'భారతం మా బానిస’ టెర్రరిస్ట్ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ గుడారం.
మసక వెలుతురులో ఆ సంస్థ యొక్క నాయకుడు కూర్చోనున్నాడు...ఎదురుకుండా చేతులు కట్టుకుని ఇద్దరు భవ్యంగా నిలబడున్నారు.
"మీరు చెప్పేది నిజమేనా?" గడ్డం సరిచేసుకుంటూ అడిగాడు.
"నిజమే 'బాస్’. ప్రమోద్ ని వాళ్ళు అరెస్టు చేసి తీసుకువెళ్ళటం నా కళ్ళారా చూశాను. ఈపాటికి వాడు నిజాలన్నిటినీ కక్కేసుంటాడు"
"అతని మీద బాగా నమ్మకం పెట్టుకున్నానే...ఇలా ఈజీగా దొరికిపోతాడని అనుకోలేదు"
వైర్ లెస్ ఫోన్ చిన్నగా శబ్ధం చేసింది. ఎదురుగా నిలబడున్న ఇద్దరిలో ఒకతను ఫోన్ తీసుకున్నాడు.
"ఆ...సరే...ఆలాగా..." అనే మాటలే తిరిగి తిరిగి పలికి, శొకంగా వచ్చి నాయకుడి ఎదురుకుండా నిలబడ్డాడు.
"బాంబు పెట్టిన కంపనీని పోలీసుల బలగం చుట్టు ముట్టిందట. ఈసారి మనం ఓడిపోతామేమోనని అనిపిస్తోంది"
"అలా జరగకూడదు. ప్రమోద్ గురించి నాకు బాగా తెలుసు. అతనికి కండ బలం లేకపోయుండచ్చు. కానీ బుద్ది బలం చాలా ఎక్కువ. వాడు తప్ప ఆ బాంబును 'డీ ఆక్టివేట్' చేయటం ఎవరి తరమూ కాదు. ఇప్పుడు మనకున్న ఒకే ఒకదారి...ప్రమోద్ ఆ బాంబును 'డీ ఆక్టివేట్' చేసేలోపు వాడ్ని చంపేయాలి"
"మీరు చెప్పిందే కరక్ట్. మేము వెంటనే బయలుదేరుతాం".....సల్యూట్ చేసి బయలుదేరారు.
కొద్ది నిమిషాలలో మిలటరీ యూనిఫారంలోకి మారారు. చేతి తుపాకీలు, ఏ.కే.47, గ్రెనేడ్లు రెడీగా ఉండే జీపులోకి ఎక్కి కూర్చున్నారు.
"జాగ్రత్త. పోలీసులు ఇప్పుడు చాలా అలర్టుగా ఉన్నారు"...నాయకుడు హెచ్చరించాడు.
"ఏంచేస్తారు? మహా అయితే మా ప్రాణాలనే కదా తీస్తారు? తీయనివ్వండి. కానీ, మనం అనుకున్న ప్రకారం ఆ బాంబును పేలేటట్టు చేస్తాం"...'కోరస్ గా చెప్పారు.
జీపు బయలుదేరింది.
నాయకుడి మొహంలో గర్వంతో కూడిన నవ్వు.
*******************************************
బాంబు పెట్టిన చోటుకు ప్రమోద్ ని తీసుకువచ్చి ఒకతోపు తోశాడు కమీషనర్. ఆ తోపుకు తూలి నిలబడలేక ఆ కంప్యూటర్ ముందు పడ్డాడు ప్రమోద్.
"లే...లేచి ఆ బాంబును 'డీ ఆక్టివేట్' చెయ్యి"
తూలుతూ లేచి నిలబడ్డ ప్రమోద్ తన చేతి సంకెళ్ళను చూపించాడు. సంకెళ్ళను తీశాడు కమీషనర్.
కంప్యూటర్ వెనుక వైపు ను ఓపన్ చేశాడు. బాంబుకు అమర్చిన వయర్లను ముట్టుకున్న వెంటనే అతని చేతులు వణికేయి. నుదుటి మీద నుండి కారిన చెమటను చేతులపై ఉన్న చొక్కాతో తుడుచుకున్నాడు. ఒకసారి అందరి వైపూ చూశాడు. చూపులను అంజలి దగ్గర ఆపాడు.
వయర్ కట్టర్ లో టైమర్ నుండి బాంబుకు వెడుతున్న వయర్లలో బ్లూ కలర్ రంగు వయర్ ను ఉంచాడు. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అందరూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ప్రాణాన్ని బిగబట్టారు.
ఇప్పుడు ఎవరి కళ్ళూ ప్రమోద్ పైన లేవు. కనుక, ఇదే సమయం అనుకుని గబుక్కున దూకిన ప్రమోద్, ఒక పోలీసు అధికారి తుపాకీ తీసుకుని ఆయన తలమీద ఉంచాడు.
"ప్రమోద్, మళ్ళీ తప్పు చేస్తున్నావ్..." చెప్పాడు డి.జి.పి.
"ఏం చేయాలో నాకు తెలుసు. అందరూ మంచిగా తుపాకులను క్రింద పడేయండి. లేకపోతే మీ అధికారి తల ముక్కలవుతుంది"
ఇది ఎదురుచూడని కొందరు శ్థంబించిపోయారు.
"నా గురించి ఆలొచించకండి. ఇతన్ని కాల్చిపారేయండి" చెప్పాడు ఆ పోలీస్ అధికారి.
"అది జరగదు సార్. ఇక్కడున్న బాంబును 'డీ ఆక్టివేట్' చేయడానికి నేను ప్రాణాలతో మీకు కావాలి….కానీ మీలో ఎవరి ప్రాణమూ నాకు అవసరంలేదు"
అందరూ తుపాకులను నేల మీద పెట్టారు.
"ఏం కమీషనర్ గారూ...మీకు మాత్రం వేరుగా చెప్పాలా? తుపాకీని క్రిందపడేయండి"
ఆయన తన తుపాకీ తీసుకుని ప్రమోద్ ను గురిచూసి కాల్చబోయారు. అంతకుముందే కమీష్నర్ను గురి పెట్టుకున్న ప్రమోద్, ఆయన చేతులు చూసి కాల్చాడు. ఆయన చేతిలోని తుపాకీ ఎగిరి దూరంగా పడింది.
"మొదట అందరూ ఈ చోటు నుండి బయటకు వెళ్లండి..."
అందరూ బయటకు వెళ్ళగానే...తల మీద ఉంచిన తుపాకితో అ పోలీసు అధికారిని తోసుకుంటూ వెనక్కి తీసుకుపోయి బయటకు తోశేశాడు.
"అంజలీ, నిన్ను మహారాణిలాగా ఉంచుకుందామనే ఆశపడ్డాను. కానీ, విధి...నావల్ల నీకు కష్టాలు తీసుకొచ్చింది. నీ జీవితంలో నేను ఇక లేను"
"ప్రమోద్ నువ్వు లేకుండా నాకు జీవితమే లేదు. ఇంతకు నుందు నువ్వు చేసింది మామూలు తప్పులు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది దేశ ద్రోహం"
మళ్ళీ మాట్లాడాలనుకున్న అంజలిని ఆపాడు ప్రమోద్.
"నన్ను తలచుకుని నీ జీవితాన్ని పాడుచేసుకోకు! విధి నా తలరాతను వేరేవిధంగా రాసేసింది. నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళిపో. డి.జి.పి సార్...ఆమెను ఎవరూ ఫాలో అవకూడదు. ఇక్కడ జరుగుతున్నదానికీ, ఆమెకూ సంబంధం లేదు"
అంజలి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె తల కనిపించనంతవరకు ప్రమోద్ వైట్ చేశాడు.
"నేను ఈ స్థితికి రావటానికి కారణమైన డిటెక్టివ్ ప్రతాప్ వెంటనే ఇక్కడకు రావాలి...ఓ.కె"... తుపాకీని మరింత నొక్కి పెట్టాడు.
"ప్రమోద్...నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు! నువ్వు ఇలా చేయటానికి డబ్బు మీద నీకున్న ఆశ. మేము చెప్పినట్లు చేస్తే...నీకు శిక్ష తగ్గే అవకాశం ఉంది"
"అన్నీ చేతులు దాటి పోయినై. నేను మంచివాడుగా ఉన్నప్పుడే నాకు ఉద్యోగం దొరకలేదు. ఇప్పుడు మీరు నేను దేశద్రోహి అని ముద్ర వేశారు. ఇక కలలో కూడా నేను ఉద్యోగం చేయలేను. అవసరం లేకుండా నన్ను సమాధాన పరిచేందుకు ట్రై చేయకండి...ప్రతాప్ ను రప్పించే ప్రయత్నం చేయండి"
సుధా యొక్క 'సెల్ ఫోన్' తీసుకుని, ప్రతాప్ నెంబర్లు నొక్కాడు కమీషనర్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి