14, జనవరి 2021, గురువారం

జీవిత సత్యం...(కథ)


                                                                                జీవిత సత్యం                                                                                                                                                                                        (కథ) 

తన స్నేహితుని కారు మెకానిక్ షెడ్డులోకి వెళ్ళాడు ఆనంద్. అక్కడ చాలాకార్లు రిపేర్ల కోసం నిలబడున్నాయి. కారు ముందు భాగాన్ని తెరిచి, కారుకు కింద పడుకుని పనివాళ్ళు పని చేస్తున్నారు...వాళ్ళను దాటుకుంటూ లోపలున్న ఆఫీసు గదిలోకి వెళ్ళాడు.

"రా రా ఆనంద్...ఏమిటి మావైపు గాలి తిరిగింది? ఆశ్చర్యంగా ఉందే?"

"ఇక్కడ మాధాపూర్ లో మా మావయ్య ఇంట్లో విశేషానికి వచ్చాను.  అప్పుడు నువ్వు జ్ఞాపకం వచ్చావు. సరే నిన్ను ఒకసారి చూసి వెళదామని వచ్చాను. ఎలా ఉన్నావు? బిజినస్ బాగా జరుగుతోందనుకుంటా"

"అవునురా. పని పూర్తి చేసి చెప్పిన టైములో 'డెలివరీ ఇవ్వలేకపోతున్నా. అందుకని కొత్తగా చాలా మందిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాను...తరువాత ఇంకేమిటి విషయాలు"

ఆనంద్ తో మాట్లాడుతూనే బయట పనులను గమనిస్తున్నాడు. "రేయ్ బద్రీ...ఇక్కడికి రా" అన్నాడు.

అతని పిలుపుకు ఒక యువకుడు ఒకడు మాసిపోయిన నిక్కరు, బనియన్ తో అతని ముందుకు వచ్చి నిలబడ్డాడు.

"ఏమిట్రా పనిచేస్తున్నావు?"

"రాజన్న బండిలోని బోల్టులనూ, నట్టులనూ టైట్ చేయమన్నారు. అదే చేస్తున్నాను"

అంతే. వాడి చెంపమీద లాగి ఒకటి కొట్టాడు. "బుర్ర లేనోడా! 2971 కారులో ఇంజన్ పని జరుగుతోంది కదా. అక్కడికి వెళ్ళి సహాయం చేస్తూ పని నేర్చుకోరా అని చెప్పానా లేదా?...అది వదిలేసి స్క్రూ డ్రైవర్ ఒకటి చేతిలో పుచ్చుకుని  కాలం గడుపుతున్నావా? వెళ్ళు...వెళ్ళి చెప్పింది జాగ్రత్తగా చెయ్యి"

జవాబేమీ చెప్పకుండా తలవంచుకుని వెడుతున్న వాడిని చూడటానికే జాలేసింది ఆనంద్ కు.

"ఏరా రవీ, పాపం రా అబ్బాయి. ఎందుకు కొట్టావు? మంచిగా చెప్పుండచ్చు కదా!"

"అరె పోరా. కొత్తగా మనుషులను చేర్చుకుని పనిచేయించుకునే లోపు నా తల ప్రాణం తోకకొస్తోంది. అబ్బాయి తల్లి లేని కుర్రాడు. సంపాదిస్తున్న తండ్రి కూడా పోయిన నెల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఒక అక్కయ్య మాత్రమే. తిండికే కష్టపడుతున్నారు. పని ఇవ్వండి...తొందరగా అన్నీ నేర్చుకుని, మంచిగా పనిచేస్తాను" అని బ్రతిమిలాడాడు. జాలిపడి చేర్చుకున్నా. నెలకు ఖచ్చితంగా ఐదువేల రూపాయలు ఇస్తున్నా. దానికి తగిన పని చెయ్యొద్దా?

వాడి దగ్గర దయాదాక్షిణ్యాలు చూపకూడదు. ఇలా నాలుగు తగిలించి, బెదిరించి, తిడితేనే గానీ పని జరగదు"

రవి ఎంత వివరణ ఇచ్చినా ఆనంద్ కు కష్టంగానే ఉన్నది.

'పెద్దెనిమిదేళ్ళ కుర్రాడు. చూడటానికే అమాయకుడిలాగా కనబడుతున్నాడు. పేదరికంలో ఉన్నాడు. వాడి దగ్గర కోపం చూపిస్తున్నాడే! అందులోనూ పరిచయం లేని ఒక మనిషి ముందు కొడితే అతని మనసు ఎంత బాధ పడుతుంది?'

"ఆనంద్ ఏం తింటావు. కూల్ డ్రింక్స్ తెప్పించనా?"

వద్దురా. టీ చెప్పు. వేడిగా తాగచ్చు. రెండు రోజులుగా గొంతు నొప్పి"

"రేయ్... బద్రీని రమ్మను

ఇంతకు ముందు చెంప మీద దెబ్బతిని చెంపంతా ఎర్రగా కందిపోయున్న బద్రీ వచ్చి  చేతులు కట్టుకుని భవ్యంగా నిలబడ్డాడు.

"కొట్టుకు వెళ్ళి స్ట్రాంగ్ టీ రెండు, మన షేడ్డుకని చెప్పి తీసుకురా"

వాడు బయటకు వెళ్ళాడు.

"ఏమిటి రవీ... కుర్రాడ్ని ఇలాంటి పనులన్నీ చెయ్యమంటున్నావు. వాడేమన్నా తప్పుగా అనుకుంటాడేమో"

"అరే నువ్వేమిట్రా.... ఇక్కడ ఉద్యోగానికి అని వచ్చేస్తే అన్ని పనులూ చెయ్యాలి. మామూలుగా ఇలాంటి పనులు చేసే కుర్రాడు రెండు రోజులగా సెలవు. వాడ్నే టీ కొట్టుకు పంపిస్తాను. వాడేమీ తప్పుగా అనుకోడు. సరే అవన్నీ నీకెందుకు...నీ భార్య, పిల్లలూ అందరూ ఎలా ఉన్నారు?"

చాలా రోజుల తరువాత కలుసుకున్న స్నేహితుడితో చాలా విషయాలు మాట్లాడి, లంచ్ టైముకు ముందు బయలుదేరి వెళ్ళాడు ఆనంద్.

రెండు రోజుల తరువాత, మార్కెట్టుకు వెళ్ళి ఇంటికి కావలసిన సరకులు కొనుక్కుని, పక్కనున్న వీధిలోకి తిరిగాడు ఆనంద్. వీధి చివర గుంపు ఉండటం చూసి, ఆసక్తితో అతను కూడా తొంగి చూశాడు.

గుంపులో ఆవేశంగా మాట్లాడుతున్నాడు ఒక యువకుడు. అతని మొహాన్ని ఎక్కడో చూసిన జ్ఞాపకం. అతనికి గుర్తుకు వచ్చింది. రోజు  రవీ మెకానిక్ షెడ్డులో చూసిన అదే బద్రీ.

'ఏం జరుగుతోంది?'--తెలుసుకోవాలనే ఆసక్తి.

అతనికి దగ్గరగా అక్కడక్కడ చినిగిపోయిన ఓణీలో అతుకులు వేసుకుని కట్టుకోనున్న ఒక అమ్మాయి నిలబడుంది.

ఇద్దరు యువకుల చొక్కాలు పుచ్చుకుని బద్రీ వారితో కోపంగా మాట్లాడుతున్నాడు.

"రెండు రోజులుగా మా అక్కయ్య ఇటు వెళ్ళేటప్పుడు...ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారట. గేలి చేశారట. పెదవాళ్ళంటే...ఏం చేసినా మాట్లాడకుండా ఉండిపోతారని అనుకున్నారా? మీరందరూ అక్కా చెల్లెల్లతో పుట్టిన వాళ్ళే కదా! ఏదో వీధి చివర్లో నిలబడి మీలో మీరు మాట్లాడుకుంటున్నారు.

దాంతో వెళ్ళిపోవాలి కదా? అటూ, ఇటూ వెళ్తున్న అమ్మాయలను ఎగతాలి చేయటం, కమెంట్ లు కొట్టడం లాంటి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు. మామూలుగా ఉండను...అసలు మనిషిగానే ఉండను.

రేపు కూడా మా అక్కయ్య వీధిలోంచే వస్తుంది. ఎవరికైనా ధైర్యం ఉంటే కమెంట్ చేసి చూడండి. తరువాత ఏం జరుగుతుందో తెలుసా! తిన్నగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. తరువాత మీలో ఒక్కరు కూడా ఇటు సంచరించలేరు"

ఎర్ర బడ్డ కళ్ళతో కోపంగా చెప్పాడు.

"సరే తమ్ముడూ. కోపగించుకోకు...వదిలేయ్. పనీపాట లేని వెధవల్ని పబ్లిక్ ప్లేసులో ధైర్యంగా చొక్కా పుచ్చుకుని బాగానే బెదిరించావు! దానికే వాళ్ళు చచ్చిపోయుంటారుఇక ఇటుపక్కకే రారు"

గుంపులో ఒకరు చెప్పగా లేకపోతే ఏమిటి సార్. నా సంపాదన చాలకే కదా నా చెల్లెల్ను పనికి పంపిస్తున్నాను. ఇలా బాధ్యతే లేకుండా...వీధిలో వెళుతున్న అమ్మాయల్ని ఎగతాలి చేస్తే వూరికే ఉండగలమా?"

రౌడీ గుంపు తలవంచుకుని, చోటును ఖాలీ చేసి వెళ్ళటంతో అక్కడ గుమికూడిన వారు కూడా కదలి వెళ్ళారు.

"అక్కా. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను కూరలూ, సరకులూ కొనుక్కొస్తాను. ఇక నీకు ఆటంకమూ ఉండదు"

"సరే త్వరగా వచ్చేయ్"

ఆమె ఇంటి దొవ పట్టింది.

ఆనంద్ గబగబా అతని దగ్గరగా వెళ్లాడు..."తమ్ముడూ, నువ్వు, రవీ కారు మెకానిక్ షెడ్డులో పనిచేస్తున్న కుర్రాడివేగా?"----అతన్ని అడిగాడు.

అవును సార్, మిమ్మల్ని రెండు రోజుల క్రితం మా ఓనర్ తో చూశాను. జ్ఞాపకం ఉంది"

"అవును బాబూ...జరిగింది నేను కూడా చూశాను. మంచి పని చేశావు. నోరు మూసుకుని ఉంటే, రౌడీల పొగరు హద్దులు దాటుతుంది. నువ్వు కోపగించుకుని ఖండించింది చాలా కరెక్టు. పోలీసులకు వెల్తానని భయపెట్టావు చూడు అది హైలైట్. ఇక వాళ్ళు తోక ఆడించరు. సరే, నేను ఒకటి అడగొచ్చా?"

"ఏమిటి సార్...అడగండి"

"లేదు... రోజు వర్క్ షాప్ లో మీ ఓనర్ నువ్వు సరిగ్గా పనిచేయ్యలేదని తిట్టి నిన్ను నా ఎదురుకుండా కొట్టాడు. అంతే కాకుండా టీ కొట్టుకు పంపి టీ తెమ్మన్నాడు. అప్పుడు ఎటువటి ఎదిరింపో, కోపమో చూపకుండా చేతులు కట్టుకుని భవ్యంగా నడుచుకున్నావు! అతను చెప్పిన పనులనూ కాదనకుండా చేశావు. ఆ రోజు నిన్ను చూడటానికి నాకు పాపం అనిపించింది. ఏమీ తెలియని అమాయకుడివని అనుకున్నాను. కానీ నీ దగ్గర ఆవేశం, కోపం ఉండటాన్ని ఇప్పుడు నేరుగా చూశాను"

అది నేను కోపాన్ని చూపించవలసిన చోటు కాదు సార్. అది గుడి. ఉద్యోగం చేసే చోటు. పని నేర్చుకోవటానికి అక్కడ చేరాను. ఓనర్ నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడూ అని కోపగించకుంటే...జీవితంలో ఎలా ఎదగగలం? ఇవన్నీ ఓర్చుకుని పని నేర్చుకుంటేనే నేను మంచి పొజిషన్ కు రాగలను.

అలా చేయకుండా ఓనర్ను కోపగించుకుంటే నన్ను పనిలోంచి తీసేస్తారు. అణిగి వెళ్ళాల్సిన చోట అణిగిమణిగే కదా సార్ వెళ్ళాలి. కోపం చూపించాల్సిన చోట కోపం చూపించాలి. అప్పుడే కదా సార్ ఈ లోకంలో జీవించగలం. నేను వెళ్ళొస్తాను సార్. అక్క ఇంట్లో ఒకత్తే ఉంటుంది. సరకులు కొనుక్కుని వెళ్ళాలి"

అతను చెప్పిన దాంట్లో 'జీవిత సత్యం' దాగుంది. 'వీడు జీవితంలో కష్ట-సుఖాలను తెలుసుకుంటూ పైగెదుకుతాడు అనుకుంటూ ఆనంద్ కూడా ఇంటి ముఖం పట్టేడు.

***************************************************సమాప్తం************************************************

ఇవి కూడా చదవండి:

గ్రహాంతర జీవితానికి కనుగొనటానికి దగ్గరలోనే ఉన్నాము(ఆసక్తి)

చెట్లు ఎక్కే మేకలు(ఆసక్తి)

*********************************************************************************************************************


8 కామెంట్‌లు:

  1. ఓ జీవితసత్యాన్ని కథలో పాత్రల ద్వారా చక్కగా తెలియజేశారు. 👌

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. Meekosam blog is not existing. Because I have not updated that blog for more than a year. Hence I deleted that blog and started this blog, with much more entertainment and knowledge material to the public and also to enable me to publish my writings. Thank you very much for your enquiry.

      తొలగించండి
    2. ఎంతో కష్టపడి ఫోటోలు సేకరించి ప్రచురించిన పోస్టులు డిలీట్ చేశారా ? ఒక సంవత్సరం update చేయకపోతే ఏమవుతుంది?

      తొలగించండి
    3. కష్టపడి సేకరించిన ఫోటోలన్నీటినీ ఒక హార్డ్ డ్రైవ్ లో దాచుకున్నాను. మీ ఎంక్వయరీ కి నా ధన్యవాదాలు.

      తొలగించండి
  3. sir meeru prathilipi app lo try cheyandi. chala baga rasthunaru meru stories. akkada patakulu untaru me rachana la goppathanam thelusthundi yentho mandiki

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రతిలిపిలో నా పేజీ ఉన్నది. చిలకలపూడి సత్యనారాయణ పేరుతో. అందులో 30 కథలు, ఒక నవల ప్రచురించాను. అక్కడ నా కథలు, నవలలకు మంచి కామెంట్స్ వచ్చాయి.

      తొలగించండి