24, జనవరి 2021, ఆదివారం

మృత్యుదూత (క్రైమ్ సీరియల్)...PART-3

 

                                                                          మృత్యుదూత (క్రైమ్ సీరియల్)                                                                                                                                                                  (PART-3)

డా. గోపీనాద్, ఆపరేషన్ ధియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు నర్స్ లిజీ ఆందోళన పడుతూ ఎదురుచూస్తోంది.

సమయం ప్రొద్దున ఏడు గంటలు.

డాక్టర్! హీరోయిన్ రంజని మేనేజర్ మిమ్మల్ని అడిగి నాలుగైదు సార్లు ఫోన్ చేసారు. మీరు ఆపరేషన్ ధియేటర్ లో ఉన్నందువలన, మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యలేకపోయాను

విషయం ఏమిటని అడిగావా?”

అడిగాను డాక్టర్...పర్సనల్ అని చెప్పారు. మీ దగ్గరే మాట్లాడాలట

డా. గోపీనాద్ తన గది వైపు నడుస్తూనే ఆఫ్ చేసి పెట్టిన సెల్ ఫోన్ తీసుకుని ఆన్ చేసి, ఏవో నెంబర్లు నొక్కారు. అవతల సైడు రింగు వెళ్ళి, రిజీవర్ తీయబడింది.

హలో...

అవతల సైడు హీరోయిన్ రంజని మేనేజర్ గొంతు వినబడింది.

సారధి! నేను డాక్టర్ గోపీనాద్

డాక్టర్ మీ ఫోను కోసమే నేను కాచుకోనున్నాను

ఏమిటి విషయం చెప్పండి?”

మీరు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా?”

ఒక ముఖ్యమైన ఆపరేషన్ ను ఇప్పుడే ముగించి ధియేటర్ నుండి బయటకు వచ్చాను. ఇక సాయంత్రం ఆరుగంటల వరకు రెస్టే

నేను ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి రావచ్చా డాక్టర్

రండి! బై...ద...బై...ఎనీతింగ్ సీరియస్?”

అది సీరియస్సా...కాదా, అని మీరే చెప్పాలి డాక్టర్

ఏమిటి సారధి! మీరు మాట్లాడేది చూస్తుంటే రంజని గారికి ఏదైనా ఒంట్లో బాగుండలేదనుకుంటానే?”

ఒంట్లో బాగుండలేనిది రంజని గారికి కాదు డాక్టర్. నాకు. రంజని గారికి ఇప్పుడు ఊటీలో షూటింగ్. ఆవిడ అక్కడున్నారు. హైదరాబాద్ తిరిగి రావటానికి పదిహేను రోజులు పడుతుంది

మీకేమిటి ప్రాబ్లం?”

నేను నేరుగా వచ్చి చెబుతాను డాక్టర్

సారధి రీజీవర్ని పెట్టేయటంతో, డాక్టర్ గోపీనాద్ సెల్ ఫోన్ ఆఫ్ చేసి కోటు జేబులో పడేసుకుని తన గదిలోకి వెళ్ళి తిరిగే కుర్చీలో కూర్చుని వెనక్కి వాలేరు.

చిన్నగా ఆకలి వేస్తున్నట్టు అనిపించటంతో, బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని రెండు బిస్కెట్లు బయటకు తీసి, తిని, ఫ్లాస్కులో ఉన్న టీ ని గాజు గ్లాసులోకి పోసుకుని తాగారు. జూనియర్ డాక్టర్ ఒకాయనకు ఫోన్ చేసి, మరుసటి రోజు చెయ్యాల్సిన హార్ట్ సర్జరీ గురించి మాట్లాడేసి రిజీవర్ను పెట్టినప్పుడు తలుపు తోసుకుని సారధి లోపలకు వచ్చాడు.  

సారధి గారికి నలభై ఏళ్ళుంటాయి. కొంచం స్థూలకాయ శరీరం, చెవి కిందవరకు గిరదా, మీసాలలో కొంచం తెల్ల వెంట్రుకలు. బనియన్ వేసుకోని చొక్కాలొపల బంగారు గొలుసు తలతలమని మెరుస్తోంది. చొక్కా జేబులో ఫారిన్ సిగిరెట్టు పెట్టె ఉంది. 

నమస్తే డాక్టర్

రండి సారధి గారు డాక్టర్ గోపీనాద్ నవ్వుతూ, ఎదురుగా ఉన్న కుర్చీ చూపించారు. సారధి కూర్చున్న వెంటనే ఆయన అడిగారు.

చెప్పండి...మీకేమిటి సమస్య?”

సారధి కొంచం సేపు తటపటాయించి చెప్పటం మొదలుపెట్టాడు.

డాక్టర్రంజని గారు షూటింగుకు వెళ్ళిపోవటం వలన బంగళాలో నేనొక్కడినే ఉన్నాను. నా రూములో ఫ్యాన్ సరిగ్గా పనిచేయకపోవటంతో, చెమట కారణంగా నిద్ర పోలేకపోయాను. గాలికోసం హాలులోకి వెళ్ళి పడుకున్నాను. దోమల బాధ ఎక్కువగా ఉంది, రెండింటి వరకు దొర్లుతూ, దొర్లుతూ పడుకున్నాను. నిద్ర పట్టలేదు. చివరిగా  వేరే దారిలేక రంజని గారి గదిలోకి వెళ్ళి ఏ.సీ. ఆన్ చేసుకుని నేల మీద దుప్పటి పరచి పడుకున్నాను. మంచి నిద్ర పట్టింది. హఠాత్తుగా తెల్లవారుజామున నాలుగూ ఆ  ప్రాంతంలో మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచాను. ముఖమంతా చెమటలు"

డాక్టర్ అడ్దుపడి అడిగారు.

ఏ.సీ.  పనిచేయలేదా?”

ఏ.సీ. పనిచేస్తోంది డాక్టర్. గది మొత్తం చల్లగా ఉంది

మరి చెమట ఎందుకు పట్టింది?”

అదే నాకూ అర్ధం కాలేదు. గదిలోపల ఉన్న ఒక గుడ్డ తీసుకుని చెమటను తుడిచేసి, ఏ.సీ. ఎక్కువగా పెట్టుకుని పడుకున్నాను. బాగా టయర్డ్ గా ఉన్నానేమో వెంటనే నిద్ర పట్టేసింది. ఆరు గంటలకు లేచాను. గది, డిసెంబర్ నెల ఊటీ లాగా ఏది ముట్టుకున్నా చల్లగా ఉన్నది

నేను లేచి ఏ.సీ. ఆఫ్ చేసి, గదిలోంచి బయటకు వచ్చేటప్పుడు, నా మొహానికి పట్టిన చెమటను తుడుచుకున్న గుడ్డ కనబడింది. ఆ గుడ్డను చూసి షాక్ అయ్యాను

డాక్టర్ కుర్చీలో నిటారుగా కూర్చున్నారు.

ఏం...ఏమైంది?”

ఆ గుడ్డను మీరే చూడండి డాక్టర్

----అన్న సారధి తన ప్యాంటు జేబులో నుండి ఒక ప్లాస్టిక్ కవరులో పెట్టిన ఆ గుడ్డను తీసి చూపించాడు.

డాక్టర్ తటపటాయిస్తూనే అది తీసుకున్నారు.

అదొక చిన్న 'టర్కీ' టవల్. చుట్టి పెట్టబడున్న టవల్ ను చూశారు.

డాక్టర్ ముఖమంతా షాక్ అలలు ప్రవహించింది.

టవల్ పైన ముద్ద ముద్దగా రక్తపు మరకలు.

టర్కీ టవల్ మీద ముద్ద ముద్దగా కనబడ్డ రక్తపు మరకలను చూసిన డాక్టర్. గోపీనాద్ ఆశ్చర్యపోతూ -- ఎదురుగా కూర్చున్న సారధిని తల ఎత్తి  చూశాడు.

ఏమిటిది?”

రక్తం డాక్టర్

అది రక్తం అని తెలుస్తోంది...ఎలా టవల్ కు అంటింది అని అడుగుతున్నా?”

అదే డాక్టర్ తెలియటం లేదు. తెల్లవారు జామున నాలుగింటికి బాగా నిద్రపోతున్న నాకు బాగా చెమటలు పట్టినై అని చెప్పానుగా. ఆ చెమటను ఈ టవల్ తోనే తుడుచుకున్నాను. ఆ తరువాత నిద్రపోయాను. ప్రొద్దున నిద్ర లేచి చూసినప్పుడు ఈ టవల్ మీద రక్తపు  మరకలు!

ఇది ఎవరి టవల్?”

రంజని గారి టవల్...ఒక అవసరానికి తీసి వాడుకున్నాను

మీ చెమటలను తుడుచుకునే ముందు ఈ టవల్ ను చూశారా...?”

చూశాను డాక్టర్

శుభ్రంగా ఉన్నదా?”

ఊ...ఉన్నది...ఉతికి ఇస్త్రీ చేసి ఉన్నది. మంచి సువాసన కూడా వచ్చింది

మీ సందేహం ఏమిటి?”

ముఖానికి చెమట పట్టినప్పుడు, నా శరీరంలో నుండి బయటకు వచ్చింది రక్తమా...లేక చెమటనా?”

ఖచ్చితంగా రక్తం అయ్యుండదు

మరెలా డాక్టర్ ఈ టవల్ మీద రక్తం మరకలు?”

ఆ రక్తపు మరకలు ముందుగానే టవల్ మీద ఉండుంటాయి

నో డాక్టర్. నేను టవల్ ను చూసానే!

వెలుతురులో చూశారా?”

లేదు

తెల్లవారు జామున నాలుగు గంటలకు ఆ ఏ.సీ రూములో జీరో వోల్ట్ కాంతిలో చూసుంటారు...టవల్ మీదున్న రక్తపు మరకలు మీకు కనబడి ఉండదు"

అంటే ఇది నా రక్తం కాదు అంటున్నారా డాక్టర్?”

ఖచ్చితంగా

---చెప్పిన డాక్టర్, రక్తపు మరకలున్న టవల్ ను తీసి ఒక పాలితిన్ కవరులో వేసారు.

మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి?”

బి-నెగటివ్

ఈ టవల్ మీదున్న రక్తపు మరకలు ఏ గ్రూపుకు చెందినదో కొంచం సేపట్లో తెలిసిపోతుంది

చెబుతూనే ఇంటర్ కాం లో హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ను పిలిచారు.

రామ మూర్తీ

డాక్టర్

ఒక పది నిమిషాలు వచ్చెళ్ళు...ల్యాబులో ఇప్పుడు ఏదైనా ముఖ్యమైన -- అవసరమైన పని ఉన్నదా?”

లేదు డాక్టర్

"సరే...రా. వచ్చెళ్ళు

డాక్టర్.గోపీనాద్ రిజీవర్ పెట్టేసి కాచుకోనున్న - రెండే నిమిషాల్లో ఆ యువకుడు వచ్చాడు.

పాలితిన్ కవర్ను ఆ యువకుడికి అందించారు డాక్టర్.

టవల్ మీదున్న రక్తపు మరకలు ఏ గ్రూపుకు చెందినవో తెలుసుకోవాలి. రిజల్ట్స్ వెంటనే కావాలి. టెస్ట్ చేసి చూసి ఇంటర్ కాం లో పిలు

సరే డాక్టర్

టవల్ తీసుకుని రామ మూర్తి వెళ్ళిపోగా....డాక్టరూ, సారధీ కాచుకోనున్నారు.

                                                           ***********************************

దశరథమూర్తి ముఖం అంతా ఆశ్చర్యంతో నిండింది. దాన్ని తన కళ్ళల్లో వెలిబుచ్చాడు.

ఏ...ఏ...ఏ...ఏమిటీ...మృత్యుదూతా?”

అవునుఅన్నది శ్రీలత.

అలాగంటే?”

శ్రీలత మళ్ళీ తన చేతిలో ఉంచుకున్న తుపాకీతో దశరథమూర్తి గారి ఎడమ వైపు చెంపపైన గట్టిగా నొక్కుతూ ఒక గీత గీసింది.

ఇలాంటి అమాయకత్వమైన మాటలూ, చూపులూ, ఒక్క దమ్మిడీకి కూడా ప్రయోజనం లేదు మిస్టర్. దశరథమూర్తి. మీరూ, మీ అసిస్టంట్ పల్లవి ప్రాణాలతో ఉండాలంటే నాకు ఆ మృత్యుదూత మూలిక కావాలి

దశరథమూర్తి గారు ఇంకా అదే ఆశ్చర్యంతో చూస్తున్నారు.

ఇదిగో...చూడూ. నువ్వు మాట్లాడేది ఏదీ నాకు అర్ధం కావటం లేదు. ఏదైనా మాట్లాడ దలుచుకుంటే తిన్నగా మాట్లాడు...అదేమిటి మృత్యుదూత మూలిక?”

నిజంగానే మీకు తెలియటం లేదా?”

తెలియదు?”

శ్రీలత తన వెనుక నిలబడున్న ఆ నలుగురు యువకులు రాజు, రామూ, గణేష్, సాహిద్ ను తిరిగి చూసింది...వాళ్ళు పల్లవి వైపు నడిచారు. ఆమెను చుట్టు ముట్టారు.

దశరథమూర్తి గారు చూస్తున్నప్పుడే కొంచం కూడా ఎదురుచూడని ఒక్క క్షణంలో ఆ నలుగురూ పల్లవి భుజం మీద చెయ్యి వేశారు. శ్రీలత ఇప్పుడు తన చేతిలో ఉన్న తుపాకీని దశరథమూర్తి గారి బట్ట తలపైన పెట్టింది.  

మిస్టర్. దశరథమూర్తి! తెలుగు పత్రికలను రోజూ చదివే అలవాటు మీకు ఉంటే...ఒక వార్త మీ కంటికి కనబడకుండా ఉండి ఉండదు. ఒక అమ్మాయిని నలుగురు కలిసి దారుణంగా మానభంగం చేసి హత్య చేశారు. ఆ వార్తను ఇప్పుడు ఈ నలుగురూ కలిసి...మీ ముందే అరంగేట్రం చెయ్యబోతారు. చూడటానికి రెడీగా ఉండండి...చూడటానికి మీరు రెడీగా ఉన్నారా?”

దశరథమూర్తి గారు పొత్తి కడుపులో నుండి గట్టిగా అరిచారు.

నో...ఓ...ఓ...ఓ...ఓ...ఓ...!

మీరు ఇష్టపడరని నాకు తెలుసు...ఎందుకంటే పల్లవి మీకు కూతురులాంటిది...అవునా?”

ఆ అమ్మాయిని ఏం చేయకండి

మిస్టర్ దశరథమూర్తి! నేనడిగిన ఆ మృత్యుదూత మూలికను మీరు తీసి ఇచ్చేస్తే, మేము మాట్లాడకుండా, ఏమీ చెయ్యకుండా వెళ్ళిపోతాము. తీసి ఇస్తారా?”   

ఇలా చూడు...నువ్వు చెప్పే ఆ మృత్యుదూతమూలిక ఏదనేదే నాకు తెలియదు. నా యాభై ఏళ్ళ జీవితంలో నేను అటువంటి మూలిక పేరు విననే లేదు. ఏదైనా సరే క్లియర్ గా చెబితేనే కదా నాకు తెలిసేది?”

శ్రీలత తలను ఒక పక్కకు వంచి దశరథమూర్తి ను చూసి నవ్వింది.

ఓ! మీకు క్లియర్ గా చెబితేనే అర్ధమవుతుందా? అన్నీ తెలిసి ఉంచుకుని, ఏమీ తెలియనట్లు నటించటం ఒక అతిపెద్ద కళ. ఆ కళ మీ దగ్గర పరిపూర్ణంగా ఉంది. మృత్యుదూత అంటే ఏమిటనేది మీకు తెలియాలి. అంతే కదా...?” అన్నది శ్రీలత .

రామూ అని కేక వెయ్యంగానే -- ఆ నలుగురి యువకులలో ఒకడు పల్లవిని వదిలిపెట్టి దశరథమూర్తి దగ్గరకు వచ్చి ఏమిటి శ్రీ...?” అన్నాడు.

మిస్టర్ దశరథమూర్తి గారికి వయసు పై బడటం వలన జ్ఞాపక శక్తి తగ్గిపోయి ఉండొచ్చు. మృత్యుదూత గురించి కొంచం చెప్పు

రామూ ఆయన్నే చూశాడు. ఒక వేళాకోలం నవ్వుతో మొదలుపెట్టాడు.

                                                                                            Continued...PART-4

**************************************************************************************************************

ఇవి కూడా చదవండి:

వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి విన్నూత గ్లోబల్ ప్రాజెక్టులు-PART-2(ఆసక్తి)

మారువేషంలో సెల్ ఫోన్ టవర్లు(ఆసక్తి)

***********************************************************************************************************************

3 కామెంట్‌లు: