చీటింగ్ పోలీస్(నవల)…..PART-8
పోలీసులకు బాగా దొరికిపోయానని ప్రమోద్ కి అర్ధమైపోయింది. ఇప్పుడు ఒకటే దారి....అక్కడ్నుంచి తప్పించుకుపోవటమే.
డీప్ బ్రీతింగ్ తీసుకుని తనలోని ఆదుర్దాను తగ్గించుకుని కొంచం నిదానం తెచ్చుకున్నాడు. 'తప్పించుకోవటానికి ఏమిటి దారి?' అని ఆలొచించటం మొదలుపెట్టాడు.
'బూట్ల శబ్ధం ఎక్కువ అవుతోంది కాబట్టి బయటకు వెలితే దొరికిపోతాం. గదిలోనుండి మేడకు వెళ్ళటానికి దారి ఉన్నది. అక్కడ నుండి పక్క మేడకు దూకచ్చు. అలగనుక చేసినట్లు అయితే వీధి చివరివరకు వెళ్ళిపోవచ్చు. అలా చేస్తే పోలీసుల కళ్లలో మట్టికొట్టచ్చు. చివరగా రెండో అంతస్తు నుండి క్రిందకు దూకాలి... తప్పదు’ నిర్ణయించుకున్నాడు ప్రమోద్.
అనుకున్నట్లు చేయడానికి గది తలుపు తెరిచాడు. పోలీసు కట్టింగ్ తలలన్నీ గదివైపుకు ఒకేసారి తిరిగినై....అదే సరైన సమయం అనుకుని మేడవైపుకు పరిగెత్తడం మొదలుపెట్టాడు. 'ఏం జరుగుతోంది?' అని అర్ధం అయ్యేలోపు మేడమీదకు వెళ్ళి పక్క మేడకు దూకాడు.
అతని దురదృష్టం...ఒక కాకీచొక్కా వాడిని చూసింది.
"సార్...అటువైపుగా తప్పించుకుని వెడుతున్నాడు"
ప్రమోద్ తన వేగన్ని పెంచాడు. ఒక్కొక్క భవనంగా దాటుకుంటూ వెళ్ళాడు. పోలీసులు అతన్ని వెంబడించారు. చివరి మేడ వచ్చింది. 'ఇక క్రిందకు దూకి పెరిగెత్తుకుంటూ వెళ్ళి పబ్లిక్ లో కలిసిపోవాలి’ అని అనుకున్నాడు.
ఇన్స్ పెక్టర్ గణపతి ప్రమోద్ యొక్క క్రిమినల్ ఆలొచనను ఊహించగలిగాడు. అతని కాలును గురిచూస్తూ కాల్చాడు.
అది కరెక్టుగా మోకాలుకు క్రింద తగిలింది. నేలమీద పడిపోయాడు ప్రమోద్. నలుగురైదుగురు పోలీసులు ప్రమోద్ ని చుట్టుముట్టారు.
కొద్ది నిమిషాల తరువాత......
ప్రమోద్ ని తీసుకుని హాస్పిటల్ వైపుకు వేగంగా వెళ్ళింది ఆంబులాన్స్.
ప్రతాప్ ఆదేశంతో ఇన్స్ పెక్టర్ అర్జున్, సబ్ ఇన్స్ పెక్టర్ మూర్తి ఇద్దరూ...ప్రమోద్ తో ఆంబులాన్స్ లో వెళ్ళారు.
**********************************************
హాస్పిటల్ కు వెళ్ళి విచారణ మొదలుపెట్టటానికి మరో అరగంట అవుతుందని లెక్కవేసుకున్నాడు ప్రతాప్. ఆలోపు ప్రమోద్ గదిని ఒకసారి చెక్ చేసి రావాలని నిర్ణయించుకున్నాడు.
ఆ గదిలో........
బ్యాచులర్ ల గది ఎలా ఉంటుందో అలాగే ఉంది. చిందరవందరగా పడున్న గుడ్డలూ, కొన్ని వారాలుగా శుబ్రం చేయబడని చెత్త.
ఒక పక్క బాంబు తయారుచేయడానికి ఉపయోగించిన వస్తువులు, మరొపక్క పెళ్ళికి కావలసిన వస్తువులు.
బాంబు తయారుచేయడానికి పోనూ మిగిలిన రసాయనాల మిశ్రమాన్ని చేతితో కొంచంగా తీసుకుని చూశాడు.
"మిస్టర్ గణపతి గారూ…బాంబుల గురించి తెలిసున్న వాళ్ళను నేను కలుసుకోవాలి"
"వెంటనే ఏర్పాటు చేస్తాను"
బాంబ్ స్క్వాడ్ డివిజన్లో పనిచేస్తున్న విశ్వానికి ఫోన్ చేశాడు ఇన్స్ పెక్టర్ గణపతి ...పది నిమిషాలలో అక్కడికి వచ్చాడు విశ్వం. ఆలోపు గదిలోని అన్ని మూలలను చెక్ చేశాడు ప్రతాప్.
"సార్... ఈయన మిస్టర్ విశ్వం. నా స్నేహితుడు. బాంబ్ స్క్వాడ్ డివిజన్లో స్పెషలిస్ట్"
"ఐయాం ప్రతాప్. స్పెషల్ ఏజెంట్…ఇది సాధరణ బాంబులాగా లేదు. దీని గురించి చెప్పగలరా?"
"తప్పకుండా"
మిగులు మిశ్రమ రసాయనాన్ని తీసుకుని పరిశోధన చెయటం మొదలుపెట్టాడు విశ్వం. అప్పుడప్పుడు తనతొ తెచ్చిన పరికరంలో పెట్టి దేనికోసమో ఆదుర్దా పడుతున్నాడు. చూడకూడని లేక్కను ఆ పరికరంలో చూసిన ఆదుర్దా అతని మొహంలో కనబడింది.
"సార్. ఇది ఆర్.డి.ఏక్స్ హై మోడ్ బ్లాస్ట్ రకానికి చెందినది. లేటస్ట్ పరిశోధనలో కనిపెట్టబడింది. ఈ రసాయన మిశ్రమాన్ని అన్ని ప్రభుత్వాలు బాన్ చేశాయి. ఇది పదిరెట్లు శక్తివంతమైంది. వీడిచేతికి ఎలా దొరికిందో ఆశ్చర్యంగా ఉంది. ఒక చోటును పూర్తిగా ధ్వంశం చేయటానికి పది డైనమైట్ల శక్తి కావాలసి వస్తే...ఈ బాంబు మిశ్రమం ఐదు శాతం సరిపోతుంది. అంత శక్తివంతమైన బాంబు మిశ్రమం ఇది."
"అలాగా....?"---అంటూ తల గోక్కుంటూ ఆలొచనలలోకి వెళ్ళిపోయాడు ప్రతాప్.
"అన్ని దేశాలూ బాన్ చేసిన తరువాత ఈ బాంబు వీడి చేతికి ఎలా దొరికుంటుంది?"
"అదే తెలియటంలేదు"
"మనం అనుకున్నట్లు ఇదేమీ చిన్న టెర్రరిస్ట్ సంస్థ కాదు. దీని నెట్ వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఉండుంటుంది. వీళ్ళకు సహాయం చేయటానికి చాలామంది ఉండుంటారు"
ప్రతాప్ మరొకసారి ఆ గదిని పరిశీలించాడు. ఇన్స్ పెక్టర్ గణపతిని పిలిచాడు.
“ఇన్స్ పెక్టర్! మీరు ఇక్కడే ఉండండి. మిస్టర్ విశ్వా మీరుకూడా ఇక్కడే ఉండండి. నేను హాస్పిటల్ కు వెల్తాను. ఆ టెర్రరిస్ట్ గ్రూప్ ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు బాంబు పేలేవిధంగా పథకం వేశారు. ఆ బాంబు ఎక్కడ పెట్టేరనే నిజాన్ని తెలుసుకుని వస్తాను. ఆ బాంబును డీ ఆక్టివేట్ చేయటానికి మీలాంటి ఒక నిపుణుడు కావాలి...అంతే కాదు. ప్రమోద్ ని పట్టుకున్న విషయం ఎవరికీ తెలియదు. అతనికోసం ఎవరైనా రావచ్చు"
"ఓకే సార్"
ప్రతాప్ జీపులో హాస్పిటల్ కు బయలుదేరాడు.
************************************
ప్రమోద్ ను ఆపరేషన్ ధియేటర్లోకి తీసుకు వెళ్ళారు.
లోపల సర్జరీ జరుగుతుండగా...బయట డి.జి.పి ఆదుర్దాతో అటూ ఇటూ తిరుగుతున్నాడు. తన భార్యకు ప్రసవం జరుగుతున్నట్లుగా!
ప్రమోద్ ని విచారణ చేయాల్సిన అవసరం గురించి చెప్పి, మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్ చేయమని కోరుకున్నాడు. మొదట కుదరదని చెప్పినా, తరువాత 'ఓకే' చెప్పాడు డాక్టర్.
అలా జరుగుతున్న ఆపరేషన్ వలన...నొప్పిని భరించలేక ప్రమోద్ పెడుతున్న కేకలు బయటవరకు వినబడుతున్నాయి.
అప్పుడు అక్కడకొచ్చిన ప్రతాప్ ను చూసిన డి.జి.పి. గబగబా ప్రతాప్ దగ్గరకువెళ్ళి అతని చేతులు పుచ్చుకుని "కంగ్రాట్స్" అన్నాడు.
"ఎమిటి సార్...అతనెలా ఉన్నాడు?" అని ప్రతాప్ డి.జి.పి ని అడుగుతున్న సమయం 'ఆపరేషన్ ధియేటర్’ లోపల నుండి డాక్టర్ బయటకు వచ్చాడు.
"డాక్టరే వస్తున్నారు...ఆయాన్నే అడిగి తెలుసుకుందాం"
"టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రక్తం కొంచం ఎక్కువగా పోవటం వలన స్పృహ కోల్పోయాడు. పది నిమిషాలలో నార్మల్ అవుతాడు. అప్పుడు వెళ్ళి చూడచ్చు"
"డి.జి.పి సార్. మనం అనుకున్నదానికంటే విషయం చాలా సీరియస్. అతను బాంబు తయారుచేటానికి ఉపయోగించిన రసాయనం అత్యంత శక్తివంతమైనది. అది పేలితే నష్టం విపరీతంగా ఉంటుంది"
"మిస్టర్ ప్రతాప్....ఈరోజు మీరే డి.జి.పి! అది మర్చిపోయి నన్ను డి.జి.పి అని పిలుస్తున్నారు. ఒక ‘క్లూ’ కూడా దొరకని కేసులో ఇంత కనిపెట్టారు. ఇకపోతే మిగిలినది కనుక్కోవటం కష్టమా ఏమిటి? మీవల్ల అవుతుంది. కొంచం రిలాక్స్ గా కూర్చోండి. ప్రమోద్ సృహలోకి వచ్చిన వెంటనే విచారిద్దాం"
అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ వచ్చాడు.
"మిస్టర్ ప్రతాప్. బ్రహ్మాండంగా కనిపెట్టారు. మీకేదైనా సహాయం కావాలంటే అడగండి"
"అరే...'క్రిమినల్’ అనేది పోయి 'మిస్టర్’ ప్రతాప్ అయ్యింది. మంచి మర్యాద. సమయం నాలుగు గంటలు అయ్యింది. ప్రొద్దున్నుంచి ఏమీ తినలేదు. హోటల్ కి వెళ్ళి ఒక భోజనం తేగలరా?"
అసిస్టంట్ కమీషనర్ ముఖం మారింది. గొడవ పెద్దదవక ముందే డి.జి.పి కలిగించుకుని ఇంకొకరిని పంపారు.
"ప్రతాప్....అసిస్టంట్ కమీషనర్ గారి తుపాకీ ఆయనకే ఇచ్చేయొచ్చు కదా...ఇకమీదట మీకు అది అవసరమా?"
"ఆయన్నే ఉంచుకోనివ్వండి సార్. ఒక సెక్యూరిటీ గా ఉంటుంది. ఆయన గురించి తెలియక ప్రొద్దున ఇన్సల్టింగ్ గా మాట్లాడాను. తప్పుగా తీసుకోకండి సార్."
"మీ తుపాకీకి ధ్యాంక్స్! మీ మాటలను అప్పుడే మరిచిపోయాను" పిస్టల్ ను తిరిగి ఇస్తూ చెప్పాడు ప్రతాప్.
పది నిమిషాలు గడిచింది.
"సార్...ప్రమోద్ కళ్ళు తెరిచాడు. మీరు చూడొచ్చు" నర్స్ చెప్పింది.
"సార్...భోజనం కొనుక్కొచ్చాను" జీప్ డ్రైవర్ మరొవైపు నుండి చెప్పాడు.
“మీరు వెళ్ళి భోజనం చేయండి...నా దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసు కదా? అతని దగ్గర నుండి నిజాన్ని రాబట్టటం నా భాద్యత" చెప్పాడు అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్.
అరగంట సమయం దాటింది.
అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ కొట్టిన దెబ్బలకు ప్రమోద్ నోరంతా నెత్తురు కారుతోంది. శరీరం దెబ్బలతో మొద్దుబారిపోయినా నిర్లక్ష్యంగా కూర్చున్నాడు.
ప్రతాప్ లోపలకు వెళ్ళాడు...అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు.
"చెప్పరా...బాంబు ఎక్కడ పెట్టావు?" అసిస్టంట్ కమీషనర్ రత్న కుమార్ లాఠీతో ప్రమోద్ కాళ్ళమీద మళ్ళీ నాలుగు పీకాడు.
"ఏమిటి ఏ.సి గారు...నోరు తెరిచాడా?" అడిగాడు ప్రతాప్.
"ఎంత కోట్టినా నోరు తెరవటంలేదు. ఇప్పుడే నా కఠినమైన ట్రీట్ మెంట్ మొదలుపెట్టాను. ఇంకాసేపట్లో నోరు తెరుస్తాడు"
ప్రతాప్ ప్రమోద్ వైపు తిరిగాడు.
"ఎందుకు ఇన్ని దెబ్బలు తింటూ చావుకు దగ్గరగా వెల్తున్నావు? నిజం చెప్పు. ఆ బాంబును ఎలా డీఆక్టివేట్ చేయాలో చెప్పు. చాలా కష్టపడి చేసినట్లు తెలుస్తోంది.'
చెప్పు...దెబ్బలు తిని చావకు"
"బాంబు ఎక్కడుందో కనిపెట్టేశారా?"
“కనిపెట్టాశాము"
"ఎలా"
డిటెక్టివ్ ప్రతాప్ చిన్నగా నవ్వాడు.
ప్రమోద్ ను హాస్పిటల్ నుండి డి.జి.పి ఆఫీసుకు తీసుకు వెళ్ళారు.
Continued: PART-9
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి