17, మార్చి 2021, బుధవారం

అంతరిక్షంలో అంతర్జాలమా!... (ఆసక్తి)


                                                                    అంతరిక్షంలో అంతర్జాలమా!                                                                                                                                                   (ఆసక్తి) 

                                                అంతరిక్షంలో(ఉచిత) అంతర్జాలం ఏర్పాటుకు పోటీ

టెక్నాలజీ ఎంతగా పెరిగిపోతోందో ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలుసు. టెక్నాలజీ పెరుగుతోంది అంటే కంప్యూటర్లు,మొబైల్ ఫోన్లు, ఇంటర్ నెట్ మాత్రమే కాదు, ఆటోమొబైల్, వైద్యరంగం, ఇంజనీరింగ్ లాంటి రంగాలలోనే కాకుండా మరెన్నో రంగాలలో అభివృద్దికి టెక్నాలజీ సహాయపడుతోంది. ప్రతి రంగమూ మానవునికి ఏదో ఒక రకంగా సహాయపడుతోంది.

కానీ కొన్ని రంగాలలో అభివృద్దికి చేస్తున్న ఖర్చు చూస్తుంటే ఇది అంత అవసరమా? మానవాళికి దీని వలన ఉపయోగం ఉంటుందా? అనిపిస్తుంది. ఉదాహరణకు అణుబాంబులు తీసుకుందాం. మానవాళిని అంతం చేయగలిగే ఈ టెక్నాలజీని అభివృద్ది చేయడానికి, తయారు చేయడానికీ మరియు వాటిని ఉపయోగించే సాధనాలకు పెట్టిన, పెడుతున్న ఖర్చు పూర్తిగా అనవసరం. ఎందుకంటే ఎవరూ ఉపయోగించకూడని, ఉపయోగించలేని ఈ టెక్నాలజీని అభివృద్ది చేయడానికి ఎందుకంత శ్రమపడ్డారో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న.

అయినా ఇలాంటి ఉపయోగం లేని టెక్నాలజీల అభివృద్ది కోసం శ్రమపడుతూ, ఖర్చు పెడుతూనే ఉన్నారు. అందులో ఒకటి ఈ అంతరిక్ష అంతర్జాల ఏర్పాటు. కానీ దీనితో ఉపయోగమూ ఉన్నది, అనవసరమూ ఉన్నది. వాటి గురించి తెలుసుకుందాం.

ఎక్కడ ఉన్నా సరే నేడు ప్రతి ఒక్కరూ ల్యాప్ టాప్, నోట్ బుక్, ట్యాబ్ లెట్ లేదా స్మార్ట్ ఫోన్...ఇలా ఏదో ఒక గ్యాడ్జెట్ ద్వారా నెట్ తో కనెక్ట్ అయిపోతున్నారు. దీంతో ఇంటర్ నెట్ కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే ఇంటర్ నెట్ కనెక్షన్ ఇచ్చే సంస్థలు ఎక్కువైపోయాయి. వీరంతా నెటిజన్ల పర్సు ఖాలీ చేస్తున్నవారే. ఇక ఇలాంటి వారికి చెక్ పెట్టే సమయం వచ్చేసింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత ఇంటర్ నెట్ కనెక్షన్ అందుబాటులోకి రాబోతోంది.

ప్రపంచస్థాయి 'వైఫై' 'ఔటర్ నెట్'

ఫ్రీ ఇంటర్ నెట్ కనెక్షనా? అదీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికీనా? ఇది జరిగే పనేనా? అనే సందేహం వస్తోంది కదూ. కానీ  మరో మూడేళ్ళలో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. ప్రతి ఒక్కరికీ ఫ్రీగా ఇంటర్ నెట్ కనెక్షన్ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూయార్కుకు చెందిన 'మీడియా డెవలప్ మెంట్ ఫండ్' అనే సంస్థ 'ఔటర్ నెట్' పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా, 'క్యూబ్ శాట్స్ అని పిలువబడే చిన్న చిన్న శాటిలైట్లను భూ కక్ష్యలోకి ప్రవేశపెడతారు(అంతరిక్షంలోకి కొన్ని వందల చిన్న కృతిమ ఉపగ్రహాలను పంపి, వాటిని భూమిపై ఏర్పాటు చేసే గ్రౌండ్ స్టేషన్లకు అనుసంధానించే 'ఔటర్ నెట్' కు ఈ సంస్థ రూపకల్పన చేసింది) ఈ శాటిలైట్ ఇంటర్నెట్ను...ఫోన్లు, కంప్యూటర్లు తదితర వస్తువులకు కనెక్ట్ చేస్తారు. అంతే...ఆ శెటిలైట్ తరంగాల ద్వారా భూమ్మీద ఉన్నవారందరికీ ఉచితంగా ఇంటెర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. మీకి 'వైఫై' కనెక్షన్ తెలుసు కదా. ఈ 'ఔటర్ నెట్' అనేది ప్రపంచస్థాయి 'వైఫై' అన్న మాట. అయితే దీనికయ్యే కోట్లాది డాలర్ల ఖర్చును విరాళాల ద్వారా సేకరించాలని న్యూయార్క్ సంస్థ భావిస్తోంది. సైబీరియా మంచు ప్రాంతాలు, ఆఫ్రికా అడవులు, సముద్ర ప్రయాణంలో -- ఇలా భూమ్మీద ఎక్కడున్నా...జస్ట్ సెల్ ఫోన్, ల్యాప్ టాప్ తో ఇంటర్నెట్ను అందుకోవచ్చు.

ఇప్పటివరకూ చరిత్రలో ఉచితంగా ప్రపంచానికి సేవ చేసిన దాఖలా లేదు. అలాంటిది భూమ్మీద ఉన్న వారందరికీ ఉచితంగా ఇంటర్నెట్ ఇచ్చే అవకాశం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదంతా బిజినస్ లో భాగంగా ఇంటర్నెట్ పై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతోనే చేస్తున్న ప్రక్రియగా పలువురు సందేహిస్తున్నారు. ఈ ఫ్రీ ఇంటర్నెట్ ద్వారా మొదట ఇంటర్నెట్ సంస్థలను నాశనం చేసి, ఆ తరువాత పూర్తిగా నెట్ ను తమ చేతుల్లోకి తీసుకోవాలని అమెరికా భావిస్తోందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అసలు విషయం తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

భూమి మీద ఉండే ప్రతి ఒక్కరికీ ఫ్రీ ఇంటర్నెట్ అనే ఆలొచన కొద్ది సంవత్సరాల ముందు వరకు వెర్రి ఆలొచనగా కొట్టిపారేసిన వారికి, కొద్దొ నెలలలొ క్రితం భూమి మీద ఉండే ప్రతి ఒక్కరికీ ఫ్రీ ఇంటర్నెట్ అందుబాటులోకి రాబోతోందని ఒక సంస్థ కాదు, టెక్నాలజీలో అసాధారణమైన శక్తి కలిగిన మూడు సంస్థలు తెలుపటంతో కల్పిత గాధ కాదు, ఇది నిజం అని అంతకు ముందు కొట్టిపారేసిన వారు ముక్కున వేలేసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి మీడియా 'డెవెలప్ మెంట్ ఫండ్' సంస్థ 'ఔటర్ నెట్'పేరుతో ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపిన కొద్దిరోజుల తరువాత 'ఓన్ వెబ్' అనే పేరుతో విర్జిన్ అనే మరో సంస్థ ఇదే విషయంపై మేమూ ఒక ప్రాజక్టుకు పెట్టుబడి పెట్టాము అని తెలిపింది.

తాజాగా గూగుల్ సంస్థ తాము కూడా ఒక బిలియన్ డాలర్లు స్పేస్ ఎక్స్(SPACE X)అనే పేరుతో ఇలాన్ మస్క్ మొదలు పెట్టిన ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేమని తెలియజేసేరు.

ఎందుకని ఇంతమంది హఠాత్తుగా అంతరిక్షంలో ఇంటర్నెట్ రూపకల్పనకు ఆసక్తి చూపిస్తున్నారు?

ప్రపంచ ప్రజలకు ఉచితంగా ఇంటర్నెట్ అందించటానికా ఇంత ఆసక్తి చూపిస్తున్నారు? కాదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సంపాదించటానికి. వైఫైగా వచ్చే ఇంటర్నెట్ కు తక్కువగా ఖర్చు అవుతుంది. అదే ప్రపంచవ్యాప్తంగా కేబుల్ మూలంగా ఇంటర్నెట్ అందజేయాలంటే చాలా పెట్టుబడి కావాలి మరియు లాభాలకు ఎక్కువ కాలం వేచి ఉండాలి. మొదట్లో ఉచితంగా అందించి, తరువాత నిదానంగా డబ్బు వసూళ్ళు మొదలెడతారు. సర్వీస్ అందించే మధ్యవర్తులు ఉండరు. లాభం మొత్తం  వారే తీసుకోవచ్చు. అందుకే ఇది మొదలు పెడుతున్నారు" అని కొందరు చెబుతున్నారు.

అంతరిక్ష అంతర్జాలమా లేక అంతరిక్షంలో అంతర్జాలమా

పై రెండింటికీ చాలా తేడా ఉన్నది. అంతరిక్ష అంతర్జాలము అంటే  ఉపగ్రహ ఆధారితంగా అంతరిక్షంలో అంతర్జాలమును ఏర్పాటు చేసి భూమి యొక్క ఉపరితలం నలుమూలలకూ వైఫై మూలం ఇంటర్నెట్ వసతి కల్పించటం . దీని కోసం 1990 నుండే ప్రయత్నాలు, పరిశోధనలూ జరుగుతూనే ఉన్నాయి. అంతరిక్షంలో అంతర్జాలం అంటే అంతరిక్షంలో అంతర్జాలము ఏర్పాటు చేసి అంతరిక్షంలో ఉండే మిగిలిన గ్రహాలతో (inter-planetary internet or IPN or outer space internet) సమాచార మార్పిడికొసం. ఈ వసతికి అమెరికా వారి నాసా చాలా ఆసక్తి చూపిస్తోంది. అయితే నాసా ప్రముఖ శాస్త్రవేత్త ఆండ్రియన్ హూకే రెండు వసతులను కలిపి అందించే అంతరిక్ష అంతర్జాల ఏర్పాటుకు ప్రణాళిక ఇవ్వడంతో ప్రైవేట్ సంస్థల సహాయంతో (ఖర్చు ఎక్కువగా ఉంటుంది కనుక) అలాంటి అంతర్జాల ఏర్పాటుకు స్పేస్ ఎక్స్ తో నాసా చేతులు కలిపేరని వార్తలు వస్తున్నాయి.

2007 లో గ్రెగ్ వైలర్ అనే వ్యాపారవేత్త "O3b" అనే పేరుతో (O3b stands for the other 3 billiyan) అంతరిక్ష ఇంటర్నెట్ ఉపగ్రహాలను తయారుజేసిందని తెలియడంతో గూగుల్ లాంటి పెద్ద సంస్థలు ఆసక్తి చూపించాయి. గూగుల్ ఇప్పతికే ప్రాజక్ట్ లూన్ పేరుతో పరిశోధనలు మొదలు పెట్టిందని, జరుపుతున్నదని తెలుసుకున్నారు. ఫేస్ బుక్ లో కూడా ఒక రహస్య ప్రాజెక్టుతో పరిశోధనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

స్పేస్ ఎక్స్ 4000 ఉపగ్రహాలను తయారుచేసి, వాటిని భూమికి 750 మైళ్ళ ఎత్తులో ఉంచబోతున్నారని, ఆ తరువాత అంగారక గ్రహంలో ఒక ఇంటర్నెట్ సంస్థ నెలకొల్పటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ సంస్థ అధినేత ఈలాన్ మస్క్ తెలియజేసారు. ఇంకో ఐదు సంవత్సరాలలో అన్నీ పూర్తి అవుతాయని చెబుతున్నారు....వేచి చూడాలి.

Images Credit: To those who took the original photos.

************************************************************************************************

ఇవి కూడా చదవండి:

మరో ప్రపంచం నుండి వచ్చిన మనిషి!(మిస్టరీ)

మనుషులకూ మూడో కన్ను?(మిస్టరీ) 

************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి