7, డిసెంబర్ 2020, సోమవారం

కనిపించి అద్రృశ్యమైన ఏకశిలా స్తంభం...(మిస్టరీ & న్యూస్)

 

                                                           కనిపించి అద్రృశ్యమైన ఏకశిలా స్తంభం                                                                                                                                                      (మిస్టరీ & న్యూస్)

ఇదేదో పురాతణ మర్మ పురాణం కాదు... మధ్య, అంటే నవంబర్ 18, 2020 అమెరికా దేశంలోని ఉటా ఎడారిలో అకస్మాత్తుగా కనబడింది, అదృశ్యమైంది తిరిగి మరో దేశంలో కనిపించింది.

                                     ఉటా ఎడారిలో నవంబర్ – 2020 లో  ప్రత్యక్షమైన ఏకశిలా స్తంభం

అమెరికాలోని ఉటా ఎడారిలో కొద్ది రోజుల కిందట ఒక ఏకశిలా స్తంభం ప్రత్యక్షమైంది. అనుకోకుండా కనిపించిన లోహ స్తంభం ఇక్కడికి ఎప్పుడు ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. ఇదంతా తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది.

ఈశాన్య ఉటాలో మారుమూల ప్రాంతంలో కొండ గొర్రెలను లెక్కించుతున్న వన్యప్రాణి విభాగం అధికారులు అసాధారణ లోహ శిలను గుర్తించారు. లోహంతో చేసిన శిల రెండు ఎర్ర రాతి గుట్టల మధ్య ఇసుకలో నాటి ఉంది. దాదాపు 10 - 12 అడుగుల పొడవున్న ఏకశిలను అక్కడ ఎవరు, ఎప్పుడు నాటారనేది అంతుచిక్కలేదు.

"నేను ఎన్నో ఏళ్లుగా ప్రాంతం పైనుంచే ప్రయాణిస్తున్నా, ఇప్పటి వరకూ అలాంటి వింత వస్తువును చూడలేదు. పెద్ద కొమ్ముల గొర్రెలను హెలికాప్టర్లో నుంచి లెక్కెస్తున్న జీవశాస్త్రవేత్తలు ఆకాశంలో నుంచే దానిని మొదట చూశారు" అని హెలికాప్టర్ పైలెట్ బ్రెట్ హచింగ్స్ కేఎస్ఎల్ టీవీకి చెప్పారు....."వాళ్లు నాతో హెలికాప్టర్ ను వెనక్కు తిప్పమన్నారు. నేను ఎందుకు అని అడిగా. అక్కడ మాకు ఒకటి కనిపించింది, దాన్ని చూడాలి అన్నారని ఆయన చెప్పారు. దాన్ని అక్కడ ఎవరు పెట్టారో తెలియదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు.

ఈలోహ స్థంబాన్ని అక్కడ ఎవరైనా పాతాలంటే కనీసం నలుగురు మనుషులు, ట్రక్కులు, క్రేన్ లు పలురోజులు కావాలి. ఇలా ఒకరోజులో స్తంభం అక్కడ ప్రత్యక్షమవటం చూసి అక్కడి స్థానిక అధికారులు, బయటపడిన వార్త చదివిన వాళ్ళూ ఆశ్చర్యపోయారు  

అది అంతరిక్షం నుంచి అక్కడ పడిందని కొంతమంది, ఇది గ్రహాంతర వాసుల పనే అని మరికొంతమంది వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు ప్రపంచం అంతా కోవిడ్-19 మహమ్మారి గుప్పిట్లో ఉన్న 2020 సంవత్సరంలో ఇలాంటి వింత వస్తువులు బయట పడటం చెడుకు సూచనగా కనిపిస్తుందని సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు.

                                    ఉటా ఎడారిలో ఏకశిల స్తంభం అదృశ్యమైన చోటు ఇప్పటి పరిస్థితి 

అయితే... గత వారం ఉటా ఎడారిలో కనుగొన్న అంతుచిక్కని ఏకశిల స్తంభం ఇప్పుడు(వారం రోజుల తరువాత) అదృశ్యమైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. అది ఉన్న చోట ఇప్పుడు ఒక రాళ్ల కుప్ప, చిన్న లోహపు ముక్క మాత్రమే మిగిలాయి

                అదృశ్యమైనట్లు చెప్పిన ఇరవై నాలుగు గంటలలో రొమేనియాలో కనిపించిన ఏకశిలా స్తంభం

అదృశ్యమైనట్లు చెప్పిన ఇరవై నాలుగు గంటలలో అదేలాంటి ఏకశిల స్తంభం యూరప్లోని రొమానియాలో ప్రాచీన కట్టడాలు ఉన్న ప్రాంతంలో కనిపించడం విస్మయానికి గురిచేస్తోంది. రొమేనియాలోని పురాతన కట్టడమైన పెట్రోడోవా డేసియన్కోట నుంచి కొన్ని మీటర్ల దూరంలో త్రిభుజాకార లోహ స్తంభాన్ని కనుగొన్నారు. అది అమెరికాలోని యుటాలో కనిపించిన ఏకశిలను మాదిరిగా ఉండటం గమనార్హం.

ఇది ప్రస్తుతం ప్రపంచ పరిశోధకులను కలవరపడేలా చేసింది. అసలు ఇది ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు వారు పరిశోధనలు ప్రారంభించారు.

అమెరికా దేశంలో కనిపించి, అదృశ్యమైన ఏకశిల స్తంభం గురించి ఏదైనా ఆచూకీ,చిట్కా, సంకేతం, ఇచ్చేవారికి..7 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించింది ఒక అంతర్జాల పత్రిక.

Images Credit: To those who took the original photos.

ఇవి కూడా చదవండి:

ఈ సంవత్సరం చివరిలో కరోనాకు తాత్కాలిక వాక్సిన్?(ఆసక్తి)

స్నేహితురాలు(కథ)

************************************************************************************************




26 కామెంట్‌లు:

  1. ఇన్నిసార్లు కనబడి మాయమయిపోతోందంటే ఇది ఖచ్చితంగా మనుషుల పనే. గ్రహాంతర జీవుల పని మాత్రం కాదు.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు. ఆ వీడియో అడ్రెస్స్ నాకు షేర్ చేయండి. దాన్ని చూసి నా ప్రత్యుత్తరాన్ని పోస్ట్ చేస్తాను.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    4. @Narayana

      అది మాయమైన న్యూస్ ప్రచురించిన పేపర్లే, ఎవరు తీశారో కుడా రాశాయి. మీకు ఆ తేదీ గుర్తుంటే ఒక్కసారి రిఫర్ చెయ్యండి.

      తొలగించండి
    5. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    6. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    7. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    8. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    9. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    10. https://m.sakshi.com/amp/telugu-news/international/another-metal-monolith-found-romania-1330700


      ఉటా ఎడారిలో నుంచి దాన్ని తొలగించింది మేమే


      ఇక ఉటా ఎడారిలో కనిపంచిన లోహపు దిమ్మెను ఎవరు తొలగించారనే దానికి సమాధానం లభించింది. అయితే దాన్ని తొలగించింది ఏలియన్స్‌ మాత్రం కాదు. నలుగురు వ్యక్తులు దాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని రాస్‌ బెర్నార్డ్స్‌ అనే ఫోటోగ్రాఫర్‌ తెలిపారు. ఎడారిలో ఉన్న లోహపు దిమ్మెని ఫోటో తీయడానికి వెళ్లినప్పుడు నలుగురు వ్యక్తులు దాన్ని తొలగించడం తన కెమరా కంటికి చిక్కిందని తెలిపాడు. అంతేకాక వారి ఫోటోలను తన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు బెర్నార్డ్స్‌. మంగళవారం తరువాత, 34 ఏళ్ల స్లాక్‌లైన్ ప్రదర్శనకారుడు, సాహస క్రీడాకారుడు ఆండీ లూయిస్ ‘మేము ఉటా ఎడారిలో కనిపించిన లోహపు దిమ్మెని తొలగించాం’ అంటూ ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.

      తొలగించండి
    11. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    13. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    14. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    15. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    16. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    17. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
  3. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. Chiru Dreams గారికీ & hari.S.babu గారికీ
    దయచేసి మీ ఆర్గ్యూమెంట్ ను మరియు డిఫ్ఫెరెన్సె ఆఫ్ ఒపీనియన్స్ ని నా బ్లాగు పొస్టులో కామెంట్ రూపంలో పెట్టవద్దని కోరుతున్నాను. మీ కామెంట్స్ పోటీ ఆగిపొతుందని ఎదురు చూశాను. కానీ ఆగటం లేదు. అందుకనే మీ కమెంట్లను తొలగిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు ఏదైనా కామెంటును డిలీట్ చేసినప్పుడు బ్లాగరు వాడు శాశ్వతంగా తొలగించాలా అని ఒక ఆప్షన్ ఇస్తాడు - దానిని టిక్ చేస్తే "ఈ వ్యాఖ్యను బ్లాగు నిర్వాహకులు తీసివేసారు" అని కాక, మొత్తం వ్యాఖ్య స్పేస్ అంతా డిలీట్ ఐపోతుంది. ఇది చాలా మంచి ఆప్షన్. గమనించగలరు.

      తొలగించండి
    2. Thanks for removing the trolling comments and maintaining balance and equality between us.

      But you did an injustice to me by removing my comments which are related to the topic and had serious content.

      If he didn't provoke me in his trolling comment in which he reasoned that I am crying over something and he is consoling me why should I write all those silly comments? I sincerely accept my comments are silly and I sincerely request you to accept my apologies for your inconvenience!

      But, you have to accept the fact that I did not do it myself. And in my other comments I put some valuable questions.Why you deleted them also?

      తొలగించండి
    3. Are you providing oregov srichakra Google earth link or not?

      తొలగించండి
  5. నారాయణ గారికి నమస్కారం!

    మీరు ఇంగ్లీషులో నేను ఈటాపిక్ గురించి వేసిన ప్రశ్నలు తియ్యకుండా ఉండాల్సింది.అలా తియ్యడం వల్ల మళ్ళీ గుర్తు చెసుకుని ముందువెనకలు సరి చూసుకోవటం లాంటి చాలా కష్టాలు పడ్డాను.ఇప్పుడు వచ్చిన కొత్త అనుమానం స్తంభాన్ని తీశాం అని చెప్పినవాళ్ళ నెరేషన్ ఏంటి?అందులో ఏమైనా కొత్త క్లూలు దొరకవచ్చు.

    మొదట మీరు యుటా ఎడారిలో కనపడిన స్తంభం గురించి వ్రాసిన విషయం గురించి మీ పోష్టులో చూపించిన బొమ్మలు లాంగ్ షాట్ కావడంతో నాకు అర్ధం కాలేదు.కానీ, మీరు చూపించిన పిక్చర్లని మ్యాగ్నిఫై చేసి చూశాను.అవి చూశాక అది మొత్తం పనీగ్ట్టుకుని క్రియేట్ చేసిన హోక్ష్ అనిపిస్తుంది నాకు.మీరు అది మహత్యం అని గానీ మరొక రకమైన మిస్టరీ అని గానీ మీరు అనుకుంటున్నారా?

    మ్యాగ్నిఫై చేసి చూస్తే నాకు వచ్చిన అనుమానాలు ఇవి
    1.ఎడారి అంటే ఇసక ఉంటుంది లేదా పొడిమట్టి గానీ ఉంటుంది.చుట్టూ రాళ్ళు కనిపిస్తున్నాయి గాబట్టి కింద ఉన్నది కూడా రాళ్ళనేల అయ్యే అవకాశం ఉంది.రాళ్ళనేల అయితే మిస్టరీ కింద తీసుకుని పైనించి దభీమని పడిందని అనుకుంటే రాళ్ళు పగిలి విచ్చుకున్న నెర్రెలు కనపడాలి.పోనీ మనుషులు చేస్తే రాళ్ళని తొలిచిన ఆనవాళ్ళు కనపడాలి.అవేవీ లేవు.ఒకవేళ పొడి ఇసక అయినా కొంచెం తడి ఉన్న మట్టి అయినా నేల పైన అంత ఎత్తున కనపడుతున్న అంత బరువైన స్తంభం అలా నిలబడి ఉండాలంటే పైనించి పడితే అదురు వల్ల మట్టీ ఇసకా చెదురుతుంది.ఆ ఆనవాళ్ళు లేవు.మనుషులు చేస్తే చాలా లోతు గుంట తవ్వాలి.పూర్తి ఇసక అయితే ఎంతో కొంత నీళ్ళు పొయ్యందే స్తంభం అలా నిలబడే అవకాశం తక్కువ.పైన ఉన్న పొడుగును బట్టి నేలలోపల ఉండాల్సిన పొడుగును బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుభవం ఉన్న ఏ తాపీ మేస్త్రీ అయినా చెప్పగలడు - ఉజాయింపుగానైనా సరే!

    గుంట తవ్వి అందులో సంభం చుట్టూ మట్టి గానీ ఇసక గానీ కూరిన ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు.ఒక ప్లాస్టిక్ బొమ్మని డ్రాయింగ్ టేబుల్ మీద ఆనించినట్టు ఉంది.ఇసక కావచ్చు,మట్టి కావచ్చు,మనవైపున ఉన్న భుజం యొక్క అడుగు భాగాన్ని ఒక జానెడు మేర మాత్రం కప్పేసింది,అంతే!

    2.రెండో బొమ్మ అయితే మధ్యలో ఇదివరకు అది తవ్వి నిలబెట్టారని చెప్తున్న చోట ఒక రాతి నలుపలకల శంకువును నిలబెట్టి మనబోటివాళ్ళు ఎంత మ్యాగ్నిఫై చేసినా ఏమీ తెలియకుండా ఉండటానికా అన్నట్టు రాళ్ళు పేర్చారు.

    కాబట్టి అసలు అది ఫోకస్ కోసమో మరి దేనికోసమే కొందరు చేసిన హడావిడి తప్ప "అంత బరువైన లోహస్తంభం ఎవరికీ తెలియని చోట నిలబడి ఉండటం,జనాలు క్యూరియాసిటీ చూపించి వెళ్ళి తేల్చుకుందామనేలోపు అది అక్కడ మాయమై ఇంకోచోట కనపడటం,ఈలొపు కొందరు ఆ స్తంభాన్ని మేమే తీశామని మీడియా ముందుకు రావటం" అనే మొత్తం ఎపిసోడ్ మిస్టరీ కాదని అనిపిస్తుంది నాకు.

    మరి, మీకేం అనిపిస్తుంది?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. hari.S.babu గారికి నమస్కారం.

      లొహ స్తంభం ఎలా వచ్చింది, ఎవరు పెట్టారూ, స్తంభం పైన ఏం రాసుంది అనే అన్వేషణ మన పని కాదు సార్. ఫోటోలు చూసి మనం ఏమీ కనిపెట్టలేము. ఆ స్తంభం కనిపించిన దేశాలలోని అధికారులు ఆ విషయాన్ని బయటపెట్టాలి. మన వరకు ఇది ఒక న్యూస్ మాత్రమే. ఇది న్యూస్ ఎందుకు అయ్యింది అంటే పది రోజుల గ్యాపులో ఈ (అంటే ఇలాంటి లోహ స్తంభం) లోహ స్తంభం 3 దేశాలలో కనిపించి అదృశ్యమవటమే కారణం. మొదట అమెరికాలో, రెండవది రుమేనియాలో, మూడవది బ్రిటన్ లో. అన్ని అంతర్జాతీయ పత్రికలూ దీన్ని ఒక మిస్టరీ గానే చెబుతున్నాయి. మనం కూడా అంతవరకే చూద్దాం. ఈ స్తంభం గురించిన వివరాలు ఆ దేశ ప్రభుత్వాలు బయట పెట్టినప్పుడు మనం కూడా తెలుసుకుందాం. అంతవరకు ఈ న్యూస్ మిస్టరీనే.

      ఇంతకంటే ఈ పోస్టు గురించిన చర్చ అవసరం లేదని భావిస్తున్నాను.

      తొలగించండి