10, జులై 2019, బుధవారం

చీటింగ్ పోలీస్(నవల)…..PART-1


                                     చీటింగ్ పోలీస్(నవల)…..PART-1

హైదరాబాద్ కు పదిహేను కిలోమీటర్ల దూరం లో ఉన్న పారిశ్రామిక ఎస్టేట్ లో ఎనిమిదంతస్తుల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడ్డ మందుల తయారీ కంపెనీ "ఫార్మా రెమిడీస్" రంగు రంగు అలంకరణ దీపాల వెలుగులో కొత్త పెళ్ళి కూతురులా నిలబడుంది.

నాణ్యత కలిగిన మందుల కోసం మనదేశం వీదేశాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండకూడదని, పలు రాజకీయ నాయకులు, పలు పెట్టుబడిదార్లు ఒకటిగా కలిసి ఆలొచించిన ప్రయత్నమే ఈ ‘ఫార్మా రెమిడీస్’ కంపెనీ.

దీని మూలంగా మనదేశంలో మందుల దిగుమతి పూర్తిగా తగ్గిపోవటమే కాకుండా, మనదేశం నుండి ఇతర దేశాలకు మందులను ఎగుమతి చేసుకునే విధంగా అత్యధిక ఉత్పత్తి కలిగిన పారిశ్రామిక కంపెనీగా ఉండాలని నిర్మించేరు ఈ ‘ఫార్మా రెమిడీస్’ ని.

కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించబడ్డ ఈ మందుల కంపెనీ ‘మందుల ఉత్పత్తిలో’ విప్లవం తీసుకురాబోతోందని ప్రపంచంలోని ఫార్మా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇంకో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి చేతులతో ప్రారంభించబడి, మందుల తయారును మొదలపెట్టటానికి రెడీగా ఉన్నది ఈ ‘ఫార్మా రెమిడీస్’ కంపెనీ.

సమయం మధ్యరాత్రి రెండు గంటలు కావడంతో ఎప్పుడూ జన సంచారంతో కుతూహలంగా కనబడే ఆ పారిశ్రామిక ఎస్టేట్ ప్రదేశం పూర్తి నిశ్శబ్ధంతో నిద్ర పోతున్నట్టు ఉన్నది.ఆ నిశ్శబ్ధానికి బంగం కలుగకుండా, పిల్లి నడకలాగా ఒక మోటర్ సైకిల్ వచ్చి ఆగింది.

ఫార్మా రెమిడీస్ కంపెనీ గేటు ముందు వైపు నలుగురు సెక్యూరిటీ గార్డులు నిలబడున్నారు. వాళ్ళను ఇస్టపడని ఆ మోటార్ సైకిల్, ఫార్మా రెమిడీస్ కంపెనీ వెనుకభాగం వైపుకు వెళ్ళింది. అక్కడ కూడా నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. అప్పుడు ఆ మోటార్ సైకిల్ ఫార్మా రెమిడీస్ పక్కన ఉన్న పాత రసాయన ఉత్పత్తుల కంపెనీలోకి వెళ్ళి ఒక పక్కగా ఆగింది.

ప్రమోద్ అనే పేరు కలిగిన అతను ,ఇరవైఏడు సంవత్సరాల వయసులో ఉన్నాడు. సిక్స్ ప్యాక్ శరీరం. కెమికల్ టెక్నాలజీ చదువులో గోల్డ్ మెడల్ పొందినవాడు. కంప్యూటర్ ఆపరేటింగ్ లో ఆరితేరినవాడు. మిడిల్ క్లాస్ ఫ్యామలీకి చెందినవాడు. చాలా మంది లాగానే ఇతను కూడా ఐదు అంకెల జీతం మీద ఆశపడ్డవాడు.

దానికోసం కంపెనీల మెట్లను ఎక్కి దిగిన అలసట అతని కళ్ళల్లో తెలుస్తోంది. ఉద్యోగం లేదనే ఒకే ఒక కారణం కోసం తల్లితండ్రులే అతన్ని వేరు చేసి చూడటంతో...ఎకాకిగా హైదరాబాదుకు మకాం మార్చుకున్నాడు. ఇంతవరకు ఫైలైన ఇంటర్ వ్యూ లను లెక్క కడితే సెంచరీ కొట్టుంటాడు. ఉద్యోగం దొరకలేదు. దానివలననో ఏమో అతనికి ప్రభుత్వం మీద విరక్తి.

అతనిలోని ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని ఒక కంపెనీ, జీతంగా ‘అతిపెద్ద మొత్తం-విదేశాలలొ పని’ ఈ రెండింటినీ ఎరగా పెట్టి వల విసరగా...ఖచ్చితంగా వచ్చి వాళ్ళ వలలో చిక్కుకున్నాడు అతను.

చుట్టుపక్కల చూశాడు. అతను అనుకున్నట్లుగానే ఆ రసాయన కంపెనీలోని ఒక వైపు నుండి, ఫార్మా రెమిడీస్ కంపనీలోకి వెళ్ళటానికి ఒక చిన్న మార్గం ఉన్నది. రసాయన కంపెనీలో నుండి వెలువడ్డ వేస్ట్ ద్రవం, బయటకు వెళ్ళే కాలువాలో నుండి ప్రవహిస్తూ, చెడు వాసనతో వాయువును కక్కుతోంది. అంతకు ముందురాత్రి వర్షం పడిందేమో, అక్కడున్న వర్షపు నీరు కూడా జిడ్డుగా, చెడువాసతో నిండుకోనుంది.

బూట్స్ కు అంటుకున్న మట్టిని తుడుచుకుని, మెల్లగా నడుచుకుంటూ ఫార్మా రెమిడీస్ ప్రహరీ గోడను చేరుకున్నాడు.

అతని భుజాల ఎత్తు వరకే కట్టబడున్న ప్రహరీ గోడ అతనికి పెద్దగా ఆటంకం కలిగించలేదు. ఒక్క జంపుతో ఎగిరిదూకాడు.

మెల్లగా ఫార్మా రెమిడీస్ భవనం దగ్గరకు చేరుకుని ఆ భవనం వెనకకు వెళ్ళాడు. వెనుకవైపు మూడు షట్టర్స్ ఉన్నాయి. రెండు పెద్దవి. ఒకటి చిన్నది. చిన్న షట్టర్ కు ఒక పెద్ద తాళం వేసుంది. తన దగ్గరున్న రకరకాల తాళంచెవులలో ఒకటి సరిపోయింది. షట్టర్ తెరుచుకుని లోపలకు వెళ్ళాడు.

లోపలకు వెళ్ళిన అతను...ఒక కంప్యూటర్ను వెతికి గుర్తించి, దానికి శస్త్ర చికిత్స చేశాడు. కంప్యూటర్ లోపల భాగాలను తీశేసి, తాను తీసుకు వచ్చిన డైనమైట్ బాంబును లోపల ఉంచి, టైమర్ను ఆన్ చేసి టైము సెట్ చేశాడు. తాను లోపలకు వచ్చిన ఆనవాలు లేకుండా చూసుకుని, ఎవరి కంటికీ కనబడకుండా బయటకు వచ్చి మోటర్ సైకిల్ తీసుకుని బయలుదేరాడు. అరగంట తరువాత మనుష్యుల సంచారమే లేని ఒక ప్రదేశంలో ఆగాడు.

తన మోటర్ సైకిల్లో దాచిన 'వయర్ లెస్’ ఫోన్ తీసి ఆన్ చేశాడు. అది 'బీప్ బీప్' అంటూ శబ్ధం చేసిన తరువాత అవతల పక్క వాళ్ళతో కనక్షన్ దొరికింది.

".........................."

".........................."

ఇరువైపులా కొద్ది క్షణాల మౌనం. ఆ తరువాత వాళ్ళు హిందీలో మాట్లాడుకున్నది ఇక్కడ తెలుగులో.

"ప్రమోద్.....వెళ్ళిన పని అయ్యిందా?"

"మీరు చెప్పినట్టే బాంబును అమర్చి, టైమర్ను కూడా ఆన్ చేశేసాను. రేపు అర్ధరాత్రి సరిగ్గా పన్నెండింటికి బాంబు పేలుతుంది"

"శబాష్....మా సంస్థకు మీలాటి తెలివిగలవారే కావాలి"

"నాకోక సందేహం. నేను తయారుచేసిన డైనమైట్ బాంబులో మందు గుండు అంత ఎక్కువగా లేదు. అంత చిన్న డైనమైట్ ఎలా అంత పెద్ద భవనాన్ని నేలమట్టం చేస్తుంది? దానికి కావలసిన శక్తి ఆ బాంబుకు ఉన్నదా?"

“అది డైనమైట్ అని నీకు చెప్పింది ఎవరు ...?" …..అవతల పక్క పెద్ద నవ్వు.

"భారత ప్రభుత్వం కళ్ళల్లో మట్టి చిమ్మి రహస్యంగా తీసుకు వచ్చిన ఆ బాంబు అతి శక్తివంతమైనది. ఈ మధ్య కనిపెట్టిన కొత్త రసాయన మిశ్రమం. ఆ బాంబు వంద డైనమట్లతో సమానం.

అది పేలేటప్పుడు దరిదాపుగా ఒక కిలోమీటర్ రేడియస్ దూరానికి నష్టం ఏర్పరుస్తుంది. ఆ పరిధిలో ఉన్న భవనాలు నేలకొరిగిపోతాయి. ఇక ప్రాణ నష్టం సంగతి చెప్పక్కర్లేదు. దురదృష్టవంతులు పైసా ఖర్చు లేకుండా పైలోకానికి పంపబడతారు"

"అదిసరే...ఇంతకు ముందు నాకు సగం డబ్బు ఇచ్చారు...మిగిలిన డబ్బులు, విదేశీ ఉద్యోగం నాకు ఎప్పుడు దొరుకుతుంది?" అడిగాడు ప్రమోద్.

“బాంబు పేలిన మరుసటి రోజు మిగిలిన డబ్బులు నీ అకౌంటులో పడుతుంది. సింగపూర్ వెళ్ళటానికి రేపటికి టికెట్టు బుక్ చేశాము. అక్కడకెళ్ళి, నేను చెప్పే మనిషిని కలిస్తే...మిగిలిన విషయాలు ఆయన చూసుకుంటాడు. నువ్వు ఎదురు చూసిన ఉద్యోగం అక్కడ నీకోసం కాచుకోనుంది."

"ధాంక్యూ! మీ వలన నా కల నిజం కాబోతోంది"

వయర్ లెస్ కనక్షన్ కట్ చేశారు. అది డెడ్ మోడ్ కి వచ్చేసింది.

"శభాష్...సులువుగా వచ్చి చిక్కుకున్నావు! నిన్ను పెట్టుకుని ఈ దేశానికి నేర్పించాల్సిన పాఠం చాలా ఉంది. అంతవరకు నువ్వు మా గారాల బిడ్డవు. అన్నీ పూర్తి అయిన తరువాత నీ ప్రాణాన్ని మా సంస్థకు సమర్పనం చేస్తాను."

మరకలు పడిన తన ముప్పై రెండు పల్లూ కనబడేటట్టు నవ్వాడు. 'భారతం మా బానిస ' అనే పాకిస్తాన్ తీవ్రవాద సంస్థకు చెందిన భారతదేశ ఇన్ చార్జ్. వాళ్ళు వేసిన ప్లాన్ విజయవంత అయ్యిందనే సంతోషంలో నిద్రలోకి జారుకున్నాడు.

అందరూ నిద్రలో ఉన్నప్పుడు, బాంబు మాత్రం కొన్ని వేల మంది ప్రాణాలు తీయటానికి రక్త దాహంతో , ఎర్రటి కళ్ళు మెరుస్తున్నట్టు బాంబులోని గడియారం టిక్ టిక్ మని ఆడుతోంది.

Continue: PART-2

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి