ప్రకృతి వేసిన శిక్ష...(కథ)...సరికొత్త కథ 05/02/23 న ప్రచురణ అవుతుంది

పదిహేడవ అల…(సీరియల్)....(PART-5 of 12)...06/02/23న ప్రచురణ అవుతుంది

ఈఫిల్ టవర్‌ను రెండుసార్లు విక్రయించిన వ్యక్తి!...(ఆసక్తి)...07/02/23 న ప్రచురణ అవుతుంది

1, ఫిబ్రవరి 2021, సోమవారం

మృత్యుదూత (క్రైమ్ సీరియల్)...PART-7

 

                                                                          మృత్యుదూత (క్రైమ్ సీరియల్)                                                                                                                                                                     (PART-7)

డాక్టర్ కారులో ఇరవై నిమిషాల ప్రయాణం.

జూబ్లి హిల్స్ గ్రీన్ పార్క్ అవెన్యూలో అశోక చెట్ల మధ్యలో ఉన్న నటి రంజని ఇంటి ముందు కారాపారు. కాంపౌండ్ వాల్ బయట నిలబడున్న గూర్కా, డాక్టర్ను చూసి స్నేహపూర్వకంగా నవ్వి సెల్యూట్చేయగా అది పట్టించుకోకుండా ఆయన లోపలకు వెళ్ళారు.

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ఆయన వెనుకే నడిచాడు.

పొర్టికో మెట్ల మీద ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి కూర్చుని మాట్లాడుకుంటుంటే, చెర్రీ పండు రంగులో ఒక కారు పొర్టికోలో  నిలబడింది.

డాక్టర్నూ, ఇన్‌స్పెక్టర్నీ చూసిన వెంటనే ఆ మగ మనిషి, ఆడ మనిషి లేచారు. పనివాళ్ళు అనేది వాళ్ళు వేసుకున్న దుస్తులను చూస్తేనే తెలుస్తోంది. భవ్యంగా వంగారు.

అయ్యా! -- నమస్కరించాడు.

డాక్టర్ గోపీనాద్ అడిగాడు ఇంట్లో ఎవరైనా ఉన్నారా?”

ఎవరూ లేరయ్యా...అమ్మగారికి ఊటీలో షూటింగు. సారధి అయ్యగారు బయటకు వెళ్ళారు. ఇంకా రాలేదు

అమ్మగారి బెడ్ రూం తెరిచుందా, మూసుందా?”

తెరిచే ఉందయ్యా

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ అడ్డుపడి అడిగాడు.

ఊటీ నుండి ఫోన్ ఏమైనా చేసారా?”

లేదయ్యా

ఇన్‌స్పెక్టరూ, డాక్టరూ ఇంట్లోకి వెళ్ళారు. బంగళా అంతా గ్రానైట్ రాళ్లతో కలకలలాడుతోంది. సోఫాలు వెల్వెట్ గుడ్డతో కుట్టబడి హాలు మధ్యలో ఉన్నాయి.

రంజని గారి పడక గది మేడ మీదే కదా ఉంది

మేడమీదే నండి

మేడ మెట్లు ఎక్కి రంజని గది ముందుకు వచ్చి నిలబడ్డారు. తలుపు వేసుంది. తలుపుల మీద చెయ్యి పెట్టబోయి -- చట్టుక్కున వెనక్కి తీసుకున్నారు డాక్టర్. గోపీనాద్.

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ డాక్టర్ను ఆశ్చర్యంగా చూశాడు.

ఏమిటి డాక్టర్?”

గోపీనాద్ స్వరం తగ్గించి మాట్లాడారు.

లోపల ఏదో శబ్ధం వినబడుతోంది

శబ్ధమా?”

ఊ...క్షుణ్నంగా విని చూడండి

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ తలుపు దగ్గరగా వెళ్ళి నిలబడి చెవులకు పని ఇచ్చాడు.

లోపల శబ్ధం వినబడింది.

ఎవరో నడుస్తున్న శబ్ధం.

ఇన్‌స్పెక్టర్ తన డ్యూటీ స్మృతిలోకి వచ్చాడు.

తన నడుము దగ్గరకు చేయి పోనిచ్చి రివాల్వర్ తీసుకున్నాడు. తన ఎడం చెయ్యి చూపుడు వేలుతో తలుపును మెల్లగా తోసాడు.

తలుపు చప్పుడు చేయకుండా లోపలకు వెళ్ళింది.

                                                          **********************************

ప్రొఫస్సర్ దశరథమూర్తి గారి పరిశోధన శాల:

మొత్తం ఎంత మంది?”

పోలీస్ కమీషనర్ సర్వానంద్ అడిగిన ప్రశ్నకు, అపస్మారక పిడి నుండి బయటపడి -- నీరసంగా కుర్చీలో వెనక్కు వాలిపోయున్న దశరథమూర్తి గారు -- సన్నటి గొంతుతో సనిగారు.

ఐదుగురు. ఒకమ్మాయి, నలుగురు మగవాళ్ళూ

ఆ అమ్మాయి పేరు?”

శ్రీలత...మగవాళ్ళ పేర్లు రాజు, రామూ, గణేష్, సాహిద్. ఆ అమ్మాయే ఆ గ్రూపుకు లీడర్. ఆమె మాటలకు ఆ నలుగురు కట్టుబడుతున్నారు

ఆ ఐదుగురు ఎలా ఉన్నారో చెప్పగలరా?”

ఎంతో కొంత చెప్పగలం

అది చాలు...మీరు చెప్పే వర్ణనను కంప్యూటర్ కి ఇస్తే, అది బొమ్మను గీసి ఇస్తుంది

దశరథమూర్తి గారికి పక్కనే వాడిపోయిన మొహంతో కూర్చోనున్న పల్లవి అడ్డుపడింది.

సార్...ఆ శ్రీలతని పక్కవైపు నుండి చూస్తే పాత హిందీ నటి రేఖా లాగా ఉంటుంది. నలుగురి యువకులలో ఆ గణేష్ కి కుడి చెవి మడత పడినట్టు ఉంటుంది. రాజు అనే వాడికి మెడ వెనుక ఒక పెద్ద మచ్చ ఉన్నది

ఇంత ధైర్యంగా దోపిడీ చెయ్యగలిగారు అంటే పాత క్రిమినల్స్ అయ్యే ఉంటారు. మీరేమీ కంగారు పడకండి. వాళ్ళు భారత దేశంలో ఏమూల ఉన్నా సరే -- రెండే రోజుల్లో కనిపెట్టేయచ్చు. బై...ద...బై... దశరథమూర్తి గారూ! దోపిడి చేయబడ్డ మూలికల మొత్తం విలువ ఎంత ఉంటుంది?”

ఆయన కన్నీటితో కమీష్నర్ను చూశారు.

అన్ని మూలికలకూ అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కోట్ల విలువ చేస్తుంది. మృత్యుదూతమాత్రం పదికోట్లు విలువ చేస్తుంది

వచ్చిన వాళ్ళు అన్ని మూలికలనూ తీసుకు వెళ్ళిపోయారా?”

అన్నీ తీసుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు

మీ దగ్గర ఇలాంటి మూలికల గిడ్డంగి ఉన్నట్టు బయట ఎవరికి తెలుసు?”

చాలా మందికి తెలుసు. నా పరిశోధన ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఈ మూలికల గురించి ఆంగ్ల పత్రికలలో చాలా వ్యాసాలు రాసాను

ఈ మూలికల పరిశోధనలో మీకు పోటీగా ఇంకెవరైనా పరిశోధన చేస్తున్నారా?”

మన దేశంలో నేను తప్ప ఎవరూ లేరు సార్

బయటి దేశాలలో ఉన్నారా?”

అవును

ఎవరు వాళ్ళు?”

నార్ మాన్ విస్ డం అని ఒకరు. ఆయనకు తొంబై ఏళ్ళ వయసు ఉంటుంది. ఎన్నో ఏళ్ళుగా మూలికల పరిశోధనలో ఉన్నారు. ఆయన నాకు పోటీగా ఉండొచ్చు. కానీ, ఆయన ఇలాంటి నేరం చేసే పనులు చేసే మనిషి కాదు

లేదు...ఈ కాలంలో ఎవర్నీ నమ్మలేము. ఒకరి మీద మనకు ఒక్క శాతం అనుమానం వచ్చినా సరే, వాళ్ళను విచారాల్సిందే మంచిది"

ఫోరన్ సిక్ నిపుణుడు ఒకతను కమీషనర్ పక్కకు వచ్చాడు.

కమీష్నర్ తలెత్తి అతన్ని చూస్తూ—

ఏమిటి... నరసింహం...ఫింగర్ ప్రింట్స్ దొరికినయా?”

ఏమీ దొరకలేదు సార్. వచ్చిన వాళ్ళు చేతులకు గ్లవుజ్ వెసుకుని, జాగ్రత్తగా దేనినీ ముట్టుకోకుండా, మూలికలను తీసుకు వెళ్ళారు

వేరే ఏదైనా పనికొచ్చే క్లూ ఏదైనా దొరికిందా?”

ఒకటే ఒకటి దొరికింది సార్

ఏమిటది?”

ఫోరన్సిక్ నిపుణుడు నరసింహం తన చేతులో ఉన్న ప్లాస్టిక్ కవరును విప్పి చూపించాడు.

                                                            **********************************

నటి రంజని ఇల్లు:

శబ్ధం చేయకుండా తలుపు లోపలకు వెళ్ళిపోవటంతో, రివాల్వర్ ను కుడి చేతి వేళ్లతో జాగ్రత్తగా పట్టుకుని ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ గదిలోపలకు వెళ్ళారు.

డాక్టర్ గోపీనాద్ కూడా ఆయన వెనుకే వెళ్ళాడు.

గదిలో ఎవరూ లేరే

శబ్ధం వినబడిందే!

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ఆశ్చర్యంగా చూస్తుంటే, డాక్టర్ ఆయన భుజాన్ని చిన్నగా కొట్టాడు.

ఏమిటి డాక్టర్?”

ఆ కర్టన్ చూడండి -- అంటూ సిట్ అవుట్ ను ఆనుకుని ఉన్న నీలి రంగు కర్టెన్ను డాక్టర్ చూపించగా... ఇన్‌స్పెక్టర్ చూశాడు.

అది చిన్నగా ఊగుతోంది.

పరిగెత్తుకు వెళ్ళి ఆ కర్టన్ను పక్కకు తోసి చూశారు. అటువైపు సిట్ అవుట్, దాని వెనుక తోట కనబడింది -- తోటలోని అరటి మొక్కల మధ్య ఒకడు వేగంగా పరిగెత్తుతున్నాడు.

డాక్టర్...ఎవడో పరిగెత్తుతున్నాడు...

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ఆందోళన పడుతూ తన చేతిలో ఉన్న తుపాకీతో, పరిగెత్తుకు వెడుతున్న  అతన్ని గురి చూసాడు. ట్రిగర్ ను నొక్కే లోపు, అరటి చెట్ల మధ్య అతను కనబడకుండా పోయాడు.

మళ్ళీ తల కనబడినప్పుడు కాల్చేడు. అతను ఒకసారిగా వంగుని---కాంపౌండ్ గోడ వైపుకు పరిగెత్తి -- మెరుపు వేగంలో ఎగిరి, కాంపౌండ్ వాల్ ఎక్కి, అవతల వైపుకు జంప్ చేశాడు.

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ కాల్చాడు.

రెండో తోటా కూడా వేస్ట్ అయ్యింది.

డాక్టర్! మీరు ఇక్కడే ఉండండి -- అన్న ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ సిట్ అవుట్ లోకి గెంతి, సిట్ అవుట్ గ్రిల్ పుచ్చుకుని తోట వైపు దిగి -- మట్టి, బురదగా ఉన్న అరటి  మొక్కల మధ్య పరిగెత్తి -- బండ రాళ్ళతో కట్టబడున్న కాంపుండ్ గోడ మీదకు ఎగిరి, ఎక్కి దాని చివరకు వెళ్ళి అవతలవైపుకు చూశాడు.

మనుష్యుల సంచారమే లేని ఆ రోడ్డులో వంద మీటర్ల దూరంలో అత్యంత వేగంగా పరిగెత్తుతున్నాడు ఆ యువకుడు.

                                                                           **********************************

ప్రొఫస్సర్ దశరథమూర్తి గారి పరిశోధన శాల:

ఫోరన్ సిక్ అధికారి నరసింహం చూపించిన ఆ వస్తువును---కమీషనర్ సర్వానంద్, దశరథమూర్తి గారు, పల్లవి అందరూ చూసారు.

అదొక చేతి రుమాల.

ఆడవాళ్ళు ఉపయోగించే చేతిరుమాల. చిన్న చిన్న పువ్వుల బొమ్మలు ఉన్నాయి.

ఇది ఆ అలమరాకు పక్కన ఉన్నది సార్

కమీషనర్ అది తీసుకుని చూశాడు.

చేతిరుమాలతో కలిసున్న ఆ సెంటు వాసన -- గాలిలో కలిసి మెల్లగా ఆయన ముక్కు వరకు వచ్చింది.

కమీషనర్ చూపులు పైకి వెళ్ళి పల్లవి వైపు నిలబడింది.

ఇది నీ చేతి రుమాలానేమో చూడు

లేదు సార్...నేను చేతిరుమాల వాడనే వాడను

అలాగైతే...ఈ రుమాల, ఆ శ్రీలతదే అయ్యుంటుంది. మూలికలను ఎత్తుకు వెళ్ళేటప్పుడు తొందరలో చేతి రుమాలను జారవిడిచి ఉంటుంది

దశరథమూర్తి గారు నిట్టూర్పు విడిచారు.

ఈ చేతి రుమాలను పెట్టుకుని, ఆ గుంపును కనిపెట్ట వచ్చా సార్?”

ఎందుకు కనిపెట్టలేము మిస్టర్ దశరథమూర్తి ! చిన్న పుల్ల, పళ్ళల్లో ఇరుకున్న వాటిని తీయటానికి ఉపయోగపడుతుందని మీకు తెలుసు కదా... పోలీసు కుక్కను తీసుకు వచ్చి, దీన్ని వాసన చూపిస్తే...వాళ్ళు వెళ్ళిన దిక్కు ఏదీ అనేది తెలిసిపోతుంది. కుక్క గనుక మంచి హుషారు మూడులో ఉంటే, వాళ్ళు ఉండే చోటుకే మనల్ని తీసుకు వెడుతుంది

కమీషనర్ గారూ, మీ పోలీసుల సంప్రదాయం ఏదీ నాకు తెలియదు. మీరు ఏదైనా చేసి, దొంగతనం చేయబడ్డ నా మూలికలను నాకు దొరికేటట్టు చూడండిఅవి నా యాబై ఏళ్ళ కష్టం"

బాధ పడకండి సార్ -- అని చెప్పిన కమీషనర్, ఫోరన్ సిక్ అధికారి వైపు తిరిగి చూసారు.

నరసింహం

సార్

పోలీస్ డాగ్ స్క్వాడ్ లీడర్ డేవిడ్ ఇంటికి ఫోన్ చేసి సీమాతో వెంటనే బయలుదేరి రమ్మని చెప్పండి"

ఎస్ సార్

నరసింహం తన దగ్గరున్న సెల్ ఫోన్ నుండి డేవిడ్ ను కాంటాక్ట్ చేసి మాట్లాడాడు -- ఆ తరువాతి పదిహేను నిమిషాలలో సీమా అనే పేరున్న కుక్కతో ఆయన వచ్చి చేరాడు.

కమీషనర్ ఆ చేతి రుమాలను డేవిడ్ దగ్గర చూపించి విషయం చెప్పి, సీమాకు కమాండ్ ఇచ్చారు.

సీమా...స్పీక్

అది అరిచింది.

సీ...ఆర్టికల్

చేతి రుమాలను కింద పెట్టాడు డేవిడ్.

సీమా, చేతి రుమాలను క్షుణ్ణంగా చూసింది. స్మెల్ ఇట్

సీమా ఒక్క క్షణం ఆలొచించి, ఆ తరువాత గదిలో  నుండి వేగంగా బయటకు వచ్చి, బయటకు పరిగెత్తింది.

డేవిడ్ తాడు పట్టుకుని దాని వెనుకే పరిగెత్తేడు.

ఐదు నిమిషాల పరుగు.

వీధి చివర ఉన్న పెట్రోల్ బంక్ లోపలకు దూరింది. పెట్రోల్ పోసే చోటుకు దగ్గరగా వెళ్ళి కూర్చుండిపోయింది.

డేవిడ్ సెల్ ఫోన్ లో కమీషనర్ను కాంటాక్ట్ చేశాడు.

సార్...సీమా పెట్రోల్ బంకు లోపలకు వచ్చి పడుకుండిపోయింది

అలాగైతే ఆ గుంపు పెట్రోల్ పోయించుకోవటానికి తమ కారును తీసుకు వెళ్ళుంటుంది

ఉండొచ్చు సార్

ఆ బంకులో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఆ దొంగవెధవల్ని చూసుండొచ్చు. వాళ్ల దగ్గర విచారణ చేస్తూ ఉండండి...ఈలోపు నేనొస్తాను

ఎస్. సార్

సెల్ ఫోన్ ను ఆఫ్ చేసి జేబులో పెట్టుకున్న డేవిడ్, సీమా కుక్కను వేడుకగా చూస్తున్న ఉద్యోగస్తుల వైపుకు వెళ్లాడు.

                                                          **********************************

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, కాంపౌండ్ గోడపై నుండి కిందకు దూకారు.

దూరంగా ఆ యువకుడు మూర్ఖమైన వేగంతో పరిగెత్తుతున్నాడు.

'కాల్చ గలమా?' -- ఒక్క క్షణం ఆలొచించి 'కాల్చ లేము అని నిర్ణయించుకుని ఆ యువకుడ్ని చేస్ చేశాడు.

ఒక నిమిష సమయం అతన్ని చేస్ చేసిన ఆయన, ఒక జంక్షన్ దగ్గరకు వచ్చి ఆగారు. మూడు రోడ్ల కూడలి. చుట్టూ చూశారు. అతను కనబడలేదు. జంక్షన్ లో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్న ఒక కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ను చూసి 'సెల్యూట్' చేశాడు.

రాజేష్ కుమార్ అడిగాడు.

ఎవరైనా ఇటు పక్కగా పరిగెత్తుకు వచ్చారా?”

అలా ఎవరూ వచ్చినట్లు నేను చూడలేదు సార్...ట్రాఫిక్ కంట్రోల్లో ఉన్నాను. పెద్దగా గమనించలేదు

ఇటుపక్కకే వచ్చేడు. నేను ఫాలో చేసుకుంటూ వచ్చాను

చెమటతో తడిసిపోయున్న చొక్కాను ఒక సారి సరి చేసుకుని, మళ్ళీ అటూ ఇటూ చూసి ఈ సందు కుండా వెళ్ళుంటాడో?”

వెళ్ళలేడు సార్...ఎందుకంటే ఈ సందు ఒక ప్రమాదకరమైన రోడ్డు. ఈ సందులోకి ఎవరు వెళ్ళినా మళ్ళీ ఇటువైపుకు తిరిగి రావలసిందే. అదీ కాకుండా ఈ సందు దగ్గరే నేను నిలబడి ట్రాఫిక్ కంట్రోల్ చేసేను...ఇటు ఎవరూ రాలేదు సార్

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ గడ్డం తడుము కుంటూ, ఇంకా ఆ సందు వైపే చూస్తున్నప్పుడు, ఆయన చొక్కా జేబులో ఉన్న సెల్ ఫోన్ మోగింది.

'సెల్ ఫోన్ తీసి డిస్ ప్లేలో చూశాడు. డెప్యూటీ కమీషనర్ అనే పేరు మెరిసింది.

చెవి దగ్గర పెట్టుకున్నాడు.

హలో...గుడ్ మార్నింగ్ సార్

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్! నటి రంజని మేనేజర్ సారధి మరణం గురించిన దర్యాప్తులోనే కదా ఉన్నారు

అవును సార్

ఆ వ్యవహారాన్ని మూటకట్టి ఒక పక్కన పడేసి వెంటనే కమీషనర్ ఆఫీసుకు రండి

                                                                                                      Continued....PART-8

************************************************************************************************

2 కామెంట్‌లు: