21, జులై 2019, ఆదివారం

చీటింగ్ పోలీస్(నవల)…..PART-6


                                 చీటింగ్ పోలీస్(నవల)…..PART-6

"సార్...నేను చెప్పిన పనులు జరుగుతున్నాయా?"

"జరుగుతున్నాయి. ఆ వివరాలు ఎందుకో తెలుసుకోవచ్చా?"

"చెబుతాను...అందుకోసమే నేనొచ్చింది"...ప్రతాప్ లేచి నిలబడ్డాడు.

అందరూ క్షుణ్ణంగా ప్రతాప్ ను గమనిస్తున్నారు.

"మొదటగా మీకందరికీ తెలిసిన విషయమే...మన దగ్గర పట్టుబడ్డ ఇద్దరూ డిగ్రీ చదువుకున్నవారే. డబ్బుకొసమే వాళ్ళు ఈ పనులు చేశారు. ఇంతవరకు ఎం.ఎస్.ఐ సంస్థకు చెందిన వారెవరినీ వీల్లిద్దరూ చూసింది కూడా లేదు.

దీనికంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈ సంస్థకు ప్రజలను చంపాలనేది ఉద్దేశం కాదు. వాళ్ళ నిజమైన ఉద్దేశం....భారతదేశాన్ని అర్ధీకంగా దెబ్బతీయాలి. అందువలనే ఈ సంస్థ ఇంతకు ముందు జరిపిన బాంబు పేలుళ్ళలో చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువ. ఇదివరకు జరిగిన రెండు బాంబు పేళ్ళుల్లలోనూ పెద్ద పెద్ద పారిశ్రామక భవనాలు కూలిపోయినై. దీని వలన ఈ సంవత్సరం మనదేశ జి.డి.పి గ్రోత్ తగ్గింది. ఇప్పుడు కూడా వీళ్ళ టార్గెట్ బిగ్ ఇండస్ట్రీస్సే.

వాళ్ళ కార్యకలాపాలకు ఆ సంస్థ సరైన వ్యక్తులను ఎలా కనిపెట్టారు? వాళ్ళు చేసిన పనికి వాళ్ళకు డబ్బు ఎలా ఇచ్చుంటారు? ఇలా అలొచిస్తున్నప్పుడే నాకు ఒకదారి దొరికింది. దానికి గురించి తెలుసుకోవటానికే నేను దిలీపును కలుసుకున్నది. అతన్ని కలుసుకున్న తరువాతే మనం దర్యాప్తు చేయాల్సిన దారి క్లియర్ గా అర్ధమయ్యింది.

ఉద్యోగాలు దొరక్క విరక్తిగా ఉన్న యువకుల ఫోన్ నెంబర్లను 'ట్రాప్' చేసి, అలాగనుక వాళ్ళు విరక్తిగా ఉంటే, అప్పుడు ఆ సంస్థ తరువాత కాయ జరుపుతారు. వాళ్ళల్లో దేశం మీద ఏర్పడిన విరక్తిని అధికం చేస్తారు. నయవంచకంగా మాట్లాడి, మాట్లాడి కొన్ని రోజులలొ వాళ్ళు మనసారా భారతదేశాన్ని ఎదిరించేటట్లు చేశేశ్తారు.

ఆ తరువాత బాంబు పేల్చడం గురించి చెప్పి....పెద్ద మొత్తాన్నీ, విదేశంలో ఉద్యోగాన్నీ ఎరగా వేస్తున్నారు. పెద్ద మొత్తంలొ డబ్బుకూ, విదేశీ ఉద్యోగానికి ఆశపడి యువకులు....వాళ్ళు విసిరిన వలలో చిక్కుకుంటున్నారు. దీనికంతా ఆరునెలలు పడుతుంది.

ఇంత తెలివిగా కాయలు జరుపుతున్న ఆ సంస్థ, ఒక పెద్ద తప్పు చేశారు. అది...డబ్బును యువకులకు ఇచ్చే పద్దతిలో. డైరెక్టుగా డబ్బును యువకులకు ఇవ్వటానికి ఇష్టపడక...యువకుల బ్యాంకు అకౌంట్ నెంబర్ తీసుకుని, బ్యాంకులో డెపాజిట్ చేస్తున్నారు. అదికూడా రెండు వాయిదాలుగా చెల్లిస్తున్నారు. మొదటి మొత్తాన్ని బాంబు పేలుడుకు మూడురోజుల ముందు, మిగిలిన మొత్తాన్ని బాంబు పేలుడు జరిగిన రెండురోజుల తరువాత బ్యాంకు మూలంగా ఇస్తారు.

ఇదే మనకు దొరికిన పెద్ద వరప్రసాదం. మామూలుగా వాళ్ళు ఫిక్స్ చేసిన పెద్ద మొత్తం ఇరవై లక్షలు. అలాగైతే ఇప్పుడు జరుపబోతున్న బాంబు పేలుడుకు మూడురోజుల ముందు ఎవరి అకౌంట్లోనో, ఏదో ఒక బ్యాంకులో, పది లక్షలు డిపాజిట్ అయ్యుంటుంది. అది కనిపెట్టి ఎవరా యువకుడు అనేది తెలుసుకోవచ్చు.

ఇక నేను చెప్పిన రెండో లిస్ట్ రెడీ చేస్తే మన పని మరింత సులువు అవుతుంది. బాంబు పేలుడు తరువాత ఆ యువకుడు ఇక్కడుండు. ఉంటే పట్టుబడతాడు. అందుకని బాంబు పేలుడు తరువాత ఆ యువకుడు విదేశాలకు వెళ్ళిపోతాడు. విదేశలకు వెళ్ళాలంటే ముందుగా రిజర్వేషన్ చేసుకోనుంటాడు"

“బ్రహ్మాండం ప్రతాప్. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు కనిపెట్టారు. ఇప్పుడు మాకు నమ్మకం వచ్చింది"

డి.జి.పి రిలాక్స్ అయ్యాడు.

********************************

అంజలి ఇంట్లోకి ప్రమోద్ చొరబడ్డాడు. ఎవరికీ కనబడకుండా ఆమె కూడా వచ్చింది. ప్రమోద్ రాలేదే నని ఇంతసేపు గాబరాపడ్డ అంజలికి కొంత ప్రశాంతత దొరికింది. అంజలి తండ్రి సోఫాలో కూర్చోనున్నాడు...ఆయనకు ఎదురుగా నిలబడి తనని పరిచయం చేసుకున్నాడు ప్రమోద్.

"నేను, మీ ఆమ్మాయి ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. మేము పెళ్ళిచేసుకోవటానికి మీ అనుమతి కావాలి"

"ప్రేమించుకోవటానికి మాత్రం నా అనుమతి అక్కర్లేదు...పెళ్ళిచేసుకోవటానికి మాత్రం నా అనుమతి కావాలా? మీరే చేసుకోనుండచ్చుగా!"

"ఎలాగైనా ఎవరినో ఒకర్నిచ్చి మీ అమ్మాయికి పెళ్ళి చేస్తారు. అ తరువాత పెళ్ళిచేసుకున్న అతన్ని ఆమె ప్రేమించే కావాలి. అలాంటప్పుడు పెళ్ళికి ముందు ప్రేమించడం చేస్తే తప్పా?"

"మీలాంటి యువకులకు ప్రేమించడం టైమ్ పాస్ విషయం అయిపోయింది. ప్రేమికుడు అని చెప్పి పెళ్ళిచేసుకుని వెళ్ళిన ఎందరో అమ్మాయులు...రోడ్డు మీద నిలబడటం చూశాను"

"కొంతమంది 'ప్రేమ’ పేరుతో అమ్మాయులను మోసం చేసింది చూసి మీరలా చెబుతున్నారు. మా ఇద్దరి ప్రేమ...మిగితావారిలా కాదు. ఒక క్రమపద్దతితో ఉన్నది"

"ఆ క్రమపద్దతిని మేమెప్పుడూ దాటలేదు. ఇప్పుడు నాకు మంచి ఉద్యోగం దొరికింది. మీ ఆమ్మాయిని బాగా చూసుకుంటాను. నన్ను నమ్మండి"

"నన్ను నమ్మించే అవసరం నీకు అక్కర్లేదు"

"చివరగా మీరేం చెప్పదలుచుకున్నారు..." అతని స్వరం పెద్దదైంది.

"నేను చూసిన అతన్ని పెళ్ళిచేసుకుంటే అది నా కూతురు. లేకపోతే చచ్చిపోయింది అనుకుంటా"

“మీరు ఇంత కచ్చితంగా చెప్పేటప్పుడు, నేనూ ఒకటి చెప్పదలుచుకున్నాను. రాబోవు మూహూర్తంలో నాకూ, మీ అమ్మాయికి పెళ్ళి. ఇంట్లోనుండి పారిపోయిందనే చెడ్డపేరు ఆమెకు రాకూడదు. ఈ ఒక్క రోజు...పుట్టింట్లో ఉండనివ్వండి. రేపు మీ ముందే తాలి కట్టి నా భార్యగా మా ఇంటికి తీసుకువెళ్తాను"

అంజలిని చూశాడు ప్రమోద్...కళ్ళతో తన అంగీకారాన్ని తెలిపింది.

"అంజలిని నేను మహారాణి లాగా చూసుకుంటున్నానని తెలుసుకుని ఏదో ఒకరోజు మీరే నాదగ్గరకు వస్తారు. రేపు వస్తాను"...చెప్పేసి బయలుదేరాడు.

*******************************************

సమయం మధ్యాహ్నం ఒకటిన్నర అయ్యింది.

డి.జి.పి సురేందర్ ముందు ఒక ఫైలును పెట్టేసి, కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్ పెక్టర్ ఆయనకి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.

"ఇదిగోండి ప్రతాప్ గారు. మీరడిగిన ఫైలు. ఐదు లక్షలకు పైన డిపాజిట్ చేసిన వాళ్ళ లిస్టు, విదేశాలకు వెళ్ళటానికి విసాలు అడిగినవారి వివరాలు ఇందులో ఉన్నాయి" డి.జి.పి ఫైలును అందించాడు.

అందులో ముప్పైఐదు సంవత్సరాలు వయస్సు ఉన్నవారి పేర్లు కొట్టాశాడు. అనుమానం ఉన్న పదిహేను మంది పేర్లను వేరుగా వేరే కాగితంపై రాసుకున్నాడు ప్రతాప్.

విదేశాలకు వెళ్ళటానికి విన్నపం చేసుకున్నవారి వివరాలను చూసి అందులో ముగ్గురి పేర్లను పెన్నుతో గుండ్రంగా చుట్టాడు.

ఆ పేర్లు: రాధాకృష్ణ, సుదర్షన్, ప్రమోద్.

"సార్...ఈ ముగ్గురే మన అనుమాన వ్యక్తుల వలయంలో ఉన్నారు. వీళ్ళను వెంటనే ఇంటరోగేట్ చేయాలి. పోలీసులమని చెప్పి ఇంటొరొగేట్ చేస్తే...మనమీద అనుమానం రావచ్చు. ఇన్ కం టాక్స్ ఆఫీసు నుండి వస్తున్నామని చెప్పి ఇంటెరోగేట్ చేద్దాం. మన అనుమానం నిజమవుతున్నట్టు తోస్తే,వెంటనే మన పద్దతిలోకి దిగిపోదాం"

“కంగ్రాట్స్ ప్రతాప్. నేరస్తుడు మనకు ప్రాణాలతో కావాలి. మీకు కావాలంటే నా సొంత 'రిస్క్' పై నా తుపాకీ ఇస్తాను. ఇంటరోగేషన్ అయిన వెంటనే తిరిగి ఇచ్చేయాలి"

"నా దగ్గర తుపాకీ ఉంది...మీరు కంగారుపడకండి" అంటూ తనదగ్గరున్న తుపాకీని చూపించాడు.

"ఇది పోలీసు తుపాకీలాగా ఉన్నదే...ఇది మీకెలాదొరికింది?"

"పోలీసు తుపాకీ లాగా కాదు...పోలీసు తుపాకీనే. మన కమీషనర్ దే. రక్షణకోసం తీసుకువెళ్ళాను"

"అంటే ఆయన తుపాకీని దొంగలించింది....?"

"నేనే! ఇదొక్కటే కాదు....అందరి మనీ పర్సులూ కనబడకుండా పోయుంటాయే? ఇంకా ఎవరూ చూసుకోలేదా...?"

అందరూ జేబులను తడిమి చూసుకుని "అవును" అన్నారు.

"ఇదిగోండి..." అంటూ సంచీలో నుండి క్రిందపోశాడు.

"ఇందులో డబ్బు తప్ప మిగిలినవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. డబ్బులు మాత్రం ఉండవు. పోలీసులు దగ్గర్ ‘ఫీజు’ తీసుకోలేనని తెలుసు. అందుకే ఇలా తీసుకున్నాను..."

"నా మనీ పర్స్ కూడా తీసుకున్నారా?"

"బిజినస్ వేరు, పర్సనల్ వేరు. నాకు అందరూ సమానమే. దీని గురించి మాట్లాడి సమయాన్ని వృధా చేయకండి. మనం చేయాల్సింది చాలా ఉంది" అంటూ లేచాడు ప్రతాప్.

అతనితో పాటూ అందరూ లేచారు.

Continued: PART-7

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి