16, జులై 2019, మంగళవారం

చీటింగ్ పోలీస్(నవల)…..PART-4                                         చీటింగ్ పోలీస్(నవల)…..PART-4

ఇన్స్ పెక్టర్ సుధాకు కోపం తలవరకు ఎక్కటంతో...లేచి అగ్నిపర్వతంలా భర్త ప్రతాప్ దగ్గరకు వచ్చింది.

“ఏమిటీ అవతారం? ఎందుకిలా పరువుతీస్తున్నారు...?---కోపంగా అరిచింది.

"నువ్వేకదా చెప్పావు...'ఏ పనిలో ఉన్నా సరే అలా పడేసి వెంటనే బయలుదేరిరా' అన్నావు. నిన్న 'లేట్ నైట్' వచ్చాను. ప్రొద్దున పది గంటలకు లేచి స్నానం చేశాను. అంతలోనే నన్ను వెంటనే రమ్మని ఫోన్ కాల్. నీ మాటలను కాదనగలనా...? అందుకనే అన్నిటినీ వదిలేసి అలాగే వచ్చాశాను"

"అందుకని ఇలాగా? ఈ నల్ల కళ్ళద్దాలు వేసుకునే 'బాత్ రూమ్' కి వెళ్ళారా?"

"చీచీ...ఇదిలేకపోతే నీ మామ ఇమేజ్ ఏంగాను? అందుకనే అంత అవసరంలోనూ దీన్ని వెతికి పెట్టుకుని వచ్చాను"

సుధాకి ఇంకా కోపం తగ్గలేదు!

"నేను నిన్ను ఇరకాటంలో పెట్టాననుకుంటా. నన్ను క్షమించు సుధా. నా మనసంతా నిండిపోయున్న నా ప్రేయసీ...నన్ను మన్నిస్తావుగా..." అంటూ తల ఊపుకుంటూ సుధాను చూస్తూ ముందుకు వచ్చాడు ప్రతాప్.

అతని ఆ చూపులతో సుధా కోపం పూర్తిగా తగ్గిపోయింది. ఇద్దరూ అక్కడున్న కుర్చీలలో కూర్చున్నారు.

పక్కన కూర్చున్న సబ్ ఇన్స్ పెక్టర్ మూర్తి, పలుసార్లు ముక్కులెగరేశాడు.

"ఏమిటిసార్...వాసన చూస్తున్నారు...? 'బాత్ రూమ్' నుండి అలాగే వచ్చాశేనని చూస్తున్నారా?"

ఆయన అవునన్నట్టు తల ఊపాడు.

"చీచీ..నేనేమి అంత లేజీ వాడ్ని కాదు. నాకు పని చాలా టైట్ గా ఉన్నది. అందువలన స్నానం చేసి రెండు రోజులైంది….అంతే" అన్నాడు ప్రైవేట్ డిటెక్టివ్ ప్రతాప్

"డార్లింగ్...మామకు ఆ స్పేషల్ సెంటు ఇవ్వరా బుజ్జి".....సుధాని అడిగాడు ప్రతాప్.

సుధా తనని తానే మళ్ళీ తలమీద కొట్టుకుని 'జేబులో ఉన్న ఆ స్పేషల్ సెంటు బాటిల్ను ఎగరేయగా, ప్రతాప్ దానిని పట్టుకుని తనపైన జల్లుకున్నాడు.

పక్కనున్న మూర్తిని చూసి "సార్...ఇప్పుడు వాసన చూడండి. గొప్పగా ఉంటుంది" అని చెప్పాడు ప్రతాప్.

మూర్తి కళ్ళు ప్రతాప్ ను కోపంగా చూసినై.

"డార్లింగ్...నువ్వు చెప్పరా! వాసన బాగుందికదా" నవ్వుతూ అడిగాడు.

అందరూ తననే చూస్తున్నారని తెలుసుకుని డి.జి.పి వైపుకు తిరిగాడు ప్రతాప్.

"చెప్పండి డి.జి.పి గారు. ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలన్నారే?"

"ఇప్పుడైనా జ్ఞాపకమొచ్చిందే...?”...అంటూ ప్రశాంతంగా క్యాసెట్టును మళ్ళీ ప్లే చేశాడు డి.జి.పి.....రెండు నిమిషాల తరువాత్ క్యాసెట్ ఆగింది.

"ఇదే ఇప్పుడున్న పరిస్థితి "...షార్టుగా చెప్పాడు డి.జి.పి.

"............"

"ఇంకా మనకి పద్నాలుగు గంటల సమయమే మిగిలి ఉన్నది. అంతలోపు కనిపెట్టాలి. మీవల్ల అవుతుందా?" ప్రతాప్ ను అడిగాడు డి.జి.పి.

“బాంబు పెట్టింది ఎం.ఎస్.ఐ తీవ్రవాద సంస్థ. ఇంతపెద్ద ముఖ్యమైన క్లూ మన దగ్గర ఉన్నది కాబట్టి ఈజీగా కనిపెట్టేయచ్చు… దానికి సమయం కూడా ఉన్నది"

"ప్రతాప్ గారూ....జోక్ వేస్తున్నారా?"

"లేదు సార్. ఇంతకు ముందే ఈ సంస్థకు పలు బాంబు సంఘటనలతో కనక్షన్ ఉన్నది. అందులో రెండు ప్రదేశలలో నేరస్తులను పట్టుకుని జైల్లో పెట్టారు. కరెక్టే కదా?"

"అవును"

"పోయిన రెండుసార్లూ బాంబులను ఎలా పేలేటట్టు చేసారో...అదేలాగానే ఈసారి కూడా చేస్తారు. ఆ రెండు నేరలలోనూ నేరస్తులను పట్టేశారు...! దానికీ, దీనికీ ఒకటే తేడా. అప్పుడు బాంబు పేలిన తరువాత నేరస్తులను పట్టుకున్నారు. ఇప్పుడు ముందుగానే నేరస్తులను పట్టుకోవాలి"

అందరి ముఖాలవైపూ ఒకసారి చూశాడు. అందరిలోనూ నమ్మకమనే వెలుగు కనబడుతోంది.

డి.జి.పి కొంచం నవ్వు మొహంతో కనిపించాడు. సుధా గురించి చెప్పక్కర్లేదు.

"డి.జి.పి గారూ.ఇంకో ఐదు నిమిషాలలో ఆ సంస్థకు సంబంధించిన బాంబ్ బ్లాస్ట్ కేసు ఫైలు మొత్తం నా దగ్గర ఉండాలి" చెప్పాడు ప్రతాప్.

"ఏర్పటు చేస్తాను"

"అంతకు ముందు..."

మళ్ళీ ఒకసారి అందరినీ చూశాడు.

"నాకొక టూత్ పేస్టు, బ్రష్ కావాలి. నా నోటి దుర్వాసనను నేనే తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్..." అని అడిగాడు.

"అవి ముఖ్యంగా ఏర్పాటు చేస్తాను. మేము కూడా తట్టుకోలేకపోతున్నాను...మీ భర్తను తీసుకువెళ్ళి ...బ్రష్ చేయించి, స్నానం చేయించి 'రెడీ' చేయండి. ఇంటికి ఫోన్ చేసి మంచి డ్రెస్స్ తీసుకురమ్మని చెప్పండి" సుధాకి చెప్పాడు డి.జి.పి.

కొంచంసేపు తరువాత ప్రతాప్ ఫ్రెష్ అయ్యి, కొత్త ఉత్సాహంతో వచ్చాడు. ఇంటిదగ్గర నుండి దుస్తులు రాకపోవటం వలన...ఇంకా మాసిపోయిన బనీను, లుంగీ తోనే ఉన్నాడు.

అక్కడ కొత్తగా ఒక కుర్చీ, టేబుల్ వేయబడింది. టెబుల్ మీద ఒక ఫైలు ఉన్నది.

ఫైలులోని ఒక్కొక్క పేజీనీ చూసుకుంటూ వెళ్ళాడు ప్రైవేట్ డిటెక్టివ్ ప్రతాప్. ఐదు నిమిషాల తరువాత తలెత్తి అందరినీ ఒకసారి చూశాడు.

“ఈజీగా కనిపెట్టేయచ్చు"

"ఎలా" డి.జి.పి ఆసక్తిగా అడిగాడు. అందరి ముఖాలలోనూ అదే ఆసక్తి కనిపించింది.

"ఇంకో అరగంటలో చెప్తాను. దానికి ముందు ఈ ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని విచారణ చేయాలి"

అప్పుడు డి.జి.పి ఇన్స్ పెక్టర్ అర్జున్ వైపు చూశాడు.

"సార్ ఇందులో దిలీప్ ఇండిపెండంట్ వ్యక్తి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు."

"ఇంతకుముందు మేము ఇతన్ని చాలాసార్లు విచారణ చేశాము. ఈ టెర్రరిస్ట్ సంస్థ గురించి అతనికి ఏమీ తెలియదు. ఒక కిరాయి మనిషిలాగానే వాళ్ళకు పనిచేశాడు"

"అది నాకు తెలుసు మిస్టర్ అర్జున్. అతనిదగ్గర వేరే విషయం గురించి విచారణ చేయాలి. దానికి నేను చెప్పింది మీరు చెయ్యాలి" ఆర్డర్ వేశాడు ప్రతాప్.

ప్రతాప్ అలా ఆర్డర్ వేయటంతో కమీషనర్ కి కొపం వచ్చింది.

"ఒకరోజు నా ఎదురుగా గంటసేపు నీ మోకాళ్ళపై కూర్చుని ‘నన్ను వదిలిపెట్టండి’ అని బ్రతిమిలాడావు. నేరస్తుడైన నువ్వు చెప్పింది మేము చెయ్యాలా? ఈ కాకీ చొక్కా నీలాంటి ఒకడి క్రింద పనిచేయదు" కమీషనర్ గట్టిగా అరిచాడు.

"సార్... ఎప్పుడో ఐదేళ్ళ క్రిందట జరిగిన విషయం చెప్పి నా భర్తను చాలా అవమానిస్తున్నారు. ఆయన వచ్చింది మనకు సహాయపడటానికి. మొదట ఆయన్ను క్షమాపణ చెప్పమనండి " చెప్పింది ఇన్స్ పెక్టర్ సుధా.

".............."

"ఇంతకు ముందు కూడా ఆయన్ని అవమానపరిచారు. వాళ్ళ కళ్ళకు ఆయన అంత చులకన అయిపోయారా?"

'ఓ' అంటూ ఏడవటం మొదలెట్టింది.

డి.జి.పి కి ఏంచేయాలో తోచలేదు!

"ఏడవకండి"

"ఆయన్ని క్షమాపణ చెప్పమనండి సార్"

కమీషనర్ లేచి నిలబడ్డాడు... ప్రతాప్ కూడా ఏడవడం మొదలుపెట్టాడు.

వాళ్ళిద్దరి ఏడుపూ అక్కడున్న వారికి చిరాకు తెప్పించింది.

వేరే దారిలేక ప్రతాప్ దగ్గర క్షమాపణ అడిగాడు కమీషనర్.

"ఇప్పుడు ఓకేనా? మీతోపాటు ఇన్స్ పెక్టర్ గణపతిని పంపిస్తాను. ఆయన మీకు సహాయం చేస్తాడు"

"వద్దు సార్...ఆయన కూడా నన్ను క్రిమినల్ గానే చూస్తారు. అందువల్ల నన్ను వదిలేయండి. నేను వెళ్ళిపోతాను. విషయాన్ని మీరే పరిష్కరించుకోండి" కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు ప్రతాప్.

“కమీషనర్ క్షమాపణ చెప్పిన తరువాత కూడా మీరు మొరాయించటం బాగోలేదు మిస్టర్ ప్రతాప్” కోపంగా చెప్పాడు డి.జి.పి.

“……………….” ప్రతాప్ మౌనంగా ఉన్నాడు.

"ఇక్కడ జరిగింది మరిచిపొండి. మేము ఏంచేయాలో చెప్పండి...చేస్తాం. మాకు ఈ కేసులో సహాయం చేయండి" మళ్ళీ డి.జి.పి నే మాట్లాడాడు.

"దాని ఒకే ఒక దారుంది"

"ఏమిటది...చెప్పండి! చేస్తాం..."

"నన్ను ఒకరోజు డి.జి.పి గా అపాయింట్ చేయండి."

డి.జి.పి స్థంభించిపోయాడు. కొంచం సర్ధుకుని "దానికి పర్మిషన్ లేదు. కావాలంటే వేరే ఏదైనా అడగండి"

"అరె...'ఒకేఒక్కడు’ సినిమా లాగా. ఈ బృందం వరకు నేను ఈ ఒక్క రోజు డి.జి.పి ని! ఓ.కే.నా?"

"............." తలవూపాడు డి.జి.పి.

"అలాగే మీ యూనీఫారం ను ఒకరోజుకు అద్దెకు ఇవ్వండి"

"నా యూనీఫారం నా? ...అప్పుడు నేనేం చేశేది?" ......డి.జి.పి సురేందర్ పూర్తిగా ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

"ఇంకొంచం సేపట్లో నా డ్రస్స్ వచ్చేస్తుంది సార్. అంత వరకు వీటిని వేసుకోండి. కానీ, జాగ్రత్తగా తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే అది నా 'లక్కీ డ్రస్సు’ . పది సంవత్సరాలుగా జాగ్రత్తగా ఉంచుకున్నాను. ఉతికితే ఎక్కడ చినిగిపోతుందో నని రెండు సంవత్సరాలుగా అదిగూడా ఆపేశాను"

ఇతనితో మాట్లాడి ఏటువంటి పని చేయించుకోలేము అని అంచనా వేసుకున్న డి.జి.పి తుపాకీ తప్ప తన డ్రస్సు ఇవ్వడానికి అంగీకరించారు.

ఇద్దరూ డ్రస్స్ చేంజ్ రూముకు వెళ్ళారు.

బయటకు వస్తున్నప్పుడు ప్రతాప్, డి.జి.పి డ్రస్సులో వెలిగిపోయాడు....అతని పాత లుంగీ, బనియన్ డి.జి.పి కి వెళ్ళినై.

ఒక్కొక్కరూ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, కౌగలించుకుని, ‘ఆల్ ద బెస్ట్ న్యూ డిజిపి’ అంటూ ప్రతాప్ భుజాలపై తట్టారు.

కమీషనర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మొదట్లో ఆయన కోపంగా చూశాడు. తరువాత కౌగలించుకుని సంతోషాన్ని తెలియపరిచారు.

చివరిగా సుధా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.

ఇద్దరి ముఖాలూ వెలిగిపోయాయి.

తరువాత ఏం జరిగిందో చెప్పక్కర్లేదు!

Continued:PART-5

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి