6, జూన్ 2020, శనివారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-15
                                       గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                        (PART-15)"మొదటి పనిగా విజయవాడ కలెక్టర్ కు విషయం చెబుతాను. ఎందుకంటే...ఆయన నాకు బాగా తెలుసు. తరువాత ఆయన ఏం చేయదలుచుకున్నారో చేయని. మనం ఇప్పుడు ఈ సర్పంచ్ చేతులకు దొరకకుండా తప్పించుకోవటంలోనే మన తెలివితేటలు ఉన్నాయి"

"అయితే రా...కారులోకి ఎక్కి వేగంగా వెళ్ళిపోదాం"

“పోరా మూర్ఖుడా...ఆ సర్పంచ్ కళ్ళు ఇప్పుడు మన కారుపైనే పడుంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఇంటిలోపలకు దూరామో...అప్పుడే అతనికి వార్త వెళ్ళుంటుంది. అందువల్ల మనం వెనుక దోవ నుండి వెడదాం. ఇలా వెడితే ఎక్కడికి వెడుతుంది?"

"వెనుక వైపు పొలాలు. పక్క దారిలో వెడితే మనం ఈ ఊరులోకి వచ్చిన రోడ్డును అందుకోవచ్చు..."

"అయితే రా...పరిగెత్తుదాం"

“ఉండు...మొదట కలెక్టర్ కు ఫోన్ చేసేస్తాను"

వీరబద్రం ఫోన్ లో నెంబర్లు నొక్కుతున్నప్పుడు...అతని మణికట్టుపైన ఎక్కడ్నుంచో ఎగురుకుంటూ వచ్చిన ఒక అంగుళం పొడవున్న సూది గుచ్చుకుంది. ఆ వేగంలో సెల్ ఫోన్ కింద పడిపోయింది. దాన్ని వీరబద్రం తీసుకునేలోపు పక్కనున్న పొదలలో నుండి నలుగురు మనుషులు వచ్చారు.

అందులో ఒకడి చేతిలో నోటితో ఊదే సూది ఆయుధం ఉన్నది. అది పెట్టుకునే అతను వీరబద్రం మణికట్టు పైకి సూదిని వేసుంటాడు.

వీరబద్రం ఆ సూదిని తీస్తున్నప్పుడు కళ్ళు బైర్లు కమ్మి పడిపోయాడు. ఆ సూదిలో ఉన్న మత్తుమందు వలనే అలా జరిగింది!

కోపంతో చూసిన కార్తిక్ భుజాల మీద కూడా సూది గుచ్చుకుంది. అతనూ కళ్ళు తిరిగి పడిపొయేడు.

ఇద్దర్నీ వాళ్ళు ఎత్తుకున్నారు. అలాగే వెనుక వైపుకు వెళ్ళారు. అంతకు ముందు ఆ నలుగురిలో ఒకతను తన సెల్ ఫోనులో ఒక మీట నొక్కగా గుర్రం వెడుతున్న శబ్ధం వినబడింది. డప్పుల శబ్ధమూ వినబడింది.

ఫోను స్పీకర్లలో దాన్ని అతిపెద్ద ధ్వనితో ప్రసారం చేసాడు. చుట్టుపక్కలున్న వాళ్ళు భయపడిపోవాలే?

అది అద్వాన్నమైన అడవి!

వీరబద్రం, కార్తిక్ ఒక చెట్టుకు కట్టబడున్నారు. ఇద్దరూ స్ప్రుహలోకి వచ్చారు.

చుట్టూ ఆ నలుగురు........

ఇంతలో కారు వస్తున్న శబ్ధం.

సర్పంచ్, అతని బావమరిది వచ్చారు.

సర్పంచ్ ఒక సాలువాతో తలను కప్పుకున్నాడు.

వాళ్ళ దగ్గరకు వచ్చిన తరువాత తీసేడు.

అతన్ని చూసిన వీరబద్రానికి కోపం వచ్చింది.

"ఏయ్ సర్పంచ్! నువ్వింత మోసగాడివని నేను అనుకోలేదు" అన్నాడు.

అప్పుడు సన్నని గాలి మొదలయ్యింది. చుట్టూ ఉన్న కలుపు మొక్కలు చిన్నగా ఊగటం మొదలుపెట్టినై.

"మామయ్యా...వదిల్తే న్యాయమూ, అన్యాయమూ అంటూ ప్రశంగం మొదలు పెడతాడు. వీళ్ళకు మన గురించి తెలిసిపోయింది.ఇద్దర్నీ చంపేసి ఆ ఇంట్లోనే పూడ్చి పెడితేనే మంచిది" అన్నాడు బావమరిది.

"అయితే అలాగే చేయండి" అంటూ...ఒకే వాక్యంలో వచ్చిన విషయం చెప్పి సర్పంచ్ వెనక్కి తిరిగాడు.

"సర్పంచ్...ఇది పెద్ద పాపం! మీరు మమ్మల్ని మాత్రమే మోసగించటం లేదు...ఆ దైవాన్ని కూడా మోసగిస్తున్నారు?.....అరిచాడు కార్తిక్.

ఆ పరిస్థితులలోనూ నవ్వాడు వీరబద్రం.

"ఎలారా ఇలాంటి పరిస్థితులలోనూ నువ్వు నవ్వ గలుగుతున్నావు?" --వీరబద్రాన్ని అడిగాడు కార్తిక్.

"నవ్వకుండా ఏం చేయను...? ఈ మనిషి మనల్ని మోసం చేసేడని నువ్వు అన్నది సరి. దైవాన్ని కూడా అన్నావే...అందుకు. ఇంకా దైవం ఉన్నదని మాట్లాడుతున్నావే? ఆ దేవుడే ఉండుంటే మనల్ని ఇలాగా వదిలిపెట్టేవాడు?"

---అతని ప్రశ్న కార్తిక్ గుండెల్లో గుచ్చుకుంది. కళ్ళల్లో కన్నీరు ఉబికి వచ్చింది.

అప్పుడు గాలి వేగం ఎక్కువైంది. ఆకాశంలో వర్షం పడే సూచనలు కనిపించాయి. ఇంతలొ తుపాకి పేలిన శబ్ధం వినబడింది.

వాళ్ళ చూట్టూ ఉన్న ఆ నలుగురు, సర్పంచ్ బావమరిది, ఆ శబ్ధం విని ఆశ్చర్యపోయారు.

"మీరు వీళ్ళను చూస్తూ ఉండండి. నేను వెళ్ళి చూసొస్తాను" అని ఆ నలుగురుకీ చెప్పి తుపాకీ శబ్ధం వచ్చిన వైపుకు పరిగెత్తుకు వెళ్ళాడు సర్పంచ్ బావమరిది.

గాలి వేగం ఎక్కువయ్యింది. మళ్ళీ తుపాకీ పేలిన శబ్ధం వినబడింది.

ఆ నలుగురిలో ఒకడు శబ్ధం వచ్చిన వైపుకు పరిగెత్తాడు...కొంచం దూరంలో సర్పంచ్, అతని బావమరది కింద పడున్నారు.

వాళ్ళ శరీరం గిలగిల కొట్టుకుంటొంది.

అది చూసిన అతను తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు.

ఆందోళన పడుతూ విషయాన్ని తన అనుచరలతో చెప్పాడు.

"రేయ్...మన యజమానిని, ఆయన బావమరిదిని ఎవరో కాల్చేశారు. పోలీసులే మనల్ని చుట్టుముట్టి ఉంటారు లాగా కనబడుతోంది. రండిరా...పారిపోదాం".

అతను తన చేతులో ఉన్న తుపాకీని తన పంచ కట్టులోకి దోపి పరిగెత్తడం మొదలుపెట్టాడు. మిగిలిన అనుచరులు కూడా వాడి వెనుకే పరిగెత్తటం మొదలు పెట్టారు.

అందులో ఒకడు కార్తిక్ ను 'కాల్చి వెళ్ళిపోదాం' అన్నట్టు తుపాకీని అతనివైపు గురిపెట్టాడు. అప్పుడు ఎక్కడ్నుంచో వచ్చిన మరో తుపాకీ గుండు అతని గుండెను తాకింది.

కార్తిక్, వీరబద్రం బెదిరిపోయారు.

గాలివేగం పెరిగింది. గాలితో పాటూ దుమ్ము ధూళీ వాళ్ళున్న వైపుకు చుట్టుకుంటూ వచ్చి వాళ్ళను దాటుకుని వెళ్ళిపోయింది. గాలి మాత్రం తగ్గలేదు.

శబ్ధం తగ్గిన సమయంలో ఎదురుగా ఒక గుర్రం లాంటి జంతువును చూసిన కార్తిక్ కు వొళ్ళంతా జలదరించింది. వీరబద్రానికి...ఏదో జరుగబోతోందని అర్ధమయ్యింది. దానికి తగినట్లు గుర్రంపైన ఒకతను. పెద్ద మీసాలు. అతని చేతిలోనే పెద్ద తుపాకి.

ఆయన్ని చూసిన క్షణం...కార్తిక్ కు పాత జ్ఞాపకాలు.

పసి పిల్లాడుగా ఉండి తప్పిపోయినప్పుడు వచ్చిన అదే మనిషి.

"అయ్యా...మీరా?"

"నేనే! నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు వచ్చి కాపాడేను. ఇప్పుడూ వచ్చి కాపాడేను. ఎప్పుడు చూడూ ఇలా తప్పైన వాళ్ళ దగ్గర చిక్కుకుంటున్నావే?"

ఆయన సమాధానం కార్తిక్ ను ముగ్దపరిచింది.

వీరబద్రం కూడా అది చూసి భయపడిపోయి "అయ్యా...మీరెవరు?" అన్నాడు.

"వేటగాడిని...అలాగే కదా నువ్వు అనుకున్నావు!"

ఆ సమాధానం వీరబద్రం బుర్రలో బలంగా తగిలింది.

ఆయన సమాధానం చెబుతూనే వాళ్ళ కట్లు విప్పాడు. తరువాత.........

"నేను వేటగాడినే. ఈ రోజు ఒక్క మృగం కూడా దొరకలేదు. ఏమిట్రా ఇది అని విసుకున్నాను. అప్పుడే ఈ మానవ మృగాలు చిక్కుకున్నై. వీళ్ళు ఎక్కువగా ఆటలాడారు. మారుతారులే అని నేను ఎన్ని సంధర్భాలు ఇవ్వను?"---ఆయన అడిగిన విధం, నవ్విన విధం, చూసిన విధం అన్నీ అమానుషంగానే ఉన్నది.

"అయ్యా...నిజం చెప్పండి! మీరెవరు?"-- అడిగాడుకార్తిక్.

"అదే చెప్పేనే...వేటగాడినని"

"లేదు...మీరు గాలిదేవుడు..."

"అరే...నా పేరు సరిగ్గా చెప్పావే...!"

"కాదు మీరు గాలిదేవుడే..."

"నేను కాదనలేదే..."

"మీ సహాయాన్ని మరిచిపోలేము..."

"నేనేమీ మీకొసం చేయలేదు. మీ ఇంట్లో ఒక బామ్మ ఉంది చూడు...ఆమెకోసం చేశాను. ఇప్పుడు దార్లో కూడా చూశాను. 'వెళ్ళే దోవలో నా మనవుడూ, అతని స్నేహితుడూ మీ కళ్ళల్లో పడితే త్వరగా పంపించండి అని చెప్పింది. అందుకే వచ్చాను”

"బా...బా...బామ్మను చూసారా?"

"వెళ్ళి అడిగి తెలుసుకో...ఆ తరువాత ఎవరెవరికి వివరాలివ్వాలో ఇచ్చేయి. ఆ ఇంటిని శుభ్ర పరిచి ఎవరికైనా అమ్మేయి. వూరికే ఉంచితే ఇంతే. దొంగలు అక్కడ దాక్కుంటారు. దొంగలు ఎదగటానికి మనమే కారణంగా ఉంటున్నాము"

"మీరా ఇలా చెబుతున్నారు?"

"మరి...దేవుడా వచ్చి చెబుతాడు? నా లాంటి ఆసామే చెప్పగలడు. ఏమిటి...నేను చెప్పేది కరక్టే కదా?"

-----ఆ మనిషి మీసాలు తిప్పుకుంటూ, కళ్ళు ఆర్పుతూ, తిరిగి గుర్రం మీద ఎక్కాడు.

వీరబద్రాన్ని చూసి నవ్వుతూ..."నువ్వు చాలా తెలివిగలవాడివి...నీకు మెధస్సు ఎక్కువ. కానీ జ్ఞానం లేదు. ఇక మీదట నీకు జ్ఞానమూ దొరకటం ప్రారంభమవుతుందని నమ్ముతున్నాను" అంటూ బయలుదేరారు.

గుర్రం...కంటి చూపు నుండి కనుమరుగయ్యింది.

వీరబద్రానికి ఏమీ అర్ధం కాలేదు. తలను విధిలించాడు.

ఇద్దరూ నడిచారు.

ఆకాశం నుండి వర్షం చినుకులు మొదలయ్యాయి. గాలి బాగా వీసింది.

ఆ గాలే.

కార్తిక్ వరకు గాలిదేవుడు.

అతని స్నేహితుడు వీరబద్రానికి ఒక ధర్మదేవత కనబడ్డాడు!

                                                                                                            (సమాప్తం) ************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి