మృత్యుదూత (క్రైమ్ సీరియల్) (PART-4)
“ప్రొఫసర్
సార్...ఆఫ్రికా దేశంలో రెండువేల సంవత్సరాలకు ముందు దొరికిన ఒక మూలిక పెరే ‘మృత్యుదూత’. అది ఒక అపూర్వమైన --
అద్భుతమైన మూలిక. ఫ్రెంచ్ రాజు పద్నాలుగో లూయూ దగ్గర కొన్ని రోజులు ఉన్నది. ఆ
తరువాత అమెరికాలోని మెర్లింగ్ మైకల్ అనే కోటీశ్వరుడి దగ్గరకు వెళ్ళింది.
ఆ తరువాత అదెలాగో కొంతమంది చేతులు మారి, మారి
గడచిన ఒక సంవత్సర కాలంగా మీ దగ్గర ఉన్నది...ఆ ‘మృత్యుదూత’ మూలికనే మేము
ఇప్పుడు అడుగుతున్నాం. అది తీసిచ్చేరనుకోండి, మేము
సైలంటుగా వెళ్ళిపోతాం”
దశరథమూర్తి గారి కళ్ళల్లో ఒక భయం, శరీరంలో
సన్నగా వణుకు మొదలై శరీరమంతా పాకింది.
శ్రీలతని, ఆ నలుగురు యువకులనూ మారి మారి చూసేసి ఆందోళన పడుతూ మాట్లాడటం మొదలు పెట్టాడు దశరథమూర్తి.
“మీరు చెబుతున్న ‘మృత్యుదూత’ మూలిక నాకు కొత్త
వార్తగా ఉంది...నేను నా జీవిత కాలంలో ఎన్నో మూలికల గురించి విన్నాను. ఆ మూలికలను
ఉపయోగించి పరిశోధనలు చేసేను. కానీ ‘మృత్యుదూత’ మూలిక గురించి నేను
విననే లేదు”
“నిజమా...మీరు
వినలేదా?”
“నేనెందుకు అబద్దం చెప్పాలి? తెలిస్తే
తెలుసని చెబుతా. నా పరిశోధనా శాలలో రకరకాలు మూలికలున్నాయి. వాటిలో కొన్నిటికి
పేరుంది. ఇంకొన్నిటికి నెంబర్లు మాత్రమే ఉన్నది! మీకు ఎవరో తప్పైన సమాచారం ఇచ్చారు”
'ఫడేల్'
రామూ యొక్క చెయ్యి కొరడాలాగా తిరిగి దశరథమూర్తి
గారి కుడి చెంప మీద పిడుగులా పడటంతో -- ఆయన పది
అడుగులు దూరంలోకి వెళ్ళి పడ్డాడు.
“ముసలి
నక్కా! తెలియదు అని చెబితే నిన్ను వదిలేస్తామని అనుకుంటున్నావా? ఎంత
కొవ్వు రా ముసలి కుక్కా? మేము గత రెండు
సంవత్సరాలుగా ఎంతో శ్రమ పడి రాత్రనక, పగలనక
తిరిగి ఈ నిజాన్ని కనిపెట్టేమో తెలుసా? ఇదిగో
ఇలా చూడు...ఇలా నటించే పనులన్నీ మా దగ్గర వద్దు.
వొళ్ళు దగ్గర పెట్టుకుని నిజాన్ని
ఒప్పుకుని, ఆ ‘మృత్యుదూత’ మూలికను తీసి
ఇవ్వు...లేదంటే పల్లవిని నీ కళ్లెదుటే నాశనం చేస్తాము. ఆమె శరీరాన్ని ఆసిడ్ పోసి
తగలబెట్టేస్తాము. ఆ తరువాత నిన్ను...”
రామూ చెబుతూనే, లేచి
నిలబడటానికి ప్రయత్నం చేస్తున్న దశరథమూర్తి గారిని ఎగిరి ఒక తన్ను తన్నాడు.
ఆయన దగ్గర దగ్గర ఒక బంతిలాగా ఎగిరి
గోడకు కొట్టుకుని కిందపడ్డారు. నుదుటి మీద చిన్నగా రక్త గాయం ఏర్పడింది.
శ్రీలత కోపంగా పల్లవి వైపు తిరిగింది.
“ఇదిగో చూడు పల్లవి...ఈ ముసలి నక్క నోరు
తెరవలేదనుకో ప్రాణాన్నీ, మానాన్నీ మొదట
వదిలేది నువ్వే. నువ్వైనా నిజం చెప్పు! ‘మృత్యుదూత’ మూలిక ఇక్కడే కదా
ఉన్నది?”
పల్లవి కళ్ళల్లో నీళ్ళు తిరిగినై. గొంతుకలోనే
మాటలు తడబడ్డాయి.
“వచ్చి...వచ్చి...”
శ్రీలత కోపంగా అరిచింది.
“చెప్పు...ఈ
ముసలోడు చేస్తున్న మూలికల పరిశోధనలకు నువ్వే కదా అసిస్టంట్? నీకు
ఈ పరిశోధనా కేంద్రంలో ఉన్న అన్ని విషయాలూ తెలుసు కదా?”
“అ...అ...అన్ని విషయాలూ తెలియదు.
పరిశోధనా కేంద్రంలో ఉన్న కొన్ని మూలికలకు ఏం పేరో కూడా నాకు తెలియదు. నేను ఇక్కడ
ఉద్యోగంలో జేరి ఒక సంవత్సరం కూడా పూర్తవలేదు”
“నువ్వూ
దారికి వచ్చేటట్టు లేవు లాగుందే? ఇద్దరూ చచ్చిపోవాలని
నిర్ణయించు కున్నారనుకుంటా. ఇక మాట్లాడానికి ఏమీ లేదు! రామూ”
“ఏమిటి
శ్రీ”
“నీకు
ఒక్క నిమిషం అవకాశం ఇస్తున్నా. పల్లవి ఒంటి మీద ఒక చిన్న గుడ్డ ముక్క కూడా
ఉండకూడదు...ఊ”
రామూ పల్లవి వైపు కు నడవగా, మిగిలిన
ముగ్గూరూ ఆమెను కదలకుండా పట్టుకున్నారు.
దశరథమూర్తి గారు బలం పుంజుకుని
రెండడుగులు ముందుకు వేశాడు.
శ్రీలత చేతిలో ఉన్న తుపాకీ ఆయన్ని
అడ్డుకుంది.
“ఇప్పుడైనా
నిజం చెప్పు...’మృత్యుదూత’ మూలిక నీ దగ్గరే కదా
ఉంది?”
“ఇదిగో చూడు...నువ్వు చెప్పే ఆ పేరులో
ఎలాంటి మూలికా లేదు...కావాలంటే నా బంగళా లోపల ఉన్న మూలికల గదికి రా. వచ్చి చూడు.
నీకు నచ్చిన మూలికలన్నిటినీ తీసుకో...నువ్వు ఏ మూలిక తీసుకున్నా, నేను
ఏమీ చెప్పను”
“రామూ!
ఈ ముసలాడు మన దారికి రాడు గానీ...నువ్వు పల్లవి బట్టలు ఊడదీయి"
రామూ యొక్క కుడి చెయ్యి వేగంగా పనిచేసి పల్లవి
భుజాలపై నున్న దుప్పటాను లాగిన క్షణం.
టేబుల్ మీదున్న టెలిఫోన్ మోగింది.
శ్రీలత దశరథమూర్తి గారి వైపు చూసింది.
“ఫోనులో
ఎవరు?”
“తెలియదు”
“మామూలుగా
ఈ టైముకు ఎవరు ఫోన్ చేస్తారు?”
“నా స్నేహితుడు బసవప్ప అయ్యుండొచ్చు”
“ఈ
ఫోనుకు ప్యారలల్ లైను ఉన్నదా?”
దశరథమూర్తి గారు సమాధనమే
చెప్పకుండా ఐదు క్షణాలు మౌనం వహిస్తుంటే, శ్రీలత
తన చేతిలో ఉన్న తుపాకీతో ఆయన తొడపై గుచ్చింది.
“నేనడిగింది
వినబడలేదా?”
“ప...పక్క గదిలో కార్డ్ లెస్ ఫోన్ ఉన్నది”
“వెళ్ళి
తీసుకురా”
దశరథమూర్తి గారు తొడను
తుడుచుకుంటూ, కుంటు కుంటూ వెళ్ళి, పక్క గదిలో ఉన్న
కార్డ్ లెస్ ఫోనుతో పాటూ వచ్చాడు. దాన్ని అతని చేతిలోంచి లాక్కున్న శ్రీలత, గొంతు
చిన్నది చేసుకుని చెప్పింది.
“ఇప్పుడు
ఫోన్ అటెండ్ చెయ్యి అవతల సైడు మాట్లాడే వారు ఎవరైనా సరే, ఏది
మాట్లాడాలో అది మాత్రం మాట్లాడేసి రీజీవర్ను వెంటనే పెట్టేయాలి...మమ్మల్ని
పట్టించేటట్టు ఏదైనా ఒక్క మాట మాట్లాడినా సరే...తరువాతి క్షణం నువ్వు ప్రాణాలతో
ఉండవు... పల్లవినూ
ఉండదు...ఊ...తీసి మాట్లాడు”
దశరథమూర్తి గారు తడబడుతూ నడిచి
వెళ్ళి,
టెలిఫోన్
ముట్టుకుని రీజీవర్ తీసి మాట్లాడగా, శ్రీలత
తన చేతిలో ఉన్న ‘కార్డ్
లెస్ ఫోన్’
ను చెవి దగ్గర పెట్టుకుంది.
దశరథమూర్తి గారు మాట్లాడటం
మొదలుపెట్టాడు.
“హలో”
అవతల పక్క ఒక మగ గొంతు.
“ఏమిటి
దశరథమూర్తి గారు...టెలిఫోన్
మోగితే రిజీవర్ తీయటానికి ఇంతసేపా?”
“మీరెవరు?”
“సరిపోయింది...ఇంత వరకు నేను ఎన్ని
సార్లు ఫోన్ చేసుంటాను. గొంతు ఎవరిదో వెంటనే కనిపెట్టద్దా? నేను.
బెంగళూర్ నుంచి బసవప్ప మాట్లాడుతున్నాను”
“ఓ... బసవప్పా...మీరా? ఇక్కడ
ఫోన్ కొంచం సరిలేదు. అందుకే మీ వాయిస్ కొంచం వ్యత్యాసంగా వినబడుతోంది. ఏమిటి విషయం
చెప్పండి...”
“సంతోషమైన
విషయమే...! మూలికా ఔషధ గుణాల గురించి పరిశోధనా సదస్సు ఒకటి వచ్చే నెల ఢిల్లీలో
ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సదస్సు బృందంలో మిమ్మల్నీ ఒక స్పీకర్ గా వేశారు.
సదస్సు మొత్తం మూడు రోజులు జరగబోతోంది. ఇందులో మన అంతర్జాతీయ మూలికా పరిశోధనా సంఘం
ప్రెశిడెంట్ పాల్గొంటారు”
“ఓ...ఆలాగా....చాలా
సంతోషం...”
“ఏమిటి
మీ మాటలో ఒక వణుకు...ఒంట్లో బాగుండలేదా?”
“అదంతా ఏమీ లేదు...ఐ యాం ఆల్ రైట్. గదిలో
ఏ.సీ. కొంచం ఎక్కువగా ఉంది”
“తరువాత
దశరథమూర్తి గారు...మీ
మూలికా పరిశోధన ఎలా ఉంది?”
“బాగా పోతోంది”
“వచ్చే
నెల ఢిల్లీలో జరగబోయే ఆ ప్రత్యేక సదస్సు మీకు ఒక వరప్రసాదంగా అమరింది....ఈ
సదస్సులో మీరు మామూలుగా సమర్పించే మీ మూలికా పరిశోధన వ్యాసాలతో పాటు, ముఖ్యంగా
ఆ ‘మృత్యుదూత’ మూలిక గురించిన
పరిశోధనా వ్యాసాన్ని మీరు చదివితే, అది
అతిపెద్ద ‘హైలట్’ గా ఉంటుంది.
మరుసటిరోజు పేపర్లలో, వార్తలలో మీ పేరు, ఫోటో
మారుమోగిపోతుంది”
దశరథమూర్తి గారు నిర్ఘాంతపోయి
చెమటలు కక్కారు.
“మృత్యుదూత’ మూలికా...మీరేం
చెబుతున్నారు”
“మీదగ్గరున్న
ఆ అపూర్వమైన, అరుదైన మూలిక పేరు ‘మృత్యుదూతే’ కదా?”
“అది...వచ్చి”
“ఏమిటా
కంగారు దశరథమూర్తి గారు...ఆ
మూలిక పేరు మరిచిపోయారా?”
“అదంతా ఏమీ లేదు”
“ఈ
రోజు మీరు సరిలేరు. ఏదో గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తోంది....నేను ఎల్లుండి మళ్ళీ
ఫోన్ చేసి మాట్లాడతాను. ఢిల్లీ నుండి ఇంకో రోజులో మీకు మూలికా సదస్సు సంబంధంగా ఒక
లెటర్ వస్తుంది. ఒక సంప్రదాయం కొరకు దాన్ని ఫాక్స్ చేయండి”
“ఊ...ఊ...”
అవతల పక్క బసవప్ప రీజీవర్ పెట్టేయడంతో, దశరథమూర్తి గారు చెమటలు పట్టిన
శరీరంతో రిజీవర్ పెట్టకుండానే భయపడ్డ కళ్లతో శ్రీలతను చూడగా -- ఆమె ‘కార్డ్ లెస్ ఫోన్’ ఆఫ్ చేసి తలను ఒక
పక్కకు వంచి నవ్వింది.
“ముసలి కుక్కా...ఇప్పుడేమంటావ్… ఇప్పుడు కూడా 'మృత్యుదూత’ మూలిక నీకు తెలియదు అంటావా?”
Continued....PART-5
*********************************************************************************************
ఇవి కూడా చదవండి:
ఆక్టోపస్ లు అన్యగ్రహ జీవులా?(మిస్టరీ)
అద్భుతమైన మంకీ రూపం కలిగిన పువ్వులు(ఆసక్తి)
*****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి