వైరస్లను మనిషి తయారు చేయగలడా?
(మిస్టరీ)
పరిచయం:
వైరస్ అనేది జీవజాలంపై దాడి చేసే అతిసూక్ష్మమైన కణం. అంటువ్యాధిని వ్యాపింపజేసే ప్రతినిధి. దీని రూపం ఒక జీవి యొక్క జీవ కణాల లోపల ఉన్న పధార్దానికి ప్రతిరూపం. వైరస్ అంటే టాక్సిన్ లేదా విషం అని అర్థం. వైరస్‌లు చాలా రకాల జీవులపై దాడి చేయగలవు. బాక్టీరియా, జంతురాజ్యం, వృక్షరాజ్యంతో పాటు శిలీంధ్రాలు, ప్రొటిస్టాకి చెందిన జీవులు, ఆర్కియాతో సహా సూక్ష్మజీవుల వరకు అన్ని రకాల జీవన రూపాలకు సోకుతాయి. వైరస్‌లు ఇతర జీవుల కణాలపై దాడిచేసి వ్యాధులను కలుగజేస్తాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశం వైరస్‌ల సంతతిని పెంచుకోవడంతో ముడిపడి ఉంటుంది. వైరస్‌లు వాటంతట అవి విభజన చెందలేవు. విభజన చెందాలంటే వేరే జీవకణం తప్పనిసరి. వైరస్లు హోస్ట్ కణాలలోకి ప్రవేశిస్తాయి. హోస్ట్ కణాల ఎంజైములను, మరియు పదార్థాలను హైజాక్ చేసి తమలాంటి వైరస్ లను తయారుచేసుకుంటాయి. వైరస్‌లలో అతి సరళమైన జన్యుపదార్థం ఒక రక్షణ కవచంచే సంరక్షించబడుతూ ఉంటుంది. ఈ రక్షణ కవచం ప్రోటీనులతో చేయబడి ఉంటుంది, దీనిని క్యాప్సిడ్ అంటారు.
జీవిత పరిణామ చరిత్రలో వైరస్ల యొక్క మూలాలు అస్పష్టంగా ఉన్నాయి: కొన్ని ప్లాస్మిడ్ల నుండి-కణాల మధ్య కదలగల DNA ముక్కల నుండి ఉద్భవించి ఉండవచ్చు, మరికొన్ని బ్యాక్టీరియా నుండి ఉద్భవించి ఉండవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి