21, ఆగస్టు 2020, శుక్రవారం

జీవన పోరాటం…(సీరియల్)...PART-1

 

                                                                        జీవన పోరాటం…(సీరియల్)                                                                                                                                                                   PART-1


కలకత్తా లోని హౌరా రైల్వే స్టేషన్ ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది.

లోపలకు వెళ్ళాలన్నా సరే, బయటకు వెళ్ళాలన్నా సరే...జన సముద్రాన్ని ఈత కొడుతూనే వెళ్ళాలి.

మతం, భాష, జాతి, రాష్ట్రం అని ఏన్నో విభాగాలు కలిగిన మనుష్యుల ప్రజా సమూహం అక్కడ ఉండటంతో అదొక చిన్న భారత దేశం లాగానే కనబడుతుంది.

రోజూ అదేలాగనే కనిపిస్తోంది.

సమయం ఉదయం 11.30.

తిరుపతి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో ప్రయాణం చేయాలనుకున్న వారు మూడో నెంబర్ ప్లాట్ ఫారం పైన కాచుకోనున్నారు. ఖాలీ పెట్టెలతో రైలు వస్తున్నదని ప్రకటన  వినిపించడంతో, ప్రయాణీకులందరూ హడావిడిగా తమతమ వస్తువులతో రైలు ఎక్కటానికి రెడీ అయ్యారు.

టికెట్టు రిసర్వ్ చేసుకున్న వారు నిదానంగా తమ రైలు పెట్టెలు ఎక్కి తమ తమ సీట్లలో కూర్చున్నారు. రిసర్వేషన్ చేసుకోని వారికోసం ఉన్న జెనెరల్ పెట్టెలలో గుంపు ఒకొళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఎక్కటానికి ఆందోళన పడుతున్నారు.

సుమారు ఐదు నిమిషాలు దాటినా, ఒక్కరు కూడా రైలు పెట్టెలోకి వెళ్ళినట్లు తెలియటంలేదు. ఎందుకంటే, లోపలకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్న వారందరూ తాము లోపలకు వెళ్లకపోయినా పరవాలేదు, తనకు ముందు ఇంకెవరూ పెట్టెలోకి ఎక్కకూడదనే కారణం వలన మిగతావారిని అడ్డుకోవడానికి తమ బలాన్నంతా ఉపయోగిస్తున్నారు.

కానీ, పరంధామయ్య మాత్రం 'పోర్టర్ ఒకతన్ని బేరమాడి....కిటికీ దగ్గరున్న సీటును పట్టుకుని హాయిగా కూర్చున్నారు.

సూట్ కేసును తన కాళ్ళ కింద పెట్టి గొలుసుతో సీటు పక్కనున్న ఇనుప కడ్డీకి కట్టి తాళం వేసి, తాళంచెవిని జాగ్రత్తగా బద్రపరచుకున్నారు. ఇంకో సంచిని తనకూ, కిటికీకి  మధ్య దిండులాగా పెట్టుకున్నారు. సంచీలో నుంచి ఒక దుప్పటి తీసి రాత్రి పూట ఉపయోగించుకోవటానికి తన భుజాలపై వేసుకున్నారు.

రైలు బయలుదేరటానికి ఇంకా చాలా సమయం ఉన్నది.

ప్రయాణీకులు మాట్లాడిన(అరిచిన!)బెంగాలీ, హిందీ, తమిల్, కన్నడం అని ఒక కలగలపు భాష పెట్టెనే అధరగొడుతోంది.

ప్లాట్ ఫారం పైన,  రైలు పెట్టెలోనూ చిన్న చిన్న వస్తువుల వ్యాపారం చురుకుగా జరుగుతున్నది.

పరంధామయ్య, తన చుట్టూ క్షుణ్ణంగా గమనించినప్పుడు తెలుగు తెలిసిన ఎవరూ ఆయన కూర్చున్న చోట ఉన్నారనే తెలియటం లేదు. ఆయనకి హిందీ బాగా వచ్చు గనుక దాని గురించి బాధపడలేదు.

మీకు ఇప్పుడొక ఒక సందేహం రావచ్చు!

' రైలు పెట్టెలో వందాలాది ప్రయాణీకులు ఉంటే...ఎందుకు పరంధామయ్య మీద మాత్రం ఇంత శ్రద్ద?' అని అడగటం తెలుస్తోంది.

దానికి ఒక కారణం ఉంది.

రైలు బయరుదేరటానికి కొద్ది నిమిషాల ముందు ఆయన జీవితాన్నే మార్చి వేయబోయే సంఘటన జరగబోతోంది.

'అది ఏమిటి?' అని అడుగుతున్నారా!

కొంచం ఓర్పు వహించండి. దానికి ముందు పరంధామయ్య గురించిన వివరాలు చెప్పి ముగిస్తాను.

అతను అనో, లేక ఆయన అనో అని చెప్ప లేని 40 ఏళ్ళు. మనం 'ఆయన అనే చెబుదామే! సొంత ఊరు గుడివాడ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన తరువాత కూడా రాజకీయాలూ, సినిమాలు తప్ప వేరే విశేష మార్పులు చూడని గ్రామం అది. 

ప్రొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి అంటూ ఒక రోజుకు రెండుసార్లు ప్రభుత్వ బస్సులు వచ్చి వెడతాయి. అందులో ప్రయాణం చేయటానికి ఇష్టపడే వాళ్ళు...మొదట్లో దాన్ని(బస్సును)కొంచం దూరం తోసుకు వెళ్ళి 'స్టార్ట్' చెయ్యాల్సి ఉంటుంది. ఒక వేల అది పాడైపోతే బాగుపడి వచ్చేంతవరకూ వేరే బస్సు లేదు. మధ్య మధ్యలో ఒక 'మినీ' బస్సు వచ్చి వెడుతుంది.  కానీ, దానికీ ఎటువంటి పూచీ లేదు. పక్క ఊర్లలో ఏదైనా సంబరాలు జరిగితే 'మినీ' బస్సు అటు వెళ్ళిపోతుంది.

పరంధామయ్య యొక్క ముత్తాతకు - ముత్తాతలు తరతరాలుగా జమీందార్లుగా -- బ్రిటీష్ పరిపాలనలో ముఖ్య ప్రముఖులుగానూ ఎడ్ల బండీలలో తిరుగుతూ ఉండేవారు. వాళ్ళ మాటకు ఊరే కట్టుబడి ఉంటుంది.

ఇప్పుడు 'పెద్దింటి ఇళ్లు అనే పేరు మాత్రమే సొంతం. కనీసం గ్రామ పంచాయితీ ప్రెశిడెంట్ గా కూడా పరంధామయ్య లేడు.  రోజైతే ఊరు మధ్యలో ఉన్న అమ్మోరి గుడి ముందున్న జంక్షన్లో పది పదిహేను స్థంబాలలో 'రంగు రంగుల జెండాలు ఎగరటం మొదలైందో...అప్పుడే 'నేను గెలుస్తానా?' అనే అపనమ్మకం కూడా పరంధామయ్య మనసులో జెండాలా ఎగిరింది. పోటీ చేసి ఓడిపోవటం కంటే పోటీ చేయకుండా తప్పుకోవటమే గౌరవం అని అనుకున్నారు. అప్పట్నుంచి వ్యవసాయం, వ్యాపారం అని ఉండిపోయారు. సమాజ కార్యక్రమాలలో అంటీ అంటనట్టు నడుచుకునేవారు.

పరంధామయ్యను విజయవాడలోని ఒక కాలేజీలో చేర్చి చదివించారు ఆయన తండ్రి. ఆయన కూడా కష్టపడి చదివి గ్రామంలోనే 'డిగ్రీ' ముగించిన మొదటి తెలివిగల మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ, పై చదువు చదవటానికి ఆశపడినప్పుడు...వ్యవసాయం చూసుకోవటానికి  తనకు సహాయంగా ఉంటాడని కొడుకు చదువుకు ముగింపు కార్డు చూపించాడు తండ్రి. పరంధామయ్య కూడా వ్యవసాయం చేయటాన్ని గౌరవానికి భంగం అనుకోకుండా పూర్తి శ్రద్దతో పనిచేయడం వలన రోజు రోజుకూ వాళ్ళ ఆస్తుల లెక్క పెరుగుతూ వచ్చింది.

కాలంలో పంట వేయాలో తెలుసున్న పరంధామయ్య తండ్రి, వయసులో పెళ్ళి చేయాలో వయసులో పరంధామయ్యకు పెళ్ళి చేయటంతో, పెద్ద ఇంటికి కోడలుగా రాజరాజేశ్వరి వచ్చి చేరింది. లోటు ఏమీ లేని గుణవంతురాలిగా ఉండటం వలన, పరంధామయ్య జీవిత ప్రయాణం హాయిగా వెడుతున్నది.

కానీ, పెళ్ళై పది పదిహేను సంవత్సరాలు పూర్తి అయినా, వారసుడ్ని కనివ్వలేకపోయేనే నన్న బాధ ఆమెనూ, ఇంట్లో ఉన్న మిగిలిన వారినీ బాధకు గురి చేసింది. బాధ తోనే పరంధామయ్య తల్లి-తండ్రులు ఒకరి తరువాత ఒకరు కన్ను మూయటం వలన, ఇంటి పూర్తి బాధ్యత పరంధామయ్య నెత్తి మీద పడింది.  

ఆస్తులన్నీ ఆకాశాన్ని చూస్తున్న భూమిలాగా ఉన్నాయి. భూగర్భ నీటి యొక్క లోతు దిగిపోవటం,  భావి నీటి పారుదల అబద్దం అవడం ప్రారంభించటంతో, పూర్తిగా వ్యవసాయంపైనే ఆశ, నమ్మకం పెట్టుకోకుండా వేరే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టటానికి పరంధామయ్యకు చదువు నేర్పిన తెలివితేటలు అతనికి సహాయపడింది.

గ్రామంలోని తన పొలంలో పండిన పత్తితో పాటు మిగిలినవారి దగ్గర నుండి కూడా పత్తిని కొని, 'కమీషన్ ఏజంట్లు పిచ్చి లాభాలు కొట్టేయకుండా ఉండటానికి, కలకత్తాకే నేరుగా  తీసుకువచ్చి అమ్మటం వలన ఆయనకు మంచి లాభం దొరికింది. హిందీ, బెంగాలీ సరళంగా తెలిసుండటంతో, వ్యాపారం లాభకరంగా చేయగలిగాడు.  దానికోసమే సారి కూడా ఆయన కలకత్తా వచ్చాడు.

కానీ, ఊరు తిరిగి వెళ్ళటానికి రిజర్వేషన్ దొరకలేదు. అందువలన జెనెరల్ బోగీలో ప్రయాణం చేస్తున్నాడు. రైలు బయలుదేరబోతోందని ప్రకటన వచ్చిన తరువాత ప్లాట్ ఫారం మీద హడావిడి మొదలైయ్యింది.

అప్పుడు........

యౌవనదశలో ఉన్న ఒక అమ్మాయి, భుజం మీద నిద్రపోతున్న పసిబిడ్డతో, చేతిలో ఒక గుడ్డ సంచితో పరిగెత్తుకు వచ్చి పెట్టిలో ఎక్కింది.

ఒక విధమైన భయం కలిసిన ఆందోళనతో హడావిడీగా ఒక్కొక్కరి మొహం చూస్తూ వచ్చిన ఆమె... పరంధామయ్యను చూసిన వెంటనే 'తెలుగోడు అనేది అర్ధంచేసుకోనుంటుంది. గబగబ నడుస్తూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని,"అయ్యా...నన్ను కాపాడండి. ముగ్గురు మొరటోళ్ళు నన్ను తరుముకుంటూ వస్తున్నారు. వాళ్ళ చేతులకు దొరికితే  నన్ను నాశనం చేస్తారు" అంటూ బోరుమని ఏడ్చింది.

అలాగే ఆయన కాళ్ళ దగ్గర ముడుచుకుపోయి కూర్చుని, అప్పుడప్పుడు తలెత్తి తనని తరుముకుంటూ వచ్చిన మొరటోళ్ళ కనబడుతారేమోనని కలవరపాటుతో ప్లాట్ ఫారం వైపు చూస్తోంది.

మహాభారతంలో దుశ్శాసనుడు వివస్త్రను చేయటానికి వచ్చినప్పుడు, తనవల్ల ఏమీ చేయలేనన్న ఆలోచన వచ్చినప్పుడు పాంచాలి అంతవరకు తన రెండు చేతులతో పట్టుకున్న చీరను వదిలేసి, రెండు చేతులూ పైకెత్తి శ్రీక్రిష్ణ పరమాత్మను సహాయనికి పిలిచిందే...అదేలాగా అమ్మాయి కూడా సహాయం అడిగి కాళ్ళ దగ్గర పడున్నది గ్రహించారు...జాలి పడ్డారు పరంధామయ్య.

                                                                                                                                 Continued...PART-2

                                                                                                                                                  ********************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి