12, జనవరి 2021, మంగళవారం

'ట్రీ ఆఫ్ లైఫ్' 400 ఏళ్ళ అద్భుతం...(మిస్టరీ)

 

                                                                               'ట్రీ ఆఫ్ లైఫ్' 400 ఏళ్ళ అద్భుతం                                                                                                                                                                  (మిస్టరీ)

బహ్రెయిన్ దేశ ఎడారిలో ఉన్న విశేషమైన చెట్టును ఆంగ్లభాషలో 'ట్రీ ఆఫ్ లైఫ్' అని, అరబ్ భాషలో 'షజరాత్-ఆల్- హేయత్' అని అంటారు. 32 అడుగుల ఎత్తున్న జమ్మిచెట్టు జా నగరానికి 3.5 కిలోమీటర్ల దూరంలోనూ, ఆస్కార్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉన్నది.


పొడి
ఇసుకలో బ్రతకలేనటువంటి జమ్మిచెట్టు 400 సంవత్సరాలుగా అక్కడ బ్రతికి ఉందంటే అది ఎంత విశేషమో అర్ధం చేసుకోవచ్చు. 400 సంవత్సరాలుగా పొడి ఇసుక ఎడారిలో చెట్టు బ్రతికున్నది కాబట్టే ఇది ఒక అద్భుతం అయింది.


శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు ఫాబేసి కుటుంబానికి చెందినది. ఇలాంటి జమ్మి చెట్టు మీదే పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచారని చదువుకున్నాం.


జమ్మిచెట్టు సారహీనమైన, వర్షపాతమే లేని ప్రదేశాలలో కూడా పెరిగుతుంది. కానీ, పొడి ఇసుకలో బ్రతకలేదు. చెట్టు వేర్లు భూమి లోపల 50 మీటర్ల లోతుకు చొచ్చుకుపోతాయట. అంటే భూమి కింద నీటిమట్టం ఎంత దూరంలో ఉన్నదో అంత దూరం వరకు వెడతాయట. చెట్టు బ్రతికుండటానికి బహుశ ఇదే కారణమై ఉంటుందంటారు.


జమ్మి చెట్టును 1583 లో నాటారని, అది ఇప్పటి వరకు జీవించే ఉన్నందున చెట్టును ఒక విశేషమైన చెట్టుగా భావిస్తున్నారు. చెట్టు ఇప్పటికీ ఆరొగ్యంగా, తాజాగా పచ్చని ఆకులతో గంభీరంగా నిలబడి దూరంలో ఉన్న వారికి కూడా కనబడుతుంది.


చెట్టు స్థానికులకు పర్యాటక ఆకర్షణగా మారింది. కారణం ప్రదేశంలో ఇంతపెద్ద చెట్టు మరొకటి లేదు. సంవత్సరానికి 50 వేల మందికిపైగా చెట్టును చూడటానికి వస్తారట. అలా వచ్చినప్పుడు చెట్టు మీద బొమ్మలూ, రాతలతో చెట్టును పాడుచేయడం ఎక్కువ కావడంతో చెట్టు చుట్టూ ఇనుప కంచె అమర్చారు.

దిస్ ఇస్ ట్రీ ఆఫ్ లైఫ్.

************************************************************************************************

ఇవి కూడా చదవండి:

ప్రేమ సుడిగుండం(పూర్తి నవల)

కరోనా స్పై శాటిలైట్(ఆసక్తి)

********************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి