28, జనవరి 2021, గురువారం

మృత్యుదూత (క్రైమ్ సీరియల్)...PART-5

 

                                                                           మృత్యుదూత (క్రైమ్ సీరియల్)                                                                                                                                                                  (PART-5)

హాస్పిటల్లో డాక్టర్ ఎదురుగా కూర్చున్న సారధి హృదయం వేగంగా కొట్టుకుంటోంది.

'రిపోర్ట్ ఎలా ఉంటుంది?'

డాక్టర్ గోపీనాద్ ఫ్లాస్కులో ఉన్న కాఫీని గాజు గ్లాసులో పోసి సారధి కి ఇచ్చారు.

బీ...రిలాక్స్ సారధి గారూ. టవల్ మీదున్నది మీ నెత్తురు అయ్యుండదు. ఎందుకో తెలుసా? మెడికల్ హిస్టరీలో ఇంతవరకు రక్తం చెమటగా వచ్చినట్లు దాఖాలు లేవు

సారధి కాఫీ గ్లాసు తీసుకున్న క్షణం, ఇంటర్ కాం మోగింది -- బటన్ నొక్కి డాక్టర్ గోపీనాద్ మాట్లాడాడు.

ఎస్

డాక్టర్...నేను రామ మూర్తీ మాట్లాడుతున్నాను

చెప్పు...'బ్లడ్ గ్రూప్' ఏమిటీ?”

డాక్టర్...ఆ టవల్ కు అతుక్కోనున్న రక్తపు మరకను అమ్మోనియంలో కరిగించి బ్లడ్ గ్రూప్ కనుక్కోవటానికి ప్రయత్నించాను. కానీ...

కానీ ఏమిటీ?”

బ్లడ్ గ్రూప్ ఏమిటనేది కనుక్కోవటం కుదరలేదు

ఏం చెబుతున్నావ్ రామ మూర్తీ...బ్లడ్ గ్రూప్ కనుక్కో లేకపోయావా? అది మనిషి నెత్తురే కదా?”

అవును...డాక్టర్! కానీ, గ్రూపు ఏమిటో తెలుసుకోవటం కుదరటం లేదు. ఏ గ్రూపో కనుక్కోవటానికి కావలసిన బ్లడ్ ఫాక్టర్స్ ఏవీ ఆ రక్తపు మరకలలో లేదు. హీమో గ్లోబిన్ మాత్రం ఉన్నది. అది పెట్టుకుని నెత్తురు ఏ గ్రూపో తెలుసుకోలేము కదా

నువ్వు ల్యాబు లోనే ఉండు...నేను ఇప్పుడే వస్తాను

----చెప్పిన డాక్టర్ గోపీనాద్, ఇంటర్ కాం ఆఫ్ చేసి కలతతో సారధిని చూశారు.

సారధి గారూ

డాక్టర్

మీరు ఇక్కడే వెయిట్ చేయండి...! నేను ఇప్పుడే వస్తాను

డాక్టర్ ఏదైనా సమస్యా

కొంచం సమస్యే. టవల్ మీద ఉన్న రక్తపు మరకలు మనిషి రక్తమే. కానీ, రక్తం ఏ గ్రూపుకు చెందినదో కనుక్కోవటం కుదరలేదట. నేను వెళ్ళి చూసొస్తాను

డాక్టర్, నాకు భయంగా ఉంది

సారధి ముఖమంతా ఆందోళనతో, గందరగోళంతో నిండిపోయుండటం గమనించిన డాక్టర్. గోపీనాద్ సారధి భుజాల మీద చెయ్యి వేశారు.

భయపడకండి. కాఫీ తాగేసి, ఆ పత్రిక చదువుతూ ఉండండి...నేను ల్యాబుకు వెళ్ళి, వెంటనే వచ్చేస్తాను

డాక్టర్. గోపీనాద్ వేగంగా బయటకు వెళ్ళారు.

                                                              *************************************

దశరథమూర్తి గారికి ఏం మాట్లాడాలో తెలియక ఆందోళన పడుతూ నిలబడగా, శ్రీలత ఆయన దగ్గరకు వచ్చి తన చేతిలోని తుపాకీతో ఆయన గుండెల మీద గుచ్చింది.

నువ్వు చెప్పేదంతా అబద్దం అని తెలిసిపోయింది చూసావా. ఇంకా పట్టుదల పడితే, దయా దాక్షణ్యం చూడకుండా నిన్ను కాల్చి చంపాల్సి వస్తుంది...అంతకు ముందు పల్లవిని...

వద్దు అని చెప్పి తన రెండు చేతులూ పైకెత్తారు దశరథమూర్తి గారు.

నన్నూ, పల్లవినీ ఏమీ చేయకండి. నువ్వడిగిన మృత్యుదూత మూలిక ఇచ్చేస్తాను

అది...ఇప్పుడు చెప్పేవే...ఇది మంచి మాట! అవును...ఆ బసవప్ప ఎవరు?”

ఆయన నాతో కలిసి పని చేశాడు. ఈ మూలికల పరిశోధనలో ఆయనకూ చాలా ఇంటరెస్టు ఉంది. వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు

దశరథమూర్తి గారి గొంతుకు దగ్గర తుపాకీ ఉంచింది శ్రీలత.

ఊ...నడు...ఆ మృత్యుదూత మూలిక ఎక్కడుంది?”

లో...లోపల...మూలికల గదిలో

ముందు నడు...

శ్రీలతతో పాటూ రాజు, రామూ, గణేష్, సాహిద్ నలుగురూ కలిసారు... దశరథమూర్తి గారిని, పల్లవిని ముందుకు నెట్టారు.

చెమటతో తడిసిపోయున్న చొక్కాతో దశరథమూర్తి గారు నడిచారు. మూడు గదులు దాటి వెళ్ళిన తరువాత, ‘మూలికా గ్యాలరీఅని ఇత్తడి అక్షరాలు  రాసున్న తలుపు వచ్చింది.

ఇదేనా ఆ బంగారు సొరంగం?”-- శ్రీలత సంతోషంతో కళ్ళు పెద్దవైనా, తుపాకీ చివరితో దశరథమూర్తి గారి మొహాన్ని గుచ్చింది.

ఊ...త్వరగా...తలుపు తెరు

దశరథమూర్తి గారు చేతిలో ఉంచుకున్న తాలం చెవుల గుత్తిలో వెతికి, అందులో నుండి ఒక తాళం చెవి తీసి -- తలుపుకు వేసున్న తాళం దగ్గరకు వెళ్లాడు. తాళం చెవి పెట్టి తాళం తిప్పగా తాళం తెరుచుకుంది.

ఆ బరువైన తలుపును -- శ్రమపడి తొసేరు దశరథమూర్తి గారు. ఇనుప తలుపు మెల్లగా గర్జించింది. లోపలకు వెళ్ళింది. మూలికల సువాసన బయటవరకు వచ్చింది.

గదిలోపల చీకటి.

దశరథమూర్తి గారు మాత్రం లోపలకు వెళ్ళి -- పక్కనున్న స్విచ్ నొక్కగానే -- గదిలో కాంతి ప్రవాహం. గదిలో నాలుగు గోడలకూ గాజు అలమరాలు ఉన్నాయి. వాటిలో రెడ్ కలర్ 'వెల్వట్' గుడ్డతో చేసిన చిన్న చిన్న పెట్టెలు ఉన్నాయి.    

శ్రీలత ఒక గాజు అలమారు దగ్గరకు వెళ్ళి, దాని తలుపును పక్కకు తోసి, అందులో ఉన్న ఒక 'వెల్వట్' పెట్టెను తీసింది. అందులో కొన్ని మూలికలు. పెట్టె పైన డీటైల్స్ అతికించబడ్డ కాగితం ఒకటుంది. అందులో రాసున్న దానిని చదివింది.

హెవెన్ స్మయల్: బరువు-25 గ్రాములు,

పుట్టిన చోటు: జొహన్నెస్ బర్గ్.

వయసు: 360 సంవత్సరాలు. 

ఔషధగుణం: మనసు బాధగా ఉన్నప్పుడు---అంటే: డిప్రెస్సన్, ఒత్తిడి, మనోవ్యాధి -- ఒక మిల్లీగ్రాం తీసుకుని వేడి నీటిలో అరగంట నానబెట్టి, ఆ నీళ్ళు తాగితే...కొత్త ఉత్సాహం.

ముఖ్య విషయం: మూలిక అరగంట కంటే ఎక్కువసేపు నీటిలో ఉండకూడదు.

శ్రీలత ఆ మూలికను అలమరాలోనే పెట్టేసి -- పక్కనున్న ఇంకొక పెట్టెను తీసింది. అందులోనూ ఒక కాగితం.

క్లోరీ మూలిక: బరువు 32 గ్రాములు,

పుట్టిన చోటు: ఇటాలీ.

వయసు: 500 సంవత్సరాలు.

ఔషధగుణం: బ్లడ్ ప్రషర్, కంటి చూపు ప్రాబ్లంస్, నరాల బలహీనత -- ఒక మిల్లీగ్రాం తీసుకుని గోరువెచ్చని పాలులో అరగంట నానబెట్టి తాగాలి.

ముఖ్య విషయం: పాలు--ఆవుపాలు అయ్యుండాలి, వర్షం పడేటప్పుడు ఈ మూలికను బయటకు తీయకూడదు.

అప్పుడు శ్రీలత దశరథమూర్తి గారిని చూసింది.

మిస్టర్ దశరథమూర్తి ఒక్కొక్క మూలిక గురించి చదువుతుంటే చాలా ఆసక్తిగానూ, స్వారస్యంగానూ ఉన్నది...ఈ మూలికలుకు ఆయా ఔషధ గుణాలున్నాయని. మొతాదు ఎంత ఇవ్వాలి, పౌడర్ గానా, మూలికగానా, ఎన్ని రోజులు ఇవ్వలి...ఇవన్నీ మీరు ఎలా కనుకున్నారు

దశరథమూర్తి గారు కొంచం సేపు మౌనం వహించారు. వెంటనే శ్రీలత కనుసైగతో ఆమె అసిస్టంట్లు పల్లవిని చుట్టు ముట్టారు.

చెబుతాను...శ్రీకాకుళం లోని ఒక ప్రాంతంలో ఒక పురాతన గుడి కోసం మేము తవ్వకాలు ప్రారంభించినప్పుడు అక్కడ రెండు కుండలు దొరికినై. వాటి నిండుగా ఇదిగో ఈ చెక్క బద్దలు ఉన్నాయి. వాటి మీద ఏవో రాతలు ఉన్నాయి. అవి తీసుకుని పరిశోధన శాలలో కూర్చుని శ్రమపడి చదివాను. అందులో ఉన్నదంతా ఈ మూలికల సమాచారమే. గుడికి సంబంధించినవి ఏదీ దొరకలేదు  

ఓ!...ఆ టేబుల్ మీదున్న చెక్కబద్దలు అవేనా?”

అవును

అయితే నాకు ఇక్కడున్న అన్ని మూలికలూ, ఆ చెక్కబద్దలూ కావాలి

దశరథమూర్తి గారు రెండు చేతులూ ఊపుతూ ఆందోళన చెందాడు.

నో...ఇవన్నీ నేను చాలా కష్టపడి సంపాదించినవి. నా పిల్లలతో సమానం. నేను ఇవ్వను. నువ్వు మొదట్లో ఆ మృత్యుదూత మూలికను మాత్రమే అడిగావు. ఇప్పుడు ఇక్కడున్న అన్ని మూలికలూ, పురాతణ చెక్క బద్దలు కావాలని అడుగుతున్నావు...వీటిని, వీటి డీటైల్స్ ను ప్రభుత్వానికి అందజేసి, సైన్స్ ఒప్పుకునేలా చేసి, ఈ మూలికల ప్రయోజనాలను ప్రజలకు అందివ్వటానికే నా జీవితమంతా గడిపేను... నేనివ్వను

నేనూ ఈ మూలిక విషయాల గురించి ఇప్పుడే వింటున్నాను. కాబట్టే నా మాట మార్చుకున్నాను...నాకు మూలికలూ, చెక్కబద్దలూ అన్నీ కావాలి

నేనివ్వను

శ్రీలత నవ్వింది.

ఇవన్నీ నువ్వు ఇవ్వలేదనుకో, వీటికి బదులుగా నీ ప్రాణాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నీకు తోడుగా పల్లవిని కూడా పంపిస్తాను. పరవాలేదా...? మీరిద్దరూ ప్రాణాలతో ఉండాలంటే, అన్ని మూలికలనూ తీసి ఒక సూట్ కేసులో పెట్టి ఇవ్వండి

దశరథమూర్తి గారు, పల్లవి ఇద్దరూ ఆవేదనతో శ్రీలతని చూసారు.

ఆమె నవ్వింది.

ఏమిటి చూస్తున్నారు? మీ ఇద్దర్నీ కాల్చి పారేసి, ఇక్కడున్న అన్ని మూలికలనూ తీసుకు వెళ్ళటానికి మాకు పది నిమిషాలు చాలు. అనవసరంగా ఇద్దర్నీ చంపకూడదనే జాలితో అడుగుతున్నా. సరే...ఇప్పుడు ఆ మృత్యుదూత మూలికను చూద్దామా?"

దశరథమూర్తి గారు తటపటాయించగా, ఆయన్ని తుపాకి అంచుతో నొక్కుతూ ముందుకు తోసింది శ్రీలత.   

ఊ...తీసివ్వు

కొద్ది క్షణాలు మౌనంగా ఉన్న ఆయన మెల్లగా నడుచుకుంటూ గది చివరకు వెళ్ళి ---- అక్కడున్న నాలుగడుగుల ఎత్తు ఉన్న స్టీల్ లాకర్ ను తెరిచారు.

ఒక పర్పుల్ రంగు గుడ్డలో ఉన్న స్టీల్ పెట్టెను తీసారు.

లోపల.

పాల తెలుపు రంగులో, వేప పుల్లలాగా కట్టబడి ఉన్న మూలికల చట్రాన్ని తీసారు.

పక్కకు వచ్చి చూసిన శ్రీలత కళ్ళు ఆశ్చర్యంతో విరుచుకున్నాయి.

అరే...ఏమిటీ అద్భుతం. మూలికలు ఇలా పాల లాంటి తెలుపు రంగులో నేనెప్పుడూ చూడలేదు. మూలిక అంటేనే నలుపు, బ్రౌన్ రంగుల్లో ఉంటాయి...కానీ ఇది...అద్భుతం

ఇదేనా 'మృత్యుదూత' మూలిక!!!?”

                                                                                                              Continued...PART-6

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి