'విద్యుత్ ఆదా కోసం కృతిమ చంద్రుడు'...(ఆసక్తి)...26/02/21 న ప్రచురణ అవుతుంది

'మేఘలలో మర్మమైన మానవరూపాలు'...(మిస్టరీ) ..28/02/21 న ప్రచురణ అవుతుంది

'ఆమే వస్తానంది'...(కథ)...02/03/21 న ప్రచురణ అవుతుంది

3, ఫిబ్రవరి 2021, బుధవారం

మృత్యుదూత (క్రైమ్ సీరియల్)...PART-8


                                                                         మృత్యుదూత (క్రైమ్ సీరియల్)                                                                                                                                                                 (PART-8) 

పోలీస్ కమీషనర్ ఆఫీసు.

కమీషనర్ సర్వానంద్ తన ముందు కూర్చున్న దశరథమూర్తి గారిని, పల్లవిని బాధతో చూస్తూ మాట్లాడాడు.

మిస్టర్. దశరథమూర్తి...మీకోపం నాకు అర్ధమవుతోంది. శ్రీలత అనే ఒక స్త్రీ, నలుగురు యువకులు జూపీటర్ టీవీ పేరు చెప్పుకుని మీ ఇంటికి వచ్చి -- మిమ్మల్ని బెదిరించి -- మీరు చాలా కష్టపడి చేర్చి పెట్టిన అరుదైన మూలికలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. సంఘటన జరిగి మూడు నెలలు అవుతున్నా ఇంకా నేరస్తులను ఎందుకు కనిపెట్ట లేకపోతున్నారు అని అడుగుతున్నారు...మీ కోపం న్యాయమైనదే!

అయినా కానీ మీ దగ్గర మేము నిజం ఒప్పుకోవలసిందే. ఆ శ్రీలతనీ, ఆ నలుగురు యువకులనూ కనిపెట్టటానికి ఇంతవరకు మేము ఏడు స్పేషల్ బృందాలను ఏర్పాటు చేశాము. కానీ వాళ్ళను కనిపెట్ట లేకపోయాము. సి.బి.సి.ఐ.డి పోలీసులు, 'క్యూ' బ్రాంచ్ పోలీసులూ మాకు పక్క బలంగా నిలబడి ఈ విషయంలో మాకు సహాయం చేస్తూనే ఉన్నారు. అందువలన త్వరలోనే పట్టుకుంటాము

దశరథమూర్తి గారు తన రెండు చేతులనూ, టేబుల్ మీద ఆనించి కోపంతో పెద్దగా మాట్లాడాడు.

కమీషనర్ సార్...మీరు చెప్పే ఈ సమాధానం విని, విని నాకు విసుగెత్తిపోయింది. దొంగతనం చేయబడ్డవి నగలో, డబ్బులో కాదు సార్. విలువ కట్టలేని అరుదైన మూలికలు. నగలో, డబ్బో పోయున్నా...అది ఎప్పుడు దొరికితే అప్పుడు దొరకనీ అని వదిలి పెట్టేసి నా పని నేను చూసుకునే వాడిని. మీరేమో అవి మూలికలే కదా అని అశ్రద్ద చేస్తున్నారు.  ఇది అంతర్జాతీయ రంగంలో భారతదేశ పేరును నెంబర్ ఒన్ చేసేది. నాకు రెండు నెలల క్రితం ఒక అంతర్జాతీయ సదస్సు ఉన్నది. ఈ మూలికలు దొంగతనం చేయడం వలన నేను ఆ సదస్సుకు వెళ్ళలేకపోయాను. కానీ, ఆ మాట చెప్పలేక నా ఆరొగ్యం బాగోలేదని చెప్పి తప్పించుకున్నాను. వాళ్ళు సదస్సునే రద్దు చేశారు. నేను చెప్పేది అబద్దం అనుకుంటే ఈ ఫైలు చూడండి. మళ్ళీ సదస్సు ఎప్పుడు పెడతారో తెలియదు. ఈ సారి తప్పించుకోలేను అంటూ ఒక ఫైలు కమీషనర్ ముందు ఉంచాడు.

మీ మనోభావాలను అర్ధం చేసుకున్నాన్ను...ఈ కేసును స్పేషల్ గా గమనించమని ఢిల్లీ నుండి కూడా మాకు ప్రెషర్ వచ్చింది. మా వల్ల అయిన అన్ని ప్రయత్నాలు చేశాము. చేస్తూనే ఉంటాము   

కమీషనర్ సార్! మీకు నేనొక ఆలొచన చెప్పనా?”

ప్లీజ్...చెప్పండి

మూలికలను ఎత్తుకు వెళ్ళిన ఆ గుంపు ఈ పాటికి ఏదో ఒక దేశంలో సెటిల్ అయ్యుంటారు. ఇంటర్ పోల్ పోలీసుల ద్వారా మీరు ప్రయత్నం చెయ్యచ్చే?”

అది చేయకుండా ఉంటామా? ఇంటర్ పోల్ పోలీసులకు ఈ మూలికల దొంగతనం విషయాన్ని డీటైల్స్ తో సహా  రెండు వారాల క్రితమే పంపించాము. ఎలాగైనా మంచి జవాబే వస్తుంది. కొంచం ఓర్పుగా ఉండండి దశరథమూర్తి గారు

జరిగి మూడు నెలలు అవుతోంది...ఇంతవరకు ఈ కేసులో ఒక చిన్న ప్రోగ్రస్ కూడా లేదు సార్. సంఘటన రోజు అక్కడ చేతి రుమాల దొరికింది. అంతే...ఆ రుమాలను స్మెల్ చేసిన పోలీసు కుక్క పెట్రోల్ బంకులోకి వెళ్ళి పడుకుండిపోయింది. పెట్రోల్ బంకు పనివాళ్ళను విచారించినప్పుడు ఎటువంటి ఉపయోగపడే సమాచారమూ దొరకలేదు

కమీషనర్ చేతులు నలుపుకుంటూ.

ఇలా చూడండి మిస్టర్ దశరథమూర్తి ...ఇది క్రైం యుగం...నగరంలో ప్రతి ఒక గంటకూ ఒక నేరం జరుగుతోంది. అది కాకుండా రాజకీయాల ద్వారా పోరాటాలు. రేపు తెల్లారితే ఎలా తెల్లార్తుంది అని చెప్పలేము. నా కుర్చీలో మీరు కూర్చుంటే నా పరిస్థితి ఏమిటనేది మీకు అర్ధమవుతుంది

కమీషనర్ మాట్లాడుతున్నప్పుడే ఆయన ముందున్న టెలిఫోన్ రింగ్ అయ్యింది.

ఒక ఎక్స్ క్యూజ్ మీ చెప్పేసి, రిసీవర్ ఎత్తేరు. అవతల సైడు డిప్యూటీ కమీషనర్ మాట్లాడాడు.

సార్...ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ మిమ్మల్ని చూడటానికి వస్తున్నారు

నటి రంజని యొక్క మేనేజర్ సారధి ఎలా చచ్చిపోయాడో అనే సమాచారం, పోస్ట్ మార్టంలో తెలిసిందా?”

ఫారిన్ స్పేషలిస్టులు కూడా వచ్చారు. రక్తం కక్కుకోవటం వలనే చావు సంబంధించిందని ఖచ్చితంగా చెబుతున్నారు సార్

అలాగైతే అది సహజ మరణమే కదా?”

డాక్టర్లు అది సరిగ్గా చెప్పటం లేదు సార్. సారధి గారికి రక్తం కక్కునేంత రోగమేమీ లేదని చెబుతున్నారు. సారధి చావులో ప్రకృతికి విరుద్దంగా ఏవో విషయాలున్నాయని చెబుతున్నారు...రాత పూర్వకంగా ఏమీ ఇవ్వలేమని చెబుతున్నారు. ఇస్తే కేసు క్లోస్ చేసేయవచ్చు

సారధి గారికి రక్త చెమట పట్టిందనేది నిజమా...కాదా? దాని గురించి ఏం చెప్పారు?”

నిజం కాదు అనేది డాక్టర్ల ఒపీనియన్ సార్

అది అబద్దమైతే...ముఖం తుడుచుకున్న టవల్ మీద రక్తం ఎలా వచ్చింది?”

సార్...ఈ కేసులో చాలా గందరగోళం ఉన్నది. ఏది నిజం, ఏది అబద్దం తెలియటం లేదు. అందుకే కదా సార్ మనం ఈ కేసులో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. లేకపోతే ఇలా ఏ కేసు ఇన్ని రోజులైనా మనం ముగించలేకపోయాము...చెప్పండి?”

సరే, కాసేపు ఈ కేసును కాసేపు పక్కన పెట్టండి. తొందరపడి రక్తపు చెమట వార్తను ఎవరికీ చెప్పవద్దని చెప్పండి. లేకపోతే దానికి ఎవరైనా బూతాకారం తొడిగి ప్రజలలో భయం కల్పిస్తారు

ఎస్...సార్

ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ఎన్నింటికి ఇక్కడకు వస్తారు?”

నేను ఇన్ ఫార్మ్ చేసేశాను సార్...బహుశ దారిలో ఉంటారు

ఆయన రానీ...నేను మాట్లాడుకుంటాను

కమీషనర్ సర్వానంద్ రీజీవర్ను పెడుతూండగా ఎదురుగా కూర్చున్న దశరథమూర్తి గారు ఆందోళనగా మాట్లాడారు.

ఒక్క నిమిషం కమీషనర్ సార్...ఎవరికో రక్తపు చెమటలు పట్టిందని చెప్పేరే...అది ఎవరికి?”

కమీషనర్ చిన్నగా నవ్వాడు.

మిస్టర్ దశరథమూర్తి! ఇది మీకు అక్కర్లేని విషయం. ఈ విషయాన్ని ఈ గదిలోనే మరిచిపొండి. బయటకు వెళ్ళి ఎవరి దగ్గర చెప్పకండి. ప్రజల సంక్షేమం మనసులో పెట్టుకునే ఈ విషయాన్ని మేము క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాము

నో...ఓ...ఓ...ఓ...ఓ...!

టేబుల్ ను గట్టిగా గుద్దారు దశరథమూర్తి గారు. కోపంగా మాట్లాడారు.

కమీషనర్ సార్...మూలికలు కనిపించకుండా పోయిన వ్యవహారంలో గత మూడు నెలల కాలంలో ఎటువంటి క్లూ దొరకలేదని చెప్పారు...ఈ రక్తపు చెమటే ఆ వ్యవహారంలో ముఖ్యమైన క్లూ"

కమీషనర్ సర్వానంద్ ముఖంలో వేడిసెగ తగిలినట్లు నిటారుగా కూర్చున్నాడు.

ఏం చెబుతున్నారు దశరథమూర్తి గారు?”

నిజాన్ని చెబుతున్నాను. ఒకరికి చెమట రక్తంగా వస్తోందంటే, అది ఒక మూలిక యొక్క పనే...కమీషనర్ సార్

ఏ...ఏ...ఏమిటీ...మూలిక యొక్క పనా?”

అవును! మూలికలలో అత్యంత శక్తి కలిగింది మృత్యుదూత అనే మూలిక. దాన్ని ప్రత్యేకంగా ఒక రోజు మాత్రం --- అంటే పౌర్ణమి రోజుకు తరువాతి రెండవ రోజున మాత్రమే బయటకు తీయాలి. ఆ రోజు మాత్రం ఆ మూలికకు అమితమైన దైవ శక్తి వస్తుంది. ఆ రోజు ఆ మూలికను చూసిన వారికీ, ఆ మూలిక యొక్క దైవ శక్తి తరంగాలు తాకిన మనుషులు మేధావులవుతారు. ఆ రోజు ఆ మూలిక యొక్క చిన్న ముక్కను తిన్న వారు వారి జీవితాంతం ఆరొగ్యంగానూ, యుక్త వయసు శక్తితోనూ ఉంటారు.  మిగిలిన రోజులలో దాన్ని బయటకు తీస్తే అది విపరీతాలకు దారి తీస్తుంది.

నిన్న అమావాస్య రాత్రి. అమావాస్య రాత్రి పూట ఆ మూలికకు చెడు శక్తి ఎక్కువ.  అమావాస్య రోజు చంద్ర కిరణాలు ఉండవు కాబట్టి ఆ మూలికకు ఆ శక్తి ఎక్కువై, ఆ మూలికలో నుండి బయటకు వచ్చే ఆ తీవ్రమైన చెడు శక్తి యొక్క అలల తరంగాలు ఏ మనిషినైనా తాకితే, అవి ఆ మనిషి లోపలకు చొచ్చుకుపోతాయి. వెంటనే ఆ మనిషిలో ఆ మూలిక యొక్క చెడు శక్తి వలన, ఆ మనిషిలో వేడి ఎక్కువ అవుతుంది. చెమట పడుతుంది. అలా చెమట పట్టినప్పుడు రక్తం చెమటగా బయటకు వస్తుంది. రక్తపు చెమట బయట పడిన కొన్ని గంటల తరువాత ఆ మనిషి రక్తం కక్కుకుని చచ్చిపోతాడు...ఇది ఆ మూలిక యొక్క శక్తి...ఇది పచ్చి నిజం

కమీషనర్ సర్వానంద్  అది విని శిలలాగా అయిపోయాడు.

దశరథమూర్తి గారు కొనసాగించారు.

కమీషనర్ గారూ! రక్తపు చెమటలు పట్టిన మనిషి ఎవరు? ఆ మనిషి ఇప్పుడు బ్రతికే ఉన్నాడా...లేడా?”

ఆయన పేరు సారధి. నటి రంజని యొక్క మేనేజర్. రక్త చెమట పట్టిన వెంటనే దాన్ని ఒక టవల్ తో తుడుచుకుని, ఆ టవల్ను తీసుకుని డాక్టర్ గోపీనాద్ ను చూడటానికి వెళ్ళారు. అక్కడున్న రెస్ట్ రూములో రక్తం కక్కుకుని చనిపోయాడు

ఆ సారధి ఎక్కడ పడుకుని నిద్రపోయారు?”

అతని రూములో ఫ్యాను పనిచేయలేదని, నటి రంజని షూటింగ్ కోసం ఊటీ వెళ్ళటం వలన ఇతగాడు రంజని గారి ఏ.సీ రూములోకి వెళ్ళి పడుకున్నాడు. ఆ గదిలోనే ఈ విపరీతం జరిగింది 

అలాగైతే రంజని గారి ఏసీ గదిలోనే ఆ మృత్యుదూత మూలిక ఉండుండాలి

కమీషనర్ సర్వానంద్ తన తల మీదున్న టోపీని తీసేసి, తన ఎడం చేతి వెళ్లతో బుర్ర గోక్కుంటూ ఆలొచించాడు.

రంజని గారి రూములో ఆ మృత్యుదూత మూలిక ఉండుంటుంది అని  చెబుతున్నారా?”

ఖచ్చితంగా

ఆ మూలిక రంజని గారికి ఎలా దొరికుంటుంది?”

ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి, పద్దతిగా ఒక విచారణ చేస్తే అన్ని నిజాలూ బయటకు వస్తాయి కమీషనర్ సార్! ఈ మూలికల దొంగతనంలో రంజనికి భాగం ఉండి ఉండొచ్చు. ఆమెను లాకప్ కు తీసుకు వచ్చి గట్టిగా రెండు తగిలిస్తే...

మిస్టర్. దశరథమూర్తి, మీరు అనుకునేటట్టు రంజని గారిని పోలీస్ స్టేషన్ కు పిలుచుకు వచ్చి విచారణ జరపలేము. ఆమె గొప్ప నటి కాకపోయినా, ఆమె ప్రభలమైన వ్యక్తి కాకపోయినా, రాజకీయాలలో చాలా పెద్ద పేరున్న వ్యక్తి. ఎక్కడ ఏ కార్యం జరగాలన్నా రంజనిని చూసి చదివింపులు ఇచ్చేసి వెళ్ళిపోతే కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. రాజకీయ రంగంలో ఆమెను 'ఆటం బాంబు అని పిలుస్తారు. ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి విచారణ చేయలేము

కమీషనర్ సార్! చట్టానికి ముందు అందరూ ఒకటేనని మీకు తెలియదా? అరుదైన మూలిక దొంగతనం కూడా పెద్ద నేరమే. కోట్లు విలువ చేసే మూలికలు దొంగతనం చేయబడ్డాయి. గత మూడు నెలలుగా ఈ కేసు బావిలో వేసిన రాయిలాగా ఉండిపోయింది. ఈ రోజే ఈ కేసులో మొదటిసారిగా ఒక నిజం బయటకు వచ్చింది. ఈ నిజాన్ని గట్టిగా పుచ్చుకుని, మూలికలు దొంగతనం చేయబడటానికి కారణమైన వాళ్ళను కనిబెట్టి అరెస్టు చెయ్యద్దా?”

కమీషనర్ సర్వానంద్ ఏదో మాట్లాడుదామనుకునే లోపు, గది తలుపు తట్ట బడింది.

                                                                                         Continued....PART-9

**************************************************************************************************************


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి