31, జులై 2019, బుధవారం

చీటింగ్ పోలీస్(నవల)…..PART-11



                                          చీటింగ్ పోలీస్(నవల)…..PART-11

పిజ్జా దోశ ఎలా చేయాలో ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ వివరిస్తుంటే రికార్డు చేసిన వీడియోను, మళ్ళీ మళ్ళీ వేసి చూసుకుంటూ దానిప్రకారం పిండి కలుపుతున్నాడు డిటెక్టివ్ ప్రతాప్.

చివరకు తన వంటను తానే మెచ్చుకుని...తన బుగ్గను తానే గిల్లుకుని ముద్దుపెట్టుకున్నాడు.

'ఈ నా వంటను సుధా గనుక తింటే ఒక వారం రోజులు రొమాన్స్ చేయచ్చు...'--తనలో తానే చెప్పుకున్నాడు.

భార్య దగ్గర నుండి ఫోన్ రావటంతో...ఉత్సాహంగా మాట్లాడాడు.

"హాయ్ ఫ్లవర్....నా వంట వాసన అక్కడ వరకు వచ్చిందా? ఇంకా ఏమిటి అలశ్యం? త్వరగా బయలుదేరి రా. నీకోసమే ఇక్కడ కాచుకోనున్నాను. బాగా ఆలశ్యం అయితే అంతా నేనే తినేస్తాను. నీకు ఏమీ మిగలదు"

"మిస్టర్ ప్రతాప్...నేను కమీషనర్ మాట్లాడుతున్నా. నన్ను కొంచం మాట్లాడనిస్తారా?”

ప్రతాప్ మౌనం వహించాడు.

"ఇక్కడ ఇప్పుడు పరిస్థితి తలకిందలయ్యింది. ప్రమోద్ తుపాకీ గురిపెట్టి పోలీసు అధికారులను తన పట్టులో ఉంచుకున్నాడు..."

"ఎలా"

"కొంచం ఏకాగ్రత తగ్గింది. అది వాడు ఉపయోగించుకున్నాడు"

"ఇప్పుడు నేనేం చేయాలి"

"నిన్ను వెంటనే చూడాలని చెబుతున్నాడు. త్వరగా వస్తారా?"

"ఇదిగో వస్తున్నా..."---బయలుదేరాడు.

*******************************************************

పది నిమిషాలలో అక్కడ దిగాడు ప్రతాప్. అక్కడ పరిస్థితిని ఊహించుకోగలిగాడు.

గ్రద్ద చేతిలో చిక్కుకున్న కోడిపిల్లలలగా డి.జి.పి మరియు కమీషనర్ నిలబడున్నారు.

ప్రతాప్ ను చూసిన ప్రమోద్ ముఖంలో పరిహాస నవ్వు.

"రండి...మీకొసమే కాచుకోనున్నాను. చాలా తెలివి గల వారు మీరు. నన్ను మాత్రం పట్టుకోనుంటే పరవాలేదు. అంజలిని ఎందుకు ఇందులోకి లాగారు. దానికి తగిన ఫలితాన్ని మీకివ్వద్దా?"

"నువ్వు నిజం చెప్పుంటే ఆమెను ఇందులోకి లాగేవాడిని కాదు"

కోపంగా ప్రతాప్ వైపు చూశాడు ప్రమోద్...."హీరో లాగా ప్రవర్తించాల్సిన మీరు విలన్ లాగ ప్రవర్తించారే. విలన్లే ఆడవారిని...ఐ మీన్ భార్యలను, తల్లి-తండ్రులను, ప్రేమికురాలును, పిల్లలనూ తీసుకు వచ్చి బ్లాక్ మైల్ చేస్తారు. అంజలిని తీసుకు వచ్చి మీరు చేసింది కూడా బ్లాక్ మైలే...ఆమె ఎం తప్పు చేసిందని అమెను కొట్టారు"

"అది...అది..." అంటు ఏదొ చెప్పటానికి మాటలు వెతుకుంటున్నాడు ప్రతాప్.

ఈ లోపు కమీషనర్ తలకు గురిపెట్టిన తుపాకీని క్రిందకు దింపి, సుధా తలకు దగ్గర పెట్టాడు ప్రమోద్. ఆమె చెంప మీద చెళ్ళుమని ఒకటిచ్చాడు. ఆమె కళ్ళుతిరిగి పడిపోయింది.

డిటెక్టివ్ ప్రతాప్ అరుచుకుంటూ ముందుకు పరిగెత్తి వెళ్లడం....గుంపులో నుండి ఇద్దరు బయటకు వచ్చారు. అందులో ఒకడు తన చేతిలో ఉన్న 'ఏ.కె. 47' తుపాకీతో ప్రతాప్ ను అడ్డుకున్నాడు. అతనూ క్రింద పడిపోయాడు.

"ప్రమోద్...మేము కూడా 'భారతం మా బానిస’ సంస్థకు చెందిన వాళ్ళమే. వెంటనే మనం ఇక్కడ నుండి తప్పించుకుపోవాలి"

ప్రమోద్ మెదడు ఉత్సాహంతో నిండిపోయింది..

"ఇంకో ఐదు నిమిషాలలో బాంబు పేలేటట్టు టైమర్ లో మార్పు చేసి వస్తా. వీళ్ళకు ఇక అవకాశం ఇవ్వకూడదు”

ప్రమోద్ వేగంగా తనపనిని ముగించుకుని బయటకు వచ్చాడు.

"ఏమైంది?"

"సక్సస్’. వెంటనే బయలుదేరదాం"

"ఓ.కే"

"ఒక్క నిమిషం...ప్రతాప్ నూ, సుధానూ వీళ్ళిద్దరిని మటుకు జీపులో పడేయండి"

"ఎందుకు...?"

"మన విజయాన్ని పండుగ చేసుకోవటానికి..."

వాళ్ళను ఎత్తి జీపులో పడేశారు. డిటెక్టివ్ ప్రతాప్ తలపై తుపాకి ఉంచారు. అతని తల వెనుక బాగంలో దెబ్బతగిలిన కారణం చేత నెత్తురు కారడం మొదలయ్యింది. 'జీప్' ఉరుముతూ బయలుదేరింది. కాకీ బట్టలు ఏమీ చేయలేక...జరిగేదంతా వేడుక చూస్తున్నారు. జీప్ ఆ వీధి చివరి వరకు వెళ్ళిందో లేదో...భవనం రాళ్ళ ముక్కలై కుంగిపోయింది.

బాంబు పేలిన శబ్ధం వినగానే జీపులో ఒకటే అరుపులు.

Continued: PART-12

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి