శతమానం భవతి...(సీరియల్) (PART-6)
మరుసటి రోజు ఆఫీసుకు వెళ్ళిన కైలాష్ ఆఫీసు పనులలో మనసు పెట్టలేకపొయడు. కారణం, అతనికి ఆ క్రితం రాత్రి భార్య వెక్కి వెక్కి ఏడవటం, ప్రొద్దున్నే డేటు వచ్చింది అని చెప్పటం…ఈ రెండూ అతని మనసును డిస్టర్బ్ చేస్తున్నాయి.
'మామూలుగా నెల వారి రావలసిన డేట్ ఆలశ్యమైంది. ఇలా అప్పుడప్పుడు జరగటం సహజమే. దానిని పెద్దదిగా తీసుకుని, భయపడి పెళ్ళికి వెళ్ళకుండా ఆగిపోయింది మానస'
మనసంతా ఎందుకనో గందరగోళంగా ఉన్నది. సన్నగా తల నొప్పి రావడంతో కళ్ళు మూసుకుని రిలాక్స్ అవటానికి ప్రయత్నిస్తున్నాడు.
"ఏమిటి కైలాష్...కంప్యూటర్ ముందు కళ్ళు మూసుకుని జపం చేస్తున్నావు"
“ఓ...నువ్వా శంకర్. ఏమీ లేదు. నువ్వలా కూర్చో"
కైలాష్ ఎదురుగా కూర్చున్న శంకర్ తన చేతిలోని పెళ్ళి పత్రికలలొ ఒకటి తీసి కైలాష్ కి అందిస్తూ "నువ్వూ, నీ భార్యామణి తప్పకుండా పెళ్ళికి రావాలి. తాంబూలాలకు కూడా రాలేదు. ఏదో సాకు చెప్పి అప్పుడు తప్పించుకున్నావు. పెళ్ళికి రాకుండా ఉంటే ఊరుకోను" హెచ్చరించాడు.
"లేదు. లేదు. తప్పకుండా వస్తాను"
శంకర్ మిగిలిన వాళ్ళకు పత్రిక ఇవ్వటానికి లేచి వెళ్ళాడు.
శంకర్ ఇచ్చిన పెళ్ళి పత్రిక తెరిచి చూశాడు కైలాష్ 'తాంబూలలకు వెళ్ళలేదు. పెళ్ళికి తప్పకుండా వెళ్ళాలి’ అనుకున్న వెంటనే తాంబూలాలకు ఎందుకు వెళ్ళలేదో అతనికి గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఇదే లాగానే మానసకు నెల వారి డేట్. విపరీతమైన కడుపు నొప్పితో గిలగిల లాడుతూంటే డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు.
ఆ రోజు తారీఖు పది. ఈ రోజు కూడా తారీఖు పదే. నెలవారి డేట్ కరెక్ట్ గానే ఉన్నది కదా…మరెందుకు మానస అలా చెప్పింది!
ఎందుకు మానస అలా చెప్పింది? ఆమె లెక్కలు మరిచిపోయిందా? అదెలా మర్చిపోతుంది? చెల్లి పెళ్ళి...ఆ పెళ్ళికి హాజరై, అందరినీ కలుసుకుని సరదాగా గడపాలనుకున్నప్పుడు....మామూలు నెలవారి డేట్ దాటి ఒక వారం అయ్యిందని...గర్భం అయ్యుండొచ్చు అని ఎలా చెప్పింది? చెల్లి పెళ్ళికి వెళ్ళటం ఇష్టం లేక అలా చెప్పిందా?
సొంత చెల్లి పెళ్ళికి వెళ్ళటానికి ఇష్టం లేక పొవటం ఉంటుందా? వెళ్ళలేకపోయేనే అనే బాధతోనే కదా అంత వెక్కి వెక్కి ఏడ్చింది?....మరి నెలవారి డేట్ దాటి వారం రోజులయ్యిందని చెప్పటం, ఈ రొజు డేటు వచ్చిందని తలకు స్నానం చేసి రావడం...ఒక పెళ్ళైన ఆడపిల్లకు ఇది కూడ తెలియకుండా ఉంటుదా?
నమ్మసక్యం కావటం లేదు కైలాష్ కి, అతని బుర్ర మరికొంత పాడయ్యింది.
ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన తరువాత ఇదే చర్చ మానస దగ్గర మొదలుపెట్టాడు.
"లేదే! ఆ తారీఖున కాదే..అది అంతకు ముందే"
ఎంత చెప్పినా మానస ఒప్పుకోలేదు. మొండిగా ప్రవర్తించింది. శంకర్ తాంబూలాలకు వెళ్ళక పోవటానికి కారణం నెలవారి డేట్, కడుపు నొప్పి కానే కాదని వాదించింది.
మానస వాదాడిన తీరు చూసి కైలాష్ ఆశ్చర్యపోయాడు.
మాటి మాటికీ నెలవారి డేట్ గురించి మాట్లాడటానికి కైలాష్ కి అసహ్యం వేసింది. మానసతో జరుపుతున్న ఆర్ గ్యూ మెంట్ ను ఆపి బెడ్ మీద వాలిపోయాడు.
బెడ్ మీద పడుకున్నాడే గాని ఒక పట్టాన నిద్ర పట్టలేదు. ఏలాగొ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారు జామున మెలుకువ వచ్చింది. బద్దకంగా పక్కకు తిరిగి పడుకున్న కైలాష్ కి భార్య పక్కన లేదని తెలిసింది. ఉలిక్కి పడి లేచి బెడ్ మీదే కూర్చున్నాడు.
'నిన్నటి లాగా మానస పక్క గదిలో కూర్చుని ఏడుస్తోందా? నెలవారి డేట్ దాటిపోయిందని అబద్దం ఆడింది. తప్పు లెక్క వేశావు అని చెబితే వొప్పుకోనంటోంది. గర్భమేమో నని ఆశపడింది.పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాను అని ఏడుస్తోంది...మానసను అర్ధం చేసుకోవటం కష్టంగా ఉన్నదే?' అనుకుంటూ బెడ్ మీద నుండి లేచి గది దగ్గరకు వెళ్ళి లోపలకు తొంగి చూసాడు.
ఏడుపు శబ్ధం వినబడలేదు. ఒక్కడుగు ముందుకు వేసి చూశాడు.
'మానస డైరీని తెరిచి పెట్టుకుని పరీక్ష రాస్తున్న ఒక స్టూడెంటు లాగా వేగంగా ఏదో రాస్తోంది. “ఏం రాస్తోంది? ఎప్పటి నుంచి రాస్తోంది? ఇంత రాత్రి పూటా రాయవలసిన అవసరం ఏమున్నది? తెల్ల వారిన తరువాత, నేను ఆఫీసుకు వెళ్ళిన తరువాత రాసుకోవచ్చు కదా? ఎందుకు ఇప్పుడు రాస్తోంది?" దగ్గరకు వెళ్ళి ఏం రాస్తోందో చూద్దామా....వద్దు...తరువాత చదువుదాం'
మానస డైరీ మూస్తున్న చప్పుడు వినబడటంతో బెడ్ దగ్గరకు వేగంగా తిరిగి వచ్చి నిద్ర పోతున్నట్టు నటించాడు. కొద్ది సేపట్లో మానస కూడా వచ్చింది. బెడ్ మీద పడుకుంది. పావు గంట తరువాత ఆమె మీద చెయ్యి వేశాడు. ఆమెలో చలనం లేదు. మెల్లగా లేచాడు. ఇంకా మెల్లగా నడిచి పక్క గదిలోకి వెళ్ళాడు. టేబుల్ సొరుగులో ఉన్న డైరీని తీశాడు. తెరిచి చూశాడు.
ఆశ్చర్యం అతన్ని ముంచెత్తింది.
డైరీ మొత్తం ఖాలీగా ఉన్నది. ఎక్కడా ఏమీ రాసి లేదు.....
'ఏమీ రాయలేదేమిటి? కానీ ఇంతసేపు ఈ డైరీలోనేగా ఏదో రాస్తూ కూర్చుంది?'… ఏమీ అర్ధం కాక అటూ, ఇటూ చూశాడు. డస్ట్ బిన్ కనబడింది. దానిలోకి చూశాడు. చిరిగిపోయిన కాగితాలు కనబడ్డాయి.
రాసిన కాయితాలను చించి పడేసింది!
'ఏం రాసుంటుంది? ఎందుకు చింపేసింది? రాసింది తప్పు అయ్యుంటే చించి పడేయచ్చు లేక రాసింది వేరెవరూ చూడ కూడదనుకుంటే కూడా చించి పారేయచ్చు. ఏందుకు చించి పారేసింది?'
కుర్చీలో కూర్చుని డస్ట్ బిన్ లోని చినిగిపోయున్న కొన్ని కాగితాలను తీశాడు. అన్నీ, ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. కొన్ని కాగితపు ముక్కలను చేతిలోకి తీసుకున్ని చూశాడు వాటి మీద తప్పు... శిక్ష...న్యాయం....తప్పు... శిక్ష....న్యాయం..అని మిగిలిన ముక్కలలో కాలేజీ, మానేసి, సరే, వదిలేయ్....ఇలా పదవినోదానికి రాసినట్లు రాసుంది.
అక్కడున్న కాగితం ముక్కలలో ఎక్కువ భాగం ముక్కలలో ‘తప్పు... శిక్ష’ అనే పదాలే ఎక్కువ కనబడటం కైలాష్ ని కలవర పరిచింది. కాగితం ముక్కలున్న అతని చెయ్యి వణకసాగింది.
*************************************
మరుసటిరోజు ప్రొద్దున లేచిన దగ్గరనుండి మానస గురించిన ఆలొచనలు చెవిలో దూరిన జోరీగలగా కైలాష్ మెదడు లోపలకు వెళ్ళి కైలాషాన్ని నాన ఇబ్బంది పెడుతున్నాయి.
ప్రశాంతంగా సాగిపోతున్న జీవిత నౌకను, సడన్ గా సునామీ అలలు తాకినట్లు అయ్యింది.
మానసలో అతిపెద్ద మార్పు చోటు చేసుకుంది. పదిరోజుల క్రితం సరదాగా కనబడ్డ మానస ఇప్పుడు ముభావంగా ఉంటోంది. ఈ మార్పు మానసలొ ఎందుకు వచ్చింది.
ఈ చినిగిపోయిన కాగితం ముక్కలలో ఉన్న పదాలకు అర్ధం ఏమిటి?
తప్పు... శిక్ష...న్యాయం, అన్న పదాలు ఉన్న కాగితం ముక్కలే ఎక్కువగా ఉన్నాయి!
ఏం రాసింది? ఎవరి గురించి రాసింది? దేని గురించి రాసింది?
రాసిన కాగితాలను ఎందుకు చింపేసింది?
మానసలొ ఏదో రహస్యం దాగి ఉంది?
ప్రేమా? పెళ్ళికి ముందు మానస ఎవరినైనా ప్రేమించిందా? అతన్ని కాదని నన్ను పెళ్ళి చేసుకోవటం జరిగిందా? ఆ ప్రేమికుడు ఎవరు? ఎక్కడ ఉన్నాడు? మానసా వాళ్ళ ఊర్లో ఉన్నాడా? పెళ్ళికి వెడితే అతను మానసను కలవాలని ప్రయత్నిస్తాడని పెళ్ళికి వెళ్ళకుండా మానేసిందా?
తప్పు చేశాను కనుకే సొంత చెల్లి పెళ్ళికి వెల్లకపోవడం అనే పెద్ద శిక్ష పడింది. ఈ శిక్ష న్యాయమైనదే….. ఇదేనా మానస రాసి, చించి పారేసిన కాగితం ముక్కలలోని సారాంశం...అయ్యుండచ్చు.
నెల వారి డేట్...గర్భం అని ఏవేవో చెప్పిందే?
చెల్లి పెళ్ళికి వెళ్ళలేకపొతున్నానే అనే బాధతో మానస ఏడవలేదు? మానస ఎవరినో ప్రేమించింది.
కనిపెట్టలి. ఆమె ప్రేమ గురించి...ప్రేమికుడి గురించి కనిపెట్టలి.
'పెళ్ళికి ముందు మానస……. గురించి తెలుసుకోవాలి. ఏలా తెలుసుకోవటం? మానసా వాళ్ళ ఊరు వెళ్ళి విచారించాలా? పెళ్ళికి ముందు ఒక అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకోవడం ఓకే. పెళ్ళైన తరువాత, తాలి కట్టిన భార్య గురించి ఎంక్వయరీ చేయడం ఏ విధంగా న్యాయం? అసలు ఇటువంటి అలొచనే తప్పు'
తల నొప్పి కైలాషాన్ని వేధించుకు తింటోంది. అలాగే ఆఫీసుకు బయలుదేరాడు.ఆఫీసుకు వెళ్ళినా పని మీద ధ్యాస పెట్టలేకపోయాడు.. కంప్యూటర్ ముందు పిచ్చి వాడి లాగా కుర్చున్నాడు కైలాష్.
ఆఫీసర్ పిలుస్తున్నాడని ప్యూన్ చెప్పటంతో ఆలొచనలలో నుండి బయట పడ్డాడు.....
ఆఫీసు పని మీద నాగ్పూర్ వెళ్ళి రావాలని ఆర్డర్. ఇప్పుడున్న పరిస్థితికి ఏ ఊరైనా వెళ్ళటం మంచిదే. మనసులోని ఆందోళన, మెదడులోని ఆలొచనలకు విముక్తి దొరుకుతుంది.....అది అలొచనలలొ మార్పు తీసుకు వస్తంది. మనసును శాంతింప చేస్తుంది.
మరుసటిరోజు బయలుదేరు తున్నప్పుడు "నాగ్పూర్ నుంచి నీకు ఏం తీసుకురాను?"
అని మానసను అడిగాడు.
"ఏమీ వద్దు" అని మానస చెప్పింది.
కైలాష్ ఎక్కువ మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు.
రైలులో కూర్చున్న వెంటనే కైలాషాన్ని మళ్ళీ ఆలొచనలు చుట్టుముట్టాయి. పెళ్ళి ముందు మానస ప్రేమ గురించిన ఏవేవో ఆలొచనలు అతని బుర్రను పీక్కు తిన్నాయి. నాగ్పూర్ స్టేషన్లో దిగి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న టీ కొట్లో టీ తాగుతూ టీ కొట్టు పక్క నున్న ఒక పాత పేపర్ల షాపులో కనబడ్డ ఒక పత్రిక కవర్ పేజీలో మానస బొమ్మ చూశాడు. అదిరిపడ్డాడు.
ఆ పుస్తకం ఇమ్మని కొట్టతన్ని అడిగాడు. అతను తీసిచ్చాడు. ఎంత అని అడిగాడు. ఐదు రూపాయలు ఇమ్మన్నాడు. ఐదు రూపాయలు ఇచ్చి మానస బొమ్మ వేసున్న ఆ పాత పుస్తకం కొన్నాడు. కానీ ఆ పుస్తకం ఆగ్లంలోనో, హిందిలోనో, తెలుగులోనో లేదు.
బహుశ మళయాలం పత్రికి అయ్యుండచ్చు.
Continued......PART-7
ఇవి కూడా చదవండి:
*******************************************************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి