5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మృత్యుదూత (క్రైమ్ సీరియల్)...PART-9

 

                                                                          మృత్యుదూత (క్రైమ్ సీరియల్)                                                                                                                                                                  (PART-9)

ఎస్...కమిన్ అన్నారు కమీషనర్ సర్వానంద్.

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ తలుపు తెరుచుకుని లోపల గెస్టులు ఉండటంతో కొంచం తడబడ్డాడు.

పరవాలేదు రండి అన్నాడు కమిషనర్.

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ లోపలకు వచ్చి సెల్యూట్చేసి నిలబడ్డాడు. కమీషనర్ సర్వానంద్. అడిగాడు.

సారధి మర్మ చావులో విచారణ ఎంతవరకు వచ్చింది?”

సార్...ఈ విచారణ కొంచం చిక్కుగానే ఉన్నది. సారధి ఎలా చనిపోయ్యుంటాడో నన్న వివరణలోనే డాక్టర్లలోనే విభేదాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వటానికి ఏ డాక్టరూ ముందుకు రావటం లేదు. సారధి తనకు రక్త చెమటలు ఏర్పడినట్టు డాక్టర్ గోపీనాద్ దగ్గర చెప్పారు. డాక్టర్ మొదట్లో అది నమ్మలేదు. సారధి రక్తం కక్కుకుని చనిపోయిన  తరువాత ఆయనకు నమ్మకం వచ్చింది. రంజని  గారి ఏసీ రూములో పడుకుని నిద్రపోయినప్పుడే సారధి గారికి రక్తపు చెమట వచ్చింది. కనుక, అక్కడేదన్నా క్లూదొరుకుతుందేమోనని ఆ గదిని పరిశోధించడానికి నేనూ, డాక్టర్ గోపీనాద్  నిర్ణయించుకుని, జూబ్లీ హిల్స్ గ్రీన్ పార్క్ అవెన్యూలో ఉన్న రంజని గారి ఇంటికి వెళ్ళాము.

ఇంట్లో పనివాళ్ళు మాత్రమే ఉన్నారు. మేడ మీదున్న రంజని గారి గదికి వెళ్ళాము. గది మామూలుగా మూసుంది. లోపల ఏదో శబ్ధం...జాగ్రత్తగా గదిలోకి వెళ్ళాను. నేను రావటం గ్రహించిన లోపల ఉన్న ఆ మనిషి, కళ్ళు మూసి తెరిచేలోపు 'సిట్ అవుట్' లోకి దూకి -- తోటలోకి దిగి పరిగెత్తేడు. అతన్ని ఫాలో చేసి వెళ్ళాను. పట్టుకోలేకపోయాను"

ఎవరతను?”

తెలియదు సార్

పనివాళ్ల దగ్గర విచారించారా?"

విచారించాను సార్...తెలియదని చెప్పారు. పని వాళ్లకే తెలియకుండా వెనుక పక్కగా వచ్చిన ఒకతను, రంజని గారి గదిలో దేనికోసమో వెతుకుతున్నాడనుకుంటా

దశరథమూర్తి గారు అడ్డుపడి చెప్పాడు అతను మూలికను వెతుక్కుంటూ వచ్చుంటాడు

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, “మూలికా?” అంటూ ఆశ్చర్యపోగా, కమీషనర్ చెప్పాడు.

"ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్! ఈయన మిస్టర్. దశరథమూర్తి. మూలికల పరిశోధనా శాస్త్రవేత్త. మూడు నెలల ముందు ఈయన దగ్గరున్న, కోట్లు విలువచేసే అరుదైన మూలికలను ఐదుగురు కలిగిన ఒక బృందం దొంగలించుకుని పోయారు. ఆ బృందానికి శ్రీలత అనే ఒక స్త్రీ లీడర్. 

మూలికలకు ఔషధ గుణాలు ఉన్నట్టే, విపరీతమైన కృర గుణాలూ ఉన్నాయని దశరథమూర్తి గారు చెబుతున్నారు. మూలికలలోనే అత్యంత శక్తి కలిగిన మృత్యుదూత మూలికే సారధి కి రక్త చెమట ఏర్పడటానికి కారణమని చెబుతున్నారు. అది మాత్రమే కాదు...మూలికల దొంగతనంలో నటి రంజని గారికి భాగం ఉంటుందని దశరథమూర్తి గారు  అనుమాన పడుతున్నారు

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ చెప్పాడు.

ఉండొచ్చు సార్. రంజని అంత మంచి ఆడది కాదు. కొందరు పెద్ద రాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర పడుంటుంది కాబట్టి, రాజకీయ రంగంలో ఆమె జెండాలాగా  ఎగురుతోంది...డబ్బుకొసం ఏదైనా చేస్తుంది. మీరు గనుక అనుమతిస్తే, ఆమెను విచారించే పద్దతిలో విచారిస్తే నిజాలు బయటపడుతాయి

సరే...విచారణ చెయ్యండి. పత్రికలకు న్యూస్ వెళ్ళకుండా చూసుకోండి. రంజని గారిని విచారణ చేస్తున్నప్పుడు ఎటువంటి హడావిడి వద్దు

ఎస్...సార్

                                                       ************************************

రంజని -- విమానంలో హైదరాబాద్ వచ్చి చేరిన తరువాత, గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో ఉంచబడ్డ చనిపోయిన సారధి యొక్క మృతదేహాన్ని చూసేసి, శోకమైన ముఖంతో బయటకు వచ్చింది. కూలింగ్ గ్లాసు పెట్టుకుంది.

హాస్పిటల్ సిబ్బంది వేడుకగా చూస్తూండగా, కార్ పార్కింగ్ వైపు నడుస్తున్న ఆమెను -- ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ అడ్డుపడి ఆపాడు.

ఎక్స్ క్యూజ్ మీ మ్యాడం

ఏమిటీ?”

సారధి గారి మరణం గురించి మీ దగ్గర ఒక చిన్న విచారణ

రంజని ఆగకుండా నడుస్తూనే అడిగింది.

ఈ విచారణ అవసరమా?”

చాలా అవసరం మ్యాడం

సరే...అడగండి

సారధి గారి మరణం గురించి మీరు ఏమనుకుంటున్నారు?”

ఇందులో ఏమనుకుంటాం...అతని ఆయుష్షు ముగిసింది...వెళ్ళిపోయాడు

ఆయన మరణంలో సందేహం ఉంది మ్యాడం

ఏమిటా సందేహం?”

ఆయన హత్య చేయబడి ఉండొచ్చు

ఆయన ఎందుకోసం హత్యచేయబడాలి...హత్యచేయటానికి కావలసిన కారణం ఉందా?”

కారణం తెలియటం లేదు

కారణం తెలియకుండా ఎలా హత్య అంటున్నారు?”

ఒక ఊహే. సారధి గారి మరణం ఒక వ్యత్యాసంగా జరిగింది. ఉక్కపోతను తట్టుకోలేక మీ రూములోకి వెళ్ళి పడుకున్నారు. ఏసీ వేసుకున్న ఆయనకి చెమట పట్టింది. తుడుచుకుని చూస్తే అది రక్తం. చెమట రూపంలో రక్తం రావటం చూసి భయపడి,  మరుసటి రోజు ప్రొద్దున డాక్టర్ను కలిశారు. డాక్టర్ ఆ రక్తాన్ని ల్యాబులో టెస్ట్ చేస్తున్నప్పుడే సారధి గారు రక్తం కక్కుకుని చనిపోయారు. ఇది ఒక అసాధారణ మరణం అని మీ మనసుకు  అనిపించటం లేదా?”

కారు వైపుకు నడుస్తున్న రంజని ఆగింది. స్వరంలో కొంచం కోపం కనబడింది.

ఇప్పుడు నేను ఏం చెప్పాలని ఎదురు చూస్తున్నారు?”

నిజం

ఏం నిజం?”

సారధి గారి మరణానికి కారణం మృత్యుదూత అనే ఒక మూలిక. అది మీ గదిలో ఉన్నది. అదెలా? ఆ మూలికను మీకు ఇచ్చింది ఎవరు?”

రంజని తన రెండు చేతులను కట్టుకుంది.

ఇన్‌స్పెక్టర్...మీరు చెప్పే విషయాలన్నీ నాకు కొత్తగా ఉంది. మూలిక ఒక మనిషిని చంపగలదా!?. అలాగే అనుకున్నా ఆ మృత్యుదూత మూలిక గురించి నాకు ఏమీ తెలియదు. నేను నిజం చెప్పటానికి ఏ రోజూ భయపడింది లేదు. ఇప్పుడు మీకు ఆశ్చర్యపరిచే ఒక విషయం చెప్పనా?”

ఏమిటీ?” అన్నట్టు ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ఆశ్చర్యపోయి చూస్తుండగా రంజని శాంతమైన స్వరంతో మాట్లాడటం మొదలుపెట్టింది.

సారధి చనిపోయాడు. ఒకవేల అతను చనిపోకుండా ఈ రోజున బ్రతికే ఉండుంటే, వచ్చేవారం ఆదివారం రోజున సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చనిపోయుండేవాడు

మే...మేడం...మీరు ఏం చెబు..చెబుతున్నారు?”

నిజం చెబుతున్నాను ఇన్‌స్పెక్టర్. సారధిని చంపటానికి నేనే ఒక పధకం వేసున్నాను. దానికొసం కిరాయి గూండా గుంపుకు రెండు లక్షల రూపాయలు ఇచ్చున్నాను. వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అతన్ని హతమార్చటానికి ఏర్పాటు చేశాను

మే...మేడం

మీకు షాకింగ్ గా ఉంటుందని నాకు తెలుసు. నేను నిజం మాట్లాడటానికి ఏ రోజూ భయపడింది లేదు. సారధిని నేను ఎందుకు చంపాలనుకున్నానో చెప్పాల్సిన అవసరం నాకుంది. నేను ఈ సినిమా ప్రపంచానికి వచ్చిన కొత్తల్లో ఒకడు నన్ను మోసం చేసి కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చి బ్లూ ఫిల్మ్తీసాడు. ఆ క్యాసట్ సారధి చేతికి ఎలాగో దొరికింది. అది పెట్టుకుని నన్ను బ్లాక్ మైల్ చేసే నా దగ్గర మేనేజర్ ఉద్యోగానికి చేరాడు. ఉద్యోగం చేస్తూ అతనికి అవసరం వచ్చినప్పుడల్లా నన్ను బెదిరించి డబ్బు తీసుకునే వాడు.

రాజకీయ రంగంలో నాకు కాస్తంత పలుకుబడి దొరికిన వెంటనే వాడ్ని ఈ లోకం  నుండి పంపించేయాలని నిర్ణయించుకున్నా. దానికొసం వచ్చే ఆదివారం సాయంత్రానికి ముహూర్తం పెట్టి, డబ్బులిచ్చి ఉంచాను. ఇంతలో సారధికి ఇలా ఒక ముగింపు వస్తుందని నేను ఎదురు చూడలేదు

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అలాగైతే ఆ మూలిక గురించి మీకు ఏమీ తెలియదు?”

తెలియదు. దాన్ని నేను చూసింది కూడా లేదు

మీ గదిలోపల ఆ మృత్యుదూత మూలిక ఉండబట్టే కదా సారధికి ఆ విధంగా చావు ఏర్పడింది

నేను నమ్మలేక పోతున్నాను

దేనిని?”

రక్త చెమటలు పుట్టించి, మనిషిని చంప గలిగేంత శక్తి గల మూలిక ఉంటుందా?”

ఉందని చెబుతున్నారు మూలికల నిపుణులు ప్రొఫెసర్ దశరథమూర్తి గారు. అది పక్కన పెట్టండి. మీకు శ్రీలత, రామూ, రాజు, గణేష్, సాహిద్ -- ఈ పేర్లలో ఎవరినైనా తెలుసా?”

రంజని కాసేపు ఆలొచించి తల ఊపింది.

తెలియదు! ఎందుకు అడుగుతున్నారు?”

ప్రొఫసర్ దశరథమూర్తి గారి పరిశోధనా కేంద్రం నుండి కోట్లు విలువ చేసే మూలికలను కొట్టుకెళ్ళింది ఆ గుంపే

సారధి మరణం చూసి, మూలికల దోపిడిలో నాకూ భాగం ఉన్నదని దశరథమూర్తి గారు అనుమానిస్తున్నారో?"

అవును...అనుమానిస్తున్నారు

మీరు దానికి ఏం సమాధానం చెప్పారు?”

ఊటీ నుండి రంజని గారు రానివ్వండి. విచారణ చేసి చూద్దామని చెప్పాను...--- ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ చెబుతున్నప్పుడే రంజని బ్యాగులో నుండి సెల్ ఫోన్ రింగ్ టోన్ వినబడ్డది.

అది తీసి ఎవరు ఫోన్ చేసారో అని చూసింది.

కొత్త నెంబర్.

ఎవరనేది తెలుసుకోవటానికి ఫోన్ ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది.

హలో....అవతల సైడు ఒక మహిళ వాయిస్ వినబడింది.

మాట్లాడేది ఎవరు... రంజని నేనా?”

అవును...నువ్వు ఎవరు?”

నేను శ్రీలత

ఒక్క క్షణం షాకయ్యింది రంజని.

పే…పేరు ఏం చెప్పావు... శ్రీలత నా?”

అవును! శ్రీలత నే...నీ పక్క నున్న ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, నా గురించి చెప్పుంటారే?”

హూ...చెప్పారు

రంజనీ...మృత్యుదూత మూలికకు నిజానికి నువ్వు బలై ఉండాలి. నువ్వు హఠాత్తుగా ఊటీ షూటింగ్ కు బయలుదేరి వెళ్లటంతో నీ గదిలో పడుకుని నిద్రపోయిన సారధి రక్త చెమట, రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. సారధికి ఏర్పడిన గతి త్వరలో నీకూ జరగబోతుంది. రెడీగా ఉండు"

రంజని చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆందోళనలోనూ, భయంలోనూ ఆమె చేతి వేళ్ల నుండి జారి కింద పడిపోయింది.

                                                                                 Continued....PART-10

**************************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి