14, జూన్ 2020, ఆదివారం

వియత్నాం కరోనావైరస్ వ్యాప్తిని ఎలా ఆపగలిగింది?...(ఆసక్తి)




                        వియత్నాం కరోనావైరస్ వ్యాప్తిని ఎలా ఆపగలిగింది?     
                                                             (ఆసక్తి)



కరోనావైరస్ వ్యాప్తిని కట్టడించడంలో విజయవంతమైన ఉదాహరణల కోసం ప్రపంచం ఆసియా వైపు చూచినప్పుడు, దక్షిణ కొరియా, తైవాన్ మరియు హాంకాంగ్ లకు చాలా శ్రద్ధ మరియు ప్రశంసలు ఇవ్వబడ్డాయి.

కానీ, పట్టించుకోని విజయం కథ ఒకటుంది...అదే వియాత్నాం. 97 మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశం ఒక్క కరోనావైరస్ సంబంధిత మరణాన్ని ఇంతవరకు నివేదించలేదు. శనివారానికి(30/05/2020) కేవలం 328 కేసులు మాత్రమే నమోదయ్యాయి. చైనాతో సుదీర్ఘ సరిహద్దు ఉన్నప్పటికీ మరియు ప్రతి సంవత్సరం కోట్ల మంది చైనా సందర్శకులు వస్తున్నప్పటికీ...ఎలా కరొనా వైరస్ వ్యాప్తిని అంత విజయవంతంగా కట్టడి చేయగలిగింది?


మూడు వారాల దేశవ్యాప్త లాక్ డౌన్ తరువాత, వియత్నాం ఏప్రిల్ చివరిలో సామాజిక దూరం నియమాలను ఎత్తివేసింది. ఇది జరిగిన 40 రోజుల తరువాత కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా రిపోర్టు కాలేదు. వ్యాపారాలు మరియు పాఠశాలలు తిరిగి తెరవబడ్డాయి మరియు జీవితం క్రమంగా సాధారణ స్థితికి చేరుకున్నది.

కాబట్టి వియత్నాం ప్రపంచ ధోరణిని ఎలా దెబ్బతీసింది. కరోనావైరస్ యొక్క శాపం నుండి ఎలా తప్పించుకుంది? ప్రజారోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వియత్నాం ప్రభుత్వం వేగంగా, దాని వ్యాప్తిని నివారించడానికి ముందస్తుగానే ప్రతిస్పందించటం, కఠినమైన కాంటాక్ట్-ట్రేసింగ్, క్వారంటైన్ మరియు సమర్థవంతమైన ప్రజా సమాచార మార్పిడి వరకు రకరకాల కలయికలో ముందడుగు వేసింది.

ముందుగానే చర్యతీసుకోవటం:

వియత్నాం దేశ అధికారులు తమదేశంలో కరోనావైరస్ మొదటి కేసు కనుగొనబడటానికి కొన్ని వారాల ముందు నుంచే కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు మొదలుపెట్టింది.


ఆ సమయంలో, చైనా అధికారులు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండూ, కరొనావైరస్ మానవుల నుండి మానవునికి వ్యాపిస్తుందని చెప్పడానికి "స్పష్టమైన ఆధారాలు" లేవని పేర్కొన్నాయి. కానీ వియత్నాం వారి మాట వినలేదు, ఎటువంటి నిర్లక్ష్యమూ చూపలేదు.

"మేము WHO నుండి మార్గదర్శకాల కోసం ఎదురుచూడలేదు. మేము బయటి మరియు మాదేశం లోపలి నుండి డేటాను సేకరించి ముందుగానే చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నాము" అని వియత్నాం దేశంలోని హనాయ్ నగరంలో ఉన్న నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ పరిశుభ్రత మరియు ఎపిడెమియాలజీ లోని ఇన్ఫెక్షన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ హెడ్ ఫామ్ క్వాంగ్ థాయ్ చెప్పారు.

జనవరి ఆరంభం నాటికి, హనాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వుహాన్ నుండి వచ్చే ప్రయాణీకులకు ఉష్ణోగ్రత పరీక్షలు అప్పటికే ఉన్నాయి. జ్వరంతో దొరికిన ప్రయాణికులను క్వారంటైన్ చేసి నిశితంగా పరిశీలించబడ్డారని ఆ సమయంలో దేశ జాతీయ ప్రసారకర్త ప్రకటించింది.

జనవరి మధ్య నాటికి, ఉప ప్రధాన మంత్రి 'వు డక్ డ్యామ్' కరోనా వైరస్ వియత్నాంలోకి వ్యాపించకుండా నిరోధించడానికి "కఠినమైన చర్యలు" తీసుకోవాలని ప్రభుత్వ సంస్థలను ఆదేశించేరు. సరిహద్దు ద్వారాలు, విమానాశ్రయాలు మరియు నౌకాశ్రయాల వద్ద వైద్య నిర్బంధాన్ని బలోపేతం చేశారు.

జనవరి 23 న, వియత్నాం తన మొదటి రెండు కరోనావైరస్ కేసులను ధృవీకరించింది - వియత్నాంలో నివసిస్తున్న ఒక చైనీస్ జాతీయుడు మరియు అతని తండ్రి. తన కుమారుడిని చూడటానికి వుహాన్ నుండి ప్రయాణించి వచ్చారు. మరుసటి రోజునే, వియత్నాం విమానయాన అధికారులు వుహాన్ నుండి వచ్చే విమానాలను మరియు వియత్నాం నుండి వుహాన్ కు బయలుదేరే అన్ని విమానాలను రద్దు చేశారు.


వియత్నాం దేశం నూతన సంవత్సర సెలవుదినాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఆ దేశ ప్రధాన మంత్రి 'న్గుయెన్ జువాన్' కరోనావైరస్ పై యుద్ధం ప్రకటించారు. "ఈ అంటువ్యాధితో పోరాడటం శత్రువుతో పోరాడటం లాంటిది" అని జనవరి 27 న జరిగిన అత్యవసర కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో ఆయన అన్నారు. మూడు రోజుల తరువాత, వ్యాప్తిని నియంత్రించడానికి జాతీయ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు - అదే రోజు WHO కరోనావైరస్ను 'కరోనా వైరస్ అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి' అని బహిరంగంగా ప్రకటించింది..

ఫిబ్రవరి 1 న, వియత్నాం కరోనా వైరస్ను జాతీయ అంటువ్యాధిగా ప్రకటించింది - దేశవ్యాప్తంగా కేవలం ఆరు కేసులు నమోదయ్యాయి. వియత్నాం మరియు చైనా మధ్య అన్ని విమానాలు నిలిపివేయబడ్డాయి. తరువాత రోజు చైనా పౌరులకు వీసాలు ఇవ్వటం నిలిపివేయబడ్డాయి.

కరోనావైరస్ చైనాను దాటి దక్షిణ కొరియా, ఇరాన్ మరియు ఇటలీ వంటి దేశాలకు వ్యాపించడంతో ఆ నెలలో, అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు, రాక నిర్బంధాలు మరియు వీసా సస్పెన్షన్లు విస్తరించారు. మార్చి నెల చివరిలో విదేశీయులందరికీ ప్రవేశాన్ని వియత్నాం నిలిపివేసింది.


వియత్నాం చురుకుగా లాక్ డౌన్ చర్యలను తీసుకుంది. ఫిబ్రవరి 12 న, ఏడు కరోనావైరస్ కేసులపై 20 రోజుల పాటు హనోయికి ఉత్తరాన 10,000 మంది ఉన్న మొత్తం గ్రామీణ సమాజాన్ని లాక్ చేసింది - ఇది చైనా వెలుపల మొట్ట మొదటి పెద్ద-స్థాయి లాక్ డౌన్.

నూతన సంవత్సర సెలవుదినం తరువాత ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభించాల్సిన పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలు మూసివేయబడాలని ఆదేశించబడ్డాయి మరియు మేనెలలో మాత్రమే తిరిగి ప్రారంభించబడ్డాయి.

జనవరి చివరిలో మరియు ఫిబ్రవరి ఆరంభంలోనే కరోనా వ్యాప్తిని కట్టడి చేయటానికి ఇతర దేశాల కంటే వియత్నాం వేగంగా చర్యలు తీసుకోవటం వలనే వారు(వియత్నాం) కరోనాపై జరిపిన యుద్దంలో గెలవగలిగారు. WHO ప్రకటనలకొసం ఎదురు చూడకుండా వారే మహమ్మారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. అందుకనే వియత్నాంలో మే నెల 30 వరకు కేవలం 328 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఒక్క మరణం కూడా లేదు. 'గ్రేట్'. 'హాట్స్ ఆఫ్ టు వియత్నాం'.

మరి ఇతరదేశలు ఎందుకు నిర్లక్ష్యం చేశాయి?

Image Credit: To those who took the original photo. ****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి