9, ఫిబ్రవరి 2021, మంగళవారం

మృత్యుదూత (క్రైమ్ సీరియల్)...PART-11

 

                                                                            మృత్యుదూత (క్రైమ్ సీరియల్)                                                                                                                                                                (PART-11)

హోటల్ సిల్వర్ ఇంటర్నేషనల్ ఏడవ అంతస్తు.

సమయం రాత్రి ఏడు గంటలు. గదిలో టీవీ చూస్తున్న రంజని చిన్నగా ఆవలించంది. ఇక నిద్రపోదామా?’ అని ఆలొచించిన మరు క్షణం బెడ్ మీదున్న సెల్ ఫోన్ రింగ్ అయ్యింది.

అది తీసి డిస్ ప్లేలో చూసింది. పేరు మోసిన రాజకీయ నాయకుని పేరు. వికసించిన మొహంతో మాట్లాడింది.

సార్

ఏం రంజని...నిద్రపోయావా?”

లేదు సార్. టీవీ చూస్తున్నాను?”

హోటల్ వసతిగా ఉందా...నువ్వు అడిగినట్లు లైటింగ్ అరేంజ్ మెంట్ చేసారా?”

ఏదో స్వర్గ లోకంలో గది వేసినట్టు ఉంది సార్...లైటింగ్ నేను అడిగినట్లే చేసుంచారు

ఆ శ్రీలత గురించి భయపడకుండా ఒక నాలుగైదు రోజులు అక్కడే ఉండు. ఈ లోపల ఆమెను కనిపెట్టేద్దాం

నాకు ఆమె గురించిన భయమంతా లేదు సార్. నేను ధైర్యంగానే ఉన్నాను

అలాంటి మొండి ధైర్యమే ఉండకూడదు అంటున్నాను. ఇద్దరు రక్తం చెమట పట్టి చచ్చిపోయున్నారు...మూడో వ్యక్తి ప్రాణానికి పోరాడుతున్నాడు. ఆ శ్రీలత సామాన్యమైన మనిషి కాదు. నువ్వుండాల్సిన జాగ్రత్తలో నువ్వు ఉండాలి.

నీ గదికి ముందు ఇద్దర్ని రహస్యంగా కాపలా పెట్టాను. అనవసరంగా నిన్ను చూడటానికో, నీ పక్కన నిలబడటానికో ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు టైముకు తిను, బాగా నిద్రపోయి రెస్టు తీసుకో. నీకు ఏది కావాలన్నా సరే నాకు ఫోను చెయ్యి. మరో గంటలో అది అక్కడికి వస్తుంది

నాకు తెలియదా ఏమిటి?”

నేను మళ్ళీ రేప్రొద్దున ఫోన్ చేస్తాను -- అవతలసైడు సెల్ ఆఫ్ చేయడంతో, తన సెల్ ఫోన్ ను దిండు కిందకు తీసుకు వెళ్ళి పెట్టింది.

గది తలుపు సరిగ్గా వేసి, గొళ్లేం పెట్టేమా లేదా కన్ ఫర్మ్చేసుకున్న తరువాత, పరుపు మీద వాలింది. ఏ.సీ. చలికి రగ్గులాంటి దుప్పటి కప్పుకుంది. మెల్లగా కళ్ళు మూసుకుంది. మనసులో ఆలొచనలు పరిగెత్తినై.

ఏవరీ శ్రీలత?’

నన్ను చంపటం వలన ఆమెకు ఏమిటి లాభం? నేను రాజకీయ పలుకుబడితో ఉన్నాను కాబట్టి, అది ఇష్టం లేని వాళ్ళు, శ్రీలత ద్వారా నన్ను చంపాలనుకుంటున్నారా?’

రంజని ఆలొచిస్తున్నప్పుడే, దిండు కింద పెట్టుకున్న ఫోన్ మోగింది.

పడుకునే సెల్ ఫోన్ తీసింది మాట్లాడింది.

హలో

ఏమిటి రంజని...టైము ఇప్పుడు పదకుండు. ఇంకా నిద్ర పోలేదా? సెల్ ఫోన్ రింగైన వెంటనే తీసావు?” -- ఒక ఆడ గొంతు.

నువ్వు...నువ్వు...ఎవరు?” -- రంజని లేచి కూర్చుంటూ విసుగ్గా అడిగింది.

శ్రీలతను

రంజనికి ఆ ఏ.సీ. రూములో కూడా చెమెటలు పట్టినై.

శ్రీలత తన మాటలు కొనసాగించింది.

రంజని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇదిగో...చూడు! నువ్వెవరు? నీకూ, నాకూ ఏమిటి పగ, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు?”

ఈ ప్రశ్నలన్నింటికీ నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఇచ్చిన పనిని నేను పూర్తిచేయాలి. అంతే. ఒక హోటల్ ఏడో అంతస్తుకు పోయి కూర్చుంటే...నిన్ను నేను వదిలిపెడతానా ఏమిటి? నువ్వు కిందకు దిగి రావా ఏమిటి?”

ఇదిగో చూడు శ్రీలతా! నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను...నన్ను చంపటానికి ఇంకెవరో ఇచ్చిన డబ్బు కంటే రెండు రెట్లు ఎక్కువ ఇస్తాను

నువ్వు పదిరెట్లు డబ్బులిచ్చినా నాకు అవసరం లేదు. నాకు కావలసినదంతా నీ ప్రాణమే. ఏదో ఒక రోజు మృత్యుదూత మూలికకు చిక్కి రక్తం చెమట చిందించాల్సిందే...స్పేషల్ కోర్టు జడ్జ్ జస్టీస్ జవహర్ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో అనాధలాగా పడుకోనున్నాడు.

పారిశ్రామకవేత్త సత్యమూర్తి ని అడ్మిట్చేసుకుని డాక్టర్. గోపీనాద్ ఆయన్ను బ్రతికించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన కాపాడలేడు. తెల్లవారు జామున ఆరుగంటలకల్లా సత్యమూర్తి కూడా శవాల గిడ్డింగికి వెళ్ళిపోతారు. నీకు ఒక తారీఖును ఖరారు చేసేస్తే, నా పని ఒక ముగింపుకు వస్తుంది.” 

నా బలం ఏమిటో తెలియకుండా మాట్లాడుతున్నావు

నీ బలం ఏమిటో నాకు మాత్రమే కాదు...తెలుగు వారందరికీ తెలుసే! ఇద్దరు మంత్రులకు నువ్వే కదా సెకండ్ సెటప్. చాలా ఫైళ్ళు నీ చూపుల్లో పడిన తరువాతే కదా వెడతాయి

ఏయ్!

చూశావా...కోపం వస్తోంది. ఈ కోపమే నాకు బలం. ఓకే రంజని...చాలా లేటయ్యింది...వెళ్ళి పడుకో. ఇది తాత్కలిక నిద్రే. నువ్వు పర్మనెంటుగా నిద్రపోవటానికి, త్వరలోనే ఏర్పాటు చేస్తాను. గుడ్ నైట్

అవతలసైడు నవ్వుకుంటూ చటుక్కున రిజీవర్ పెట్టేసిన తరువాత -- రంజనికి చెమటలు నీరులాగా కారింది.

                                                         *************************************

మరుసటి రోజు ప్రొద్దున ఏడు గంటలు.

వాకింగ్వెళ్ళొచ్చి తన ఇంటి ముందున్న గడ్డి నేల మీద కూర్చుని టీ తాగుతూ, న్యూస్ పేపర్ తిరగేస్తూ ఉన్న దశరథమూర్తి గారికి, కాంపౌండ్ గేటు దగ్గరకు వచ్చి నిలబడ్డ కారును చూసిన వెంటనే లేచి నిలబడ్డారు.

జీపులో నుండి దిగిన కమీషనర్ సర్వానంద్ జాగింగ్దుస్తులలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ మిస్టర్ దశరథమూర్తి

గుడ్ మార్నింగ్ కమీషనర్...ఏమిటి...వాకింగ్ వెళ్ళి వస్తున్నారా...లేక ఇకమీదటే వెళ్లబోతారా?”

అరగంట వాకింగ్’, అరగంట జాగింగ్. రెండూ పూర్తి అయినై. ఇంటికి వెళ్ళే దోవలో రెండు మంచి వార్తలు మీ దగ్గర చెప్పి వెల్దామని కారు ఆపాను

దశరథమూర్తి గారి ముఖం వికసించింది.

ప్రొద్దున్నే రెండు మంచి వార్తలా? చెప్పండి...చెప్పండి! తాగుతున్న టీ కప్పును అలాగే కిందపెట్టేసారు దశరథమూర్తి గారు.

కమీషనర్ గడ్డి నేల మీద నడుచుకుంటూ అక్కడున్న బుట్ట కుర్చీలో కూర్చుంటూ చెప్పేరు.

మొదటి మంచి వార్త! ఐ.సి యూనిట్ లో అడ్మిట్ అయ్యి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సత్యమూర్తి  ప్రాణంతో బయట పడ్డారు

నిజంగానా?”

ఎస్...రక్తాన్ని మూడుసార్లు మార్చటం వలన శరీరంలో ఉన్న విషం అంతా తగ్గిపోయి, మెల్లగా స్పృహలోకి వచ్చారు. సాయంత్రం లోపల లేచి కూర్చుంటారు అని డాక్టర్ చెప్పారు

వెరీ గుడ్...వినటానికే సంతోషంగా ఉంది కమీషనర్

రెండో వార్తను వింటే ఇంకా పొంగిపోతారు. మీ దగ్గర మూలికలను దొంగతనం చేసిన ఐదు గురిలో ఒకడు దొరికాడు. చెన్నై దగ్గరున్న ఆ ఊర్లోనే అనుమానంతో ఒక ఇంటి మీద దాడి చేసినప్పుడు దొరికిపోయాడు.

విచారణలో ఒక్కొక్క పోలీసు అధికారి అడిగినప్పుడు ఒక్కొక్క పేరు చెప్పాడు. వాడిని, వాడి వస్తువులనూ పరిశోధన చేసినప్పుడు మూలిక పొదిగి ఉన్న ఉంగరం ఒకటి దొరికింది. అది పెట్టుకుని ఆలొచించి నప్పుడు శ్రీలతతో వచ్చిన నలుగురు యువకులలో ఒకడై ఉంటాడని మనసులో సందేహం. మీరు వచ్చి చూసి వాడిని గుర్తుపడితే మంచిది

ఆ యువకుడిని తమిళనాడు నుండి తీసుకు వచ్చారా?”

నిన్న రాత్రే తీసుకు వచ్చాము. పోలీస్ స్టేషన్ లాక్ అప్ లో ఉంచాము. మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి వచ్చి ఆ యువకుడ్ని చూస్తే మంచింది...ఆ నలుగురినీ మీకు బాగా గుర్తుంది కదా?”

గుర్తుందా అని అడుగుతారేమిటి...ఆ శ్రీలతని, ఆ నలుగురు వెధవల్ని,నా మనసు లోపలా, నా అసిస్టంట్ పల్లవి యొక్క మనసులోపలా ఫోటోలాగా ప్రింట్ అయిపోయారు. చూసిన వెంటనే చెప్పేస్తాము

అలాగైతే పల్లవిని తీసుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చేయండి. పది గంటల సమయంలో వచ్చేస్తారా? నేను మీకొసం అక్కడ కాచుకోనుంటాను

పది గంటలకు వస్తే చాలా కమీషనర్ సార్?”

చాలు...మనిషిని గుర్తించి చెబితే చాలు. మీరు వచ్చేయచ్చు. నిజాలన్నిటినీ కక్కించ వలసింది మా డ్యూటీ. నిన్న రాత్రి ఆ శ్రీలత, హోటల్లో స్టే చేస్తున్న రంజనికి ఫోన్ చేసింది. నువ్వు ఎంత ఎత్తులో కూర్చోనున్నా నా దగ్గర నుండి తప్పించుకోలేవు. రక్తం చెమటలు చిందించే కావాలీ అని చెప్పిందట.

మధ్య రాత్రి రాజకీయ నాయకుల దగ్గర నుండి నాకు ఫోన్లు. వెళ్ళి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసొచ్చాను. ఏం చేయను...కాకీ డ్రస్సు తొడుక్కుంటే కొన్ని సమయాలలో గూర్కా కంటే ఎక్కువగా పనిచేయాలి. ఎలాగో శ్రీలతని, ఆ నలుగురు యువకులనూ ఖైదు చేసి లోపల పడేస్తే ఈ కేసుకు ఒక గుడ్బై చెప్పేయచ్చు….అయితే పల్లవిని తీసుకుని పది గంటల కల్లా స్టేషన్ కు వచ్చేస్తారుగా?”

వచ్చేస్తాను

                                                                                                 Continued.....PART-12 (Last Part)

************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి