30, జులై 2020, గురువారం

డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతిరోజూ ఆరాధిస్తున్న భారతీయుడు...(ఆసక్తి)               డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతిరోజూ ఆరాధిస్తున్న భారతీయుడు                                   

                                                                (ఆసక్తి)

డోనాల్డ్ ట్రంప్ యొక్క అమెరికన్ మద్దతుదారులు ఆయనమీద ఎంత అంకితభావంతో ఉంటారో మనకు తెలుసు. కాని వారికి (అమెరికన్స్) యుఎస్ ప్రెసిడెంట్ కు ఒక భారతీయభక్తుడుఉన్నాడని తెలియదు. బుస్సా కృష్ణ అనే అతను వాచ్యంగా ట్రంప్ను దేవుడిగా ఆరాధిస్తాడు. ప్రతిరోజూ ఆయన జీవిత పరిమాణ విగ్రహాన్ని ప్రార్థిస్తాడు. అతను  తాను నిర్మించిన ఒక బలిపీఠానికి సింధూరం, పసుపు మరియు పువ్వులను అర్పిస్తాడు.

భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని కొన్నే అనే మారుమూల గ్రామానికి చెందిన 33ఏళ్ల బుస్సా కృష్ణ అనే అతను కొన్ని సంవత్సరాల క్రితం మొట్టమొదటి సారిగా మీడియా దృష్టిని ఆకర్షించాడు. కారణం అతను డొనాల్డ్ ట్రంప్ బలిపీఠం వద్ద ప్రార్థన చేస్తున్నప్పుడు మరియు అమెరికా అధ్యక్షుడి పెద్ద చిత్రపటాన్ని మోస్తున్న చిత్రాలు అతడు ఆన్లైన్లో పెట్టాడు. అవి వైరల్ అయ్యాయి. సంవత్సరం ఫిబ్రవరి 24-25 ట్రంప్ భారతదేశం వచ్చినప్పుడు, అది  ప్రధాన వార్తా అంశంగా ఉండటంతో, భారతదేశ ట్రంప్ భక్తుడు మరోసారి వార్తాపత్రికలలో వార్తల్లోకి వచ్చాడు. గత రెండేళ్లలో చాలా జరిగింది. కాని డొనాల్డ్ ట్రంప్ పట్ల బుస్సా కృష్ణ యొక్క భక్తి అప్పటికీ దృఢంగా ఉంది. బుస్సా కృష్ణలో ఏదైనా మారింది అంటే, అది ట్రంప్ మీద భక్తి మునుపటి కంటే బలంగా ఉంది, ట్రంప్ విగ్రహం భారత రైతు తన పెరట్లో ఉంచుకోవటమే దానికి రుజువు.

"భారత-అమెరికా సంబంధాలు బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి శుక్రవారం నేను ట్రంప్ యొక్క దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటాను. నేను ఆయన చిత్రాన్ని తీసుకువెళ్ళి, ఏదైనా పని ప్రారంభించే ముందు ఆయనని ప్రార్థిస్తున్నాను. నేను ఆయనను కలవాలని కోరుకుంటున్నాను. నా కలను నిజం చేసుకోవాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానుఅని కృష్ణ భారత వార్తా సంస్థ ANI కి చెప్పారు.

వాస్తవానికి, భారత-అమెరికా దౌత్య సంబంధాల బాగా ఉండటం కోసమే బుస్సా, “ట్రంప్ కృష్ణడొనాల్డ్ ట్రంప్ను పూజించడం ప్రారంభించాడు. సుమారు మూడు సంవత్సరాల క్రితం, తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అమెరికా నేవీ అనుభవజ్ఞుడు ద్వేషంతో హత్య చేసేడు. ఆధ్యాత్మిక ఆప్యాయతతో ట్రంపును ముంచేసి అమెరికా అధ్యక్షుడిపై అఖిల భారతదేశం తరఫున విజయం సాధించాలని అతను భావించాడు.


" సంఘటన తరువాత నేను చాలా బాధపడ్డాను. భారతీయ గొప్పతనాన్ని అమెరికా అధ్యక్షుడు మరియు అతని ప్రజలు అర్థం చేసుకోగల ఏకైక మార్గం వారి పట్ల మనకున్న ప్రేమను, ఆప్యాయతను ప్రదర్శించడమే అని నేను అనుకున్నాను. అందుకే నా ప్రార్థనలు. నా ప్రార్థనలు ఆయనకు ఒక రోజు చేరుతాయనే ఆశతో ట్రంప్ను ఆరాధించడం ప్రారంభించానుఅని ట్రంప్ భక్తుడు 2018లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

"భారతీయులు తమ ఆధ్యాత్మిక శక్తులతో ఎవరినైనా గెలవగలరని నేను నమ్ముతున్నాను. మనం ఒక శక్తివంతమైన వ్యక్తిని నేరుగా గెలవలేనప్పుడు, మనం అతనిని ప్రేమతో మరియు ఆరాధనతో గెలవవచ్చునేను చేస్తున్నది అదే, ”అన్నారాయన.

ట్రంప్ కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్లు రెండేళ్ల క్రితం అతను ప్రగల్భాలు పలికినప్పటికీ, కొన్నేలోని తన పొలంలో అతను 6 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అతను రోజూ ఆయన్ను ప్రార్థిస్తున్నాడు.

నేను ఆయన (ట్రంప్) చిత్రాన్ని నా కూడా తీసుకువెళుతాను. ఏదైనా పనిక చేసే ముందు, నేను ఆయన్ని ప్రార్థిస్తున్నాను. ఆయన నాకు దేవుడితో సమానంఅదే నేను ఆయన విగ్రహాన్ని నిర్మించటానికి కారణం అయ్యింది. విగ్రహాన్ని నిర్మించడానికి దాదాపు ఒక నెల పట్టింది.15 మంది కార్మికులు పనిచేసారుఅని కృష్ణ ANI కి చెప్పారు.


తోటి గ్రామస్తులు మరియు బుస్సా కృష్ణ కుటుంబం కూడా అతను మొదట పిచ్చివాడని భావించారు, కాని ఇప్పుడు వారంతా డోనాల్డ్ ట్రంప్కు ఆయన ఆధ్యాత్మిక మద్దతుతో పాటూ వారూ మద్దతు ఇస్తున్నారు.

ఎప్పటికైనా అతను ట్రంపును కలవాలని ఆశిద్దాం.

Image Credit: To those who took the original Photos

*********************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి