28, జనవరి 2020, మంగళవారం

ఆలయం(సీరియల్)...PART-11



                                                   ఆలయం(సీరియల్)
                                                            (PART-11)


"లేకపోతే ఏమిటమ్మా... నేను వచ్చి ఎంతసేపైందో తెలుసా?"

"అలాగా...'టీ.వీ.' లో సీరియల్ చూస్తూ ఉండటంతో నువ్వు వచ్చింది గమనించలేదు"

"నువ్వు ఎలా గమనిస్తావమ్మా! నేను టీ.వీ. లో కనబడి 'అమ్మా...ఆకలేస్తోంది’ అని అడిగితేనే, నా మీద నీ దృష్టి పడుతుందని చెప్పు"

"ఛఛ...మీ నాన్న రానీ, ఇద్దరికీ ఒకేసారి భోజనం పెడతాను"

"అమ్మా...నాన్న ఎప్పుడో వచ్చాశారు. అక్కడ చూడండి మంచం మీద"

---శంకరయ్య తల్లికి చూపగా, మాలతీ బెడ్ రూమువైపు చూసింది.

వెంకట్ ప్రసాద్ చెవులకు వాళ్ళ సంభాషణ వినబడింది.

"నాన్నా లేచిరా...నాకు బాగా ఆకలిగా ఉంది"

----శంకరయ్య పిలిచాడు. ప్రసాద్ లేచి కట్టుకున్న లింగీని బాగా సర్ధుకుని హాలులోకి వచ్చాడు. మొహంలో డల్ నెస్.

"ఏం నాన్నా డల్ గా ఉన్నారు?"

"అరే నువ్వొకడివిరా...మీ నాన్న అలా ఉంటే 'కంపనీ' లో ఏదో సమస్య అని అర్ధం".

"అవునా నాన్నా?"

"ఆయన్ని ఎందుకు అడుగుతావు...నన్ను అడుగు. నేను చెబుతాను. నీకు ఏది జరిగినా...నాకు ఏది జరిగినా ఆయన బాధపడరు. ఆయన బాధపడుతున్నారు అంటే 'కంపనీ' లో ఏదో సమస్యే నని అర్ధం"

"ఏమిటి నాన్నా...అమ్మ చెప్పేది నిజమా?"

"అవును రా..."

"నువ్వు బాధ పడేటంత సమస్య ఏమిటి నాన్నా? నీ పనిలో నువ్వు ఏమన్నా తప్పు చేశావా?"

"పిచ్చొడా...నా 'కంపనీ' లో ఇప్పుడు తప్పు చేస్తేనే అక్కడ ఉద్యోగం చేయగలం"

"ఏమిటి నాన్న చెబుతున్నారు?" --- కొడుకు శంకరయ్య అర్ధంకాక ఆశ్చర్యంగా అడిగాడు.

మాలతీ మళ్ళీ తండ్రీ-కొడుకుల సంబాషణ మధ్యలో తలదూర్చింది.

“శంకరయ్యా...ఎప్పుడూ ఊరంతా ఒక దారిలో నడిస్తే....మీ నాన్న మాత్రం వేరే దారిలో నడుస్తారు"

"అరే ఏంటమ్మా నువ్వు...నాన్నతో చెప్పి ఆయన చేస్తున్న 'కంపనీ' లో ఒక ఆరు నెలలో, ఒక సంవత్సరమో 'మేనేజ్ మెంట్ ట్రైనీగా' అవలాని అనుకుంటున్నాను. ఇప్పుడు పోయి ఈయన దారి వేరే దారి అంటున్నావు..."

"అవునురా...ఐదు వేళ్ళూ ఒకే లాగానా ఉన్నాయి? చేతి వేళ్ళే ఎచ్చుతగ్గులుగా ఉన్నప్పుడు...మనుషులందరూ మనం ఎదురుచూస్తున్నట్టు ఉండాలనుకుంటే ఏలా?"

"నువ్వు చాలా కన్ ఫ్యూజ్ చేస్తున్నవమ్మా..."

"నేనేమీ కన్ ఫ్యూజ్ చేయటం లేదు. నిజం చెబుతున్నా! మీ నాన్నకు తానేమిటో; తన పనేమిటో చూసుకోవటం తెలియదు. ఈయన పని చేస్తున్న కంపనీకి ఈయనే యజమాని అనుకుంటారు. నన్ను అడిగితే ఈయన యజమాని కూడా అంత బాధ పడరని గట్టిగా చెప్పగలను. ఎవరు ఎలా ఉంటే మన కెందుకురా? మన పని ఏమిటో అది మాత్రం చూసుకుంటే ఏ సమస్యా ఉండదు"

----- మాలతీ మాటలతో సాధించింది. ప్రసాద్ కు కోపం ముక్కు మీదకు వచ్చింది. కోపంగా భార్యను చూశాడు.

"వూరికే అలా చూడకండి...మీరేమీ మహాత్మా గాంధీ కాదు. అందరినీ మార్చటానికి"

"తరువాత...?"

"తరువాత ఏమిటి తరువాత...కంపనీలో జరిగే తప్పుల కోసం మీరు ఎందుకండీ ఇలా బాధ పడుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటారు? ఇప్పుడు మీ కంపనీ ఏమన్నా మూసేస్తున్నారా ఏమిటి?"

"అంటే...కంపనీ నష్టపోయి మూసేసిన తరువాతే ఒకరు బాధపడాలి అంటావా?"

"అలాగంతా జరగదండి... కోట్లలో పెట్టుబడి పెట్టి కంపనీ నడుపుతున్నవారికి తెలియదా...ఎవరు ఏం చేస్తున్నారు? ఏది, ఎప్పుడు, ఎలా జరపాలోనని?"

"తెలియదు మాలతీ...ఏమీ తెలియదు. అదే ఇప్పుడు నా బాధ!"

"ఏం చూసి చెబుతున్నారు...'తెలియదు’ అని?"

“కంపనీ లోనే మధ్యం సేవిస్తున్నాడు ఒక అధికారి. ఎప్పుడు చూడు పేపరూ, పత్రికలు చదువుతూ ఆఫీసు 'ఫైల్స్’ చూశానని అబద్దం చెబుతున్నాడు ఇంకొక అధికారి. లేని సమస్యను ఉందని చెప్పి దానికి లంచం అడుగుతున్నాడు ఒకడు. దాన్ని ఇంకొకడు తీసుకుని వీడికి ఇస్తున్నాడు.

ఎనిమిది గంటలు పని. దాంట్లో కనీసం మూడు గంటలు కూడా ఎవరూ పనిచేయటం లేదు. మిగితా సమయమంతా సినిమాల గురించి, రాజకీయాల గురించి కబుర్లే. క్యాంటీన్లో వర్కర్లకు ఒక 'మెనూ'... పై అధికారులకు ఒక 'మెనూ'! క్యాంటీన్లో ఏదైనా సరిలేదు అని ఎవరైనా చెబితే వినిపించుకునే వారే లేరు. వర్కర్స్ ను కలుసుకోవటమే అతిపెద్ద గౌరవ సమస్యగా అనుకునే సర్వాధికార మనసున్న వ్యక్తికి 'పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పదవి"

------ 'ఏమీ చేయలేం' అని కన్నీళ్లు పెట్టుకుంటూ తన నిస్సహాయాన్ని, నిస్పృహను వ్యక్తం చేయలేక కుములిపోయాడు వెంకట్ ప్రసాద్. అలా తండ్రి కుమిలిపోవటం కొడుకు శంకరయ్యా ఇంత వరకు చూడలేదు. కానీ ఇదంతా మాలతీని ఏమీ చేయలేదు.

"హూ...ఇలాగే కదా భారతదేశంలో ఉన్న ఎనబై శాతం కంపనీలూ నడుస్తున్నాయి. ఏదో మీ ఒక్క కంపెనీ మాత్రమే ఇలా ఉన్నట్టు బాధపడుతున్నారు?"

                                                                     ఇంకా ఉంది.....Continued in PART-12 ****************************************************************************************************

2 కామెంట్‌లు:

  1. Thank you for your compliments. I will be posting much more interesting posts in future........Further I have seen your site. Looking nice and good job.

    రిప్లయితొలగించండి
  2. కోనసీమ సోయగాల్ని రొమాంటిక్ గా చిత్రీకరించిన సాంగ్
    ప్రతి ఉదయం నీ పిలుపే
    హృదయంనే కదిలించే
    మనసే పులకించే
    Prati Udayam Nee Pilupe - Romantic Melody Song from Prema Entha Madhuram
    Song Link: https://youtu.be/Z9qVLatW6dQ

    రిప్లయితొలగించండి