21, ఫిబ్రవరి 2021, ఆదివారం

మానవ ఉలి...(కథ)


                                                                                       మానవ ఉలి                                                                                                                                                                                      (కథ)

"అమ్మా...నాకు గవర్నమెంట్ ఉదోగం దొరికింది" --కాళ్ళ మీద పడ్డ సురేందర్ ను మనస్పూర్తిగా  అభినందించింది తల్లి సరశ్వతి.

"అమ్మా...మన వీధి మొత్తానికీ స్వీటు పంచిపెట్టేను. ఇంకెవరికైనా ఇవ్వాలా?"

"మీ బాబాయికి ఇచ్చావా"

"ఎవరూ...సుందరం బాబాయికా?"

"అవును"

"అమ్మా...నీకేమైంది? ఆయనకి స్వీటి ఇవ్వమని చెబుతున్నావు...! ఆయన నోటి నుండి మంచి మాటలే రావే?"

పదో క్లాసు పాసైనప్పుడు స్వీటు తీసుకు వెళ్ళి ఇస్తే 'ఏమిట్రా...ఏదో ఇంటర్ పాసైనట్టు స్వీటు ఇస్తున్నావు అంటూ అదొలా నవ్వారు.

ఇంటర్ పాసైనప్పుడు స్వీటు తీసుకు వెళ్ళి ఇచ్చినప్పుడు 'ఏమిట్రా....ఏదో పెద్ద డిగ్రీ పాసైపోయినట్టు స్వీటు ఇస్తున్నావు అంటూ వెక్కిరింతగా నవ్వారు.

డిగ్రీ పాసైనప్పుడు స్వీటు తీసుకువెళ్ళి ఇస్తే 'ఏమిట్రా...ఏదో పెద్ద గవర్నమెంటు ఉద్యోగం సంపాదించినట్టు ఫీలైపోతూ స్వీటు ఇస్తున్నావా?' అంటూ ఎగతాలిగా నవ్వారు.

"అయితే ఏమిటి? నివ్విప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించానని ఆయన ముందుకు వెళ్ళి నిలబడు" అమ్మ సలహా చెప్పింది.

ఇప్పుడేమంటారో చెప్పనా? ఏమిట్రా...నువ్వు పెద్ద కలెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యావా ఏమిటి?' అని అడుగుతారు. అలాంటి వారికి ఎందుకు స్వీటు ఇవ్వాలి?"

 "ఆయన నిన్ను ఎగతాలి చేస్తూ, వెక్కిరింతగా మాట్లాడి మాట్లాడి నిన్ను పెద్ద పొజిషన్ కు తీసుకు వచ్చారు. ఉలి తగలను తగలను రాయి శిలగా మారుతుంది. మీ బాబాయి గేలి మాటలే...నిన్ను పొజిషన్ కు ఎదగనిచ్చింది"

"ఏంటమ్మ చెబుతున్నావు?"

"అవునయ్యా...మన మీద శ్రద్ద చూపించే వారి ఆశీర్వాదాలు మనకు కావాలి. కానీ, మన మీద ఈర్ష్య చెంది మాట్లాడేవారిని చూడు...వాళ్ళ మాటలే మన మనసులో పట్టుదలను పెంచి, మనల్ని జీవితంలో గొప్ప వాళ్ళను చేస్తుంది. మరోవిధంగా చెప్పాలంటే ఈర్ష్య=మానవ ఉలి"

తల్లి చెప్పింది నిజమేనని అర్ధం చేసుకున్న సురేందర్, బాబాయ్ సుందరామయ్యను చూడటానికి స్వీట్ బాక్స్ తో బయలుదేరి వెళ్ళాడు.

************************************************************************************************ 

 ఇవి కూడా చదవండి:

"మీలా లేడండి...!"(కథ)

పువ్వులో ఒక తుఫాన(కథ)

******************************************************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి