10, అక్టోబర్ 2020, శనివారం

గ్రహాంతర జీవితాన్ని కనుగొనటానికి దగ్గరలోనే ఉన్నాము: నాసా చీఫ్ సైంటిస్ట్....(ఆసక్తి)

 

                         గ్రహాంతర జీవితాన్ని కనుగొనటానికి దగ్గరలోనే ఉన్నాము: నాసా చీఫ్ సైంటిస్ట్                                                                                                                  (ఆసక్తి)

మరొక గ్రహం మీద జీవితాన్ని కనుగొనటానికి మనం కొన్ని సంవత్సరాల దూరంలోనే ఉన్నాముకానీ దీన్ని నమ్మటానికి ప్రపంచం సిద్ధంగా లేదు: నాసా చీఫ్ శాస్త్రవేత్త డాక్టర్. జిమ్ గ్రీన్ హెచ్చరించారు.

వచ్చే వేసవిలో, నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) నుండి రెండు రోవర్లు అంగారక గ్రహానికి ప్రయాణించి, జీవులకు ఆధారాలు దొరుకుతాయనే ఆశతో, అంగారక గ్రహంలోని రాళ్ళలో అడ్డంగా , అంగారక గ్రహం ఉపరితలంలో లోతుగా రంధ్రం చేయబోతాయి.


                                                                       డాక్టర్ జిమ్ గ్రీన్, నాసాలోని ప్రధాన శాస్త్రవేత్త.

మనం విశ్వంలో ఒంటరిగా ఉన్నామా?’ అనే ప్రశ్నకు సమాధానమివ్వడానికి మానవాళికి లభించిన ఉత్తమ అవకాశం మిషన్లు.

రెండూ మిషన్లూ విజయవంతమయ్యే అవకాశం ఉందని,  ఈ రెండు మిషన్ల నిర్వాహం లో కీలకపాత్ర పోషిస్తున్న డాక్టర్ జిమ్ గ్రీన్ 'ది టెలిగ్రాఫ్'‌కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో చెప్పారు. అయినప్పటికీ ఇది చాలా చిక్కులను కలిగి ఉంటుంది కానీ దీన్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆయన నమ్ముతున్నాడు

"ఇది విప్లవాత్మకంగా ఉంటుంది" అని ఆయన చెప్పాడు. “కోపర్నికస్భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందిఅని చెప్పినప్పుడు అది పూర్తిగా విప్లవాత్మకమైంది. అది సరికొత్త ఆలోచనా విధానాన్ని ప్రారంభించిది. ఫలితాల కోసం ప్రజలు సిద్ధంగా  లేరు. ఇది కూడా అదేలాగనే

"నేను దాని గురించే ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే మేము దానిని కనుగొనటానికి, దాని గురించి కొన్ని ప్రకటనలు చేయడానికి దగ్గరగా ఉన్నాము"

"తరువాత ఏమి జరుగుతుంది అనేది సరికొత్త శాస్త్రీయ ప్రశ్నలు. అక్కడ జీవితం మనలాగే ఉంటుందా? మనకు వాళ్ళతో ఎలాంటి బంధుత్వం ఉంటుంది? జీవం...గ్రహం నుండి గ్రహం వరకు కదలగలదా లేదాఅక్కడ సరైన వాతావరణం ఉంటుందా. వాతావరణం  జీవితాన్ని ఉత్పత్తి చేస్తుందా - మన భూమి మీద లాగా ఉంటుందాలేక - అక్కడున్న రసాయన వాతావరణం ఆధారంగా మన జీవితం ఉంటుందా?” 

యూరప్ వారి ఎక్సోమార్స్ రోవర్, మార్చి 2021(ఇప్పుడిది 2022 కి మార్చారు) లో రెడ్ ప్లానెట్లోకి అడుగుపెట్టనుంది. బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త రోసలిండ్ ఫ్రాంక్లిన్ గౌరవార్థంరోసలిండ్గా పిలువబడే రోవర్ రెడ్ ప్లానెట్నమూనాలను తీసుకోవడానికి ఆరున్నర అడుగుల రెడ్ ప్లానెట్ భూమిలోకి రంధ్రం చేస్తుంది.

                                                                                       ఎక్సోమార్స్ రోవర్

రెడ్ ప్లానెట్‌  భూమి యొక్క ఆరడుగుల లోతులో ఉన్న మట్టిని రోవర్లోని ఎపర్చరు ద్వారా మొబైల్ ప్రయోగశాలలోకి పంపిస్తుంది, అక్కడ వాటిని చూర్ణం చేసి సేంద్రియ పదార్థాల కోసం పరీక్షిస్తారు. జీవితం యొక్క ధృవీకరణ ల్యాండింగ్ అయిన కొన్ని వారాలలో లేదా నెలల్లోనే రావచ్చు.

అదేవిధంగా నాసా యొక్క రోవర్ 'మార్స్2020' రెడ్ ప్లానెట్ఉపరితలంపై ఉన్న రాతి నిర్మాణాలలోకి రంధ్రం చేసి, ఆపై నమూనాలను పరీక్ష-గొట్టాలలో వదిలివేస్తుంది, తరువాత వాటిని సేకరించి పరీక్ష కోసం తిరిగి భూమికి పంపుతుంది, అంగారక గ్రహం నుండి పదార్థం తిరిగి తీసుకురావడం ఇదే మొదటిసారి.

శాస్త్రవేత్తలు ముఖ్యంగా 300 ఖనిజాల కోసం వెతుకుతారు, ఇవి జీవం ద్వారా మాత్రమే తయారు చేయబడతాయి.

రోవర్లు , అంగారక గ్రహం లో పురాతనకాలంలో ఉన్నటువంటి మహాసముద్రం ఉన్న ప్రదేశానికి సమీపంలో వెతుకుతాయి, ఇక్కడ జీవం బిలియన్ల సంవత్సరాల క్రితం జీవించి ఉండవచ్చు. అప్పుడు ఎర్ర గ్రహం భూమిలాగానీలంగా ఉండేది.

"నేను మిషన్ల గురించి ఎక్కువ సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాటికి జీవితాన్ని కనుగొనే అవకాశం ఉంది. అవి నిజంగా కనుగొంటాయి, అవి కనుక్కోవాలని నేను వాటిని కోరుకుంటున్నాను" అని ఆయన చెప్పారు.

ఇంతవరకు ఇంత లోతుగా ఎప్పుడూ రంధ్రం చేయలేదు. వాతావరణాలు మారినప్పుడు తీవ్రమైన జీవం. రాళ్ళలోకి కదులుతుంది.

"మేము 90 లలో మొదట ఆస్ట్రోబయాలజీ రంగాన్ని ప్రారంభించినప్పుడు మేము జీవం కోసం వెతకడం ప్రారంభించాము. మేము భూమికి రెండు మైళ్ళ లోతులో ఉన్న గనులలోకి వెళ్ళాము. అక్కడ జీవం నిండి ఉన్నది.

మేము న్యూక్లియర్ (అణు) మురికి గుంటలలోకి వెళ్ళాము, అక్కడ ఏదీ మనుగడ సాగించలేదని మీరు అనుకునే ప్రదేశాలలోకి వెళ్ళాము. కానీ   అక్కడ జీవం నిండి ఉన్నది. అంతేకాదు బాటమ్ లైన్ నీరు ఉన్న చోట కూడా జీవితం ఉంది.

"వాస్తవానికి, క్రస్ట్లో చాలా నీరు ఉన్నందున, సముద్రంలోని జీవంతో సహా భూమి యొక్క ఉపరితలంలో కంటే మన అడుగుల క్రింద ఎక్కువ జీవం ఉందని ఇప్పుడు మనకు తెలుసు."

38 సంవత్సరాలు నాసాలో పనిచేసిన డాక్టర్ గ్రీన్, ఇతర గ్రహాలపై చిన్న జీవులతో పాటు, శనిగ్రహం యొక్క చంద్రుడు టైటాన్పై కూడావిచిత్రమైన జీవితంఉండవచ్చు. నక్షత్ర మండలంలో లో కూడా నాగరికతలు ఉన్నాయి. దానికొసం మనమేమీ గెలాక్సీ లో ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు.

జనావాసాలకు నివాసయోగ్యం కావని శాస్త్రవేత్తలు భావించిన సౌర వ్యవస్థల్లోని కొన్ని ప్రాంతాలు ఒకప్పుడు ద్రవ నీటిని కలిగి ఉండవచ్చని ఇటీవలి పరిశోధనలో తేలింది.

మరెక్కడా నాగరికతలు లేవని అనుకోవటానికి ఎటువంటి కారణం లేదు, ఎందుకంటే మేము అన్ని చోట్ల ఎక్స్ప్లానెట్లను కనుగొంటున్నాము. గెలాక్సీలో నక్షత్రాల కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నాయని కెప్లర్ పరిశీలనల నుండి మనకు ఇప్పుడు తెలుస్తున్నది" అని ఆయన చెప్పారు.

కొన్ని రోజులు ఆగండి....అన్యగ్రహ మనుష్యులను చూద్దాం.

ఇవి కూడా చదవండి:

ప్రేమించుకోవచ్చు!(కథ)

లక్కీ క్యాట్ గుడి(ఆసక్తి)

 Image Credits: to those who took the original photos.

**************************************************************************************************************కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి