17, డిసెంబర్ 2023, ఆదివారం

ఇంటింటి వెన్నెలలు...(పూర్తి నవల)


                                                                                   ఇంటింటి వెన్నెలలు                                                                                                                                                                     (పూర్తి నవల) 

పాఠక మహాశయులకు.

ఇంటింటా జరుగుతున్న వేడైన సమస్యే ఈ నవలకు ఆధారం.

యధార్ధమైన ఈ వ్యవహారం చాలా వరకు ప్రతి కుటుంబంలోనూ ఎప్పుడూ కొత్తగా యుక్త వయసులో ఉండే ఎనర్జీలాగానే ఉంటుంది.  తెలివితేటలతో దాన్ని స్వీకరించి, సరి చేసుకునే వారు ఈ వ్యవహారం నుండి తప్పించుకుంటారు.

అలా చెయ్యని వారు చిక్కుకుంటారు...ప్రశాంతత, నెమ్మది, సంతోషం పోగొట్టుకుంటారు.

ప్రేమ చూపటం ముఖ్యమే...కానీ అది వెర్రిగా ఉండకూడదు.

'కన్నవారు కూతుర్లకు నిరంతరం కాదూ అనే నిజాన్ని నొక్కి చెప్పే కథ ఇది!

కథాకాలక్షేపం టీమ్.

బద్దకం, మిగిలిన వాళ్ల వీపు మీద ఎక్కి కూర్చుని జీవితాంతం సవారి చేయాలని ఆశపడే స్వార్ధం, నోటి దురుసు, పోట్లాట పెట్టుకుని మంచి బంధుత్వాలను సైతం గాయపరిచే జంతు గుణం, ముదిరిపోయిన తలబిరుసు తనం...వీటన్నిటినీ మానుకోవాలనే ఆలొచనే చాలా మందికి రా దు. తమని ఆవగింజంత కూడా మార్చుకోవాలని అనిపించలేదు.

ఒక మనిషికి జరిగే ప్రతిదానికీ కారణం ఆ మనిషే. అతనికి ఎవరూ శత్రువులు ఉండరు. అతనికి అతనే శత్రువు!

ఎందుకు పగ? ఎందుకా పోట్లాట--కోపం? అది న్యాయమా? వీటన్నిటి గురించి కూర్చుని ఆలొచించే ఓర్పో--మనసో చాలామందికి లేదు.

పట్టుదల, ఈగో,ముక్కోపం,చటుక్కున మాట్లాడే గుణం...వీటన్నిటినీ ఉడుము పట్టులాగా పట్టుకుంటే ఎవరికీ నచ్చదు. వారికి జీవితంలో విరక్తి మాత్రమే మిగులుతుంది!

గొడవల్లో గెలిచే వారు...జీవితంలో ఓడిపోతున్నారు. ఇది వాళ్ళకు అర్ధమే కావటం లేదు!

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఇంటింటి వెన్నెలలు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

ఈ నవలను ఒకేసారి ఆన్ లైన్లో చదవటానికి టైము లేకపోతే, కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి PDF గా డౌన్ లోడ్ చేసుకుని సమయం దొరికినప్పుడల్లా చదువుకోండి.

https://drive.google.com/file/d/1KfcjfBhNysraIDbo3XgBhvGGSthWjFRW/view?usp=drive_link

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి