"నువ్వు నా కొడుక్కు వద్దు. ఏమీ మాట్లాడమోకు! నేను చెప్పదలుచుకున్నది చెప్పేసి వెళ్ళిపోతాను. మీ అమ్మే నిన్ను కూతురిగా అంగీకరించలేదు. నేనెలా అంగీకరిస్తాను? నా కొడుకు అమాయకుడు...వాడిని వదిలేయ్. నా కొడుకును బ్రతకనీ" అని బ్రతిమిలాడింది.
మాలతికి ఏం చెప్పాలో తెలియలేదు.
అంతలో వచ్చినామె వెనక్కి తిరిగి వెళ్ళటం మొదలుపెట్టింది.
మౌనంగా తలుపులు మూసి గొళ్ళెం వేసుకున్నది మాలతి...
మంచం మీద వాలిపోయింది.
కన్నీరు ఆమె చెవి పోగును తాకింది.
'అమ్మా...నువ్వే నన్ను అర్ధం చేసుకోవటానికి నిరాకరిస్తే, సురేష్ తల్లి ఎలా నన్ను అంగీకరిస్తుంది....? నీ పేగు తెంచుకు వచ్చిన సునీత ప్రేమించవచ్చు...నేను ప్రేమించకూడదా...?'-- తనలో తాను అనుకుంది.
---కళ్ళ మీదకు కునుకు వచ్చి కూర్చుంది. కళ్ళు మూసుకుంది.
దిగంబరంగా పరిగెత్తుతోంది.
దిగంబరంగా పరిగెత్తుతున్న ఆమెను చూసి చంద్రుడికే సిగ్గు వచ్చుంటుంది. మేఘాల దుప్పటిని తీసుకుని ముఖంపై కప్పుకున్నాడు. ఆమె దిగంబరం ఆమెను సిగ్గుపడేట్టు చేసింది! దాన్ని దాచటానికి రంగు చీరనో, తెల్ల పంచనో అక్కడుంటున్న వాళ్ళు ఎవరూ ఇవ్వలేదు.
ఆమె పరిగెత్తుతున్న దిక్కులోనే కృష్ణా నది ఎవరికోసమో భయపడిన దానికి మల్లె చిక్కిపోయి ఒక చివరగా పరిగెత్తుతున్నది. నదీ తీరం వెంబడి పెద్ద పెద్ద పొడుగైన చెట్లు. వాటి కొమ్మల్లో పచ్చని, ఎర్రని, పసుపు, నీలం రంగులలో చీరలు ఎగురుతున్నాయి.----రాజకీయ పార్టీ జెండాలలాగా.
నదీ తీరంలో పరిగెత్తుతున్న ఆమెకు పరిగెత్తుకుని వెళ్ళి అన్నీ చీరలూ తీసుకుందామా అనే ఆశ వచ్చింది. చల్లటి గాలికి చీరలు రెపరెప లాడుతున్నాయి. గబుక్కున ఒక చీర తీసుకుని ఆమె శరీరాన్ని మూసుకుంది.
అదే సమయం.
అడ్డుగా వచ్చింది గుర్రం ఒకటి.
గుర్రం కాదు పక్షి.
హూ..హూ...అది గుర్రమే!
అరె...శరీరం గుర్రం లాగానూ, తల పక్షి లాగానూ తెలిసింది.
ఆమెలో భయం తొంగి చూసింది.
'పారి పోదామా?' అని ఆలొచించింది.
మధ్య దారిలో దారిని అడ్డుకున్నట్టు నిలబడింది పక్షి గుర్రం.
"చీరను తీసి క్రింద పడేయ్"
---బెదిరించింది.
"కుదరదు" ఆవేశంగా చెప్పింది ఆమె.
ఆ పక్షి గుర్రానికి హఠాత్తుగా మొలచింది ఒక చేయి. ఆ చేతిలో తెల్లటి పంచె ఉంది.
"చీరను తీశేసి పంచెను కప్పుకో"
మెరుపులాగా పక్కకు జరిగి పరిగెత్తటం మొదలు పెట్టింది ఆమె.
తలుపు తడుతున్న మోతకు అధిరిపడుతూ లేచింది. కళ్ళు నలుపుకుంది.
భయంతో వొళ్ళు వణికింది. 'ఎవరై ఉంటారు?'
లేచి కూర్చుంది.
"ఏయ్ గాడిదా...తలుపు తీయ్..." ఒక భయంకరమైన కంఠం బెదిరించింది.
తలుపును మళ్ళీ మళ్ళీ తడుతున్నారు.
తలుపు విరిగి కింద పడిపోతుందేమో నన్న భయం ఏర్పడింది.
"తట్...తట్"
----మళ్ళీ తలుపు తట్టబడింది.
తలుపుకు మధ్య వేసున్న ఇనుప గొళ్ళెం ఏ మాత్రం కదలలేదు.
"ఏయ్...తలుపు తెరుస్తావా లేదా...నీకు ప్రేమ కావాలా? దానికి మా సురేషే దొరికాడా...? నీకు ప్రేమా?....ధూ...ఇంకొసారి వాడిని వెతుక్కుంటూ వచ్చావా..."
----రాయలేని బూతులు విసురుతున్నారు. బయట కనీసం నలుగురైదుగురైనా ఉంటారు. ప్రతి ఒక్కరూ వారికి తెలిసిన బూతులతో తిడుతున్నారు. చ చ...అవి మనలాంటి మానవ జన్ములు వినకూడని మాటల ప్రయోగం.
ఇక్కడెందుకు ఎవరూ నాకు తోడుగా లేరు?
అమ్మ నన్ను ఇంటి నుండి తరిమేసింది. ఏం.ఏ హిస్టరీ, ఏం ఏ ఎకనామిక్స్ చదివి ఉద్యోగానికి వెడుతున్నప్పుడు... సురేష్ ను కలిశాను.
"సి...సీలింగ్" --బయట బాటిల్ పగిలిన శబ్ధం.
నిశ్శబ్ధం కోసం కాచుకుని ఉన్నది.
ధ్వంసం, గొడవ.
ఎవరో రేకెత్తించిన భయపెట్టే గొడవ.
పది నిమిషాలకు ఒకసారి తలుపు దెబ్బ తింటోంది.
వరుసగా.
అసహ్య పాటలు...అసహ్య పిలుపులు.
అప్పుడప్పుడు బాటిల్ పగిలి గాజు ముక్కలు చిందుతున్న శబ్ధం భయపెట్టింది.
ఆమెకు తెలుసు...ఇది సురేష నాన్న పని. కొడుకును కంట్రోల్ చెయ్యలేక, వాడ్ని వదిలేసి మాలతినీ తరిమే ట్రిక్క్స్. కొత్తరకం బెదిరింపు.
చుట్టూ ఉన్న వాళ్ళు భయంతో ఇళ్ళలోనే తలుపులు వేసుకుని ఉన్నారు.
కన్న కల ఙాపకానికి వచ్చింది.
'అదేమి కల...? నేను దేన్ని వెతుక్కుని పరిగెత్తుతున్నానో అది కలగా వచ్చిందా...? పదిహేనేళ్ళ వయసులో దాచి దాచి కట్టుకున్న చీరను దక్కించుకోవటానికి మనసు పోరాడుతోందా...? ఆ పోరాటమే కలగా వచ్చిందా?'---- ఆమె మనసు ఆమెను వేధించింది.
ఇంటికి ముందు శబ్ధాలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి.
మేము ప్రేమించకూడదా?.
బయట శబ్ధాలు తగ్గిపోయినై.
తలుపులు మళ్ళీ తట్టబడ వచ్చు.
ఈసారి తలుపు తెరిస్తే హౌస్ ఓనర్ నిలబడొచ్చు.
"ఇల్లు ఖాలీ చెయ్యి" అని బెదిరించ వచ్చు.
అద్దెకు ఇల్లు కావాలని రోడ్ల మీద నిలబడింది...ఈ నిమిషంలో గుర్తుకు వస్తోంది.
"నీకు నేను ఇల్లు ఎలా ఇవ్వగలను...? పుట్టినిల్లు నిన్ను వద్దని తరిమేసింది. నీ తలుపులను ఎవరెవరో వచ్చి తడతారే?...నీకు ఇల్ల ఎలా ఇచ్చానని చుట్టుపక్కల వాళ్ళు కోపగించుకుంటారే...?"
---- ఆమె నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
'మాలతి చదువుకుంటున్న ఒక జీవి. అది మాత్రమే కాదు...తప్పుగా బ్రతక కూడదనే ఒక ట్రాన్స్ జండర్. మనమందరమే నమ్మాలీ.
రచయత్రి నారాయణమ్మ నన్ను నమ్మి ఇచ్చిన ఇల్లు.
ఇంటి యజమానురాలు ఈ నిమిషం వాకిటికి వచ్చి నిలబడితే ఏం సమాధానం చెప్పను...? నేను ప్రేమిస్తున్నాను అని చెప్పనా...? నువ్వు ప్రేమిస్తున్నావా అని ఆశ్చర్యపోతారే...? నా పరిస్థితిని వాళ్ళకు ఎలా వివరించగలను...?
అతని నవ్వు మొహం కళ్ళ ముందుకు వచ్చింది.
'నేను మేలుకునే ఉన్నాను...నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నావా?
"మా పుట్టుక...దేవుడి శాపమా? చూపు సరిలేకపోయినా ఆమోదించే తల్లి మమ్మల్ని మటుకు ఎందుకు వద్దంటున్నారు? వికళాంగులను ఆమోదించే ఈ సమాజం మమ్మల్ని చూసి ఎందుకు ముఖం చిట్లించుకుంటోంది...? వీధిలో పుట్టిన కుక్కను తీసుకు వచ్చి పాలు పోసి ఆనందిస్తున్నారు. ఇంట్లో పుట్టిన మమ్మల్ని వీధులలోకి తరిమేస్తున్నారే ఎందుకు...? మా జీవితం నవ్వుల పాలవటానికి ఎవరు కారణం...? ట్రాన్స్ జెండర్ గా పుట్టిన మేమా...? మమ్మల్ని కని ఇంటి నుంచి తరిమిన తల్లితండ్రులా? లేదు...మమ్మల్ని వెంబడిస్తూ తరుముతున్న సమాజానిదా? ఏది...ఎవరు?'---ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎరుపెక్కగా గోడకు జారిపోయి అలాగే నిద్ర నిద్రపోయింది.
"తట్...తట్..."
------తలుపు తట్టబడింది.
ఇంటి యజమానురాలు అయ్యుంటుంది.
లేచి వెళ్ళి తలుపు తెరిచింది.
వాకిట్లో...
సురేష్ నిలబడున్నాడు.
"మాలతీ "…… మాలతి లాగా ప్రేమ జీవితాన్ని జీవించాలని ఆశపడిన అందమైన సురేష్ కుమార్ అనే ట్రాన్స్ జెండర్.
"నీకు ఏమైయ్యింది...?"
"ఏమీ అవలేదు"
"ఎవరైనా...?"
"నీ సొంతం బెదిరించింది. మీ అమ్మ ప్రాధేయ పడింది"
"రా...ఎక్కడికైనా పారిపోదాం"
"ట్రాన్స్ జెండర్ గా పుట్టిన నాకూ ఒక భాద్యత ఉంది"
-----అది విన్న సురేష్ మొదట్లో కన్ ఫ్యూజ్ అయ్యాడు.
"మమ్మల్ని కన్న మా తల్లి తండ్రులు మమ్మల్ని అర్ధం చేసుకోలేదు. గుడికి వెడితే ఆ దేవుడు కూడా మమ్మల్ని తరుముతాడు. నిన్ను నాన్నను చెయ్యలేను. మేము మట్టిలో కలిసిపోవలసిన వాళ్లం కాదు. బ్రతకటానికి పుట్టిన వాళ్ళమే. అడుక్కోవటానికి పుట్టిన వాళ్ళం కాదు...మగ వారి కోరిక తీర్చే వస్తువులం కాదు....అని ప్రపంచానికి తెలియజేయటానికి పోరాడతాను.. ట్రాన్స్ జెండర్స్ కూడా సహ మగమనిషి-ఆడమనిషి లాగా గౌరవించే మనుష్యులుగా అందరిచేత గౌరవించబడటానికి పోరాడుతాను"
"మన ప్రేమ...?"
"ప్రేమించిన జ్ఞాపకాలు మాత్రం నాకు చాలు"
"నేను..."
"వెళ్ళు. నీ తల్లి దగ్గరకు వెళ్ళు. నా తల్లి నన్ను తన కూతురిగా చచ్చిపో అన్నది. నీ తల్లి నిన్ను ఆమె కొడుకుగా ఉండటానికి వదిలేయమని ఏడ్చింది. పో...వెళ్ళి మీ తల్లికి కొడుకుగా ఉండు"
హడావిడిగా తలుపు వేసింది.
ఏదో ఒక రోజున ఆ తలుపులు ఆదరణ కొసం తెరుచుకుంటాయి అన్న గట్టి నమ్మకంతో! *******************************************సమాప్తం***************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి