10, జనవరి 2021, ఆదివారం

“హమ్మయ్య...!”… (కథ)

 

                                                                                  'హమ్మయ్య...!'                                                                                                                                                                                     (కథ)  

"అమ్మా రేపే నువ్వు బయలుదేరి ఇక్కడికి రా. లేకపోతే...నేను అక్కడికి వచ్చేస్తాను..."

"ఏమిటి విషయం సుధా...? ఏదైనా సమస్యా?" కూతురు మాటలతో ఆదుర్ధా పడినా దాన్ని కనబడ నివ్వకుండా నిదానంగా అడిగింది తల్లి.

"చాలా ఉంది! ఫోన్ లో ఎన్నని చెప్పమంటావు?...ఇక్కడికిరా...చెబుతాను..." అని చెప్పి ఫోన్ కట్ చేసింది.

కూతురు ఇంతకు ముందెప్పుడూ అలా మాట్లాడిందే లేదు. మాట్లాడుతున్నప్పుడే ఎప్పుడూ అలా ఫోన్ కట్ చేసిందీ లేదు.

ఫోనులో మాట్లాడింది కాపురానికి వెళ్ళిన భానుమతి యొక్క ఒకే కూతురు సుధా. మాటల్లో ఒక విధమైన వణుకు. తల్లి భానుమతి భయపడిపోయింది. జాతకం మ్యాచ్ అయ్యిందా అను చూసి, తెలిసిన వాళ్ళూ...తెలియని వాళ్ళు అని అందరి దగ్గర వాకబు చేసే ఒక మంచి రోజు సుధాను అల్లుడికిచ్చి పెళ్ళి చేశాము. అల్లుడు ఎప్పుడూ నవ్వు మొహంతోనే కనిపిస్తాడు. గట్టిగా మాట్లాడటం కూడా అల్లుడు భరధ్వాజ్ కు తెలియదు సడన్ గా అతన్ని ఒక విలన్ గా ఆలొచించుకోవటానికి భానుమతికి సాధ్యపడటం లేదు. పెద్ద చదువులు చదువుకున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు

'పెళ్ళి తరువాత సుధా ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు. ఇంటి పట్టునే ఉంటూ అమ్మనూ-నాన్ననూ చూసుకుంటేనే చాలు అని కాలంలో అల్లుడు చెబుతాడు? కొంచం చిన్న చదువు చదువుకున్న పిల్ల దొరికితేనే, మొదటి పనిగా ఉద్యోగానికి పంపి జీతాన్ని ఎదురు చూసే ఎందరో అల్లులను, కుటుంబాలను చూశాము, విన్నాము.

సుధా బాగా చదువుకున్న పిల్ల. అల్లుడికి సరిసమంగా సంపాదిస్తోంది. లోపమూ లేదు.

అటువైపు..."పెళ్ళి తరువాత కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు" అని అనుకున్న అల్లుడి దగ్గర ఏం లోపం ఉంటుంది?

"ఉన్న ఆస్తిని అనుభవించటానికే ఏడెనిమిది మనవళ్ళు కావాలి. నా కోడలు ఎందుకు పనికెళ్ళి సంపాదించాలి?...కష్టపడాలి?” అంటూ మాట్లాడే వియ్యపురాలు మెత్తని స్వభావం గల మనిషే నని తెలుస్తోంది. ఎవరి గురించీ తప్పుగా అనుకోవటానికి వీలులేకుండా తికమకపడ్డది.

మరైతే కూతురు దగ్గర నుండి ఎందుకు అలాంటి ఫోన్...? ఎక్కువ డబ్బు పెట్టి నమ్మకంగా కొన్న చీర, మొదటి ఉతుకులోనే రంగు పోయినట్టు కూతురి జీవితం అయిపోకూడదని ఎంతో కంగారు పడ్డది భానుమతి.

భర్తతో కలిసి ఆలొచించింది. " సుధా మాటలను బట్టి చూస్తే అక్కడ ఏదో పెద్ద సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. నేను వెళ్ళి ఏం చేస్తానండీ? మీరొకసారి వెళ్ళి అమ్మాయిని చూసి రండి..."

"అది 'స్పేషల్ గా నిన్నే కదా రమ్మన్నది? నన్ను కాదుగా...? నువ్వే వెళ్ళిరా. పోనీ ఇద్దరూ కలిసి వెళ్దాం అనుకుంటే ఆఫీసులో లీవు చెప్పలేను. ఆడీటింగ్ జరుగుతోంది. అయినా, అమ్మ దగ్గర మనసు విప్పి మాట్లాడినట్లు నాన్న దగ్గర మాట్లాడ గలదా...? ట్రైన్ టికెట్టుకు చెప్పుంచాను. రేపే బయలుదేరు..." అన్నాడు భర్త.

భర్త చెప్పినట్టు నా దగ్గర ఏదో రహస్యం చెప్పటానికి నన్ను బలవంతపెట్టి రమ్మంటోందా? విషయమైనా ఫోను లో చెప్పటానికి ఎందుకంత కష్టం? ఫోనులో చెబితే ఏమవుతుంది? కాలం పిల్లలు కన్నవాళ్ళను టెన్షన్ పెట్టటానికి ఏదో ఒక దారి వెతుకుతారు అన్నది నిజమే కాబోలు!

కాకినాడ నుండి విజయవాడ వచ్చి రైలు దిగే వరకు ఆ తల్లి మనసు అల్లల్లాడిపోయింది. సుధా - భరధ్వాజ్ పెళ్ళి జరిగి వచ్చే బుధవారానికి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది. ఒకసారి 16 రోజుల పండుగ సంప్రదాయానికి కాకినాడ వచ్చి వెళ్ళారు. ప్రస్తుతం కూతుర్ని చూడటానికి ఒక విధమైన నిర్భందంతో వచ్చినట్టు ఫీలైయ్యింది. రైల్వే ప్లాట్ ఫారం మీద కూతుర్ని చూసిన తరువాత, ఆమె కళ్ళు అటూ ఇటూ చూసినై.

"అటూ ఇటూ చూసి యేమారొద్దు. నేను మాత్రమే వచ్చాను..." అంటూ తల్లిని చూసి నవ్వింది. అప్పుడు చూసింది కూతురి మొహం. మహాలక్ష్మిలాగా ఉన్నది! బాధ్యతలను ఎక్కువగా మోస్తున్నట్టు మొహం చూపుతున్నా, ఇంకా పిల్ల తనం లక్షణాలు ఉన్న పిల్లలాగానే ఉన్నదే?.

"ఏమిటే...అల్లుడు గారు రాలేదా? నువొక్కదానివే వచ్చావు?" అడుగుతూ కూతుర్ని అదోలాగా చూసింది సుధా తల్లి.

"ఏమిటేమిటీ! పెళ్ళికి ముందు ఒకబ్బాయితో వస్తే పరువు పోయినట్టు చూస్తారు...ఇప్పుడు అల్లుడితో రాకపోవటం వలన అదోలాగ చూస్తున్నావు! ఏమిటమ్మా...నీ చూపు? ఆయన తల మీద బోలడన్ని పనులు. ఆఫీసు - ఇల్లు అంటూ అల్లల్లాడిపోతున్నారు" దగ్గరకు వచ్చి తల్లి చేతిలో ఉన్న బ్రీఫ్ కేసును తీసుకుని తల్లి వంక చూసింది. తల్లి కళ్ళు ఎర్రగా ఉన్నాయి.

"ఏంటమ్మా...బెర్త్ లోనే కదా వచ్చావు...సరిగ్గా నిద్రపోలేదా?"

"కూతురికి ఒక సమస్య అంటే కన్న తల్లికి ఎలా నిద్ర వస్తుంది? అందులోనూ ఉగుతూ వచ్చే రైలులో నాలాంటి విలేజ్ మనుషులకు ఒక చిన్న కునుకు కూడా రాదు..."

చేతిలో ఉన్న లగేజీని కారులో కుక్కి, డోర్ తెరిచి తల్లిని కూర్చో బెట్టిన సుధా కారును వేగంగా నడిపింది.

"నీకు ఏమిటమ్మా సమస్య...?" కూతుర్ని అడిగింది తల్లి.

"నాకు సమస్య అని చెబుతున్నావు...నువ్వే కనుక్కో?"

కూతురు కారు నడుపుతున్న అందాన్ని అప్పుడే చూసింది. ఆశ్చర్యపడింది తల్లి.

"మా ఆయనే నాకు కారు నేర్పించి 'లైసన్స్ సూ తీసిచ్చారు"

అనుభవమున్న డ్రైవర్ లాగా కూతురి దగ్గర ఎంత కంట్రోల్?’

వియ్యంకుడి కుటుంబమే వాకిలికి వచ్చి స్వాగతం పలుక... సుధా తల్లి మనస్సు ఒక్క సెకెండ్ కంట్రోల్ తప్పింది.

అరటి చెట్లు మాత్రమే కట్టలేదు. అంతే, ఎంత హడావిడి చేస్తున్నారు.

వచ్చి రెండు రోజులు అవుతోంది. ఉత్సాహం తగ్గని ఉపచర్య. సినిమాలోలాగా అందరూ కలిసి సుధాను బెదిరించి ఉంచేరో? నా చూపులకు సంతోషంగా ఉన్నట్టు  చూపించి...నేను వెళ్ళిన తరువాత కసురుకుని కూతుర్ని తమ గుప్పిట్లో ఉంచుకుంటున్నారా?’

భోజనం చేస్తున్నప్పుడు కూతురి చెవిలో గుసగుసలాడింది.

"ఏయ్...నువ్వు చదువుకున్న దానివే కదా! ఏదైనా ఉద్యోగానికి వెళ్ళచ్చు కదా...?"

పెళ్ళి చూపులకు వచ్చినప్పుడే వాళ్ళు వేసిన మొదటి ఆర్డర్ 'పెళ్ళైన తరువాత ఉద్యోగానికి వెళ్ళకూడదు అనేదే కదా. అంతలోనే మర్చిపోయావా?"

"అయితే...మనం కట్న కానుకలు తక్కువగా ఇచ్చేమని వియ్యపురాలు బాధ పడుతోందా?"

"నువ్వు ఎక్కువ 'సీరియల్స్ చూసి చాలా బాధపడుతున్నావు...! నీ మనసును మార్చుకో. లేదంటే సీరియల్ మార్చి చూడు" అని నవ్వింది.

వియ్యంకులతో కలిసి...కన్న కూతురు కూడా నాటకమాడుతోందా? ఎవరో వస్తున్న చప్పుడు ఆమె ఆలొచనలను అరికట్టింది. తినడంలో లీనమయ్యింది భానుమతి.

"ఏమిటి వియ్యపురాలమ్మా...కూతుర్ని పెళ్ళి చేసి పంపించడంతో మీ బాధ్యత పూర్తి అయ్యిందని అనుకుని మీ ఊర్లోనే ఉండిపోవటంలో ఏమిటి అర్ధం? అప్పుడప్పుడు వస్తూంటేనే కదా మీ కూతురి మనసు సంతోషపడుతుంది...?" అన్నాడు వియ్యంకుడు.

"మీ అమ్మాయి నాగరీకంగా పెరిగినా...నోటికి రుచిగా వంటచేయడం నేర్పించారు..." భానుమతికి ప్రశంశా పత్రం కూడా చదవబడ్డది.

"రహస్య గూఢాచారిని పెట్టి ఇంటిని గమనించినా సమస్యనూ కనిపెట్టలేము లాగుందే...!'తల్లి ఆనందం.

తండ్రి దగ్గర నుండి 'ఫోన్ వచ్చింది. సుధా కుశలం విచారించి తల్లికి ఫోన్ ఇచ్చి ఏదో పనిమీద వెళ్ళిపోయింది.

అవతల 'ఫోన్ లో భర్త మాట్లాడటం, దగ్గర ఎవరూ లేకపోవడం భానుమతికి ఒక విధంగా మంచిదయ్యింది.

"ఏమండీ...నాకు ఏమీ అర్ధం కావటంలేదు. వియ్యంకుల ఇంట్లో మన అమ్మాయి పట్టు పీతాబరం లాగానే ఉంది. ఒక్క చిన్న సమస్య కూడా ఉండేటట్టు తెలియటంలేదు?"

"......................."

"ఏమిటీ...కొన్ని విషయాలు మనతో చెప్పరు అంటున్నారా? గూఢచారి లాగా వ్యవహరించి మనమే తెలుసుకోవాలా? నా తెలివికి అలా తెలుసుకోవటం కుదురుతుందా అని తెలియటం లేదు...చూస్తాను" అని ఎవరికీ వినబడనంత చిన్నగా మాట్లాడింది.

"నాన్న నీ గురించి అడిగారమ్మాయి. అవునూ...నువ్వు ఇక్కడ బాగున్నావా?"

చుట్టుపక్కల ఎవరూ లేరనే ధైర్యంతో ఇక ఓర్చుకోలేక కూతుర్ని అడిగింది భానుమతి.

"నీ అల్లుడు నన్ను మంచిగా చూసుకుంటున్నాడో లేదో తెలియదు...తనని కన్న వాళ్ళను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. నాన్న చిన్నగా తుమ్మితే చాలు ఈయన ఆసుపత్రికి వెళ్ళి నిలబడతారు. అమ్మ సరదాగా కాళ్ళు పట్టుకుంటే ఈయన తైలం తీసుకు వెళ్ళి నిలబడతారు"

కూతురు కంప్లైంట్ చేస్తున్నట్టు కనిపించినా నవ్వుతూనే చెప్పింది.

"ఒకరోజు ఏం జరిగిందో తెలుసా, 'వాకింగ్' వెళ్ళిన మామగారు అరగంట దాటినా రాలేదు. వెంటనే గుడికి పరిగెత్తి దేవుడితో మొరపెట్టుకుని...తెలిసిన వాళ్ళకూ, తెలియని వాళ్ళకూ ఫోన్ చేసి పెద్ద తతంగమే చేశారు.మంచికాలం పోలీసుల దగ్గరకు వెడతానన్నారు. ఎవరో బాల్య స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్న మామగారు, సమయం తిరిగొచ్చారు

కూతురితో పాటూ తల్లి కూడా నవ్వింది.

"మంచి విషయమే కదా...! మీ మామగారూ -అత్తగారూ అదృష్టవంతులు"

" ఏం నువ్వు అదృష్టవంతురాలివి కావో...! అన్నయ్య నిన్ను ఇలా చూసుకున్నాడా...?"

వదినకు ముఖ్యత్వం ఇచ్చి జీవిస్తున్న అన్నయ్య మీద ఆమెకు కోపం వచ్చింది.

"మనుష్యులంటే... త్రాసు పళ్ళెంలో లాగా పెట్టి తూకం అంతా వేసి చూడకూడదు. అన్ని వేళ్ళూ ఒకటిగానా ఉన్నాయి...?"

కొడుకు అలా ఉన్నా, అల్లుడు మంచి గుణవంతుడుగా ఉండటం భానుమతికి తృప్తినిచ్చింది.

"ఒక పది రోజుల ముందు ఇలాగేనమ్మా....'షాపింగ్' వెల్దాము రెడీగా ఉండు అని నాతో చెప్పారు. నేను రెడీ అయి ఉన్నాను. సమయం చూసి అత్తగారికి చిన్నగా తల తిరిగింది, అన్నీ మర్చిపోయి ఆవిడ్ని ఆసుపత్రిలో చేర్చి 'మాస్టర్ చెకప్' చేయించి ఆమెకు ఏమీ లేదని చెప్పిన తరువాత ప్రశాంత పడ్డారు...".

"అందుకోసం కోపం తెచ్చుకొని నీ భర్తతో గొడవ పడ్డావా...?"

" ...నీ కూతురు అంత అవివేకి అనుకున్నావా? నేనెందుకు గొడవపడాలి? నాకు అంతా ఆశ్చర్యంగా ఉన్నది. చూస్తూ ఉండిపోయాను. కానీ ఒక్కటి మాత్రం  ఖచ్చితమమ్మా....వయసైన తల్లితండ్రులను ఇలా చూసుకుంటున్నారే...రేపు నాకు వయసు పైబడినప్పుడు నాకు ఏదైనా ఒకటంటే ఎలాగంతా చూసుకుంటారు..."

ఆమె కళ్ళు కాంతివంతమవగా....తల్లి మైమరచి నిలబడింది.

రోజు ఊరుకు తిరిగివెళ్ళబోతోంది. మెల్లగా కూతురు దగ్గరకు వెళ్ళింది.

"అవునే...ఏదో సమస్య! వెంటనే రా అని ఫోన్లో చెప్పావే. ఇక్కడ చూస్తే నీకేమీ సమస్య ఉన్నట్టు నాకు అనిపించటం లేదు. అసలు ఏమిటీ నీ సమస్య...?" 

"మీరు రాకపోవటమే సమస్య . దీపావళి పండుగను మీతో జరుపుకోవాలనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించుకున్నాము"

వెనుక నుండి వచ్చిన అల్లుడి మాటలు విని తడబడింది భానుమతి. 'అంత పెద్దగానా అడిగాను?'---సిగ్గుతో చీరకొంగును లాగి భుజాలపై వేసుకుంటూ తనని చిన్నబుచ్చుకుంది.

దృశ్యం సుధాను ఆశ్చర్యపరచింది. రోజుల్లో కూడా ఇలాంటి అత్తగార్లు! ఇలాంటి వారి వలనే భారతీయ సంప్రదాయం ఇంకా బ్రతికే ఉంది

"అత్తయ్యా...మీరు అప్పుడప్పుడు వచ్చి వెడుతూండాలి. మామయ్యకు 'లీవ్' దొరికినప్పుడు ఆయన్నీ తీసుకు రండి. మా అమ్మా-నాన్నలను నేను సంతోషంగా ఉంచుకున్నట్టు మిమ్మల్ని సంతోషంగా పెట్టుకోవాలని సుధాకు అనిపిస్తుంది కదా? ఇక్కడ మగవాళ్ళకు ఒక చట్టం--ఆడవాళ్ళకు ఒక చట్టం అనేది లేదు. చివరి వరకు మిమ్మల్ని కష్టపడకుండా 'చూసుకోవల్సింది మా బాధ్యత"

అందరి కొడుకులూ భరధ్వాజ్ లాగా పెద్ద మనసుతో ఉంటే పెరుగుతున్న వృద్దాశ్రమాలకు పులుస్టాప్ పడుతుంది.

"ఒక్కొక్కరికీ చేతిలో సెల్ ఫోన్ ఉన్నది. ఇంటర్ నెట్ కూడా ఉన్నది. అందులో మాట్లాడుకోవచ్చు...కుశలాలు అడిగి తెలుసుకోవచ్చని కన్నవారు, మెట్టింటికి వెళ్ళిన మేమూ అనుకుంటే బంధుత్వాలు ఎలా నిలబడతాయి? నేను బాగానే ఉన్నాను అని చెబితే...నువ్వు ప్రశాంతంగా మన ఊరి గుడికి వెళ్ళి ఒక అర్చన చేసి సంతోషంగా గుడి చుట్టూ ప్రదక్షణాలు చేసేసి ఇంటి దగ్గరే ఉండి పోతావు!

కూతురు సంతోషంగా జీవించటాన్ని కనులారా చూడటం తప్ప కన్నవారికి లోకంలో ఇంకేమిటి మనశ్శాంతిని  ఇవ్వగలదు? నీకు వెల కట్టలేని సంతోషాన్ని ఇవ్వాలని తీర్మానించుకున్నాము.

అందుకనే ఇంట్లో ఏవో గొడవలు జరుగుతున్నట్టు నువ్వు అనుకోవాలనే నీకు అలా ఫోను చేశాను. నన్ను క్షమించమ్మా" అన్నది.

"హమ్మయ్యా" అనుకుంది భానుమతి.

రైలు ఎక్కించటానికి కూతురు, అల్లుడూ వచ్చారు....

తిరిగి వెళ్ళటానికి మనసు ఒప్పుకోక నస పెడుతున్నప్పుడు...ఎక్కాల్సిన రైలు వచ్చి ప్లాట్ ఫారం మీద ఆగింది.

ఒక పెద్ద నిట్టూర్పు.

ఇక కూతురు ఊరికి---తన ఊరికి తిరిగే టయర్డ్ నెస్ తో ఆనందపడ్డది వియ్యపురాలు భానుమతి.

*********************************************సమాప్తం**************************************** 

ఇవి కూడా చదవండి:    

ఏడు అసాధారణ శక్తిగల రాళ్ళ నిర్మాణం(మిస్టరీ)     

మాస్టారు(కథ)  

*******************************************************************************************************************************************                                                                                                                                                             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి