29, ఆగస్టు 2020, శనివారం

జీవన పోరాటం...(సీరియల్)...PART-5


                                                                             జీవన పోరాటం...(సీరియల్)                                                                                                                                                                   (PART-5)

(క్రమశిక్షణతో ఉండటమే కుటుంబ జీవితానికి ప్రధానమైనది. క్రమశిక్షణ తప్పి జీవించే జీవితం పోకిరితనమైనదని యోచిస్తారు)

హఠాత్తుగా జరిగి ముగిసిన సంఘటన యొక్క తాకిడి నుండి పరంధామయ్య బయటకు రాలేకపోయాడు. మొదట్లో అదేదో 'కల అని కూడా ఆలొచించారు. అది నిజమే నని నమ్మినప్పుడు...'అది కలగానే ఉండిపోకూడదా?' అని అనుకుని బాధ పడ్డారు. ముందూ వెనుక తెలియని మహిళతో కలిసి ఒకే గదిలో ఉన్న తప్పును తలచుకుని తనని తానే నిందించుకున్నారు.

రాత్రంతా నిద్ర లేకుండా అల్లాడిపోయారు.

పాపం...ఆయన మాత్రం ఏం చేయగలరు?

'పిల్లలు పుట్టే భాగ్యమే లేదు అని వైద్యులు చెప్పినప్పుడు విలవిలలాడిపోయింది రాజరాజేశ్వరి. 'గొడ్రాలు అనే పేరు వ్యాపించటం విని కూలిపోయింది. కొంచం కొంచంగా ఆమెకు దాంపత్య జీవితంపై ఆసక్తి తగ్గిపోయింది. భార్య మనసెరిగిన పరంధామయ్య కూడా గత కొద్ది సంవత్సరాలుగా దాంపత్య జీవితానికి దూరంగా ఉండిపోయారు.

ఈరోజు హఠత్తుగా తన మగతనానికి పరీక్ష రావటంతో తడబడ్డాడు. రేపు భార్య ముఖం ఎలా చూడను అని సిగ్గుతో తల వంచుకున్నారు.

అన్నిటికీ మంగమ్మే కారణమని ఆమె మీద నేరం మోపటానికి ఆయన మనసు అంగీకరించలేదు. తాను జాగ్రతగా ఉండుంటే ఇది జరిగుండేది కాదు అని నమ్మారు.

ఇలా పలు పలు ఆలొచనలు వచ్చి ఆయన బుర్రను తాకటంతో ఆయన నిద్రపోలేకపోయేరు. ఎర్ర బడ్డ కళ్ళతో కుర్చీలో కూర్చుని తన స్థితిని తలుచుకుని వేదన పడుతున్నారు.

ప్రొద్దున్నే కళ్ళు తెరిచిన మంగమ్మ ఆయన్ను చూసి హడలెత్తిపోయింది. రాత్రి జరిగింది సాధారణంగా తీసుకుంటారని అనుకున్నది. ఇలాగూ ఒక మగ మనిషి ఉంటాడు అని  ఆమె ఎదురు చూడనే లేదు. ఇప్పుడు ఆయనతో మాట్లాడటానికి ఆమెకు సిగ్గుగానూ, భయంగానూ ఉన్నది.

ఆయన కూడా మౌనంగా ఉండటంతో చాలా బాధ పడ్డది మంగమ్మ. 'ఇంత మంచి మనిషిని నేరం చేసేననే మనోస్తితికి తీసుకువెళ్ళేనే?' అని పశ్చాత్తాప పడింది.

అలాంటి మౌన పరిస్థితి యొక్క తీవ్రతను తగ్గించటానికి ఎవరైనా ఒకరు మాట్లాడి తీరాల్సిందే! ఆయన దగ్గరకు వచ్చి తడబడుతూ నిలబడ్డది.

"అయ్యా, నిన్న జరిగిన తప్పుకు నేనే కారణం. దానికి ఇంత బాధ పడక్కర్లేదు. మీరు ఎంత న్యాయమైన మనిషో తెలుసుకోలేకపోయిన కుక్కను...నేను తప్పు చేశాను. నన్ను మన్నించి...ఉరికి వెళ్ళటానికి కొంచం డబ్బిచ్చి సహాయపడితే...నేను వెళ్ళి చేరిపోతాను. తరువాత జన్మజన్మలకూ మీ కంటికే కనబడను. నన్ను మన్నించి పంపించండయ్యా" అంటూ వేడుకుంది.

ఆయన సమాధానం ఏమీ చెప్పకుండా లోతైన ఆలొచనలో ఉన్నట్లు కనబడ్డారు.

మంగమ్మకి ఏడుపు పొంగుకుంటూ వచ్చింది. ఆయన కాళ్ళ మీద పడి రోదించింది. "అయ్యా, నన్ను మన్నించి పంపించేసి దీన్ని మరిచిపొండయ్యా. మీకు ఇక ఎటువంటి సమస్య లేకుండా ఊరు వెళ్ళి జేరిపోతానయ్యా"

ఆమె ఏడుపునే కొంచం సేపు చూస్తున్న ఆయన చెప్పారు: "మంగమ్మా...నిన్ను మీ ఊరు పంపించటం లేదు. నాతోనే తీసుకు వెళ్ళబోతాను"

అదిరిపడ్డది మంగమ్మ. 'ఏమైంది ఈయనకు?' అని ఆందోళన చెందింది.

ఆమె షాక్ అవటం చూసి.

"ఇష్టపడో...ఇష్టపడకనో నిన్ను ముట్టుకున్నాను. ఇకమీదట నువ్వు నా  రక్షణలో ఉండటమే న్యాయం" -- ఆయన స్వరంలో అధికమైన పట్టుదల తెలుస్తోంది.

తల తిరిగింది మంగమ్మకి. కొంచం కూడా ఎదురుచూడని ఆయన యొక్క   నిర్ణయన్ని తలచుకుని వొణికిపోయింది. ఆయనతో వెడితే తన వలన కుటుంబంలో ఎన్నెన్ని సమస్యలు తలెత్తుతాయో అని ఆలొచించినప్పుడు ఏడుపు గొంతుకు అడ్డుపడింది. ఆయన ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటారని ఎదురుచూడనే లేదు. ఏది ఏమైనా దాని నేను సమ్మతించ కూడదు అని ఖచ్చితంగా నిర్ణయించుకుంది.

"అయ్యా, నా మీద మీరు చూపిస్తున్న సానుభూతికి చాలా సంతోషపడుతున్నాను. కానీ, మీ నిర్ణయాన్ని నేను ఆమొదించనేలేను. అది అంగీకరించే అదృష్టం నాకు లేదు. రెండు రోజులు నాకోసం మీరు కష్టపడ్డదంతా చాలు. నా వల్ల మీకు ఇక ఎటువంటి సమస్య రాకూడదు. దయచేసి నా దారిలో నన్ను పోనివ్వండి" -- బ్రతిమిలాడింది.

"మీ అమ్మా-నాన్నలను గురించి ఒక్కసారి ఆలొచించు మంగమ్మా. కలకత్తాలో భర్తతో చాలా సంతోషంగా ఉన్నావని అనుకుంటూ ఉంటారు. దాన్ని చెడపటానికి వెళ్ళబోతావా? మీ చెళ్ళెళ్ళ గురించి ఆలొచించు. భర్త వదిలేసిన దానివిగా వెడితే వాళ్ళకు పెళ్ళిల్లు జరుగుతాయా? నీ భర్త వచ్చి నీ మీదే తప్పంతా నని చెప్పి మాట్లాడితే నువ్వు తట్టుకోగలవా? అతన్ని ఎదిరించి నువ్వు మంచి దానివని నిరూపించగలవా?"

మీ ఊరికి వెళ్లి...నీకు మాత్రం కాకుండా నీ కుటుంబం మొత్తానికి కష్టం ఇవ్వబోతావా? రైల్లో వచ్చేటప్పుడే నిన్ను మా ఇంటికి తీసుకు వెల్దామని అనుకున్నాను. కానీ, నీ దగ్గర ఏం చెప్పి...ఎలా నిన్ను తీసుకు వెళ్ళాలి అని ఆలొచిస్తూ ఉన్నాను. కానీ, ఇప్పుడు నిన్ను కాపడవలసిన బాధ్యత నాకు వచ్చేసింది"

ఆయన మాటల్లో ఉన్న న్యాయాన్ని అర్ధం చేసుకుంది. 'పెద్ద మనుష్యులు పెద్ద మనుష్యులే'...నా కుటుంబం గురించి ఆయన ఎంత శ్రద్ధతో ఆలొచించారు? నేను కూడా, నా భర్త దగ్గర నుండి తప్పించుకుని ఊరు వెళ్ళి చేరితే చాలు అని మాత్రమే ఆలొచించాను. దాని వలన నా కుటుంబానికి ఇంత పెద్ద సమస్య వస్తుందనేది నేనెందుకు ఆలొచించలేదు?'--అని అనుకుంది.

ఊరికి వెళ్ళే ఆలొచనను విడిచిపెట్టింది'అలాగైతే నాకు వేరే దారి ఏముంది? ఇక ఈయనతో వెళ్ళాల్సిందేనా?'

'అలా వెడితే ఆయన ఇంట్లో...?'.....తలచుకుంటేనే ఆమెకు భయం వేసింది.

"ఏం మంగమ్మా?"

'అయ్యా, నన్ను కొంచం ఆలొచించుకో నివ్వండి?'

గోడ చివరగా కూర్చుని కళ్ళు మూసుకుంది.

చాలా సేపైన తరువాత ఆయన మొహాన్ని నేరుగా చూసింది: "అయ్యా, మీ మాటల్లో ఉన్న నిజాన్ని గ్రహించి...నా ఉరికి వెళ్లకూడదు అని నిర్ణయించుకున్నాను. కానీ, మీతో రావాలంటే దానికి ముందు మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి"

"చెప్పు...ఏమిటి?"

ఒక పనిమనిషి గానే అక్కడికి వస్తాను. మీరు చెప్పేరు చూడండి... బద్రత మాత్రమే నాకు ఇవ్వాలి. అంతకు మించి నా దగ్గర నుండి మీరు ఎటువంటి ప్రతిఫలము ఎదురుచూడకూడదు"

"సరే"

"నన్ను పనిమనిషిగా మాత్రమే చూడాలిమిగిలిన పనివాళ్లను ఎలా చూస్తున్నారో నన్ను కూడా అలాగే చూడలి. నా దగ్గరకు వచ్చి ఏకాంతంగా మాట్లాడటమో, లేక నాకని ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వటానికి ప్రయత్నించ కూడదు"

"సరే మంగమ్మ"

"ఇంకొక విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి"

"చెప్పు"

మీ కుటుంబంలో నా వలన ఎలాంటి గొడవులూ రావు. గొడవ వచ్చేటట్టు మీరు ఏదైనా చేస్తే...మరు క్షణమే నా కొడుకుతో కలిసి కనిపించకుండా వెళ్ళిపోతాను. వీటన్నిటికీ సమ్మతమైతే చెప్పండి...వస్తాను"

ఆమె మాటల్లో ఒక స్పష్టత ఉన్నది.

"నిజంగా చెబుతున్నాను మంగమ్మ. నీ మీద నాకు ఎటువంటి 'ఆశ కలగలేదు. అందువలన నా వలన నీకు ఎటువంటి ఇబ్బందీ రాదు. నేను చెప్పేను కదా...రైలు లోనే నిన్ను నా ఇంటికి తీసుకు వెళ్ళాలి అనుకున్నాను అని. ఇప్పుడు అది నా భాధ్యత అని నా మనస్సాక్షి చెబుతోంది. మా ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉంటే అదే నాకు చాలు. నా వలన నీకు ఎప్పుడూ ఎటువంటి బాధ ఉండదు"

ఆయన మాటలను పూర్తిగా నమ్మి ఆయనతో వెళ్లటానికి అంగీకారం తెలిపింది. ఏడుకొండలకు భార్యగా ఉండటం కంటే ఈయన ఇంట్లో పనిమనిషిగా ఉండటం ఎంతో గౌరవమైనది అని అనుకున్నది.

నమ్మకంతోనే ఆయనతో వెళ్ళటానికి తయారైయ్యింది. ఆమె నమ్మకం నెరవేరిందా? కాలమే సమాధానం చెబుతుంది.

                                                                                                                     Continued.....PART-6 

************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి