25, ఆగస్టు 2020, మంగళవారం

జీవన పోరాటం…(సీరియల్)...PART-3



                                                                          జీవన పోరాటం…(సీరియల్)                                                                                                                                                                     PART-3 

(మంచివాళ్ళతో పాటు చెడ్డవాళ్ళు, మంచివారులాగా నటించి కలిసి జీవిస్తారు. ఆలా ఉన్నప్పుడు చెడ్డజాతి వారిని కనుక్కోవటం జరిగేపనికాదు)

ఆమె పేరు మంగమ్మ. జగ్గయ్యపేట దగ్గరున్న వెంకాటాద్రి పురం ఆమె సొంత ఊరు. వర్షం అనేది సంవత్సరానికి ఒకటి రెండు రోజులే చూస్తారు.

గ్రామానికి చుట్టూ ఉన్న చిన్న అడవి ప్రాంతంలో ఉన్న ఎండిపోయిన చెట్లను ముక్కలు చేసి కట్టెలుగానో, లేక బొగ్గుగానో అమ్ముతారు. గ్రామంలోని చాలా మందికి అదే వృత్తి.

పేదరికం రేఖకు కింద ఉన్న వాళ్ళను చూపించాలనుకుంటే, మంగమ్మ కుటుంబమే దానికి ఉదాహరణం.

రోజు కారోజు సంపాదించుకునే కూలీ డబ్బులే వాళ్ళకు ఆహారం. ఆమె తల్లి-తండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. అందులో మంగమ్మే పెద్ద కూతురు.

ఆడపిల్లా ఐదో క్లాసు దాటలేదు...దాటటం కుదరలేదు. క్లాసు వరకూ స్కూలుకు వెళ్ళటానికి కారణం...చదువు మీద శ్రద్ద ఉండి కాదు. స్కూల్లో పెడుతున్న మధ్యాహ్నం భోజనం కొసమే ననడం నిజం.

25 ఏళ్ల వయసు దాటినా ఆమె తల్లి-తండ్రులు ఆమెకు పెళ్ళి చేయాలనే ఆలొచన కూడా చెయ్యలేకపోయారు. నగలకు, కట్నానికి, సారెకు--అన్నిటికీ డబ్బులు కావాలే! దానికి వాళ్ళు ఎక్కడికి వెడతారు?

పిల్లలను తలచుకుని రాత్రి, పగలు కన్నీరు కార్చడమే వాళ్లవల్ల అయ్యింది. 'దేవుడే దారి చూపిస్తాడు అనే నమ్మకంతో రోజులు గడిపారు.

పరిస్థితుల్లోనే అపద్భాందువుడిలాగా వచ్చి నిలబడ్డాడు వాళ్ళకు బందువైన ఏడుకొండలు. వాడికీ అదే ఊరే. వాడి కుటుంబం కూడా పేద కుటంబమే.

బ్రతకటం కోసం చిన్న వయసులోనే కలకత్తా వెళ్ళిపోయాడు. చాలా కష్టపడి పైకొచ్చి రోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఎండాకాలంలో జరిగే అమ్మోరి జాతరకు, సంక్రాంతికి ఊరికి వచ్చి వెడుతూ ఉంటాడు.

హఠాత్తుగా ఒక రోజు మంగమ్మను పెళ్ళిచేసుకుంటానని అడుగుతూ మంగమ్మ ఇంటికి వచ్చాడు. సరే ననే మీ అంగీకారం మాత్రం చాలు...ఖర్చంతా నాదేనని హామీ ఇచ్చాడు.

దేవుడు కరుణించేడని మంగమ్మ తల్లి-తండ్రులు ఆనందపడ్డారు. ఎక్కువ  ఆలొచించకుండా వాళ్ళ అగీకారం తెలిపారు. మూడింట ఒక భారాన్ని ఖర్చులేకుండా దింపి కింద పెట్టారు.

భర్తతో కలకత్తా బయలుదేరినప్పుడు...తాను అదృష్టవంతురాలు నని ఆనందపడటమే కాకుండా, గర్వ పడింది. కలకత్తా వచ్చి చేరిన తరువాత ఏదో కొత్త లోకానికి వచ్చినట్లు ఫీలైంది.

మొదట్లో జీవితం ఉత్సాహంగా ఉన్నది. మనసులో ఊహించు కున్నదానికంటే కలకత్తా  అతిపెద్ద అద్భుతంగా కనబడింది. భర్తకు ప్రముఖ 'కంపెనీ' లో నైట్ డ్యూటి. సాయంత్రం బయలుదేరి వెడితే తెల్లవారు జామున తిరిగి వస్తాడు. పగలంతా నిద్రపోతాడు.

అప్పుడప్పుడు ఆమెను బయటకు తీసుకు వెళ్ళాడు. ఒకసారి సముద్ర తీరానికి తీసుకు వెళ్ళాడు. సముద్రతీర అందాన్ని తిలకించి స్థంభించిపోయింది. 'ఇదేనా స్వర్గం?' అని ఆలొచంచి బ్రమ పడింది.  

కొన్ని సార్లు మార్కెట్టుకు తీసుకు వెళ్లాడు. అతను కొనిచ్చిన దుస్తులను ఆనందంగా వేసుకునేది. కానీ, అమెగా ఏదీ అడిగి కొనుక్కోలేదు. పుట్టినింటి పేదరికం ఆమెను అంత పక్వ పర్చి ఉంచింది. కొడుకు పుట్టాడు. కొడుకుకు సత్యపాల్ అని ఆధినిక బెంగాలీ పేరు పెట్టాడు ఏడుకొండలు. ఇదేం పేరని మంగమ్మ అడిగినప్పుడు 'ఇంకా గ్రామ వాతావరణం నుండి నువ్వు బయటకు రాలేదా. ఇది పట్నం పేరు. అలాగే ఉంటుంది అని చెప్పాడు. 

కొడుకు సత్యపాల్ పుట్టి ఐదారు నెలల వరకు అంతా బాగానే గడిచింది. కానీ, పోను, పోనూ భర్త ఏదో తప్పైన దారిలోనే సంపాదిస్తున్నాడని ఆమె ఫీలైంది. గుచ్చి గుచ్చి అడిగినప్పుడు...కలకత్తా లోని రెడ్ లైట్ ఏరియాలో 'బ్రోకర్ పని చేస్తున్నాడని తెలిసింది.

మంగమ్మ తల మీద పిడుగు పడినట్లు అయ్యింది. కడుపుకు పావు గ్లాసు గంజి నీళ్ళు తాగినా నీతిగా తాగిన కుటుంబం వాళ్లది. రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య  అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. రోజులు గడుస్తున్న కొద్ది అది పోట్లాటగా మారి, రోజూ అతను తాగి రావడం...ఆమెను కొట్టి చిత్రవధపెట్టటం మొదలైయ్యింది. సరిగ్గా ఇంటికి రావటం లేదు. తనకి ఆదరణగా ఎవరూ దగ్గరలో లేకపోవటం; కుటుంబ గౌరవాన్ని కాపాడటం కోసం అన్నిటినీ తట్టుకుంది. కానీ, ఒకరోజు అతను చెప్పింది ఆమెకు భారీ దెబ్బగా తగిలింది.

అవును, ' వ్యాపారంలో' ఆమె కూడా దిగాలని, సంపాదించాలని ఆజ్ఞ వేశాడు. అతని కాళ్ళ మీద పడి బ్రతిమిలాడింది. 'నువ్వు ఎలాగైనా పో...నన్ను వదిలేయి అని వేడుకుంది.

దేనికీ అతని మనసు కదలలేదు. నేను చెప్పింది చెప్పిందే అని కర్కసంగా ఉన్నాడు.

రోజు ప్రొద్దున ఇంటికి వచ్చిన అతను, "సాయంత్రం వస్తాను. మర్యాదగా నాతో పాటూ బయలుదేరి రావాలి. లేకపోతే జరిగేదే వేరు" అంటూ హెచ్చరించి వెళ్ళాడు. దారుణాన్ని తట్టుకోలేక...'ఎలాగైనా అమ్మా-నాన్నల దగ్గరకు వెళ్ళి చేరిపోవాలి అని నిర్ణయించుకుంది.

అక్కడ ఉండే ఒక్కొక్క క్షణం అపదే అనేది గ్రహించింది. తనకీ, బిడ్డకూ కావలసిన కొన్ని దుస్తులు తీసుకుని సంచీలో పెట్టుకుంది. అవసరానికి కావాలి కాబట్టి డబ్బు కొసం వెతికినప్పుడు -- చెతిలో చిల్లి గవ్వ కూడా లేదనేది తెలిసింది.

మధ్య రోజుల్లో ఏడుకొండలు ఆమె దగ్గర డబ్బులేమీ ఇవ్వటం లేదు. ఇంటికి కావలసిన వస్తువులను కూడా సగం సగం, ఇష్టం లేకపోయినా కొని పడేశాడు. కొన్ని సమయాలలో వంట చేయటానికి ఏమీ లేక వంట చేయకుండా పస్తు పడుకునేది.

సమయంలో కూడా అతని దగ్గర ఏమీ అడిగి తీసుకోవటానికి ఆమె ఆత్మగౌరవం చోటివ్వలేదు!

డబ్బులే లేకుండా జగ్గయ్యపేటకు ఎలా వెళ్ళేది? ఎక్కువ ఆలొచించలేదు. 'మొదట నగరం విడిచి వెళ్ళిపోవాలి -- అనుకున్న వెంటనే...ఉన్న కొంచం చిల్లర డబ్బులు తీసుకుని, బిడ్డను ఎత్తుకుని బయటకు వచ్చింది.

ఇంటి బయట భర్త స్నేహితుడొకడు ఆమెను అడ్డుకున్నాడు. "థూ కుక్కా...దారి వదులరా" అంటూ అరుస్తూ వాడి మీద ఉమ్మేసింది. అందువల్ల భయపడ్డాడో ఏమో...జరిగి దారి వదిలాడు. కానీ, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఆమెను వెంబడించాడు.

అక్కడా, ఇక్కడా విచారించి, రైలు స్టేషన్ వెళ్లటానికి ఎక్కాల్సిన సిటీ బస్సులో ఎక్కింది. అతనూ ఎక్కాడు. ఆమెను వెంబడించిన అతను  ఇచ్చిన వార్త వలన భర్త వస్తాడనేది ఎదురు చూసి జాగ్రత్తగా రైలు స్టేషన్ లోకి దూరింది.

అప్పుడొచ్చిన ఒక ప్రకటనలో...తిరుపతి వెళ్ళే రైలు గురించిన సమాచారం విని కొంచం కొంచం అర్ధం చేసుకుని వేగంగా నడుచుకుంటూ మూడో నెంబర్ ప్లాట్ ఫారం లో ఉన్న రైలు ఎక్కింది. అప్పుడే భర్త స్నేహితుడు చూశాడు.

తరువాత జరిగింది మీకు తెలుసుగా!

వివరాలన్ని అడిగి తెలుసుకున్నాక పరంధామయ్య, ఆదరణగా చెప్పారు: "ఇక నువ్వు దేనికీ భయపడటానికో, బాధపడటానికో అవసరం లేదు. విజయవాడలో దిగి, నిన్ను జగ్గయ్యపేట బస్సు ఎక్కించి నేను ఊరికి బయలుదేరుతాను" అన్నారు.

'భర్త తన చెయ్యి వదిలేసినా కూడా దేవుడు పూర్తిగా తన చేయి వదలలేదుఅని అనుకుంటూ ప్రశాంతంగా ఉన్నది మంగమ్మ. ఆమె కళ్ళకు పరంధామయ్య సాక్షాత్తు దైవంలాగా కనబడ్డారు. 

రాజరాజేశ్వరికి ఫోన్ చేసి మాట్లాడారు.

"ఏమండీ...ఎక్కడున్నారు?" -- ఆందోళనగా అడిగింది.

"రైలులో వస్తున్నాను. విజయవాడలో నాకు ఒక పనుంది. అది ముగించుకుని రాత్రికి వస్తాను...అది సరే నువ్వెందుకు అంత ఆందోళనగా మాట్లాడుతున్నావు?"

"మీరు రాత్రి పూట రావద్దు. విజయవాడలో రాత్రికి ఉండి ప్రొద్దున వస్తే చాలు.  గుడివాడ నుంచి టాక్సి పట్టుకుని వచ్చేయండి"

"నువ్వెందుకు అంత ఆందోళనతో మాట్లాడుతున్నావు? అక్కడ ఏమిటి సమస్య...చెప్పు" ---అదికార స్వరంతో అడిగాడు.

అంతకుపైన ఆమె ఏదీ దాచ దలుచుకోలేదు. "మీరు వెళ్ళిన తరువాత ఇక్కడ కుల కలహాలు చోటుచేసుకుంది. వీధికి వీధి కొట్టుకుంటున్నారు. రాత్రి పూట గుడిసెలకు నిప్పు పెడుతున్నారు. ఇళ్ళ మీద రాళ్ళు రువ్వుతున్నారు. పోలీసు బలగాలను ఎక్కువగా దింపటం వలన భయం లేదండి"

గుండే దఢ తగ్గ కుండానే చెప్పి ముగించింది.

"ఇంత గోల జరిగింది. నా దగ్గర ఎందుకు ఏమీ చెప్పలేదు?"--స్వరంలో కోపం తెలుస్తోంది.

"ఇందులో మనకేమీ సమస్య లేదండి. అందువలన మీరు వెళ్ళిన పనిని ప్రశాంతంగా ముగించుకుని రావాలని ఏమీ చెప్పలేదు..."

పరంధామయ్య నమ్మేటట్టు నిదానంగా చెప్పి ముగించింది. కానీ, పనివాడు వెంకయ్య చెప్పిన విషయాల వలన ఆమె బెదిరిపోయిందనేదే నిజం.

                                                                                                                       Continued...PART-4

************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి