30, అక్టోబర్ 2019, బుధవారం

కదిలే అలలపై--కదలని విమానాశ్రయం (ఆసక్తి)
                                    కదిలే అలలపై--కదలని విమానాశ్రయం


ఒసాకా బేలో కృతిమంగా రూపొందించిన ద్వీపంలో దీన్ని నిర్మించారు. 1987 లో నిర్మాణం ప్రారంభించి 1994 లో పూర్తి చేశారు. తొలుతు నాలుగు కిలోమీటర్ల పొడవు, రెండున్నర కిలోమీటర్ల వెడల్పుతో ద్వీపం నిర్మించారు. ముందుగా ఈ మేరకు కాంక్రీట్ తో సముద్రంలో గోడ కట్టారు. తరువాత అందులో సముద్ర మట్టం నుంచి 30 మీటర్ల ఎత్తు వరకు కొండ రాళ్ళు, మట్టి పోశారు. ఇందుకోసం ఏకంగా మూడు పర్వతాలను తవ్వేశారు. మొత్తం మ్మీద దాదాపు పదివేల మంది కార్మీకులు మూడేళ్ళ పాటు కష్టపడి ఈ ద్వీపాన్ని నిర్మించారు. అనంతరం దానిపై విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.
విమానాశ్రయం నుంచి భూభాగానికి చేరుకోవడం కోసం మూడు కిలోమీటర్ల పొడవున ఓ వంతెన కూడా నిర్మించారు. ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీకగా నిలిచిన ఈ ఏర్ పోర్ట్ 2001 లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నుంచి 'సివిల్ ఇంజనీరింగ్ మాన్యూమెంట్ ఆఫ్ ది మిలీనియం' అవార్డు కూడా పొందింది.
ఎక్కువ స్థలం అవసరమవుతుంది కాబట్టి, విమానాశ్రయాన్ని ఎప్పుడూ నగర శివార్లలోనే కడతారు. కానీ ఇది సముద్రపు నీటిలో కట్టిన ఓ అద్భుతమైన ఏర్ పోర్ట్. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. భూకంపాలనూ, సునామీలనూ కూడా ఇది తట్టుకోగలదు.

కాన్సాయ్ విమానాశ్రయ నిర్మాణం 1987 లో మొదలుపెట్టారు. దాదాపు పదివేలమంది, 80 పడవలు వాడబడ్డాయి. మూడేళ్ళపాటూ కష్టపడితే పూర్తయ్యింది. మిగతా పనులన్నీ పూర్తిచేసేందుకు నాలుగేళ్ళు పట్టింది. నిజానికి ఏర్ పోర్ట్ ఇటామి ప్రాంతంలో ఉండేది. అయితే వ్యాపార లావాదేవీల నిమిత్తం విమానాల రాకపోకల్ని మరింత పెంచాలనుకుంది అక్కడి ప్రభుత్వం. మొదట కాన్స్ రీజియన్ లోని, కొబె దగ్గర కొత్త ఏర్ పోర్ట్ కట్టేందుకు ప్లాన్ వేశారు. ఏర్ పోర్టును నిర్మించేందుకు ఆల్రెడీ ఉన్న నిర్మాణాలను తొలగించడానికి వీల్లేదని, పైగా ఇళ్ళు, ఆఫీసుల మధ్య విమానాశ్రయం ఉంటే విమానాల మోత భరించడం కష్టమని గొడవ పెట్టారు. ఒకవేల కట్టినా కూడా, దాన్ని ఎప్పటికీ విస్తరించడం వీలు కాదని కండిషన్ పెట్టారు. దాంతో సముద్రంలో కడితే ఎలా ఉంటుంది అన్న ఆలొచన వచ్చింది అధికారులకి. వెంటనే మొదలుపెట్టాశారు. సముద్ర జలాల్లో ఏర్ పోర్టును నిర్మించారు. సముద్రపు ఒడ్డు నుంచి ఏర్ పోర్టుకి వెళ్ళడానికి మూడు కిలోమీటర్ల పోడవైన బ్రిడ్జిని కూడా నిర్మించారు. జలాల మీద నిర్మాణం అంత తేలిక కాదు. ఏర్ పోర్టు అంటే మరీ కష్టం. అయినా వారు సాధించారు. ఇప్పుడది ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది.
జనవరి 17, 1995 లో జపాన్ లో కోబేను భూకంపం తాకింది. ఈ భూకంప ఎపి సెంటర్ విమానాశ్రయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. ఈ భూకంపంలో 6,434 మంది చనిపోయారు. కానీ విమానాశ్రయానికి గానీ, ఆ టైములో అక్కడున్న పర్యాటకులకు గానీ, విమానాలకు గానీ, ఉద్యోగులకు గానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారణం ఆ విమానాశ్రయం భూకంప నిరోధక శక్తితో నిర్మించబడింది.. కనీసం విమానాశ్రయ అద్దాల కిటికీలకు కూడా చిన్న గీటు పడలేదు. అలాగే 1998లో 200 కిలోమీటర్ల వేగంతో ఎగిసిపడిన టైఫూన్ (పెను తుపాను) వలన కూడా విమానాశ్రయానికి ఏటువంటి హానీ జరగలేదు.పెద్ద పెద్ద కొండ రాళ్ళను సముద్రంలో పడేయటం వలన ఆ ద్వీపం ఆ బరువుకు కనీసం 19 అడుగులైనా కిందకు వెడుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు ఆ విమానాశ్రయ ద్వీపం 27 అడుగులు కిందకు వెళ్ళింది. ఇది అనుకున్న దానికంటే ఎక్కువే. అయితే ముందే విమానాశ్రయ ద్వీపమును బాగా ఎత్తుకు కట్టినందువలన ఈ విమానాశ్రయం ఇంకా ఎటువంటి ప్రమాదానికీ గురి అవలేదు. ఇంజనీర్ల లెక్క ప్రకారం ఈ విమానాశ్రయ ద్వీపం ఇంతకంటే కిందకు వెళ్ళే చాన్సే లేదని తేల్చి చెప్పారు. ఈ విమానాశ్రయం కట్టటానికి మొత్తం ఇప్పటి వరకు (2008 వరకు మెయింటనన్స్ తో కలిపి) 20 బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టారు. ఇందులో ఎక్కువ మొత్తం విమానాశ్రయ కుంగుకు ఖర్చు పెట్టారు. మొదట, అంటే 1994లో సంవత్సరానికి 20 ఇంచులు కిందకు కుంగిపోయిన ఈ విమానాశ్రయం 2008కి 7 ఇంచులకు తగ్గింది.2014 లో వారానికి 960 విమానాల రాకపోకలు కలిగిన ఈ విమానాశ్రయాన్ని అమెరికన్ ఇంజనీరింగ్ సొసైటీ అయితే, 'సివిల్ ఇంజనీరింగ్ మాన్యూ మెంట్ ఆఫ్ ది మిలీనియం' అంటూ దీన్ని కొనియాడుతోంది.

Images Credit: to those who took the original photos.

***************************************సమాప్తం********************************

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి