మృత్యుదూత (క్రైమ్ సీరియల్) PART-1
దశరథమూర్తి తన పరిశోధనా కేంద్రంలో
పైజమా-బనియన్ తో కూర్చుని తన ముందున్న టేబుల్ పైన వరుసగా ఉంచబడిన పురాతన
చెక్కబద్దలను ఒక్కొక్కటిగా చేతిలోకి తీసుకుని, చేతిలోని
భూతద్దం ద్వారా ఆ చెక్క బద్దలపైన రాసున్న వాక్యాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ చదువుతున్నప్పుడు----
ఆయన దగ్గరున్న ‘వాకీ
టాకీ’
పిలిచింది.
దాన్ని తీసుకుని చెవి దగ్గర
పెట్టుకున్నారు.
అవతల పక్క ఆయన సెక్రెటరీ పల్లవి
మాట్లాడింది.
“సార్...జూపిటర్
టీవీ నుండి బృందం వచ్చింది”
“టీ.వీ
బృందమా....? వాళ్లెందుకు వచ్చారు?”
“ఏమిటి సార్...మర్చిపోయారా? జూపిటర్
టీవీకి మీరు ఈ రోజు ఒక స్పేషల్ ఇంటర్ వ్యూ ఇవ్వవలసిన రోజు”
“అలాగా?”
“ఏమిటి సార్...అలాగా అని సావకాశంగా
అడుగుతున్నారు? ఇది క్రితం నెలే ఫిక్స్ చేసిన విషయం.
ప్రొద్దున కూడా నేను మీకు జ్ఞాపకం చేశేనే?”
“ఓ! సారీ... పల్లవి...మర్చిపోయాను”
“టీ.వీ
బృందం వచ్చి వైట్ చేస్తున్నారు సార్”
“మొత్తం
ఎంత మంది?”
“ఐదుగురు సార్”
“ఎందుకు
పల్లవి ఈ ఇంటర్ వ్యూ లన్నీ? వాళ్లను ఇక్కడికి
రప్పించకుండా చేసుండచ్చే?”
దశరథమూర్తి ‘హుష్’ అంటూ
నిట్టుర్పు విడిచారు.
“ఇక
కుదరదు సార్. తారీఖు ఫిక్స్ చేసి, టైము ఇచ్చేశాము. టీవీ
వాళ్ళు కూడా ఏదో అవుట్ డోర్ షూటింగ్ వచ్చే విధంగా విధవిధమైన వస్తువులతో వచ్చాసారు.
వాళ్ళు మీకొసం కాచుకోనున్నారు”
“ఇంటర్ వ్యూ పూర్తి చేయటానికి ఎంతసేపు
అవుతుంది?”
“ఎలాగూ ఒక గంటసేపైనా పడుతుంది సార్”
“క్రిమినల్
వేస్ట్! వచ్చేనెల ఇటలీ దేశంలో ఐదవ అంతర్జాతీయ మూలికల సదస్సు జరగనుంది...ఆ సదస్సులో
మాట్లాడటానికి కావలసిన ముఖ్యమైన టాపిక్ గురించి ఇంకా ఏ పనీ మొదలుపెట్టలేదు. ఆ
సదస్సులో అత్యంత అరుదైన, ఔషధ గుణాలున్న మూలికల
గురించి నేను మాట్లాడాలి. దానికొసం పురాతన చెక్కబద్దలను చదువుతున్నాను. ఇది పూర్తి
చేయటానికే చాలా సమయం పట్టేట్టు ఉంది...ఇప్పుడు ఈ ఇంటర్ వ్యూ లన్నీ అవసరమా? ఏదైనా
చెప్పి వాళ్ళను ప్యాకప్ చెయ్యటం కుదరదా?”
“సారీ సార్... జూపిటర్ టీవీ ఆర్డినరీ
ఛానల్ కాదు. వాళ్ళకు ప్రపంచమంతా ‘నెట్ వర్క్’ ఉంది...మీతో
స్పేషల్ ఇంటర్ వ్యూ ను ప్రచారం చెయ్యబోతారని పదిహేను రోజులుగా వాళ్ల టీవీ ఛానెల్లో
ప్రకటనలు చేస్తున్నారట...ఇంటర్ వ్యూ చేయడానికి బృందంతో వచ్చిన వాళ్ళను...అందులోనూ
మనం టైము ఇచ్చిన తరువాత, ఇప్పుడు కుదరదు అంటే
బాగుండదు సార్”
“ఒక
గంటసేపు కంటే ఎక్కువ సమయం తీసుకోరుగా?”
“తీసుకోరు సార్...నేను వాళ్ళ దగ్గర టైము
గురించి చెప్పేశాను”
“సరే
నేను ఇంకో పది నిమిషాలలో వస్తాను! వాళ్లకు కాఫీ, టీ
లాంటివి ఏర్పాటు చెయ్యి”
“ఇచ్చేను
సార్...కాఫీ తాగుతున్నారు సార్”
దశరథమూర్తి గారు చూస్తున్న పురాతన
చెక్కబద్దను పక్కన పెట్టి లేచారు.
పరిశోధనా కేంద్రానికి ఆనుకుని ఉన్న
స్నానాల గదిలోకి వెళ్ళారు. స్నానం చేసి ఫ్రేష్ అయ్యి, ప్యాంటు, ఓవర్
కోటు వేసుకుని అద్దం ముందు నిలబడ్డ ఆయన, జుట్టు
లేని బట్ట తలమీద పొడుగ్గా ఉన్న నాలుగు తెల్ల వెంట్రుకులను దువ్వెనతో జాగ్రత్తగా
దువ్వి అనిచి పెట్టుకున్నారు.
కొంచంగా సెంటును ఒంటి మీద జల్లుకుని
బయటకు వచ్చారు. రెండు అంతస్తుల వరాండాను దాటి, గ్రౌండ్
ఫ్లోర్ లో ఉన్న హాలుకు రావటానికి ఐదు నిమిషాలు పట్టింది. హాలులో టీవీ బృందం కెమేరాలతో
కాచుకోనున్నారు.
పల్లవి లేచి నిలబడింది.
“రండి
సార్”
సోఫాలో కూర్చోనున్న టీవీ బృందానికి
చెందిన ఆ ఐదుగురూ లేచి నిలబడి “నమస్తే
సార్” చెప్పారు.
వాళ్ళల్లో ఒకరు మహిళ. అందంగా, సినిమా
హీరోయిన్ లాగా ఉన్నది. అందమైన పళ్ళ వరుసతో నవ్వుకుంటూ దశరథమూర్తి గారి దగ్గరకు
వచ్చింది.
“సార్...నా
పేరు శ్రీలత...జూపిటర్ టీవీలో ప్రెసెంటర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు నేనే
మిమ్మల్ని ఇంటర్ వ్యూ చెయ్యబోతాను. వీళ్ళు ‘కెమేరా
మాన్’ రాజు మరియూ రామూ.
వాళ్ళు లైట్ మ్యాన్స్ గణేష్ అండ్ సాహిద్”
దశరథమూర్తి గారు శ్రీలత ని చూసి నవ్వారు.
“ఒక
సినిమా హీరోయిన్ని ఇంటర్ వ్యూ చేసి టెలికాస్ట్ చేస్తే, అది
చూడటానికి లక్షలమంది చూసేవాళ్ళు ఉంటారు. ఈ అరవై ఏళ్ళ వయసున్న, రిటైర్డ్
పురావస్తు శాఖ పరిశోధనా సైంటిస్ట్ ను ఇంటర్ వ్యూ చేసి టెలికాస్ట్ చేస్తే ఎవరు
చూస్తారు?
టీవీ
తెర మీద నా మొహాన్ని చూసిన వెంటనే రిమోట్ కంట్రోల్ లో ఉన్న బటన్ నొక్కి, వేరే
ఛానల్ కు వెళ్ళిపోతారు”
“యు
ఆర్ రాంగ్ సార్...జూపీటర్ టీవీ ప్రేక్షకులు ఎప్పుడూ వ్యత్యాసమైన ఇంటర్ వ్యూ లను
ఎంజాయ్ చేసి చూసే రకం. ఇప్పుడంతా నటీనటుల , సెలెబ్రెటీల
ఇంటర్ వ్యూ లను పెద్దగా ఇష్టపడి చూడటం లేదు. మేమూ నటీనటులను, సెలెబ్రెటీలనూ
వదిలేసి వేరు వేరు రంగాలలో ఉండే ముఖ్య వ్యక్తులను ఇంటర్ వ్యూ చేసి ప్రసారం చేస్తూ
వస్తున్నాము. ‘వ్యత్యాసమైన వ్యక్తులు’ అనే పేరుతో ప్రతి
గురువారం సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు ప్రసారం చేస్తూ వస్తున్నాము. మీరు చూడటం లేదా సార్?”
“ఇంట్లో రెండు టీవీలు ఉన్నాయి. ‘టీవీ
ఆంటెనా’
కనెక్షన్
ఉంది. కానీ, టీవీ చూడటానికే టైము లేదు. ప్రొగ్రాం
పేరు ఏం చెప్పావమ్మా...వ్యత్యాసమైన వ్యక్తులా?”
“అవును సార్”
“చాలెంజ్
టీవీలో వస్తున్న 'ప్రముఖ మనుష్యులు’ లాగానా?”
"అదివేరు...ఇదివేరు
సార్"
“సరే...ఇంతవరకు
ఎవరెవర్ని ఇంటర్ వ్యూ చేసి ప్రసారం చేసారు?"
"ఒక చిన్న లిస్టే ఉంది
సార్...పోయిన వారం, మల్టీ మిల్స్ ఓనర్ విశ్వేశ్వర
రావు గారి ఇంటర్ వ్యూ"
"ఒక మిల్ ఓనర్ ఇంటర్ వ్యూ అంటే అది
అత్యంత సాధారణ వ్యక్తి ప్రొగ్రామే కదా...ఇందులో ఏముంది ప్రత్యేకత?"
శ్రీలత నవ్వింది. "మల్టీ మిల్స్
అనేది ఆయన మిల్లు పేరు కాదు. పదిహేను మిల్లులకు ఆయన సింగిల్ ఓనర్. ఆయన దగ్గర అందరి
మిల్లు ఓనర్ల కంటే ఒక ప్రత్యేకత ఉంది కాబట్టే ఆయన దగ్గర ఇంటర్ వ్యూ తీసుకున్నాం?"
"ఏమిటా ప్రత్యేకత?”
"సార్... విశ్వేశ్వర
రావు గారు తన చిన్న వయసులోనే తల్లి-తండ్రులను ఒక ప్రమాదంలో పోగొట్టుకుని -- సొంత
మనుష్యులచే బహిష్కరించబడ్డారు. వీధిలో అనాధగా నిలబడ్డారు. ఒక పూట కడుపు
నింపుకోవటానికి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి. కానీ, ఆయన
ఎవరి దగ్గర చెయ్యి చాపలేదు. రోడ్డు రోడ్డూ తిరిగి, చెత్త కాగితాలు ఏరుకుని - పాత సామాన్ల
మార్కెట్టుకు వెళ్ళి అమ్ముకుని -- తన మూడు పూటల ఆకలిని పోగొట్టుకున్నారు.
సుమారు ఏడు సంవత్సరాలు చెత్త కాగితాలను
ఏరి, అమ్ముకుని -- ప్లాట్
ఫారం మీద పడుకుని నిద్రపోయిన ఆయన తన పదిహేనవ ఏట విజయవాడ గవర్నర్ పేట సెంటర్ లో ఒక
పాత పేపర్ల షాపును ప్రారంభించారు. హోల్సేల్ చెత్త పేపర్ల వ్యాపారంలో పలు వ్యక్తులతో
పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఉపయోగించుకుని, తాను
సేవింగ్స్ చేసిన డబ్బును, బ్యాంకు అప్పుగా
ఇచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టి, తన
ఇరవై రెండవ ఏట ' విశ్వా పేపర్ కోన్స్’ అనే పేరు మీద
వ్యాపారం మొదలు పెట్టారు. ఖచ్చితంగా ఏడే సంవత్సరాలలో వ్యాపారం పెద్దగా జరుగుతుంటే, ఐదుకోట్ల
రూపాయల ఖర్చుతో ఒక కొత్త పేపర్ మిల్లు నిర్మించారు. అప్పుడు ఆయనకు వయసు ముప్పైయే. ఆ తరువాత విజయం
పైన విజయం. ఈ రోజు భారతదేశంలో వివిధ నగరాలలో ఆయన పేరు మీద పదిహేను పేపర్ మిల్లులు
ఉన్నాయి. ఈ రోజు భారతదేశంలో ఉన్న వార్తా పత్రికలూ, వార, మాస
పత్రికలు ఆయన మిల్లు పేపర్లనే వాడుతున్నారు. భారత దేశంలో పేపర్ దిగిమతి 70 శాతం
నుండి 20
శాతానికి
పడిపోయింది"
"నిజంగానా?"
“చూసారా
సార్. మీరే ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ప్రముఖ వ్యక్తులను మా ఈ ప్రోగ్రాం ద్వార
ప్రపంచానికి పరిచయం చేయటానికి ఉద్దేశించినదే 'వ్యత్యాసమైన
వ్యక్తులు’ యొక్క
ఉద్దేశ్యం. చెత్త కుప్పల తొట్ల నుండి
చెత్త కాగితాలు ఏరుకున్న విశ్వేశ్వర రావు అనే ఆ ఏడేళ్ళ చిన్న పిల్లాడు, ఈ
రోజు ఇండియాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు -- అనేది
ఎంత ఉన్నతమైనది. ఈ ప్రోగ్రాం చూసే ఉద్యోగం లేని కుర్రకారుకు విశ్వేశ్వర రావు గారి
జీవితం ఒక ఉత్సాహ 'టానిక్' గా
ఉండదా?”
దశరథమూర్తి గారు తన భుజాలు ఎగరేసాడు.
“ఏస్... విశ్వేశ్వర
రావు నిజంగానే ఒక వ్యత్యాసమైన వ్యక్తే. ఆయన్ను ఇంటర్ వ్యూ చేసి ప్రసారం చేయటం కూడా
న్యాయమైనదే. కానీ...నన్ను ఇంటర్ వ్యూ చేయటానికి, నా
దగ్గర వ్యత్యాసంగా ఏముంది? నేను 40 సంవత్సరాలుగా
పురావస్తు శాఖ విభాగంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఒక సాధారణ
ప్రొఫసర్”
శ్రీలత గట్టిగా నవ్వుతూ దశరథమూర్తి
గారిని చూసింది “సార్...మేధావులు
ఏ రోజూ పొగడ్తల కోసమో, ప్రకటనల కోసమో
పనిచేయరు. అది వాళ్లకు ఇష్టం కూడా ఉండదు.
ఈ కట్టుబాటుకు మీరు మినహాయింపుగా ఉండగలరా ఏమిటి? సార్...మీరు
ఒక ఇంగ్లీష్ ప్రొఫసర్ గానో, హిస్టరీ ప్రొఫసర్
గానో పనిచేసి రిటైర్ అయ్యుంటే జూపీటర్ టీవీ ఇంటర్ వ్యూ అంత ఈజీగా వచ్చుండదు.
మీరు ఎంత మేధావులంటే మీ అనుభవం, మీ
సేవ ఇంకా మన ప్రభుత్వం కోరుకుంటోంది. మీరు గొప్ప నిపుణులు. 'హెర్బల్’ అనే మూలికల గురించిన
పరిశోధన కోసం ఈ అరవై ఏళ్ళ వయసులోనూ, రోజులను
ఖర్చుపెడుతూ కష్టపడి పనిచేస్తున్నారు. మీరు పరిశోధిస్తున్న అరుదైన మూలికల గురించి
మామూలు ప్రజలు కూడా తెలుసుకోవాలనే కారణంతోనే మిమ్మల్ని ఇంటర్ వ్యూ చేయాలని
అనుకున్నాము”
దశరథమూర్తి గారు మెల్లగా తల వూపుతూ శ్రీలతని
చూశారు.
“చాలా
సంతోషం...మూలికల గురించి ప్రజలు తెలుసుకోవటానికి టీవీ ఒక మంచి మీడియా. కానీ, ఇంటర్
వ్యూ ను ఒక అరగంట లోపు ముగించుకుంటే మంచిది. నాకు ల్యాబులో చాలా పనుంది. వచ్చే నెల
ఇటాలీ దేశంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరగబోతోంది. దానికి సంబంధించిన పనులు చాలా
ఉన్నాయి”
“ఐ నో
యువర్
వాల్యూబుల్
టైమ్
సార్.
ఈ
ఇంటర్
వ్యూ
మంచి
ఇన్
ఫర్మేషన్
తో
చిన్నదిగా
ఉండాలనేదే
నా
ఇష్టం
కూడాను.
మీ
ఓర్పునూ, టైమును
పరీక్షించే
లాగా
ఏ
ఒక
ప్రశ్నా
ఉండదు.
ఇంటర్
వ్యూ
మొదలు
పెడదామా
సార్?”
“ఊ....”
Continued...PART-2
********************************************************************************************************
ఇవి కూడా చదవండి:
********************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి