22, జనవరి 2021, శుక్రవారం

మృత్యుదూత (క్రైమ్ సీరియల్)...PART-2

 

                                                                       మృత్యుదూత (క్రైమ్ సీరియల్)                                                                                                                                                                  (PART-2)

కెమేరా ఆంగిల్స్ మార్చి పెట్టబడి, రెండు వేల వోల్ట్ బల్బులు వేడితో వెలుతురు విరజిమ్ముతున్నాయి.

శ్రీలత తన చేతిలో ఉంచుకున్న కాలర్ మైక్ ను దశరథమూర్తి గారి చొక్కాకు అమర్చింది.

కెమేరాలు పని మొదలుపెట్టగానే, శ్రీలత కెమేరాల వైపు నవ్వుతూ చూస్తూ తన మాటలను మొదలు పెట్టింది.

జూపీటర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. స్వాగతం! వ్యత్యాసమైన వ్యక్తులు కార్యక్రమంలో ఇది తొమ్మిదో భాగం. రోజు మనం చూడబోయే వ్యత్యాసమైన వ్యక్తి  శ్రీ దశరథమూర్తి గారు. ఈయన బయటి లోకానికి పెద్దగా పరిచయంలేని ఒక వి..పి.

గత నలభై సంవత్సరాలుగా ఆర్కియాలజీఅని పిలువబడే పురాతన వస్తువుల పరిశోధనా సంస్థలో ప్రొఫసర్ గానూ, పరిశోధనా సైంటిస్టుగానూ పనిచేస్తూ మానవ జాతికి ఎంతో ఉపయోగపడే అరుదైన మూలిక లను పరిశోధించి చాలా వ్యాసాలు రాసి అంతర్జాతీయ మూలికా సదస్సులలో, మహ శభలలో సమర్పించారు. పెద్ద పెద్ద పత్రికలలో మాత్రమే ఈయన పేరు కనబడుతుంది. సామాన్య మానవుల మనసులో చోటు పట్టులేకపోవటానికి కారణం, ఇక్కడున్న ప్రజలకూ, విదేశీయ ప్రజలకూ మూలికల గురించి ఎక్కువగా తెలియదు కనుక. మూలికల గురించి తెలుసుకోవటానికే రోజు దశరథమూర్తి గారిని కలుసుకుని మాట్లాడబోతున్నాము. నమస్తే ప్రొఫసర్ దశరథమూర్తి గారూ!”

అప్పుడు కెమెరాలు దశరథమూర్తి గారి వైపు తిరిగినై. ఆయన తన రెండు చేతులనూ జోడించి నమస్తేచెప్పారు. తరువాత మొదలుపెట్టారు.

ఇలాంటి ఇంటర్ వ్యూల మూలం నా గురించో, నేను చేసే మూలికల పరిశోధనల గురించో, నన్ను ప్రజలకు చూపించుకోవాలనేదో నా ఉద్దేశ్యం కాదు. మూలికల గురించి ప్రజలు తెలుసుకోవాలనే ఒకే ఒక  ఆశతో జూపీటర్ టీవీ నా దగ్గర ఇంటర్ వ్యూ చేయడానికి ముందుకు వచ్చారు. మంచి ప్రయత్నానికి టీవీ నిర్వాహకులకు నా శుభకాంక్షలను, సంతోషాన్నీ తెలియపర్చుకుంటున్నాను 

కెమెరాలు శ్రీలత వైపు తిరిగినై.

ఆమె మొదటి ప్రశ్న అడిగింది.

మూలిక అంటే ఏమిటనేది బహుశ చాలా మందికి తెలిసిన పదమే. వాటికి ఔషధ శక్తులు ఉంటాయనేది కూడా చాలా మందికి తెలిసుంటుంది. కానీ, ఈ మూలికల గురించి ముప్పై ఏళ్ళు పరిశోధన, అంతర్జాతీయ సదస్సులు, శభలు, ప్రశంగాలు, వ్యాసాలు...దానికొసం కోట్ల కొద్ది డబ్బు ఖర్చుపెట్టడం---దీని గురించి చెప్పండి సార్

చాలా మంచి ప్రశ్న అడిగావు. నేను దీనికి క్లుప్తంగా జవాబు చెబుతాను. మూలిక అనగానే అదేదో వాడుకలో భారతదేశానికి మాత్రమే సొంతమైనదని చాలా మంది అనుకుంటారు. అది తప్పు. మూలికలను ఔషధాలుగా వాడుకునే సంప్రదాయం పలుదేశాలలో వాడుకలో ఉంది. నిజానికి మూలికలు దేవుడు మనిషికి ఇచ్చిన పృక్రుతి ఔషధం. అయితే రసాయన ఔషధాలు, చికిత్స శాస్త్రీయ సపోర్ట్ తో ప్రబలమైంది కాబట్టి, ఈ మూలికా చికిత్స విధానం పూర్తిగా కనుమరుగయ్యింది. కానీ, నిజానికి మూలికా ఔషధ చికిత్స చాలా గొప్పది. రసాయన ఔషధ చికిత్స కంటే చాలా గొప్పది. అయితే దీనికి శాస్త్రీయ సపోర్టు లేదు. ఔషధ గుణాలున్న మూలికలకు శాస్త్రీయ సపోర్ట్ జతచేయటం కోసమే భారత దేశంతో పాటూ మూలికలపై నమ్మకమున్న మరికొన్ని దేశాలు కలిసి ఈ మూలికా పరిశోధనా ప్రయత్నంలో పెట్టుబడి పెట్టాయి.

మూలిక అనగానే అదేదో భారత దేశానికి మాత్రమే సొంతం, అవి మన దేశంలో మాత్రమే దొరుకుతాయి అనుకొవడం కూడా పొరపాటే. ఈ ఔషధ గుణాలున్న మూలికలు అన్ని ప్రపంచ దేశాలలోనూ ఉన్నాయి. కొన్ని దేశాలు వాటిని ఔషధాలుగా వాడుతున్నారు. కొన్ని దేశాలు వాటిని పట్టించుకోవటం లేదు. మేము అలా ప్రపంచ దేశాలలో దొరుకుతున్న మూలికలను గుర్తించి, వాటిపై పరిశోధన చేసి వాటి ఔషధ గుణాలను శాస్త్రీయంగా నిరూపించి, వాటిని వాడకంలలోకి తీసుకు రావాలనేదే మా ప్రయత్నం. మా ప్రయత్నంలో మేము కొంతవరకు విజయం సాధించాము. రసాయన ఔషధాలలో, ఔషధ గుణాలున్న మూలికలను కలిపి ఔషధాలు తయారు చేస్తున్నారు. కానీ ముఖ్యమైన కొన్ని పెద్ద వ్యాధులకు చికిత్స అందించగల మూలికలను ఇంకా పూర్తిగా వాడటం లేదు. అలాంటి మూలికలు చాలా వరకు మా పరిశోధనా కేంద్రంలో ఉన్నాయి. వాటికి శాస్త్రీయ పరిశోధనా నివేదికలను కూడా అందించాము. అందించింది చాలదు...ఇంకా కావాలని అడుగుతున్నారు. ఆ ప్రయత్నంలోనే నేను ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాను

మూలిక అంటే నిజానికి ఏమిటి సార్? అది ఆకులా...కొమ్మలా...వేర్లా?”   

దశరథమూర్తి గారు తన కళ్లద్దాలను తీసి, చేతిలో పెట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టారు.

మూలిక అనే పదం చెట్లకు సంబంధించినదే. అది ఆకులు కావచ్చు, కొమ్మలు కావచ్చు, మొక్కలు కావచ్చు, వేర్లు కావచ్చు. ఇవన్నీ మూలికల సముదాయంలోనే వస్తాయి. మరో విధంగా చెప్పాలంటే ఔషధ గుణాలున్న వృక్ష జాతికి చెందినది ఏదైనా కావచ్చు

ఆయుర్వేదం అని చెప్పొచ్చా?”

అలాగూ చెప్పలేము. ఆయుర్వేదం మూలికల ఔషధ సముదాయంలో ఒక భాగం. మూలికలు దానికంటే విలువైనవి. ఆయుర్వేదం అనేది నేను ఇందాక చెప్పిన వన్నిటినీ కలిపి చెప్పవచ్చు. మూలిక అలా కాదు. అందులో ఏదో ఒకటే

శ్రీలత కురులు పైకెత్తింది.

ఏమిటి సార్ చెబుతున్నారు...నాకు అర్ధం కాలేదు

ఒకే ఒక దానికే ఎక్కువ ఔషధ శక్తి ఉన్నదానిని మూలిక అంటాను. చికిత్సకు ఆ ఒక్కటే చాలు....అన్నిటినీ కలుపనవసరం లేదు

నిజమా?”

అవును...అదే నా పరిశోధనా పని. ప్రపంచంలోని పలు అడవులలో, పలు చోట్ల అలాంటి మూలికా చెట్లు ఉన్నాయి. వాటిని కనిబెట్టి ఉపయోగానికి తీసుకు రావాలనేదే నా పరిశోధన.  ప్రతిదేశంలోనూ నా లాగా పరిశోధన చేసే వ్యక్తులున్నారు. కొన్ని దేశాలలో ప్రభుత్వాలే వాటికి నిధులు ఇస్తున్నాయి. అలాంటి వారితో కలిసి నేను కనుగొన్న మూలికల గురించి వాళ్ళకూ, వాళ్ళు కనుగొన్న మూలికల గురించి నాకూ, ఇతర దేశాల నిపుణులకూ వారి పరిశోధనా ఫలితాలను పంచుకోవటమే మూలికా సదస్సులు

మీరు గానీ, ఇతర నిపుణులుగానీ ఇంతవరకు కనుగొన్న మూలికలు ఏ ఏ వ్యాధులకు పనికొస్తాయో మా ప్రేక్షకులు తెలుసుకోవచ్చా?”

తప్పకుండా... మేము కనిపెట్టిన మూలికలతో క్యాన్సర్, డయాబిటీస్, స్థూలకాయం, మతిమరుపు, పక్షవాతం లాంటి వ్యాధులు అతి తక్కువ రోజులలో గుణం అవుతాయి

నిజమా?”

వందకు వంద శాతం నిజం

మీరు చెప్పేది చూస్తే మెడిసన్ చదవటం మానేసి మూలికల గురించి చదవటం మంచిదనిపిస్తోందే?”

నన్ను అడిగితే అలా చేయటం మంచిదే అని చెబుతా. ఇందులో ఎటువంటి మోసమూ లేదు. ఇలాంటి ప్రత్యేక మూలికల గురించి నేను అంతర్జాతీయ ఆరొగ్య సంస్థకు నివేదిక సమర్పించాను

వాళ్ళు అది ఒప్పుకున్నారా?”

పూర్తిగా ఒప్పుకోలేదు

కారణం?”

ఇంగ్లీష్ మందులపైన ఉన్న వ్యామోహమే. దానికంటే వాళ్ళకు ఇంకో భయం కూడా ఉన్నది

ఏమిటది?”

మూలికలతో వ్యాధులు గుణమైతే, ఇంగ్లీష్ మందులు తయారుచేసే కంపెనీలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. దాని వలన ఆర్ధీక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంగ్లీష్ మందులను టన్నులు, టన్నులుగా తయారు చేసి కోట్లకొలది లాభాలను పొందుతున్న ప్రపంచంలోని పది మందుల కంపెనీలు ప్రపంచ ఆరొగ్య సంస్థలో ఉన్నవారిని ఇండిపెండెంటుగా గమనిస్తారు. వాళ్లందరూ పరిస్థితుల మూగవారిగా ఉండిపోయారు. ఈ రోజు కాకపోతే...ఇంకో రోజైనా నోరు విప్పాల్సిందే

శ్రీలత అడ్డుపడింది.

మీరు తప్పుగా అనుకోకపోతే, నేను ఒక అభిప్రాయం చెప్పొచ్చా సార్?”

ఖచ్చితంగా

ఇప్పుడు మూలిక ఔషధాలు, మన దేశంలో ఉన్న ఆయుర్వేద, హోమియోపతి, సిద్దా, యునానీ ఆసుపత్రులలో...వీటిలో ఇప్పటికే మూలికా ఔషధాలను వాడుతున్నారు. మరి వాటి సంగతేమిటి...అవి పనిచేయవా?”

అవి పనిచేస్తున్నాయో, లేదో అవి వాడుతున్న ప్రజల మనోభావల మీద అధారపడి ఉన్నదమ్మా...కానీ, నేను చెప్పే మూలికల ఔషధ శక్తులకు శాస్త్రీయ పరిశోధనా రిపోర్టులు ఉన్నాయి. అంటే ఈ మూలిక ఈ మోతాదులో, ఇన్ని డోసులు ఇస్తే వ్యాధి నయం అవుతుందని ఖచ్చితమైన రుజువులు ఉన్నాయి. ఈ రుజువులను మన ప్రభుత్వమూ, ప్రపంచ ఆరొగ్య సంస్థ అంగీకరిస్తే...ఇక మూలికా చికిత్సా ప్రభల మవుతుంది. ప్రజలు మంచి చికిత్సలు పొందుతారు

మీరు చెప్పే దాంట్లో అన్ని వ్యాధులకూ మూలికలు ఉన్నాయా?”

చాలా వ్యాధులకు ఉన్నాయి. మిగిలిన వ్యాధులకు కూడా మూలికలు సేకరించి పరిశోధనలు చేస్తున్నాము. వాటికి కూడా మూలికలు దొరుకుతాయి

ఎలా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు

ఇది ప్రకృతికి సంబంధించినది. ప్రకృతి మానవులకు అన్నీ రకాల వనరులూ ఇచ్చిందని నేను నమ్ముతున్నాను

మూలికలను నేను...ఐ మీన్ మా ప్రేక్షకులకు చూపిస్తారా?”

సారీ! ప్రస్తుతానికి ఆ అరుదైన మూలికలను బయటవాళ్లకు చూపించటానికి నాకు అనుమతి లేదు. నా పరిశోధనలు పూర్తిగా ముగిసిన తరువాత, ప్రభుత్వాలూ, ప్రపంచ ఆరొగ్య సంస్థ అంగీకరించిన తరువాత ప్రింట్ మీడియా, టీవీ ఛానెల్స్ ను పిలిచి నేనే చూపిస్తాను

శ్రీలత నవ్వింది.

"మిస్టర్ దశరథమూర్తి! మాది చాలా బిజీ అయిన టీవీ ఛేనల్. మీరు పిలిచినప్పుడంతా మేము కెమేరాలు తీసుకుని రాలేము. ఈ రోజే మీరు మూలికలను చూపిస్తే పరవాలేదు

అంతవరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న పల్లవి కొంచం కోపంగా శ్రీలతను  చూసింది.

మీరు మాట్లాడే మాటలు నాకు నచ్చ లేదు. మూలికలను ఇప్పుడు చూపించలేను అని చెబితే, అది ఒప్పుకుని మౌనంగా ఉండటమే సంప్రదాయం. ఇంటర్ వ్యూకి వచ్చేసి బెదిరించినట్టు మాట్లాడటం సరికాదు

ఏయ్! నేను మాట్లాడుతున్నది దశరథమూర్తి దగ్గర! నీ దగ్గర కాదు. నీ పని చూసుకునిపో...

శ్రీలత కోపంగా అరవటంతో -- దశరథమూర్తి గారు ఆశ్చర్యపోయి లేచి నిలబడ్డారు. మొహం అంతా కోపతాప సెగ. పెదాలు ఆవేశం చెందాయి.

గెట్ లాస్ట్ ఎవిరి బడీ...టీవీ మీడియా బృందానికి ఇంత కొవ్వా? మీ ఏం.డీ. కి ఇప్పుడే ఫోన్ చేస్తాను...

దశరథమూర్తి గారు చెబుతూ తన జేబులోకి చెయ్యి పెట్టి సెల్ ఫోన్ తీశారు.

పల్లవి...! జూపీటర్ టీవి ఫోన్ నెంబర్ చెప్పు 

పల్లవి సెల్ ఫోన్ నెంబర్ చెప్పటానికి ప్రయత్నిస్తున్న క్షణం -- శ్రీలత తన చేతితో పాటూ తీసుకు వెళ్ళిన వానిటీ బ్యాగ్ జిప్పును తెరిచి చెయ్యి లోపలకు పెట్టి తీసింది.

రివాల్వర్.

పల్లవి చూపులు భయంతో నిశ్చేష్టమవగా, దశరథమూర్తి చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆయన వేళ్ళ పట్టులో నుండి జారిపోయింది. 

శ్రీలత రివాల్వర్ తో పాటూ లేచి నిలబడింది.

మిస్టర్. దశరథమూర్తి. మీరు అనుకుంటున్నట్టు మేము టీవీ బృందం కాదు. మిమ్మల్ని ఇలాంటి ఒక సందర్భంలో కలుసుకోవాలని ఆ టీవీ పేరు ఉపయోగించుకున్నాం. మీరూ, మీ అసిస్టంట్ పల్లవి...ఇద్దరూ ఇంకో గంట సేపు కొంచం కూడా కోపం తెచ్చుకోకుండా మాతో సహకరించాలి. మేము అడిగే ప్రశ్నలన్నింటికీ నిజమైన సమాధానం చెప్పాలి. అబద్దం చెబితే...అది ఈ వరస్టు ఫెలోకు నచ్చదు.....ఏమిటి ఇద్దరూ అలా చూస్తున్నారు. వరస్టు ఫెలో అని చెప్పింది ఈ తుపా కీనే. దాని పేరే వరస్టు ఫెలో 

చేతిలో తుపాకీతో నిలబడ్డ శ్రీలతని -- ఆమె వెనుక గుండ్రంగా నిలబడ్డ నలుగురిని ఇప్పుడు దశరథమూర్తి గారు భయంతో చూశారు.

మీ... మీకు ఏం కావాలి? డబ్బా?”

డబ్బు ఎవరికి కావాలి?”

మ.మ...మరేం కావాలి?”

శ్రీలత చేతిలో తుపాకితో దశరథమూర్తి దగ్గరకు జరిగి తుపాకీతో ఆయన బుగ్గల మీద ఒక  గీత గీసింది.

మాకు ఏం కావాలో చెప్పమా?”

చె...చెప్పు

మృత్యుదూత

                                                                                                    Continued...PART-3

*******************************************************************************************************

ఇవి కూడా చదవండి:

మానవ శరీరం గురించి ముఖ్య వాస్తవాలు(ఆసక్తి)

వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి విన్నూత గ్లోబల్ ప్రాజెక్టులు-PART-1(ఆసక్తి)

********************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి