ప్రేమ సుడిగుండం (సీరియల్)
(PART-4)
సరిగ్గా నాలుగు గంటలకు అందరూ పెళ్ళి చూపుల ఇంటికి చేరుకున్నారు. అత్తయ్య అంతస్తుకు తగిన ఆస్తి పరుల ఇళ్ళే! అమ్మాయి చాలా అందంగా ఉన్నది. మంచి చదువు. నాగరీకంగా అందరితో గలగల మని మాట్లాడుతూ కలిసిమెలిసి పోయింది. అనవసరమైన సిగ్గును వదిలిపెట్టింది.
వరుణ్
అదృష్టవంతుడే!
"ఏరా...అమ్మాయి
ఎలాగుంది?" అత్తయ్య
అడిగింది.
"సూపర్!"
"అయితే ఓకే
చెప్పేద్దామా?"
"అన్నయ్య దగ్గర
అడిగావా?"
"వాడికేం తెలుసు?"
“మంచి
కుటుంబమే...ఓకే చెప్పేయి" కిరణ్ చెప్పాడు...అత్తయ్య సంప్రదాయంగా
తొమలపాకులు-వక్క మార్చుకుని బయలుదేరటానికి సిద్దమయ్యింది.
సంతోషంగా ఇంటికి
బయలుదేరారు.
"ఇళ్ళు చాలా
బాగుంది కదూ?"
"టిఫెను కూడా చాలా
బాగుంది"-వరుణ్ అమాయకంగా చెప్పటంతో...కిరణ్, ప్రతిమ 'గొల్లు’ మని నవ్వారు.
"పెళ్ళివారింటి
టిఫెను వరకు వెళ్ళిపోయావే! అవునమ్మా...వదిన పేరేమిటో చెప్పనేలేదే?"
"వదినా....?"
తల్లి మొహం
చిట్లించి కిరణ్ ను చూసింది.
"మరి...అన్నయ్య
పెళ్ళాం వదినే కదా?"
"ఏమిట్రా తెలివి
తక్కువ ప్రశ్న ఇది? ఆ అమ్మాయిని
చూసింది నీకు...వాడికి కాదు...! వదినను చూడాలని నీకు ఆశగా ఉంటే...వెనక్కి తిరిగి
చూడు. ఇదిగో ఉన్నది...మీ వదిన"
అత్తయ్య ప్రతిమను
చూపించగా...కిరణ్ అదిరిపడ్డాడు. ప్రతిమకు తల తిరిగింది. ఏదో పెద్ద శిఖరంపై నుండి
తలకిందలుగా పడుతునట్టు అనిపించింది ప్రతిమకు.
"నా పెళ్ళి కోసం
అమ్మాయిని చూడటానికి వెడుతున్నట్టు నాతో ఒక్క మాటకూడా చెప్పలేదేమ్మా? అన్నయ్య కోసం చూడటానికి
వెడుతున్నామని అనుకున్నాను…..ఏం అన్నయ్యా నీకు తెలుసా ఈ అమ్మాయిని ఎవరికోసం
చూడటానికి వెడుతున్నామో?"
"తెలియదురా! అమ్మ
బయలుదేరు అన్నది. బయలుదేరాను"
"ఎందుకమ్మా
మమ్మల్ని ఇలా ఇరకాటంలో పెడుతున్నావు?"
"ఇలా చూడరా కిరణ్.
వాడికి ప్రతిమనే పెళ్ళాం అని మేము ఎప్పుడో నిర్ణయం చేశాశాం. సమయం వచ్చినప్పుడు
చెపితే చాలు అనుకున్నాము. అయినా కూడా మీ నాన్న దాన్ని 'కోడలు పిల్లా...' అనే కదా పిలుస్తారు. అప్పుడే మీఇద్దరికీ ఇది
అర్ధం అయ్యుంటుందని అనుకున్నాను"
"నాకు ఇప్పుడు
పెళ్ళి వద్దమ్మా"......విసుగ్గా చెప్పాడు కిరణ్.
"ఏమిట్రా
చెబుతున్నావు? ఆ అమ్మాయికి ఏం
తక్కువ? నీకు తగిన
పిల్లనే కదా చూశాము. జల్లెడ వేసి వెతికేము తెలుసా...ఈ అమ్మయిని కనుక్కోవటానికి?
ఈ అమ్మాయి కంటే నీకు
సరిపోయే ఇంకో అమ్మాయి ఈ బూమ్మీదే ఉండదు...చెప్పేశాను"
"నువ్వు ఏం
చెప్పినా నాకు వద్దమ్మా?"
"ఎందుకని...అమెరికాలో
ఏ అమ్మాయినైనా చూసి పెట్టుకున్నావా? 'ప్రేమా గీమా' అనే అసహ్యం ఏదైనా ఉన్నదా?"
"అలాంటిదేమీ
లేదు!"
"మరైతే ఏమిటి నీ
ప్రాబ్లం?"
"నా వల్ల కారణాలు
చెప్పటం కుదరదు. పెళ్ళి వద్దంటే వద్దు...వదిలేయ్..."
"ఒప్పు
తాంబూళాలు మార్చుకున్నాము కదరా కిరణ్. ఇప్పుడు కాదంటే...నా పరువు, మర్యాద అంతా
పోతుంది"
"నా సంతోషం
కంటే నీకు నీ పరువు, మర్యాదే ముఖ్యమా?"
"ఈ
అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే నీ సంతోషానికి భంగం వస్తుందని
అనుకుంటున్నావంటే....నువ్వు ఈ పెళ్ళి వద్దూ అని చెప్పటానికి వేరే ఏదో అర్ధం ఉన్నది.
ఎమిటది? నిజం
చెప్పు!"
"ఒక్క
పుచ్చు కారణం కూడా లేదు. మళ్ళీ అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నా. అక్కడ నాకు
ఉద్యోగం రెడీగా ఉన్నది. ఆ ఉద్యోగంలో చేరుదామా...వద్దా అనే కన్ ఫ్యూషన్ లో ఉన్నాను.
రెండు రోజుల క్రితమే చేరుదాం అని నిర్ణయం తీసుకున్నాను. అప్లికేషన్ ఫారం కూడా
పూర్తి చేసి ఇచ్చాశాను. ఈ టైములో పెళ్ళి
ఎందుకని వద్దంటున్నాను"
“సరే...వాళ్ళ
దగ్గర ఒక సంవత్సరం తరువాత పెళ్ళి పెట్టుకుందామని చెబితే సరిపోతుంది. ఆ అమ్మాయి
కూడా న్యూ యార్కులో ఏదో పనికోసం ట్రై చేస్తోంది. చాలావరకు ఆ ఉద్యోగం దొరుకుతుందని
చెబుతున్నారు. అలాంటప్పుడు ఇబ్బంది లేదు కదా"
"ఇలా
చూడమ్మా...ఆ అమ్మాయిని నా వదినగా అనుకునే చూశాను. ఇక ఆ అమ్మాయిని నా భార్యగా
అనుకొలేను. అలా కాదు, నా పరువు, మర్యాదా కాపాడుకోవలసిందే
అని నువ్వనుకుంటే అన్నయ్యకి ఆ అమ్మాయిని కట్టిపెట్టు. నువ్వు చెప్పే వాటన్నిటికీ
తల ఊపే వ్యక్తి వాడే"
కారు ఇంటి
పోర్టికోలోకి వచ్చి ఆగింది.
కిరన్ గబగబా మేడ
మీదకు వెళ్ళిపోగా...అక్కడ మౌనం చోటు చేసుకుంది.
(ఇంకా ఉంది)...PART-5
*********************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి