'విద్యుత్ ఆదా కోసం కృతిమ చంద్రుడు'...(ఆసక్తి)...26/02/21 న ప్రచురణ అవుతుంది

'మేఘలలో మర్మమైన మానవరూపాలు'...(మిస్టరీ) ..28/02/21 న ప్రచురణ అవుతుంది

'ఆమే వస్తానంది'...(కథ)...02/03/21 న ప్రచురణ అవుతుంది

7, ఫిబ్రవరి 2021, ఆదివారం

మృత్యుదూత (క్రైమ్ సీరియల్)...PART-10

 

                                                                          మృత్యుదూత (క్రైమ్ సీరియల్)                                                                                                                                                                (PART-10)

దశరథమూర్తి గారి బంగళా.

సమయం రాత్రి తొమ్మిది.

దశరథమూర్తి గారు కలతతో మౌనంగా కూర్చోనుండగా -- ఎదురుగా కమీషనర్ సర్వానంద్, ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, నటి రంజని కూర్చోనున్నారు.

రంజని ముఖం భయంతో వాడిపోయింది.

మిస్టర్ దశరథమూర్తి! నాకు ఇంకా నమ్మకం రావటం లేదు. చెట్ల వేర్లు లాగా ఉండే ఒక మూలికకు ఇంత శక్తి ఉందా? దాన్ని పెట్టుకుని ఒకరి ప్రాణం తీయటం  కుదురుతుందా?”

మానవ జాతిలో మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళూ ఉన్నట్లే...మూలికలలోనూ మంచివి - చెడ్డవి ఉన్నాయి. మామూలుగా చాలా మూలికలకు ఔషధ గుణాలు మాత్రమే ఉన్నాయి. మృత్యుదూత మూలిక, అరవై శాతం ఔషధగుణం, నలబై శాతం చెడు గుణం కలిగి ఉంది. ఆ మూలికను తీసుకు వెళ్ళిన శ్రీలత దాన్ని మంచి పనులకు ఉపయోగించకుండా...చెడ్డ పనులకు వాడటం మొదలు పెట్టింది. దీన్ని ప్రారంభంలోనే తుంచేయాలి. గత మూడు నెలలుగా పోలీసు డిపార్ట్మెంట్ నిద్రపోతున్నది చాలు. ఇకనైనా వెతికే వేట మొదలుపెట్టి -- ఆ శ్రీలత ని, ఆమెతో ఉన్న ఆ నలుగురు యువకులనూ కనిపెట్టి -- ఆ మూలికలన్నిటినీ చేజిక్కించుకోవాలి. లేకపోతే విపరీతాలు జరగటం ఆపలేము

కమీషనర్ సర్వానంద్ అడ్డుపడ్డారు.

మిస్టర్ దశరథమూర్తి... శ్రీలత, ఆమెతో ఉన్న ఆ నలుగురు కుర్రాళ్ళూ ప్రస్తుతం మన రాష్ట్రంలోనే ఉన్నారు, అందులోనూ మన హైదరబాద్ లోనే ఉన్నట్టు ఇప్పుడు రంజనిని హెచ్చరించటం వలన మనకు తెలుస్తోంది. కానీ, ఫోన్ కాల్ ట్రాక్ చేసి చూస్తే  ఆ కాల్ తమిళనాడులోని ఆంధ్రా బార్డర్లో ఉన్న ఉలవానూర్ అనే గ్రామంలో నుండి చేసింది. కాబట్టి వాళ్ళు అక్కడ ఎవరింట్లోనో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రా పోలీస్ స్పేషల్ బ్రాంచ్ పోలీసులు, ఆ ఊరికి మధ్యాహ్నమ్మే బయలుదేరి వెళ్లారు...త్వరలోనే వాళ్లను పట్టుకుంటాము

ఈ చురుకుదనాన్ని మీరు ముందే చూపుండచ్చు కదా. రంజని గారి ప్రాణానికి ఆపద అని తెలిసిన వెంటనే, ఇంత వేగంగా ట్రై చేస్తున్నారు

దశరథమూర్తి గారూ, ఈ కేసులో ఇప్పుడే మొదటి క్లూ దొరికింది. ఇది చాలు. వాళ్లను పట్టుకోవటానికి ఇది చాలు

అంటే రంజని గారి ప్రాణానికి, మీరు వేగంగా పనిచేయటానికీ సంబంధం లేదా?”

ఏం చెయ్యం... దశరథమూర్తి గారూ? అంతా రాజకీయమే. రంజని మీద ఒక చిన్న గోరు గీత కూడా పడకూడదని ఇద్దరు వి.ఐ.పి లు గెజట్ లో వేసేంత తీవ్రంగా ఆర్డర్ వేశారు...అలా మేము చేయలేదనుకోండి మమ్మల్ని ఎక్కడైన దూరంగా విసిరి పారేస్తారు

దశరథమూర్తి గారు చిన్నగా నవ్వుతూ, తలెత్తి రంజనిని చూశారు.

ఏమ్మా...నేను నీ దగ్గర ఒక ప్రశ్న అడగొచ్చా?”

అడగండి సార్

నిన్ను హత్య చేయాలనుకునేంత కోపం శ్రీలతకి ఎందుకు ఏర్పడింది?”

అదే నాకూ అర్ధం కావటం లేదు సార్! ఆ శ్రీలత నలుపా, ఎరుపా అని కూడా నాకు తెలియదు. ఆమె ఎందుకు నన్ను హత్య చేయాలనుకుంటోందో తెలియటం లేదు. నేను రాజకీయ రంగంలో పలుకుబడి సంపాదించి ఉంచుకోవటం ఆమెకు నచ్చలేదో,ఏమో?”

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, దశరథమూర్తి గారి వైపు తిరిగాడు.

సార్! రంజని గారిని ఆ మృత్యుదూత మూలిక నుండి కాపాడటానికి ఏదైనా దారి ఉందా?”

ఓకే ఒక దారి ఉంది

చెప్పండి సార్

గది పూర్తిగా ఎర్ర  కాంతి ఉండేలాగా ఇరవైనాలుగు గంటలూ నలభై వాట్స్ లైటు వెలుగుతూ ఉండాలి. ఎర్ర కాంతిలో ఏ మూలిక శక్తి కిరణాలు చొచ్చుకు పోలేవు. మూలిక భయం లేకుండా నిద్రపోవచ్చు. ఎర్రని కాంతిలో మూలికలు చంద్ర కాంతిలో కలిసి ట్రావల్ చెయ్యలేవు

శ్రీలత థ్యాంక్స్ చెబుతున్నప్పుడే...కమీషనర్ సర్వానంద్ యొక్క సెల్ ఫోన్ రింగ్ అయ్యింది. తీసి చెవి దగ్గర పెట్టుకున్నారు. అవతలవైపు డెప్యూటీ కమీషనర్.

సార్...నేను దీపక్ శర్మ

చెప్పండి

ఒక విపరీతం సార్

ఏమిటది?”

జడ్జ్ జవహర్ గారు...హత్య చేయబడ్డారు సార్

ఎవరు...తీవ్ర వాదులను విచారణ చేస్తున్న విషేశ కోర్టు జడ్జ్ జవహర్ గారి గురించా మీరు చెబుతున్నారు

అవును సార్

చావు ఎలా? హంతకుడ్ని పట్టుకున్నారా

సార్... జవహర్ గారి మరణం, సారధి గారి మరణం లాగానే జరిగింది సార్

అంటే రక్తం చెమట...రక్తం కక్కు?”

అవును సార్

ఏ ఆసుపత్రి?”

చెప్పాడు.   

నేను వెంటనే బయలుదేరి వస్తాను---సెల్ ఫోన్ ను ఆఫ్ చేసి జేబులో పెట్టుకుంటూ కమీషనర్ సర్వానంద్ రెండు చేతులతోనూ మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ దశరథమూర్తి గారిని చూసాడు.

మృత్యుదూత మూలిక, జస్టీస్ జవహర్ గారిని కూడా బలితీసుకుంది. సారధి గారికి లాగానే రక్తం చెమటలు, రక్తం కక్కు ఏర్పడి మరణం

దశరథమూర్తి గారు నీరసపడిపోయి, అలాగే కుర్చీలో వాలిపోయారు.

కమీషనర్ సర్వానంద్, ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ను చూశారు.

మీరు రంజని గారిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఆమె ఇంట్లో దిగబెట్టి, హాస్పిటల్ కు వచ్చేయండి

కమీషనర్ అందరి దగ్గర సెలవు తీసుకుని పోర్టికోలో నిలబడున్న జీపులోకి ఎక్కారు.

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, రంజని వైపు తిరిగాడు.

మ్యాడం...మనం వెలదాం?”

రంజని తల ఊపుతూ, తడబడతూ లేచి నిలబడ్డ క్షణం, ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ సెల్ ఫోన్ ప్రాణం తెచ్చుకుని పిలిచింది.

తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు.

హలో

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్?”

ఎస్

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్! నేను డాక్టర్ గోపీనాద్

చెప్పండి డాక్టర్

మీరు వెంటనే బయలుదేరి నా హాస్పిటల్ కు రాగలరా?”

ఏమిటి విషయం డాక్టర్?”

సారధి కేసు లాగానే ఒక కేసు. రక్తం చెమట పడుతోందని చెప్పి ఇక్కడ ఒకరు అడ్మిట్అయ్యున్నారు

ఏవరు...ఎవరు...ఆయన...?”

పేరు సత్యమూర్తి...పెద్ద కోటీశ్వరడు. కడప, కర్నూల్ వైపు ఆయనకు ఏడెనిమిది గ్రానైట్ క్వారీలూ, రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మీరు వెంటనే బయలుదేరి రండి?”

ఓ.కే --- వేగంగా బయలుదేరాడు ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్.

 ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, దశరథమూర్తి గారిని తీసుకుని, రంజని కారులో బయలుదేరి డాక్టర్. గోపీనాద్ హాస్పిటల్ కు వెళ్ళి చేరినప్పుడు ఐ.సి. వార్డుకు ముందు ఒక పెద్ద గుంపు ఉన్నది. గుంపు మధ్యలో నిలబడున్న డాక్టర్. గోపీనాద్ అక్కడ జేరిన గుంపుతో మాట్లాడుతున్నారు.

ఇలా మీరు గుంపుగా చేరినందువలన ఏమీ ప్రయోజనం లేదు. మిస్టర్ సత్యమూర్తి గారికి చికిత్స జరుగుతోంది. కొంచం సేపు వెయిట్ చేయండి

ఆయనకు ముందు నిలబడ్డ ఒక యువకుడు, ఏడుస్తున్న గొంతుకతో అడిగాడు.

నాన్న గారి ప్రాణానికి ఏమీ ఆపద లేదుగా డాక్టర్?”

ఇప్పుడే నేనేమీ చెప్పలేను. వచ్చిన రోగం అరుదైన రోగం. ఇలాంటి వ్యాధికి మేము ఇంతవరకు చికిత్స ఏమీ ఇవ్వలేదు. ఆయన శరీరంలో ఉన్న రక్తం, ఏదో ఒక విషంతో చెడిపోయింది. ఆ చెడిపోయిన రక్తాన్ని తీసేస్తూ, ఆయనకు కొత్త నెత్తురు ఎక్కిస్తున్నాం. దాని రిజల్ట్స్ ఎలా ఉంటుందనేది రెండు గంటలు గడిచిన తరువాతే చెప్పగలం. ఇక్కడ  గుంపుగా నిలబడున్న వాళ్లందరూ ఎవరు? మీ బంధువులా?”

అవును డాక్టర్

మొదట వీళ్లందరినీ బయటకు వెళ్లమని చెప్పండి. మిస్టర్ సత్యమూర్తి గారికి మీరొక్కల్లే కొడుకా?”

అవును డాక్టర్

అరున్ కుమార్

ధైర్యంగా ఉండండి... మనం చేయగలిగింది రక్త మార్పిడి ఒక్కటే. అది పూర్తి అయిన రెండుగంటల వరకు ఏమీ చెప్పలేము. చేయగలినంతవరకు చేస్తున్నాం. సిటీలో ఉన్న  పెద్ద డాక్టర్లందరికీ ఫోన్ చేశాను. వాళ్ళూ వస్తున్నారు

డాక్టర్. గోపీనాద్, అరున్ కుమార్ దగ్గర నుండి కదిలి ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ వైపుకు వచ్చారు. పక్కన నిలబడున్న దశరథమూర్తి గారినీ, నటి రంజనిని ఒక చూపు చూసి అడిగారు.

వీళ్ళు?”

ఈయన మిస్టర్ దశరథమూర్తి...మూలిక నిపుణులు. ఈమె నటి రంజని. మీకు తెలుసు

పత్రికలలో చూశాను... -- అంటూ దశరథమూర్తి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, రంజనికి నమస్తే పెట్టి రండి...నా గదికి వెళ్ళిపోదాం

అందరూ  డాక్టర్. గోపీనాద్ గదికి వెళ్ళారు.

డాక్టర్. గోపీనాద్ తన కుర్చీలో వెనక్కి వాలిపోతూ ముగ్గురికీ ఎదురుగా ఉన్న కుర్చీలు చూపించారు. వాళ్ళు కూర్చున్న వెంటనే చెప్పారు.

ఈ రోజు ఇది రెండో సంఘటన

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ఆందోళన పడుతూ అడ్డుపడ్డాడు.

మూడోది అని చెప్పండి డాక్టర్

డాక్టర్. గోపీనాద్ కళ్ళు ఆశ్చర్యంతో చూసాయి.

మూడవదా?”

అవును...మీరు నాకు ఫోన్ చేయటానికి మునుపు కమీషనర్ గారికి ఒక ఫోన్ వచ్చింది. డెప్యూటీ కమీషనర్ దీపక్ శర్మ గారు చేసారు. తీవ్రవాదులను విచారించటానికని ఏర్పాటు చేసిన స్పేషల్ కోర్టు జడ్జ్ జస్టీస్ జవహర్ గారు ఆసుపత్రిలో చేర్చుకోబడి మరణించారు. మరణానికి కారణం రక్తం చెమటలు, రక్తం కక్కు. కమీషనర్ నన్ను కూడా ఆ హాస్పిటల్ కు రమ్మని చెప్పి వెళ్ళారు. నేను అక్కడికి బయలుదేరి వెళ్లబోతున్న సమయంలో మీ ఫోన్ వచ్చింది. వెంటనే మేము ముగ్గురం బయలుదేరి ఇటొచ్చాము "

పోలీస్ కమీషనర్ కు ఈ మూడో సంఘటన గురించి చెప్పారా?”

కార్లో వచ్చేటప్పుడే ఇన్ ఫార్మ్చేశేశాను

హాస్పిటల్లో జస్టీస్ జవహర్ గారికి ఎక్కువసేపు చికిత్స జరిగిందా?”

లేదు...హాస్పిటల్ కు తీసుకు వెళ్ళిన వెంటనే మరణం సంభవించిందట

రంజని అడ్డుపడింది. “'మృత్యుదూతను నిజానికి నాకు గురి పెట్టారు. అద్రుష్టవసాత్తూ, హఠాత్తుగా బయట ఊరిలో షూటింగ్ పెట్టటంతో, నేను అటు వెళ్ళిపోయా, తప్పించుకున్నాను. సారధి చిక్కుకున్నాడు

దశరథమూర్తి గారు కళ్ళు నిజంగానే అగ్ని కణంలాగా ఏర్రబడ్డాయి.

మూలికలను ఉపయోగించి ఇలాంటి చావులు ఏర్పరచటం వలన ఆ శ్రీలత కి, ఆమె బృందానికి ఏమిటి లాభమో తెలియటం లేదే? మూలిక అనేది ఔషధ గుణం కలిగిన ఒక చెట్టు కొమ్మ, వేరు. ఆ మూలికలు దేవుని శక్తి కలిగినవి కూడా. అవి ప్రకృతి మనకు అందించినవి.  దాన్ని ఇలాంటి చెడ్డ పనులకు ఉపయోగించటం పెద్ద పాపం

దశరథమూర్తి గారు కోపంగా మాట్లాడి ముగించిన క్షణం -- తుఫాను గాలి వేగంతో లోపలకు వచ్చాడు అరున్ కుమార్.

చేతిలో ఒక బ్రీఫ్ కేస్.

డాక్టర్. గోపీనాద్ నిటారుగా కూర్చున్నారు.

ఏమిటిది అరున్ కుమార్?” 

అతను సమాధానం ఏదీ చెప్పకుండా, బ్రీఫ్ కేసును టేబుల్ మీద పెట్టాడు.

డాక్టర్ దీన్ని కొంచం తెరిచి చూడండి

ఇందులో ఏముంది?”

కొంచం తీసి చూడండి 

డాక్టర్. గోపీనాద్ కొన్ని నిమిషాలు తటపటాయించి, ఆ బ్రీఫ్ కేసును తెరిచాడు.

లోపల ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు.

డాక్టర్. గోపీనాద్ కన్ ఫ్యూజన్ తో అరున్ కూమార్ను చూసాడు.

ఏమిటిది?”

డబ్బులు డాక్టర్

డాక్టర్ ఇందులో పది లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ డబ్బు మీ ఫీజు. మా నాన్నను ఎలాగైనా కాపాడండి

సారీ అరున్ కుమార్...ఇంత పెద్ద మొత్తం నాకు అవసరం లేదు. మీ నాన్న బ్రతికి బయటపడితే న్యాయంగా నాకు ఇవ్వవలసిన డబ్బు నేనే అడిగి తీసుకుంటాను. ఈ డబ్బును తీసుకుని వెళ్ళిపో. నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే, ప్రార్ధన చెయ్యి...ఈ పది లక్షల కంటే, ఆ ప్రార్ధనకే ఎక్కువ విలువ

డాక్టర్! మా నాన్నను ఎలాగైనా బ్రతికించండి. ఆస్తుల విషయంలో కొన్ని ముఖ్య కాగితాల్లో సంతకాలు పెట్టాల్సి ఉంది. ఆయన సంతకాలు చేయకపోతే...ఏవీ చెల్లుబడికావు

ఇలా చూడు అరున్ కుమార్...సీరియస్ కండిషన్ లో ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు పేదవాళ్ళైనా, డబ్బుగలవాళ్ళు అయినా సరే...వాళ్ల ప్రాణాలను కాపాడటానికి అన్ని ప్రయత్నాలూ చేస్తాము. ఇలాటి వాటికి ఫలితం ఇచ్చేది ఆ పైవాడే...దయచేసి డబ్బు తీసుకుని వెళ్ళిపొండి"

డాక్టర్

ప్లీజ్

----బ్రీఫ్ కేస్ తీసి అతని చేతికి ఇచ్చాడు డాక్టర్. గోపీనాద్.

                                                                                                        Continued....PART-11

************************************************************************************************

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి