18, జనవరి 2021, సోమవారం

హచికో కథ, విశ్వాసంగల కుక్క...(ఆసక్తి)


                                                                 హచికో కథ, విశ్వాసంగల కుక్క                                                                                                                                                                     (ఆసక్తి) 

టోక్యో యొక్క షిబుయా రైల్వే స్టేషన్ యొక్క ఐదు నిష్క్రమణ ద్వారాలలో ఒకదానికి వెలుపల హచికో అనే కుక్క యొక్క కాంస్య విగ్రహం ఉంది. ఇది టోక్యో నగరంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సమావేశ కేంద్రాలలో ఒకటి. ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు దాని గుండా నడుస్తారు, దాని ముందు నిలబడతారు, ఫోటో తీసుకుంటారు లేదా స్నేహితులతో చాట్ చేస్తారు. టోక్యో నగరంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సమావేశ కేంద్రంలో కుక్క విగ్రహం ఎందుకు ఉంచారు, ఎందుకు అది ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవడానికి, ఖచ్చితంగా కుక్క కథను తెలుసుకోవాలి.

హచికో ఒక బంగారు-గోధుమ రంగు అకిటా కుక్క. 1923 లో అకిటా అధికారములో ఉన్న ఓడేట్ నగరానికి సమీపంలో ఉన్న పొలంలో జన్మించింది. దాన్ని ప్రొఫెసర్ హిడెసాబురో యునో తీసుకున్నాడు. అతను షిబుయా స్టేషన్ నుండి చాలా దూరంలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్రేమ, దయ చూపించి దాన్ని పెంచాడు. కుక్క అతన్ని ఆరాధించింది. ప్రతి ఉదయం ప్రొఫెసర్ పనికి బయలుదేరినప్పుడు, హచికో తన యజమానితో కలిసి, అతనితో పాటు షిబుయా స్టేషన్ వరకు నడుస్తూ వెళ్ళేది. ప్రొఫెసర్ తన టికెట్ కొని స్టేషన్‌లోకి కనిపించకుండా వెళ్ళేంతవరకు చూస్తుంది. ఆ తరువాత హచికో స్టేషన్ ముందు ఉన్న చిన్న కూడలిలో కూర్చుని, తన యజమాని పని నుండి తిరిగి వచ్చే వరకు వేచి ఉంటుంది.

హచికోకు ఇది ఒక దినచర్యగా మారింది. అలా  ఒక సంవత్సరం గడిచింది. మే నేల 1925 లో ఒకరోజు పనికి వెళ్ళిన ప్రొఫెసర్ యునో తిరిగి రాలేదు. దాని యజమాని ప్రాణాంతకమైన మెదడు రక్తస్రావం ఏర్పడి  మరణించాడని హచికోకు తెలియదు. హచికో వేచి ఉండి, రైళ్లు రావడాన్ని చూడటం, ఎప్పటికీ తిరిగిరాని తన యజమాని కలయిక కోసం ఆశతో ఎదురుచూసేది. తరువాతి తొమ్మిది సంవత్సరాలు, తొమ్మిది నెలలు మరియు పదిహేను రోజులు...ప్రతి రోజు, రైలు స్టేషన్ వద్ద తన యజమాని తిరిగి వచ్చే రైలు సమయానికి ఖచ్చితంగా అక్కడ ఉండేది. తన యజమాని తిరిగి వస్తాడనే నమ్మకంతో. ఎన్నడూ తిగిరాని యజమాని రాకను ఎదురుచూడటం వదులుకోని కుక్క కథ స్థానిక మరియు జాతీయ వార్తల నుండి చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇది షిబుయా స్టేషన్‌లో తన యజమాని కోసం కాచుకోనుంటున్న హచికోను సందర్శించడానికి చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. ఈ తొమ్మిది సంవత్సరాలూ ప్రొఫెసర్ బంధువులు హచికోను చూసుకున్నారు. కాని హచికో తన యజమాని కోసం స్టేషన్‌లో జాగరణను ఎప్పుడూ, ఏనాడూ వదులుకోలేదు.

హచికో యొక్క పురాణ విశ్వాసం విశ్వసనీయతకు జాతీయ చిహ్నంగా మారింది. ఇది జపాన్ ప్రజలను కుటుంబ విధేయత యొక్క ఆత్మగా ఆకట్టుకుంది. దీన్ని అందరూ సాధించడానికి కృషి చేయాలి. జపాన్ దేశం లోని ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు హచికో యొక్క జాగరణను ఒక ఉదాహరణగా ఉపయోగించారు. పిల్లలు పెద్దల యెడల హచికో యజమానికి చూపించిన విశ్వాసం ను అనుసరించడానికి.

హచికో మార్చి 8, 1935 న మరణించింది. హచికో మరణానికి ఒక సంవత్సరం ముందు, హచికో పోలికలో ఒక కాంస్య విగ్రహాన్ని షిబుయా స్టేషన్ వద్ద నిర్మించారు.  హచికో స్వయంగా దాని ఆవిష్కరణకు హాజరయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, హచికో విగ్రహాన్ని కూల్చివేసి, మందుగుండు సామగ్రిని తయారు చేయడానికి కరిగించారు. కాబట్టి యుద్ధం ముగిసిన తర్వాత 1948 లో కొత్తది నిర్మించబడింది. ప్రతి సంవత్సరం మార్చి 8, హచికో యొక్క భక్తిని, జ్ఞాపకార్దంగా టోక్యోలోని షిబుయా రైల్‌రోడ్ స్టేషన్‌లో గంభీరమైన ఉత్సవంతో సత్కరిస్తారు.

షిబుయా స్టేషన్‌లోని హచికో విగ్రహంతో పాటు, హచికో యొక్క సొంత పట్టణంలో, ఓడేట్ స్టేషన్ వెలుపల, మరియు అకితా డాగ్ మ్యూజియం ముందు హచికో విగ్రహాలు ఉన్నాయి. టోక్యో విశ్వవిద్యాలయం హచికో తన యజమాని ప్రొఫెసర్‌తో కలిసి ఆడుతున్న విగ్రహాన్ని కూడా నిర్మించింది. రైలు స్టేషన్‌లో హచికో వేచి ఉన్న ఖచ్చితమైన ప్రదేశంలో శాశ్వతంగా హచికో కాంస్య పాదం ప్రింట్లు, జపనీస్ భాషలో హచికో విధేయతను వివరిస్తుంది. అయోమా స్మశానవాటికలో తన మాస్టర్ సమాధి పక్కన హచికోకు ఒక స్మారక చిహ్నం కూడా ఏర్పరిచారు. హచికో కాపలాగా ఉన్న షిబుయా స్టేషన్ నిష్క్రమణ ద్వారానికి హచికో పేరు పెట్టబడింది. హచికో శరీరాన్ని టోక్యోలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ లో భద్రపరచబడి ప్రదర్శనలో ఉంచారు.



హచికో కథను 2009 లో హాలీవుడ్ చిత్రం 'హచి: ఎ డాగ్స్ టేల్' ప్రపంచానికి తీసుకువచ్చింది. ఈ చిత్రంలో రిచర్డ్ గేర్ ప్రొఫెసర్ హిడెసాబురో యునో పాత్రను పోషించారు.

Images Credit: To those who took the original photos.

************************************************************************************************

ఇవి కూడా చదవండి:

కదులుతున్న ఒక ఎడారి(ఆసక్తి)

సదా యౌవనం(కథ) 

***********************************************************************************************************************




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి