన్న చాలామంది గురించి మీకు ఏమీ తెలియదనుకుంటా. పోను పోనూ అన్ని విషయాలనూ తెలుసుకుంటారు"

"నా ప్రశ్నకు ఇప్పుడు ఇదేనా సమాధానం?"

"అవును సార్...కొంచం ఓపికగా 'అడ్జస్ట్' చేసుకుని వెళ్ళండి. ఇలా అప్పుడప్పుడు ఐదు,ఆరు తీసుకుంటూ 'టాప్' కు వెళ్ళిపొవచ్చు. ఒక సంవత్సరం ఈ సీటులో ఉంటే చాలు...జీవితంలో 'సెటిల్’ అయిపోవచ్చు"

----ఆ అకౌంట్స్ మేనేజర్, విఠల్ రావ్ కు బాగానే ఆశ చూపాడు.

అతని కళ్ళల్లోనూ...ఒక విశాలమైన పండ్ల తోటలోకి పెద్ద బుట్టతో వెళ్ళినంత కుషీ.

"అవును...మీ దగ్గర ఒక విషయం అడగాలి.'ఈ కంపెనీ చైర్మాన్' శంకరయ్య గురించి చాలా విన్నాను. ఆయన రాసిన పలు వ్యాసాలు చదివాను. అవి చదివిన తరువాత ఆయన ఒక మేధావి అనేది సందేహం లేకుండా తెలుస్తోంది"

"దానికేమిటిప్పుడు?"

"అది కాదు...'ఈ ఎక్స్ ట్రా' సమాచారం ఆయన వరకు వెల్తే?"

"వెల్తేనే కదా?"

"అంటే వెళ్ళదా?"

"అరే మీరొకరు...ఆయన దగ్గరకు వెళ్లటం అంత సులభం కాదు. అంతే కాదు...ఆయనకు ఎవరిమీదైనా చాడీలు చెబితే నచ్చదు"

“అంటే...ఎంత తప్పు జరిగినా ఆయన చెవులదాక వెళ్ళదని చెబుతున్నారు"

"అవును...అలా ఒకవేల వెళ్ళినా 'టాప్' లో కొంతమంది ఉన్నారు. వాళ్ళకు ఆయన్ని ఎలా సమాధాన పరచాలో తెలుసు"

"ఇది పెద్ద గొప్ప సమాధానం లాగా కనబడటం లేదు"

"సారీ....తెలిసింది చెప్పాను. నాకూ మీలాగానే సందేహాలు ఉన్నాయి. నేను వేగంగా 'సెటిల్’ అవటానికి ఆశపడటం నా భార్యకే నచ్చలేదు. 'పలు రోజుల దొంగ ఒక రోజు చిక్కుకుంటాడు’...తరువాత పరువే పోతుంది. మర్యాద పోతుంది అని అప్పుడప్పుడు బుద్ది చెబుతుంది. కానీ, ఇలాంటి సంధర్భాలు అన్ని చోట్లా దొరకవు.

'చైర్మాన్’ మంచాయనే. అందుకని కంపనీ లాభాలలో భాగం అడిగితే ఇస్తారా? అందుకని మనమే తీసుకోవటం ఒకే దారి. దీని వలన ఆయనేమీ తరిగిపోడు. సంవత్సరానికి వెయ్యి కోట్లు సంపాదిస్తున్నాడు. అందులో మనం ఐదారు కోట్లు కొట్టేయ గలిగితే అదే చాలా పెద్దది కదా?”

'అకౌంట్స్ మేనేజర్ చెప్పిన 'న్యాయం' విఠల్ రావ్ కే ఆశ్చర్యం తెప్పించింది.'ఇలాంటి మనిషి సెంట్రల్ మినిస్టర్ గా ఉండి--అందులోనూ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యుంటే భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని ఏ దేశానికి అమ్ముతాడో తెలియదు!" అనే అనిపించింది.

అయినా ఒక హెచ్చరిక భావం మనసులో ఏర్పడింది.

"బాగా మాట్లాడుతున్నారు...అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. అవును....ఇక్కడ ఈ విషయాల్లన్నిటినీ గమనించే వ్యక్తి ఎవుడూ లేడా?"

"ఎందుకు అడుగుతున్నారు?"

"ఒక హెచ్చరిక కోసమే..."

"ఉన్నారు. 'కంపనీ' అన్న తరువాత ఇలా ఒక నలుగురు, అలా ఒక నలుగురూ లేకుండానా పోతారు? రామక్రిష్ణ అనే ఒకతను ఉన్నాడు.'హిందీ డౌన్ డౌన్, తెలుగు జై జై' అనే ముఠా. సాధారణ మనిషే. కానీ పనిచేయటానికి వొళ్ళు వొంగదు. అతనికి కూడా మనలాంటి ఆలొచనే.'కమీషన్’ ఎక్కడ దొరుకుతుందో ఆ సీటులోకి వెళ్ళి కూర్చోవాలని ఆశ. ఎవరి దగ్గరన్నా మంచి ఉంటే అతనికి తెలియదు. కానీ, చెడు మాత్రం ఏలాగైనా తెలుసుకుంటాడు. మీరు 'ప్యాంటు’ బటన్ సరిగ్గా వేసుకోలేదనుకోండి...దాన్ని కూడా 'నోట్' చేసి నలుగురు దగ్గర మాట్లాడతాడు. అతనికి ఒకే పాలసీ:

'అధికారి గాడిదైనా సరే కాళ్ళు పుచ్చుకో, కార్మికుడు ఆ దేవుడైనా సరే ఎగిరి తన్ను!' అనేదే.

అతనికి మన విషయాలు కొన్ని తెలుసు. దానికి ప్రతిగా అతను పనిచేయకుండా అటూఇటూ తిరుగుతూ ఉండటాన్ని పట్టించుకోము. మాటి మాటికీ లీవు పెడతాడు. దాన్ని కూడా పట్టించుకోము"

"అంటే ఈ పరిశ్రమలో ఏ ఒక్కడూ కూడా న్యాయంగా లేడా?"

"మీరు అడిగేది చూస్తే...?"

నో...నో, ఈ ప్రశ్నకు మీరు ఊహించుకునే సమాధానం తప్పు...నేనెందుకు అలా అడిగానంటే...

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-10 ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి