27, జులై 2019, శనివారం

చీటింగ్ పోలీస్(నవల)…..PART-9



                                       చీటింగ్ పోలీస్(నవల)…..PART-9

ప్రతాప్ తన ఇంటరోగేషన్ కొనసాగించాడు.

"చెప్పు ప్రమోద్...ఆ బాంబును పేలకుండా చేయటం ఎలా?"

"మీ టెక్నిక్ నా దగ్గర సాగదు మిస్టర్ డిటెక్టివ్ ప్రతాప్. నా నోటి నుండి ఒక్క ముక్క కూడా రాబట్టలేరు"

"నేను అబద్దం చెబుతున్నాని అనుకుంటున్నావా?"

ప్రమోద్ నిర్లక్ష్యంగానూ,మౌనంగానూ, నవ్వు మొహంతో ఉండటం చూసి మళ్ళీ ప్రతాపే మాట్లాడాడు.

"బాంబు ఎక్కడ పెట్టావో చెప్పనా...? 'ఫార్మా రెమిడీస్' కంపెనీలోని ఒక కంప్యూటర్లో బాంబును సెట్ చేశావు! నీ ఇష్ట ప్రకారం అది ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు పేలటానికి రెడిగా ఉన్నది"

ప్రమోద్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనై.

"ఎలాగని ఆశ్చర్యంగా ఉన్నదా? నీ బూట్లే నిన్ను పట్టించింది...ఎలా అని చూస్తున్నావా?"

“నీ బూట్లకు అంటుకున్న పసుపు రంగు మట్టి నా చూపును ఆకర్శించింది. అదే రంగు మరకలను నీ టూ వీలర్ పైన కూడా చూశాను. దాన్ని రసాయన పరిశోధనకు పంపాను”

“ఆ పసుపు రంగు మట్టిలో ఉన్నది బాన్ చెయబడ్డ ఒక రసాయనం అని తెలుసుకున్నాను. ఆ రసాయనాన్నీ ఇంతకుముందు హైదరాబాద్ లో ఎక్కడ తయారుచేశావారో నన్న ప్రశ్నకు "ఫార్మా రెమిడీస్" కంపెనీకి దగ్గరలో క్లోస్ చేయబడ్డ ఒక ఫ్యాక్టరీలో అని తెలుసుకోవటానికి నాకెంతో సమయం పట్టలేదు”

"నువ్వు చాలా మంచివాడివి. నీ బూట్ల కాలి ముద్రలు ఆ కంపెనీ దగ్గర గట్టిగా నొక్కి వదిలిపెట్టి వచ్చావు. ఆప్పుడు నీ బూట్లకు అతుకున్న ఆ పసుపు రంగు మట్టి నీతో పాటూ వచ్చి, నువ్వు వెళ్ళిన దారి చూపిస్తూ, చివరగా "ఫార్మా రెమిడీస్" ఫ్యాక్టరీలోకి వెల్లింది"

ప్రమోద్ మళ్ళీ మౌనంగానే ఉన్నాడు. కానీ అతనిలో నిర్లక్ష్యం, మొహంలో నవ్వూ లేదు.

"మీ సంస్థ యొక్క ఒక పాలసీ నాకు నచ్చింది. బాంబు బ్లాస్టులో ఎక్కువమంది చనిపోకూడదు. అందుకే నీదగ్గర నిదానంగా మాట్లాడుతున్నాను...నిజం చెప్పు"

"ఇంత దూరం కనిపెట్టిన మీరే దాన్ని కూడా కనిపెట్టచ్చుగా?"

"నేను బాంబు నిపుణుడిని కాదు ప్రమోద్. చాలా కష్టపడి తయారు చేశావు. ఆ బాంబును వేరే చోటుకు మార్చాలని కదిల్చినా అది పేలిపోయే స్థితిలో ఉన్నది. నువ్వు తెలివిగలవాడివే...కానీ. ఆ తెలివిని నువ్వు తాకట్టు పెట్టిన చోటు తప్పు"

ప్రమోద్ పరిహాసంగా నవ్వాడు.

"సార్...వీడ్ని నాకొదిలిపెట్టండి. కొట్టే కొట్టుడుతో నిజం కక్కిస్తాను"

"ఓ.కే. కమీషనర్ సార్...."

అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ లాఠీతో బలంగా రెండు దెబ్బలు వేశాడు. ఆ దెబ్బలు ప్రమోద్ ని కొంచంకూడా భయపెట్టలేదు...ప్రమోద్ కోపంగా ప్రతాప్ వైపు చూస్తూ కూర్చున్నాడు.

మూడో దెబ్బ వేయటానికి లాఠీ ఎత్తిన అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ చేతిని అడ్డుకున్నాడు ప్రమోద్.

"నీకు చివరిగా ఐదు నిమిషాల టైము ఇస్తున్నాను.టైము వేస్ట్ చేయటం ఇష్టంలేదు. మర్యాదగా చెప్పేసై. లేకపోతే కమీషనర్ కాళ్ళ మీద పడే చెప్పాల్సి వస్తుంది. అప్పుడే ఆయన నువ్వు చెప్పేది వింటారు"

"మీరు ఎంత కొట్టినా నా దగ్గర నుండి ఒక్క మాటకూడా రాదు"

ప్రమోద్ చెప్పిన మాటలను పట్టించుకోకుండా 'సెల్ ఫోన్ లో టైమర్ ఆన్ చేశాడు డిటెక్టివ్ ప్రతాప్. టైమర్ తన పని మొదలుపెట్టింది.

డి.జి.పి మరియు అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ ఇద్దరూ ...తరువాత ఏం జరగబోతోంది అని ఎదురుచూస్తున్నారు

"మూడూ...రెండు...ఒకటి. నీకిచ్చిన టైము ముగిసింది ప్రమోద్"

టైము ఐదు నిమిషాలు గడిచిన తరువాత...డిటెక్టివ్ ప్రతాప్ చేతితో సైగ చేయగా...ఆ చోటుకు ఎదురువైపున ఉన్న తలుపు తెరుచుకుంది. అక్కడ ప్రమోద్ ప్రేమిస్తున్న అంజలి నిలబడుంది.

మరుక్షణం...ప్రమోద్ కళ్ళల్లోకి చూశాడు ప్రతాప్. ఆ కళ్ళల్లో అంతకుముందున్న కృరత్వం పోయి కన్నీళ్ళు కనబడ్డాయి.

"నేను నిజం చెప్పేస్తాను" పెద్దగా కేకలు వేయటం మొదలుపెట్టాడు.

"ఇంతసేపు మౌనంగా ఉన్నావే...ఇప్పుడు నువ్వు చెప్పేది నేను వినాలా...?"

ప్రతాప్ చేతులు ఊపగా...అంజలి చెంపపై లాగి ఒక్కట్టిచ్చింది సుధా. ఆ దెబ్బను తట్టుకోలేక అంజలి గట్టిగా ఏడ్చింది.

"నా గురించి మీకు తెలియదు. నన్ను ఏమైనా చేసుకోండి. ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఆమె మీద చిన్న గీత పడినా నేను వూరికే ఉండను”

మళ్ళీ చెతులు ఊపగా....అంజలి చెంపపై మరో దెబ్బ.

"నేను నిజం చెబుతానని చెప్పానుగా...ఇంకా ఎందుకు ఆమెను కొడతారు?"

"నువ్వు నిజమే చెప్పబోతున్నావని ఏమిటి రూజువు"--ఇప్పుడుకూడా అంజలి చెంప చెళ్ళుమన్నది.

“ప్లీజ్ ఆమెను విడిచిపెట్టండి. ఆమెకూ, నా పనికీ ఏ సంబంధం లేదు. మీ కాళ్ళమీద కూడా పడతాను. ప్లీజ్"

"పడాల్సింది నా కాళ్ళమీద కాదు...కమీషనర్ కాళ్ళమీద. ఆయనచెబితే కొట్టటం ఆపుతాను"

ప్రమోద్ ఒక్క దూకు దూకి కమీషనర్ కాళ్ళను గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. కొట్టింది చాలు అని ఆయన కళ్ళతొ సైగ చేశాడు. ప్రతాప్ చేతులు ఊపడంతో...అంజలి విడిచిపెట్టబడింది.

ప్రమోద్ ను లేపి, తిరిగి కుర్చీలో కూర్చోబెట్టారు.

"నాకు తెలుసురా...ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ లైటు వెలుగుతుందో...! నీకొక్కడికే తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నావా? మర్యాదగా మొత్తం చెప్పు"

ప్రమోద్ వివరంగా అన్నిటినీ అప్పజెప్పాడు.

ప్రతాప్ గడియారం వైపు చూశాడు. టైము ఏడు గంటలు చూపుతోంది.

"కమీషనర్ సార్...మీరు అడిగినదానిని ఐదు గంటల ముందే పూర్తిచేశాను. ఇక మీరే చూసుకోవచ్చు. నా అవసరం మీకుండదు"

"బాంబు డిస్పోజ్ చేసేటప్పుడు, ఆ అంజలిని కూడా తీసుకువెళ్ళండి. వీడు గనుక అక్కడ ఏదైన తిక్క పనులు చేస్తే, వీడితోపాటూ ఆమె కూడా బూడిదైపోనివ్వండి"

"వెల్ డన్ మిస్టర్ ప్రతాప్"--డి.జి.పి మరియు కమీషనర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు.

"మళ్ళీ 'సారీ' చెబుతున్నా ప్రతాప్. మీ గురించి తెలియక ప్రొద్దున మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడాను"

"మీరు సారీ చెబుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను దొంగతనాలు మానేసి మంచివాడిగా ఉంటున్నానంటే దానికి కారణం మీరు ఆ రోజు నాకు ఇచ్చిన దెబ్బలూ, అడ్వైస్. మీరంటే నాకు చాలా గౌరవం. మీ మనసును బాధపెట్టుంటే నన్ను క్షమించండి" బయటకు వెళ్ళిపోయాడు ప్రతాప్.

అంజలిని లాకొచ్చి, ప్రమోద్ ముందు నిలబెట్టారు. ఆమె చెంపల మీద సుధా యొక్క చేతి వేళ్ల ముద్ర ఉన్నది. ప్రమోద్ ఆమె వైపు చూడలేకపోయాడు. తలవంచుకుని నిలబడ్డాడు.

"ప్రమోద్....రేపు నన్ను పెళ్ళి చేసుకుంటానని మా నాన్న దగ్గర ప్రామిస్ చేశావు? మంచికాలం...ప్రామిస్ ఫైల్ అయిపోతుందేమోనని భయపడ్డాను. అంతా అయిపోయింది కదా. ఇక బయలుదేరు"

"ఇప్పుడు నేను వీళ్ళ కస్టడీలో ఉన్నాను...నేనెలా రాగలను"

"సరే, వాళ్ళకు నిజాలన్నీ చెప్పేసి, రేపు ఉదయాన్నే వచ్చాయి. నీకొసం నేను రెడీగా ఉంటాను"

ఇన్స్ పెక్టర్ సుధా అంజలి చెయ్యి పుచ్చుకుని బయటకు తీసుకు వెళ్ళింది.

Continued: PART-10

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి