టెలివిజన్ చూడటానికి లైసెన్స్ (ఆసక్తి)
చాలా దేశాలలో, టెలివిజన్
కలిగుండాలంటే
దానికొసం
ఒకటి
కంటే
ఎక్కువ
రకాల
ఖర్చులు
ఉంటాయి.
మొదట పరికరం (అంటే 'టీవీ' సెట్), ఎవరి రుచిని బట్టి, అనేక
వందల నుండి అనేక వేల, లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. తరువాత, టెలివిజన్ చానెల్స్ మరియు ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కు చందా రుసుము, అలాగే విద్యుత్ ఖర్చు కూడా ఉన్నాయి. ఇకపోతే, ఐరోపా
ఖండంలో ఉంటే --టెలివిజన్ సెట్‌ను సొంతం చేసుకోవడానికి పన్నుకట్టాలి.
టెలివిజన్ లైసెన్స్ యొక్క ఉద్దేశ్యం
పబ్లిక్ ప్రసార సేవలకు నిధులు సేకరించడం. అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని టీవీ
ఛానెల్స్ ఈ పన్నుల ద్వారా ఎక్కువగా నిధులు సమకూర్చుకుంటున్నాయి. ఇది దేశానికి
దేశానికి మధ్య భిన్నంగా ఉన్నప్పటికీ, బ్యాలెన్స్
డబ్బును ప్రకటనల ద్వారా సమకూర్చుకుంటారు. ఉదాహరణకు, పోలిష్
టీవీపీ బ్రాడ్‌కాస్టర్ (పోలాండ్ దేశ ప్రభుత్వ చానల్స్), వారు
తీసుకునే టీవీ పన్ను కంటే ప్రకటనల నుండి ఎక్కువ నిధులను పొందుతుంది.
టెలివిజన్ లైసెన్స్,
మరియు కొన్నిసార్లు రేడియో లైసెన్స్, ఇది
రేడియో రిసీవర్‌ను సొంతం చేసుకోవడానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు, ఇది ఎక్కువగా యూరోపియన్ దేశాల విషయం. యూరప్ వెలుపల ఈ పన్ను వసూలు
చేస్తున్న ఇతర దేశాలు ఆసియాలో జపాన్, పాకిస్తాన్ మరియు
దక్షిణ కొరియా మరియు ఆఫ్రికాలోని నమీబియా, ఘనా, దక్షిణాఫ్రికా మరియు మారిషస్. గతంలో, మరెన్నో
దేశాలలో ఈ పన్ను విధానం ఉండేది. కానీ ఆ తరువాత అది రద్దు చేయబడింది. బ్రెజిల్
మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి ఇతర దేశాలలో టెలివిజన్ లైసెన్స్ ఎప్పుడూ లేదు.
తప్పనిసరి టెలివిజన్ చందాను బలవంతం చేసిన
మొట్ట మొదటి దేశం యునైటెడ్ కింగ్‌డమ్. వసూలు చేసిన మొత్తం డబ్బు 1927 లో ఏర్పడిన బిబిసికి వెళుతుంది. ఈ లైసెన్స్‌ను మొదట 'వైర్‌లెస్ లైసెన్స్' అని పిలిచేవారు. టెలివిజన్
రాకతో, కొన్ని దేశాలు ప్రత్యేక అదనపు టెలివిజన్ లైసెన్స్‌ను
సృష్టించాయి. మరికొన్ని దేశాలు టీవీ ప్రసారానికి అదనపు ఖర్చును భరించటానికి రేడియో
లైసెన్స్ ఫీజును పెంచాయి. లైసెన్స్ పేరును "రేడియో లైసెన్స్" నుండి
"టివి లైసెన్స్" లేదా "రిసీవర్ లైసెన్స్" గా మార్చాయి. ఈ రోజు
చాలా దేశాలు టెలివిజన్ కోసం ఉపయోగించే అదే లైసెన్స్ ఫీజు నుండి పబ్లిక్ రేడియో
ప్రసారానికి నిధులు సమకూర్చుకుంటున్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాలలో ప్రత్యేక
రేడియో లైసెన్సులు ఉన్నాయి, లేదా రేడియో మాత్రమే ఉన్న వినియోగదారులకు
తక్కువ రుసుము పన్నుగా తీసుకుంటున్నారు. కొన్ని
దేశాలు కలర్ టీ.వీ కి--బ్లాక్ అండ్ వైట్ టీ.వీ కి ఉన్న వినియోగదారులకు వేర్వేరు
ఫీజులను తీసుకుంటున్నారు.
కెనడియన్ రేడియో స్టేషన్ లైసెన్స్, 31 జూలై 1948 న జారీ చేయబడింది.
రేడియో లైసెన్స్ భారతదేశంలో 1984 వరకు వసూలు చేయబడింది. బ్రిటిష్ వ్యవస్థ తరువాత ఒక సంవత్సరం తరువాత 1928 లో దీనిని ప్రవేశపెట్టారు.
భారతదేశంలో రేడియో మరియు టెలివిజన్
లైసెన్స్‌లను తపాలా కార్యాలయంలో సంవత్సరానికి ఒకసారి పునరుద్ధరించాల్సి ఉండేది.
పైన చూపిన వైర్‌లెస్ లైసెన్స్ బుక్ కోసం ప్రతి ఇల్లు మరియు స్థాపనలను
తనిఖీ చేయడానికి పోస్ట్ ఆఫీస్ నుండి వైర్‌లెస్ లైసెన్స్ ఇన్స్పెక్టర్కు కు అధికారం
ఉంది. ఎగవేతదారులకు జరిమానా విధించే వారు. కొన్నిసార్లు వారి రేడియోలు మరియు
టీవీలను స్వాధీనం చేసుకున్నారు.
సెర్బియా మరియు రొమేనియా వంటి కొన్ని
దేశాలలో విద్యుత్ బిల్లుల ద్వారా లైసెన్స్ ఫీజు చెల్లించాలి. విద్యుత్ బిల్లులతో
పాటు టెలివిజన్ లైసెన్స్‌ను క్లబ్బింగ్ చేయడం వల్ల వినియోగదారులకు ఫీజు ఎగవేత
కష్టమవుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో 5 శాతం
టీవీ యజమానులు ఎప్పుడూ ఫీజు చెల్లించరని అంచనా. ఎగవేత రేట్లు పోలాండ్‌లో
అత్యధికంగా ఉన్నాయి. 65 శాతం టీవీ యజమానులు తమ బకాయిలు
చెల్లించకుండా పోతున్నారు. ఇంత ఎగవేత రేటుతో, పోలిష్
ప్రభుత్వం ఇప్పుడు టెలివిజన్ ఫీజు ను రద్దు చేయడంపై దీర్ఘంగా ఆలోచిస్తోంది.
ఎగవేతదారులను గుర్తించడం చాలా సరళమైన
విషయం. దాదాపు అన్ని గృహాలకు లైసెన్స్ ఉన్నందున, లైసెన్స్
లేని గృహాలను మాత్రమే తనిఖీ చేయాలి. లైసెన్స్ లేని టీవీ యజమానులను వెతుకుతూ
వీధుల్లో తిరుగుతున్న ప్రత్యేకమైన “టెలివిజన్ డిటెక్టర్ వ్యాన్లు” తమ వద్ద
ఉన్నాయని బిబిసి పేర్కొంది. ఈ వాదనను ఏ స్వతంత్ర సంస్థ ధృవీకరించబడలేదు. లేదా ఈ
వ్యాన్ల వెనుక ఉన్న సాంకేతికతను వెల్లడించడానికి బిబిసి సిద్ధంగా లేదు. ఈ
డిటెక్టర్ వ్యాన్లు కేవలం ప్రజలను గుర్తించవచ్చని భావించి వారిని భయపెట్టడానికి
మరియు టీవీ లైసెన్స్ లేనందుకు వెంబడించడానికి ఒక ఉపాయం అని చాలా మంది నమ్ముతారు.
ఒక BBC టెలివిజన్ డిటెక్టర్ వ్యాన్
టెలివిజన్ డిటెక్షన్ వాన్ లోపల, 1956.
ఒక టెలివిజన్ డిటెక్టర్ వ్యాన్, ఇది మాత్రమే మిగిలి ఉంది
ఆస్ట్రియన్లు అత్యధిక టెలివిజన్ లైసెన్స్
రుసుమును సంవత్సరానికి € 335 చెల్లిస్తారు.
సంవత్సరానికి € 6 కన్నా తక్కువగా అల్బేనియా దేశ ప్రజలు
అత్యల్పంగా చెల్లిస్తారు. ప్రస్తుతం 15 యూరోపియన్ దేశాలలో
మాత్రమే ఈ పన్ను ఉంది. మరికొందరు తమ విద్యుత్ బిల్లులో భాగంగా పన్ను
చెల్లిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో, కారు యజమానుల దగ్గర మాత్రమే
రేడియో పన్ను వసూలు చేస్తారు.
Images Credit: To those who took the original photos.
************************************************************************************************
ఇవి కూడా చదవండి:
ఆకాశం నుండి విచిత్రమైన శాబ్ధాలు(మిస్టరీ)
************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి