ఈ నెల కనబడే తోక చుక్క విపత్తుకు సూచనా?
(ఆసక్తి)
రానున్న కొన్ని రోజుల్లో ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశంలో ఒక భారీ తోకచుక్క కనువిందు చేయనుంది. దీనిపేరు నియోవైస్ అని నాసా వెల్లడించింది. ఇది కొన్ని నిమిషాల పాటు ఆకాశంలో దర్శనమిస్తుందని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్కను ఈ ఏడాది మార్చి 27న నాసా నియోవైస్ అనే ఇన్‌ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్‌తో కనుగొన్నందున దీనికి నియోవైస్ అని నామకరణం చేసింది. ఇక ఈ తోకచుక్క అధికారిక నామం c/2020 F3నియోవైస్. ఈ తోకచుక్కను మామూలుగానే ఎలాంటి కళ్లజోడు లేకుండా చూడొచ్చని నాసా స్పష్టం చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి