11, ఫిబ్రవరి 2021, గురువారం

మృత్యుదూత (క్రైమ్ సీరియల్)...PART-12(LAST)


                                                                        మృత్యుదూత (క్రైమ్ సీరియల్)                                                                                                                                                                (PART-12) 

                                                                                       (చివరి భాగం)

టూ టౌన్ పోలీస్ స్టేషన్.

దశరథమూర్తి గారు స్టేషన్ దగ్గరగా కారు ఆపేసి, పల్లవితో కారు దిగినప్పుడు సరిగ్గా సమయం పది గంటలు. కమీషనర్ సర్వానంద్, డెప్యూటీ కమీషనర్ దీపక్ శర్మ లోపల కూర్చుని ఒక ఫైలును తిరగేస్తూ మాట్లాడుకుంటున్నారు. వీళ్లను చూసిన వెంటనే లేచారు.

రండి మిస్టర్ దశరథమూర్తి! సరిగ్గా చెప్పిన టైముకు వచ్చాసేరే

ఎప్పుడూ టైమును వేస్టు చేయకుండా కరెక్టుగా ఉండాలని డిసిప్లేన్ పెట్టుకున్నాను

మంచిది! రండి లాకప్ కు వెళ్ళి ఆ యువకుడ్ని చూసేద్దాం. ఈ రోజు మీరు చెప్పబోయే సమాధానాన్ని ఫాలో అయ్యి మా విచారణ మొదలు పెట్టాలి

స్టేషన్ లోపల వెనుక వైపున ఉన్న ఒక లాకప్ వైపుకు నడిచారు. పాత గది ఒకటి లాకప్ గా మార్చబడుంది. లావాంటి ఇనుపగేటు ఒకటి తాలం వేసుంది. సెంట్రీకీ నిలబడున్న కాపలా కానిస్టేబుల్ తాళం తెరిచాడు. లోపలకు వెళ్లారు. ఎత్తైన గోడకున్న కిటికిలో నుండి సూర్య కిరణాలు, గదిని వెలుతురుతో నింపింది.

లోపల సిమెంటు బెంచ్ మీద యువకుడు ఒకడు అండర్ వేర్ మాత్రం వేసుకున్న శరీరంతో పడుకోనున్నాడు. నోటి దగ్గర, ముక్కు దగ్గర నెత్తురు గడ్డ కట్టుంది. పోలీసు లాఠీలు కొంచం హద్దు మీరి అతని మీద ఆడుకోవటం వలన రక్తం గడ్డకట్టి, గీతలు గీతలుగా తెలుస్తున్నది. కళ్ళు మూసుకోనున్నాడు.

నలుగురూ అతని చుట్టూ నిలబడ్డారు. మిస్టర్ దశరథమూర్తి...పోలీస్ దెబ్బలతో నొప్పి భరించలేక మత్తుగా పడుకోనున్న ఈ యువకుడ్ని చూడండి. మూలికలను దొంగలించుకు పోవటానికి వచ్చిన ఆ నలుగురి యువకులలో వీడూ ఒకడేనా చూడండి

దశరథమూర్తి గారు వంగుని అతని మొహం చూసాడు. నాలుగు వైపుల నుండి బాగా లోతుగా చూశాడు. ఒక్క నిమిషం తరువాత తల ఎత్తారు.

 “ఎస్...ఆ రోజు వచ్చిన ఆ నలుగురు యువకులలో ఇతనూ ఒకడు. కానీ వీడి పేరేమిటో నాకు జ్ఞాపకం లేదు

పల్లవీ...మీరూ చూడండి

పల్లవి కూడా వంగుని నాలుగు విధాలుగా అతని ముఖం చూసింది. అనుమానమే లేదు సార్. మూలికలను ఎత్తుకు వెళ్ళటానికి వచ్చిన ఆ నలుగురి యువకులలో వీడూ ఒకడు

ఖచ్చితంగా?”

వందకు వంద శాతం సార్. ఆ మొహాలను మేము ఎన్నటికీ మరిచిపోలేము

ఇది చాలు మాకు! ఇక మీదట అతని నోటి వెంట నిజాలను ఎలా రాబట్టాలో అలా రాబడతాము. రండి...ముందు గదికి వెళదాం

స్టేషన్ లోని ముందు గదికి వెళ్లారు. అక్కడున్న చెక్క కుర్చీలో కూర్చున్నారు.

ఒక కానిస్టేబుల్ కాఫీ గ్లాసులతో వచ్చాడు. అందరికీ కాఫీ ఇచ్చాడు. అందరూ తీసుకున్న తరువాత ఒకే ఒక గ్లాసు కాఫీ మాత్రం ట్రే లో ఉండిపోయింది--కమీషనర్ ఆ కానిస్టేబుల్ దగ్గర చెప్పారు.

ఆ కాఫీని ఇక్కడ పెట్టేసి వెళ్ళి దేవానంద్ ను పిలుచుకురా

కానిస్టేబుల్ తల ఊపి వెళ్ళి లాకప్లోకి వెళ్ళి సిమెంటు బెంచి మీద పడుకోనున్న అతన్ని లేపి తీసుకు వచ్చాడు.

కమీషనర్ స్వాగతం పలికాడు రండి దేవానంద్...ప్లీజ్ కూర్చోండి. అని చెప్పి తన పక్కనున్న కుర్చీ చూపించగా, అతను కూర్చున్నాడు. కాఫీ గ్లాసును చేతిలోకి తీసుకున్నాడు.

దశరథమూర్తి గారు, పల్లవి ఇద్దరూ ఆశ్చర్యంతో కమీషనర్ ను చూసారు.

ఏమిటిసార్ ఇది? ఒక నేరస్తుడ్ని పక్కన కూర్చో బెట్టుకుని, కాఫీ ఇచ్చారు?”

కమీషనర్ సర్వానంద్ నవ్వారు.

ఈయన నేరస్తుడు కాదు మిస్టర్ దశరథమూర్తి. ఈయన పేరు దేవానంద్. సి.బి.సి.ఐ.డి. అధికారి. ఆయన్ను లాకప్ లో నేరస్తుడిగా నటించమని చెప్పింది మేమే. ఆ పెదాలు చిట్లటం, రక్తం కారడం అంతా మేకప్’.

దశరథమూర్తి, పల్లవి….ఇద్దరి ముఖాలూ మాడిపోయినై.

కమీషనర్ నవ్వారు.

ఇప్పుడు చెప్పండి దశరథమూర్తి. ఆ రోజు మూలికలను దొంగతనం చేయడానికి వచ్చిన నలుగురు యువకులలొ ఈయన ఉన్నాడా?”

“...........”

మీ ఇద్దరికీ మాత్రమే ఆ నలుగురి యువకుల మొహాలు ముద్రించినట్టు మీ మనసులో పదిలమైందని చెప్పేరే! ఆ నలుగురిలో దేవానంద్ ఉన్నాడా?”

“...............”

ఖచ్చితంగా ఉండి ఉండరు. ఎందుకంటే పోయిన సంవత్సరం ఒక ట్రైనింగ్ కోసం చంఢీగర్ వెళ్లారు--రెండు రోజుల ముందే వచ్చారు.

....................”

కాబట్టి మీరు అబద్దం చెప్పారు. ఎందుకు అబద్దం చెప్పారు?”

మేము అబద్దం చెప్పలేదు సార్...మోహాలు ఒకేలాగా ఉన్నందువలన...

ఇలాంటి ఒక సమాధానం చెబుతారనే మేము ఒక ఏర్పటు చేసి ఉంచాము. మిస్టర్ దీపక్ శర్మా...అది తీసి ఆపరేట్ చెయ్యండి

డెప్యూటీ కమీషనర్ దీపక్ శర్మ -- పక్కనున్న టేబుల్ డ్రా తెరిచి అందులో నుండి వాయిస్ మైల్ రికార్డు బాక్స్ తీసి పైన పెట్టారు.

కమీషనర్ చెప్పాడు. మిస్టర్ దశరథమూర్తి ఈ రోజు ప్రొద్దున సుమారుగా ఏడుంబావ్ ప్రాంతంలో -- అంటే నేను మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తరువాత--మీరు పల్లవికి ఫోన్ చేసారు. అలా మీరు మాట్లాడిన మీ సంభాషణను రికార్డు చేసి ఇమ్మని చెప్పి మీరు వాడుతున్న 'సెల్ ఫోన్ కంపెనీ దగ్గర చెప్పుంచాను. వాళ్ళూ రికార్డు చేసి ఉంచారు. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఇంకొకసారి రికార్డు వేసి విని తెలుసుకుందామా?...మిస్టర్ దీపక్ శర్మా మళ్ళీ ఆపరేట చెయ్యండి 

ఆయన దాన్ని ఆన్ చేసాడు.

దశరథమూర్తి స్వరమూ, పల్లవి స్వరమూ క్లియర్ గా వినబడింది.

పల్లవీ...

చెప్పండి సార్

ఏం చేస్తున్నావు?”

రాత్రి లేటుగా పడుకోవటం వలన, ఇప్పుడే నిద్ర లేచాను. స్నానం చేయడానికి వెడుతున్నాను

సరే...పది గంటల కంతా నువ్వు, నేనూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి

ఎందుకు?”

పది నిమిషాల ముందు పోలీస్ కమీషనర్ సర్వానంద్ ఇక్కడికి వచ్చారు. తమిళనాడు బార్డర్ అరక్కోణం దగ్గరున్న ఒక గ్రామంలో మూలికల దొంగతనం విషయంలో ఒకడ్ని పట్టుకున్నారట. టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి ఉంచారట. వాడు ఏదో మూలిక ఉంగరం ధరించి ఉన్నాడట. అందువల్ల పోలీసులకు వాడి మీద అనుమానం

అయ్యో పాపం!

పాపంగానే ఉన్నది...ఏం చేయగలం? కానీ, ఇది మనకి దొరికిన మంచి సందర్భం. పది గంటలకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి --- పోలీసులు ఎవరిని చూపించినా సరే, మూలికలను దోపిడి చేయటానికి వచ్చిన ఆ నలుగురి యువకులలో వీడూ ఒకడు అని చెప్పేసి వచ్చేద్దాం

అందువలన మనకేమిటి సార్ లాభం?”

ఏమిటి పల్లవీ...ఏమీ తెలియనట్లు అడుగుతున్నావు? మూడు నెలలకు ముందు మూలికలను ఎత్తుకు పోవటానికి శ్రీలతా అనే అమ్మాయి, నలుగురు యువకులూ వచ్చారు. మనల్ని బంధించి, బెదిరించి మూలికలను దోపిడీ చేసుకుని వెళ్ళే సమయానికి, అలమారులో నేను దాచి ఉంచిన తుపాకీతో నలుగురినీ కాల్చి చంపేను.

ఆ తరువాత ఆ నలుగురి శవాలనూ బయటకు తీసుకు వెళ్ళి -- మనుష్యులు సంచారమే లేని ముళ్ళపొదల మధ్య గొయ్యి తవ్వి పాతేసి వచ్చాము. వాళ్ళ వ్యానును కూడా ఒక కొండపై నుండి అద:పాతాలానికి తొసేసేమే. ప్రభుత్వానికి సొంతమైన కోట్లకొలది విలువ కలిగిన మూలికలను డబ్బు చేసుకుందామని వాటిని ఇప్పుడు మనం తీసుకున్నామే, గుర్తులేదా?”

గుర్తుంది...కానీ, దానికీ, దీనికీ లింక్ ఏమిటి?”

ఈ నిజాలన్నీ బయటకు రాకుండా ఉండాలంటే శ్రీలత నూ, ఆ నలుగురు యువకలనూ, ప్రాణాలతోనే బ్రతికున్నారని 'బిల్డ్-అప్' చెయ్యాల్సిన అవసరముంది. చేశాము. ఇది కాకుండా శ్రీలత పేరు ఉపయోగించి రంజనీని, జస్టీస్ జవహర్ నూ, కోటీశ్వరడు సత్యమూర్తిని మృత్యుదూత మూలిక ద్వారా హత్య చేయటానికి ప్లాను వేశేమే. దానికొసం ఆ హత్యలకు, వారిని హత్య చేయమని అడిగినావారి దగ్గర నుండి పెద్ద మొత్తం లో డబ్బు తీసుకున్నామే. మీ తమ్ముడు దిలీపుకు భాగం ఇచ్చాం. ఇక మీదట మనం ప్రొఫషనల్ గా ఎవరినీ హత్య చేయకూడదనీ, ఉన్న డబ్బు పెట్టుకుని సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నామే.

దానికి తగిన రీతిగా ఇప్పుడొక సందర్భం వచ్చింది. మూలిక ఉంగరం వేసుకున్న ఒకడెవడో పోలీసుల దగ్గర బాగా చిక్కు కున్నాడు. శ్రీలతతో పాటు వచ్చిన ఆ నలుగురి యువకులనూ నువ్వూ, నేనూ తప్ప వేరే ఎవరూ చూసింది లేదు. అందువలన పోలీసులు చూపించిన యువకుడు ఎవరైనా సరే, శ్రీలతతో వచ్చిన యువకుడే నని చెప్పేస్తే పోలీసు చూపులు పూర్తిగా వాడి వైపుకు వెళ్ళిపోతాయి. మనకి బద్రత అయిపోతుంది

దీని వలన మనకి ఏలాటి సమస్యా రాదుగా సార్?”

ఒక్క సమస్య కూడా రాదు

రంజనీనూ, సత్యమూర్తీనూ మృత్యుదూత మూలిక దగ్గర నుండి తప్పించుకున్నారు కదా...మళ్ళీ ప్రయత్నించాలా, అక్కర్లేదా?”

వద్దు! హత్య చేయమన్న పార్టీ దగ్గర డబ్బులు తిరిగి ఇచ్చేద్దాం. మనకు ఇక మిగిలిన మూలికలు చాలు. వాటికి మంచి ధర వచ్చినప్పుడు ఒక్కొక్కదాన్ని అమ్మేద్దాం

అయితే ఇక రంజనీకీ శ్రీలతలాగా నేను ఫోను చేయక్కర్లేదా?”

అక్కర్లేదు...అన్ని నేరాలకూ, నేరాలు చేయటానికీ టాటా చెప్పేసి హాయిగా ఉందాం. పోలీసులు శ్రీలతని వెతకనీ. మనం వాళ్లను వేడుకగా చూద్దాం. నువ్వు తొమ్మిదిన్నరకు తయారుగా ఉండు....కారులో వస్తాను. టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి వచ్చేద్దాం

సరే సార్

మాటలు ఆగినై. వాయిస్ మైల్ రికార్డర్ బాక్స్ మౌనం వహించింది.

దశరథమూర్తి, పల్లవి షాకైయ్యి మొహం వాడిపోయి నిలబడగా -- పోలీస్ కమీషనర్ సర్వానంద్, సన్నటి స్వరంతో చెప్పారు.

దశరథమూర్తి! నాకు మీ మీదా , పల్లవి మీదా చిన్నగా ఒక అనుమానం వచ్చింది.  అనుమానానికి మొదటి కారణం: శ్రీలత, నలుగురు యువకులూ కోట్ల కొద్ది విలువ కలిగిన మూలికలను దోపిడీ చేసుకుని వెళ్లారు. కానీ, మీ ప్రాణానికీ ఎటువంటి హానీ జరగలేదు. జెనెరల్ గా ఒక పెద్ద దోపిడీ చేసే వాళ్ళు, తరువాత సమస్య వస్తుందనే కారణంతో ఎవరినీ సింపుల్ గా ప్రాణాలతో విడిచిపెట్టరు.

నా రెండో అనుమానం: మీ గ్యాలరీలో ఉన్న మూలికలలో సగ భాగం ప్రభుత్వానికి, అంటే పురావస్తు శాఖ కు సొంతమైనవి. కాబట్టి ఈ మూలికలను మీరే ఎందుకు అపహరించి ఉండకూడదు అనే కోణం లో నుంచి ఆలొచించి చూశాను. మీరు నిజంగానే నేరస్తులా, కాదా అని తెలుసుకోవటం కొసమే సి.బి.సి.ఐ.డి. పోలీసు అధికారిని పెట్టుకుని మీకు పరీక్ష పెట్టాను.

ఆ పరీక్షలో మీరు ఫైలు-- మేము పాస్

మేము అంటే చట్టం, న్యాయం అని అర్ధం

అదిగో మీకు తోడుగా దిలీప్ వస్తున్నాడు

**********************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి